Tuesday, July 18, 2023

దిక్కులనుబట్టి చెట్లు నాటితే ఏం ప్రయోజనం?

దిక్కులనుబట్టి చెట్లు నాటితే ఏం ప్రయోజనం? 

                                    

          సహజంగా ఇండ్లలోగానీ, గ్రామాలలోగానీ దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం ఈ దిశలనుండి నీరు తూర్పువైపుకు ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు ప్రవహించడం జరిగితే ఆ ఇండ్లకు ఆ గ్రామాలకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆ ప్రజలకు ఆయువు పెరుగుతుంది. ఈ ప్రధాన లక్ష్యాన్ని సాధించడంకోసం మన ప్రాచీన మహర్షులు పడమర, నైరృతి, దక్షిణం దిక్కులలో ఎత్తుగా పెరిగే మహావృక్షాలను నాటి పెంచాలని సూచించారు. మహావృక్షాలన్నీ భూమిలో చాలా లోతువరకు వాటి వేర్లను వ్యాపింపచేస్తుంటాయ్. దానివల్ల వర్షాకాలంలో భూమిపైన వర్షపునీటిని ఈ మహావృక్షాలు అధికంగా గుంజుకొని తమ అడుగున పెద్ద పెద్ద జలాశయాల్లాగా నీటిని నిల్వ చేస్తయ్. దీనివల్ల ఎగువనుండి బిగువవైపుకు భూమిలో జలధారలు విశేషంగా ప్రవహించడం జరుగుతుంది. ఆ ఊరిలోని బావులలో వేసవిలో సైతం పుష్కలంగా నీరు నిలువ ఉంటుంది. అంతేగాకుండా, ఈ మహావృక్షాల వేర్లకుండా ఔషధగుణాలు కూడా ఈ నీటిద్వారా బావులలోకి చేరుతూ వుంటుంది. దీనివల్ల నీటిఎద్దడి ఎప్పుడూ లేకపోవడం ఆనీటిని వాడుకొనే ప్రజలకు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు వర్ధిల్లటం జరుగుతుంది. కాబట్టి, ఏదిక్కులో ఏమొక్కలు వేస్తే ఏమిటంటా? అనే వితండ వాదాలు విపరీతార్థాలు రావివ్వకుండా పెద్దల మాట చద్దిమూట అనే నానుడిని నమ్మి చెప్పబోయేవిధంగా గ్రామాలలో చెట్లను నాటుకొని గ్రామీణ బృందావనాన్ని నిర్మించాలని సూచిస్తున్నాము.

ఆగ్నేయ దిక్కులో ఏ చెట్లు నాటాలి?

ఏ ఊరికైనా ఖచ్చితముగా ఆగ్నేయదిశలో చింతచెట్లను విరిచిగా పెంచాలని ప్రాచీన మహర్షులు నిర్దేశించారు. ఈ చింతచెట్లవలన ఆ ఊరిలో సకాలంలో వర్షాలు పడతాయి గ్రామాలలోని పశువులను ఆ చెట్టుక్రింద మేపుకోవచ్చు. వివిధ సందుగల సందర్భాలలో గ్రామ ప్రజలంతా ఆ చింతతో పులకింద ఉత్సవాలు జరుపుకోవచ్చు. కాబట్టి, గ్రామీణ నిర్మాణంలో చింతచెట్లను అగ్నేయ దిక్కువ నాటడం ఒక ప్రధాన పక్రియగా ప్రజలం గుర్తించాలి.

.🌴🌴🌴తూర్పుదిక్కులో ఏ చెట్లు నాటాలి ?

 ఇంటికి గానీ గ్రామానికి గానీ తూర్పుదిక్కువైపున ఎత్తుగా పెరిగే మహావృక్షాలు నాటకూడదు. సూర్యరశ్మి ధారాళంగా ఊరిలోకి ఇండ్లలోకి ప్రవేశించే విధంగా ఎక్కువ ఎత్తు పెరుగని గుల్మాలు, అతలు, పూలచెట్లు మొదలైనవి నాటి పెంచాలి. ఉదాహరణకు
మందారం, గన్నేరు, నందివర్ధనం, సన్నజాజి, విరజాజి, మల్లె, సంపెంగ, వెంటి పూలచెట్లు తిప్పతీగ, దుష్టపుతీగ, రూపరతీగ, చిక్కుడుతీగ గుమ్మడితీగ, సారతీగ, కాకిదొండ, లింగదొండ, తినేదొండ, బీర వంటి తీగజాతి మొక్కలు, తంగేడు, మంగ, ఉప్పి, పులివేరు వంటి పాదజాతి. మొక్కలు అన్నిరకాల తులసిజాతియొక్కలు నాటుకోవచ్చు.   

             🌴🌴🌴🌴🌴🌴🌴🌹🌹🌹. 🦚🦚🦚🦚 

ఆగ్నేయ దిక్కులో ఏ చెట్లు నాటాలి?

ఏ ఊరికైనా ఖచ్చితముగా ఆగ్నేయదిశలో చింతచెట్లను విరిచిగా పెంచాలని ప్రాచీన మహర్షులు నిర్దేశించారు. ఈ చింతచెట్లవలన ఆ ఊరిలో సకాలంలో వర్షాలు పడతాయి గ్రామాలలోని పశువులను ఆ చెట్టుక్రింద మేపుకోవచ్చు. వివిధ సందుగల సందర్భాలలో గ్రామ ప్రజలంతా ఆ చింతతో పులకింద ఉత్సవాలు జరుపుకోవచ్చు. కాబట్టి, గ్రామీణ నిర్మాణంలో చింతచెట్లను అగ్నేయ దిక్కువ వాటడం ఒక ప్రధాన పక్రియగా ప్రజలం గుర్తించాలి.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴.       

దక్షిణ నైరృతి, పడమర దిక్కులలో ఏ చెట్లు నాటాలి ?

గ్రామానికి ఒక రక్షణకవచంలాగా వుండే కంగా ఎత్తుగా పెరిగే మహావృక్షాలను పెంచుకోవాలి. మజ్జి, రావి, జాన్వి, మేడి, మద్ది, ఒట్టి, వేప, పెనువేసి, తురకనేది, ఇచ్చి, జీడి, ఇందుపు " జమ్మి, టేకు, నల్లతుమ్మ తెల్లదుమ్ము, కస్తూరితుమ్ము, అశోక, మామిడి, పున్నాగము, పొగడ, దిరిశెన, బొడ్డుగ, విరిగి, వేగిన, దేవదారు, వృద్ధదారు. నాగము, నేరేడు మొదలైన వాటివి నాటుకోవాలి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS