Saturday, July 29, 2023

ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం

ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం


 1. శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ 
శ్రీ దత్త స్మాన్ పాహి దేవాదిదేవ|
భావగ్రాహ్యక్లేశ హారిన్ సుకీర్తే     ఘోరాత్ కష్టా దుద్ధరాస్మాన్ నమస్తే||.

 *భావము*: హే శ్రీపాద శ్రీవల్లభ ప్రభో! శ్రీ దత్త! దేవాదిదేవ! కీర్తిమంతా! సదా నా ప్రార్ధన మన్నించి, నన్ను రక్షించి, ఘోర ఇహ, పర దైన్యకష్టముల నుంచి ఉద్ధరించే  
శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం.

2. త్వం నో మాతా త్వం నో పితాప్తో   ధిపస్త్వం తాత్రా యోగ క్షేమకృత్ సద్గురుస్త్వం
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టా దుద్ధరాస్మాన్ నమస్తే||.

*భావము:* హే పరమేశ్వరా! విశ్వవ్యాపకా! నీవే తల్లివి,  తండ్రివి, భందువు, రక్షకుడవు. యోగ, క్షేమం ప్రసాదించే సద్గురుడవు. నన్ను ఘోర ఇహ, పర కష్టముల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో నీకు నమస్కారం.

3. పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యమ్ భీతిం క్లేశం త్వం  హరాశుత్వదన్యమ్|
త్రాతారం నోవీక్ష ఈశాస్త జూర్తే ఘోరాత్ కష్టా దుద్ధరాస్మాన్ నమస్తే||.

*భావము*: ఓ విశ్వమూర్తి పాపము, తాపము వ్యాధి, భయం, దైన్యము, ధుఃఖములను మీరు తప్ప హరించువారు లేరు. హే శ్రీ దత్తాత్రేయ ప్రభో! నన్ను ఘోర ఇహ, పర కష్టముల నుంచి ఉద్ధరించే నీకు నమస్కారం.

4. నాన్యాస్త్రాతా నాపి దాతా న భర్తా త్వత్తో దేవత్వం శరణ్యో శోకహర్తా|
కుర్వాత్రేయ అనుగ్రహం పూర్ణరాతే ఘోరకష్టాత్ దుద్ధారాస్మాన్ నమస్తే||.

*భావము:* హే శరణాగత వత్సలా! నువ్వు తప్ప పోషకుడు, యజమాని, రక్షించు వారు, కృపాకరుడు ఎవరు లేరు. ఎవరు నిన్ను సంపూర్ణoగా శరణు వేడుకొంటారో అటువంటివారిని దయతో సంపూర్ణంగా అనుగ్రహిస్తావు. ఓ దత్త ప్రభో! నన్ను  ఘోర ఇహ పరకష్టముల నుంచి ఉద్ధరించే నీకు నమస్కారం.

5. ధర్మే ప్రీతీం సన్మతిమ్ దేవభక్తిమ్ సత్సాంగాప్తిమ్ దేహి భుక్తిమ్ చ ముక్తిం |
భవాశక్తిమ్ చ అఖిలానన్దమూర్తే ఘోరకష్టాత్ దుద్ధారాస్మాన్ నమస్తే||.

*భావము:* ఓ అఖిలానందమూర్తి ధర్మంనందు ప్రీతి, భక్తి, శ్రద్ధ, సద్బుద్ధి, సత్సంగము ప్రసాదించి భుక్తి, ముక్తి, పరిపూర్ణ భక్తిని ప్రసాదించి నన్ను ఘోర ఇహ, పరకష్టముల నుంచి ఉద్ధరించే  శ్రీ దత్తాత్రేయ ప్రభో! నీకు నమస్కారం.

6. శ్లోక పంచక మేతద్యో లోక మంగళవర్ధనం |
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||

*భావము:* ఈ పంచ శ్లోకములను     భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ ఆశీర్వచనాలతో పాటు వారి కృపతో లోకంలో అంతా మంగళకరము అవుతుంది.

ఇతి శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి విరచితం ఘోర కష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణమ్.

శ్రీ అవధూత చింతన గురుదేవ దత్త.

ఓం సాయిరామ్ 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 

*తెలుగు అనువాదం రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి*

 🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS