వనదుర్గ_మహావిద్య
వనదుర్గ 500 మంత్రాల మహావిద్య గా ప్రాచుర్యం పొందింది. 1500 మంత్రాల విద్య కూడా కొందరు అనుష్టిస్తారు.
ఈ మహావిద్యను గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి.
ఈ వనదుర్గమంత్ర క్రియతో శంకరులు భయంకరంగా ఉన్న కొన్ని దేవతా శక్తులను ఉపశమింపచేసి శ్రీచక్రంలోకి ఆ శక్తిని ప్రవేశపెట్టారని ప్రతీతి.
దేవతలు, యక్షులు, కిన్నెరలు తో పాటు రాక్షస, పిశాచ గణాలు కూడా ఆవిడ పరివారమే కాబట్టి, పూజలో వారిని కూడా ఆహ్వానించి నైవేద్యం ఇస్తారు.
కొన్ని దిగ్బంధన, ఉగ్ర, తీవ్ర శక్తులు, అస్త్ర మంత్రాలు కూడా ఈ వనదుర్గ విద్యలో ఉంటాయి.
#వనదుర్గ_మంత్రం
హ్రీం దుం దుర్గాయై ఉత్తిష్ఠ పురుషి, కిం స్వపిషి, భయం మే సముపస్థితం యది శక్యమశక్యంవా తన్మే భగవతి శమయ శమయ స్వాహా"
#అర్థం_వివరణ
అమ్మా దుర్గమ్మ లేవమ్మా, ఇంకా పడుకునే వున్నవా? కలలు కంటున్నావా?
ఇక్కడ నేను భయంతో వున్నాను, అది ఎంతటి సాధ్యమయ్యేదైనా, కాకున్నా నువ్వు వెంటనే దాన్ని నానుండి తీసివేసెయ్యి"
ఈ మంత్రం యొక్క అర్ధం చిత్రంగానూ, అమ్మవారితో చనువు గానూ వుంటుంది. ఒక కొడుకు తన తల్లిని వేడుకుంటున్నట్టుగా.
సర్వం శక్తిమయం జగత్
No comments:
Post a Comment