Friday, December 5, 2025

భాగ్య తంత్రం..............!!


భాగ్య తంత్రం..............!!
భాగ్య తంత్రం అంటే భాగ్యాన్ని మార్చుకోవడానికి చేసే ఒక త్రాంత్రిక క్రియ. తంత్రం అంటే ఏవేవో క్షుద్ర పూజలు, బలులు అనుకోకండి. నేను చెప్పేది చాలా సులువైన ప్రక్రియే, కాదు చాల తక్కువ ఖర్చుతో చేయగలిగే క్రియ! 
ఇలాంటి తంత్రాలు చాల నిరపాయకరమైనవే కాక ఎంతో సులభమైనవి కూడ! 

దీని పేరు నవగ్రహ కలశ స్థాపనా తంత్రం! 
కావలసిన సామగ్రి......

చంద్రుని కోసం ఒక జత వేండితో చేయంచిన నాగుపాములు. వీటిని చాల చిన్నవిగా ఒక సెంటీమీటరు సైజులో చేయిస్తే చాలు. వెండి వైరుతో ఒక దానితో ఒకటి పెనవేసుకొన్నట్లు చేయిస్తే చాలు.

కుజుని కోసం నవ రంధ్రాలు గల రాగి రేకు. కేవలం ఒక స్క్వేరు ఇంచి సైజు రాగి రేకు చాలు. ఆ రేకు మీద తొమ్మిది కన్నాలు పొధిపిస్తే చాలు.

బుధుని కోసం అయిదు గవ్వలు కొద్దిగా పసుపు రంగులో ఉన్నవయితే మంచిది.

గురుని కోసం మూడు ఇత్తడితో చేయించిన త్రిభుజాకారపు రేకులు చిన్న ఇత్తడి రేకుతో చేయించవచ్చు. ఒక సెంటీమీటరు సైజు చాలు.

శుక్రుని కోసం ఆరు వెండితో చేసిన పాంకోళ్లు. ఇవి కూడా చాల చిన్న సైజులో అర మిల్లీమీటరు సైజులో చేయించవచ్చు.

శని కోసం ఎనిమిది ఇనుప రేకుతో చేయించిన త్రిశూలాలు. ఇవి కూడాఒక సెంటీమీటరు సైజు చాలు. ఒక డబ్బా రేకుని కత్తెరతో కత్తరించుకోవచ్చు.

రవి కోసం ఒక గాజు సీసా, పైన చెప్పిన వన్నీ వేసుకోవడానికి.

రాహు-కేతువుల కోసం గంగాజలం. ఆ సిసాలో పోయడానికి.

సామగ్రి విషయం తెలిసింది కదా! 
ఇక ప్రక్రియ తెలుసుకొందాం!

ఈ పని చేయడానికి వారం రోజులు పడుతుంది.

 ఆదివారం నుండి శనివారం వరకు ఏదో ఒక ఆదివారంనాడు మొదలుపెట్టండి. ఆదివారం ఉదయం గాజు సిసాలో గంగాజలం పోయండి. ఆదివారం రాత్రి ఆ సీసాని మంచం క్రింద తల పెట్టుకొనే చోట ఉంచి, అందులో చంద్రునికి సంబంధించిన నాగుపాముల జతని పడేయండి తరువాత ఒక రూపాయి కాసుని తలగడ క్రింద, పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత మూత బిగించి రాత్రంతా అక్కడే ఉంచండి. 

సోమవారం ఉదయం దానిని తీసి పూజ గదిలో గాని వేరే పవిత్రమైన స్థలంలో గాని ఉంచండి. తలగడ క్రింద దాచిన రుపాయిని కూఢ ఒక డబ్బాలో వేసి జాగ్రత్తగా దాచండి. సోమవారం రాత్రి ఆ సీసాలో తొమ్మిది రంధ్రాలు కల రాగిరేకుని ఆ గంగాజలంలో పడేయండి. తిరిగి మూత పెట్టి మంచం క్రిందఎప్పటిలాగే ఉంచండి. తలగడా క్రింద ఒక రుపాయి బిళ్లని పెట్టి పడుకోండి. మర్నాడు ఉదయం సీసాని, రూపాయిని ఇదివరకులాగే జాగ్రత్త చేయండి.

మంగళవారం రాత్రి ఆ సీసాలో అయిదు గవ్వలు పడేసి, మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి కాసుని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఎప్పటిలాగే ఊదయాన్నే సీసాని, రూపాయిని ఇదివరకులాగే జాగ్రత్త చేయండి.

బుధవారం రాత్రి ఆ సీసాలో మూడు ఇత్తడితో చేసిన త్రిభుజాకారపు ముక్కలని పడేసి మూతబిగించి మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి కాసుని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత ఉదయాన్నే సీసానీ, రూపాయినీ జాగ్రత్తచేయండి.

గురువారం రాత్రి ఆ సీసాలో ఆరు వెండి పాంకోళ్లు పడేసి మూత బిగించి మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి కాసుని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత ఉదయాన్నే సీసానీ,రూపాయినీ ఎప్పటిలాగే జాగ్రత్త చేయండి.

శుక్రవారం రాత్రి ఆ సీసాలో ఎనిమిది ఇనప త్రిశూలాలు పడేసి మూతబిగించి మంచం క్రింద పెట్టండి. మూత బిగించి మంచం క్రింద పెట్టండి. ఒక రూపాయి బిళ్లని తలగడ క్రింద పెట్టుకొని పడుకోండి. ఆ తరువాత ఉదయాన్నే సీసానీ, రూపాయిని ఎప్పటి లాగే జాగ్రత్ర చేయండి.

అంతే! నవ గ్రహ కలశం తయారయి పోయింది. శనివారం ఉదయానికే దానిని పూజ గదిలో గాని లేక ఇంకేదైనా ఎత్తైన జాగాలో ఉంచండి.

పూజలు పునస్కారాలు ఏమీ చేయనవసరం లేదు. ఆ కలశం తన పనిని తాను చేస్తుంది!

No comments:

Post a Comment

POPULAR POSTS