Wednesday, December 17, 2025

నాటి ప్రదేశాలకు నేటి పేర్లు .


నాటి ప్రదేశాలకు నేటి పేర్లు . 
1) వ్రేపల్లె/గోకులం-గోకుల్,మధుర వద్ద.
2) కుంతిపురి-(పాండురాజు మెదటి భార్య) గాల్వియర్.
3) మద్ర దేశం(పాండురాజు రెండో భార్యమాద్రి పుట్టిల్లు)పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
4) ద్రోణన గరి(ద్రోణుడు నివసించిన ప్రాంతం) డెహ్రాడూన్.
5) గురుగ్రామం(కురు-పాండవులు విద్య అభ్యసించినచోటు ) గురుగావ్,హర్యానా.
6) కర్ణుడు పాలించిన అంగరాజ్యం-(కాబూ-ఆఫ్ఘనిస్ధాన్)
7)పాండవుల లక్కఇల్లు దగ్ధమైన ప్రదేశం.వర్నాల్,హస్తినాపూర్.
8) కాలయవనుడు ముచికుందుని కోపానికి దగ్ఢమైన స్ధలం-గిర్నార్,గుజరాత్.
9) శ్రీకృష్ణుడు-బలరాముల ద్వారకానగర్ -ద్వారకా,గుజరాత్.
10) హిడింబ వనం-(హిండింబాసురుని భీముడు చంపిన చోటు)జలాన్ జిల్లా,ఉత్తరప్రదేశ్.

11) విదర్బ(నలదమయంతి-రుక్మిణీదేవి తండ్రులు పాలించిన రాజ్యం)విదర్భ,మహరాష్ట్ర.
12) కుండీనపురం(రుక్మిణీదేవి జన్మస్థలం)కుండినపుర,మహరాష్ట్ర.
13) ఛేది రాజ్యం(శిశుపాలుడు ఏలినరాజ్యం)బుందేల్ ఖండ్,మధ్యప్రదేశ్.
14) కారుషరాజ్యం(దంతవక్రుడు ఏలిన రాజ్యం)దాతియాజిల్లా,మధ్యప్రదేశ్. 
15) ఖాండవప్రస్తం/ఇంద్రప్రస్తం(పాండవులరాజధాని)ఇంద్రప్రస్థ,ఢిల్లి దగ్గర.
మరికొన్ని...
1)భగీరధుడు గంగను భువికి దించిన ప్రదేశం.గంగోత్రి.ఉత్తరాఖండ్.
2)కపిలమహర్షి ఆశ్రమం.గంగాసాగర్.వెస్ట్ బెంగాల్.
3)కాంభోజరాజ్యం.ఇరాన్.(శ్రీరాముని ముత్తాత రఘమహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్,తజకిస్తాన్,కజఖిస్తాన్,దాటి యింతవరకు విస్తరించింది.)
4)రక్షస్ధలం.(రావణుడు తనతలలు తెగవేసి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)లాంగాకో,టిబెట్ ,చైనా.
5)పరమశివుని ఆత్మలింగాన్ని గణేళుడు నేలప దించినచోటు. గోకర్ణ, కర్ణాటక.
6)సీతాదేవి భూమిలో లభించినచోటు. సీతామరి, బీహార్.
7)మిథిల(సీతాదేవి పుట్టిల్లు)జనక్ పూర్,నేపాల్.
8)కోసలదేశం-రాజధాని అయిన అయోధ్యనుండి నేపాల్ ల్లోని కొన్ని ప్రాంతాలవరకు ఉంది.
9)దశరథుడు పుత్రకామేష్టియాగం చేసిన స్ధలం-ఫైజాబాద్,ఉత్తరప్రదేశ్.
10)సరయూనదిఅ(ఈనదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) ఘూఘరనది.
11)అయోధ్య -సాకేతపురం(శ్రీరాముని జన్మస్ధలం,బంగారు సీతతో అశ్వమేధయాగం చేసిన ప్రదేశం,రాముని అవతార సమాప్తిజరిగిన స్ధలం)అయోధ్య,ఉత్తరప్రదేశ్.
12) తాటకవధ జరిగినప్రదేశం.బక్సర్,బీహార్.
13)అహాల్యశాప విమోచనా స్ధలం.అహిరౌలి,బీహార్.
14)కుశనాధపురం(విశ్వమిత్రుడు రామ లక్ష్మణుల రక్షణతో యాగం చేసిన స్ధలం)సుల్తాన్ పూర్,ఉత్తరప్రదేశ్.
15)గుహుడు రామ లక్ష్మణులను కలసిన చోటు.శృంగభేరిపురం, అలహాబాద్ దగ్గర.
16)దండకారణ్యం.-చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా,ఆంధ్రా, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
17)చిత్రకూటం(సీతా రామ లక్ష్మణులు నివాసం ఉన్న చోటు.)సాత్నాజిల్లా,మధ్యప్రదేశ్.
18)పంచవటి (శూర్పణఖ ముక్కు చెవులు కోసిన చోటు)నాసిక్, మహరాష్ట్ర.
19)కబంధాశ్రమం-కర్దిగుడ్,బెల్గావి,కర్ణాటక.
20)శబరి ఆశ్రమం-సర్బన్,బెల్గావి,కర్ణాటక. 
మరి కొన్ని...
1)శ్రీమహావిష్ణువు గజేంద్రుని మొసలి బారినుండి రక్షించినస్ధలం-దేవ్ ధాం.నేపాల్. 
2) నృసింహస్వామి హిరణ్యకసిపుని వధించినస్ధలం-అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3) జమదగ్ని మహర్షి ఆశ్రమం-జమానియా,ఉత్తరప్రదేశ్.
4)మహీష్మతి(కార్తవీర్యార్జునుని రాజధాని)మహేశ్వర్,మధ్యప్రదేశ్ .
 5)శమంతపంచకం(పరశురాముడు ఇరవై ఒక్కమార్లు క్షత్రియులనుసంహరించి వారి రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచిన చోటు,మరియు దుర్యోధనుడు మరణించిన స్ధలం)కురుక్షేత్ర, హర్యానా.
6)పరశురామక్షేత్రం(పరశురాముడు తనగొడ్డలిని సముద్రంలోనికి విసిరి,సముద్రజలాలను వెనక్కు పంపి తనకోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం)కేరళ,కర్ణాటక,మహరాష్ట్రసముద్రతీరప్రాంతం.
7)మహేంద్రపర్వతం-(పరశురాముడు తపస్సు చేసిన స్ధలం)పశ్చిమ ఒరిస్సా.
8) నిషాదరాజ్యం(నలమహరాజు రాజ్యం)గాల్వియర్ జిల్లా,మధ్యప్రదేశ్.
9)వ్యాసమహర్షి పుట్టిన స్ధలం-ధమౌలి,నేపాల్.
 10)నైమిశారణ్యం(వ్యాసమహర్షి తనశిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన స్ధలం)సీతాపూర్ జిల్లా,ఉత్తర్ ప్రదేశ్.
11)వ్యాసమహర్షి చెపుతుండగా,విఘ్నేశ్వరుడు మహాభారతం రాసిన స్ధలం-మనగ్రామం,ఉత్తరాంచల్.
12)ప్రతిష్టానపురం(పురూరవుని రాజధాని)ఝన్సి,అలహాబాద్.
13)సాళ్వరాజ్యం(సావిత్రి సత్యవంతులకథలో సత్యవంతుని రాజ్యం)కురుక్షేత్రసమీపాన.
14)హస్తినాపురం(కౌరవుల రాజధాని)హస్తినాపూర్,ఉత్తరప్రదేశ్.
 15)మధుపురం/మధువనం(కంసుని రాజధాని)మధుర,ఉత్తరప్రదేశ్

.ఫోటో అయోధ్య సరయు నదీ తీరంలో అర్ధాంగితో వ్యాసకర్త.
సేకరణ:డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

No comments:

Post a Comment

POPULAR POSTS