Saturday, December 6, 2025

నృసింహవాడి తరచూ వెళ్లే గురు బంధువులు చుట్టూ చూడవలసిన క్షేత్రాలు అడుగు తున్నారు. కాబట్టి ఆ క్షేత్రాల గురించిన వివరాలు కొద్దిగా మాత్రమే ఇస్తున్నాము


దత్త లీలా క్షేత్ర మహత్యం*.
నృసింహవాడి తరచూ వెళ్లే గురు బంధువులు చుట్టూ చూడవలసిన క్షేత్రాలు అడుగు తున్నారు. కాబట్టి ఆ క్షేత్రాల గురించిన వివరాలు కొద్దిగా మాత్రమే ఇస్తున్నాము.
నృసింహవాడి చుట్టుపక్కల ఉన్న పురాతన దత్తాత్రేయ క్షేత్రాలు..1). నృసింహవాడి లో మనోహర పాదుక మందిరం,అష్ట తీర్ధాలు, నారాయణ మహరాజ్ సమాధి స్థాన్, శ్రీ గోపాల్ మహరాజ్, గోవింద స్వామి, కృష్ణా మాత ,అన్నపూర్ణ మాత మందిరం, గణపతి, సంగమం.
2) *శిరోల్*...నృసింహవాడికి సుమారు 8 km దూరంలో ఉన్న ది. ఇక్కడ శ్రీ గురుని హస్తం యొక్క ముద్ర ఉంది.
3) *అమరపురం* నృసింహవాడిలో కృష్ణా నదికి అవతల వడ్డున ఉన్నది. ఇక్కడ స్వామి పెద్ద చిక్కుడు చెట్టు పీకగా బంగారంతో ఉన్న  కుండ దొరికిన ఇల్లు, అమరేశ్వర్ మందిరం,వాసుదేవానంద సరస్వతీ మఠం, (నృసింహ సరస్వతీ స్వామి వారిది) ఉన్నాయి.
3.) *కురుంద్వాడి*:దీనిని పురాతన కురుపురం అని కూడా అంటారు. అక్కడ 500 సంవత్సరల క్రితం శ్రీ పాద వల్లభ నిద్రాస్థాన్-విశ్రాంతి స్థాన్  ఉంది. పల్లకి ఉత్సవం బాగా జరుగుతుంది.
4) krudwadi నుంచి సుమారు 2 km దూరంలో తెరవడా అనే గ్రామంలో శ్రీ విశ్వంభరావధూత దత్తాత్రేయ మందిరం ఉంది. ఇక్కడ ఏకనాధ్ మహరాజ్ మనవడు పూజారిగా ఉండేవారు. శ్రీపాద వల్లభ స్వామి జన్మించక ముందే ఇక్కడ  షోడశ దత్త అవతరాలను పూజించేవారు.
6.
అతి పురాతన శ్రీపాద దత్త పాదుకలు. నృసింహవాడి దగ్గర.
కొల్హాపూర్ కి 25 km దూరంలో విస్ఫురి కి దగ్గరగా కుందుర్తి (గులవాణి మహరాజ్ జన్మించిన ఊరు) కి  16 km దూరంలో ఉన్న ఈ గ్రామం (bachani)( బచని) శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. ఈ మందిరం పురాతనమైనది. నృసింహవాడి లాగానే కృష్ణా నది వడ్డున  ఉంటుంది. ఇక్కడ దత్త పాదుకలు ఉన్నాయి.
7).*ఔదుంబర్*-నృసింహవాడికి శ్రీ గురుడు రాకముందు ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చేశారు.
8).ఔదుంబర్ కి అవతల వడ్డున దగ్గరలో భిల్లువటి గ్రామంలో భువనేశ్వరి మాత మందిరం ఉన్నది. దీనికి దగ్గరలో కొండ మీద కూడా నారాయణ మహరాజ్ తపస్సు చేసిన ప్రాంతం ఉంది.
9).*కొల్హాపూర్*. లో
మహాలక్ష్మి మందిరం.
ఈ మందిరంలో పురాతన దత్త మఠం (ఈ మఠంలోనే నారాయణ స్వామి మహరాజ్ భజన చేసేవారు), దత్త మందిర్, మహాలక్ష్మీ మందరం ఉన్నాయి.
కొల్హాపూర్ లో భిక్ష లింగ మందిరం. ఏకముఖి దత్త మందిరం. అలాగే స్వామి సమర్ధ దగ్గర గల దత్త విగ్రహం ఉన్న మఠం.
శ్రీ కృష్ణ సరస్వతీ మందిరం,
ఇలా చాలా పురాతన దత్త మందిరాలు చాలా వున్నాయి
ఆ వివరాలు అన్ని మన భారతదేశంలో దత్త క్షేత్రాలులో వివరాలు ఉన్నాయి. చూడగలరు.
10).నృసింహవాడి దగ్గర మిరజ్ లో మహా అవధూత దిగంబర బువా సజీవ సమాధి ఉంది. ఇప్పటికి పిలిస్తే పలుకుతారు
11).నృసింహవాడి దగ్గర గుళవణీ మహరాజ్ జన్మించిన కుందుర్తి గ్రామంలో ఇప్పడికి వారి ఇల్లు, దత్త మఠం, వేద పాఠశాల, గోశాలలు ఉన్నాయి
12.) కుందుర్తి దగ్గర పత్రి నృసింహవాడి ఉంది.
13) అమరపురం లో ఏకనాధ్ మహరాజ్  జనార్ధన్ స్వామి ఆజ్ఞ పై ప్రతిష్ఠ దత్త పాదుకలు,కృష్ణా నదికి కట్టిన ఘాట్ లు ఉన్నాయి.
14).నృసింహవాడి దగ్గర ఖిద్రా పూర్ .నృసింహవాడి కి 19 kms దూరంలో శ్రీ గురుడు చెప్పిన త్రిస్థలి లో ఈ క్షేత్రం కాశీ తో సమానమే అని చెప్పిన క్షేత్రం. కృష్ణా నది వడ్డున ఉంది.
నృసింహవాడి మహాత్ముల చరిత్ర తప్పక పారాయణ చేయగలరు.
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి,పద్మజా ప్రసాద్ బేతన భొట్ల.

No comments:

Post a Comment

POPULAR POSTS