Thursday, December 18, 2025

దత్త అను రెండు అక్షరాలే చాలా విశేషమైన మంత్రముగా చెప్పబడతాయి



దత్త అను రెండు అక్షరాలే చాలా విశేషమైన మంత్రముగా చెప్పబడతాయి. అత్రి మహర్షి సంతానమును కోరి తపస్సును చేయగా భగవానుడు సంతోషించి నన్ను నేను నీకు ఇచ్చుచున్నాను అని పలికెను. అపుడాయన అత్రికి పుత్రుడై జన్మించి దత్తుడు (ఈయబడినవాడు) అను పేరు (దత్తాత్రేయ)టో ప్రసిద్ధిని బడసినాడు. యదు మహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలగు వారు ఆయన పాదపద్మముల ధూళిచే పవిత్రములైన దేహములు గలవారై ఆయన అనుగ్రహముచే ఇహలోకములో అణిమ మొదలగు అష్ట సిద్ధులను మాత్రమే గాక, దేహమును వీడిన తరువాత మోక్షమును కూడా పొందినారు. (శ్రీమద్భాగవతం)

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం:

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ ||

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ ||

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ ||

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ ||

ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ ||

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ ||

జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ ||

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ ||
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ ||
అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ ||

సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ ||

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ ||

                                 🌹🙏🌹

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ ||
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ ||

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ ||

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||

       సేకరణ

No comments:

Post a Comment

POPULAR POSTS