తారా విశేషాలు:-
టిబెట్ తంత్ర శాస్త్రం ప్రకారం తారా మొత్తం 21 మంది తారలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు అందరూ తాంత్రిక దేవతలు అయినప్పటికీ వీరిలో అతి కొద్ది మంది మాత్రమే సాధకుల చేత ఆరాధించబడుతున్నారు. ఈ 21 తారలలో కురుకుల్ల ప్రధాన దేవతగా గుర్తించబడింది.
తారానాధుడు అనే ప్రాచీన కాలపు టిబెట్ పండితుల అభిప్రాయం ప్రకారం సూర్య గుప్తుడు అనే మహ పండితుడు కార్శీర దేశంలో జన్మించారు. ఇతడు శాంతి దేవుడు, చంద్రకీర్తి మరియు చంద్రగోవిన్ అనే టిబెటన్ తాంత్రిక గురువులు సమకాలీనుడు అని తెలుస్తోంది. సూర్యగుప్థుడు ఏడు జన్మల పాటు తారను ఉపాసన చేసినట్లు తెలుస్తోంది. ఈయన ఒక మహ సిద్దుడు అని తారానాధుడు పేర్కొన్నారు. ఈ సూర్యగుప్తుని ద్వారానే కురుకుల్లా లేక ఎర్ర తారకు సంబంధించిన మంత్రాలు తర్వాత తరాల వారికి అందించబడ్డాయి . సూర్య గుప్తుని శిష్యుడు సర్వజ్ఞ మిత్రుడు తారా సాధనలో మరియు తారకు సంబంధించిన మంత్రాలలో మహ పండితుడిగా గుర్తింపు వచ్చింది. ఈ సూర్య గుప్తుడు వ్రాసిన కొన్ని తాంత్రిక గ్రంధాలు టిబెట్ భాషలోకి అనువాదం చేయబడ్డాయి.
టిబెటన్ తాంత్రిక శాస్త్రాలలో పేర్కొన్న 21 తారలు వివిధ రకాల తాంత్రిక విధానాలలో ఆరాధించబతాయి. వారికి సంబంధించిన బీజ మంత్రాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ 21 తారల వివరాలు క్లుప్తంగా....
1. ప్రవీరతార అంటే వేగవంతురాలు మరియు ధీరోదాత్తురాలు ఈమె బీజ మంత్రం "ఓంతారే తుత్తారే తురే స్వాహా.
2. చంద్రకాంత తార అంటే శరదృతువులోని చంద్రునిలా తెల్లగా ఉంటుంది.
3. కనకవర్ణ తార అంటే బంగారం రంగు శరీర ఛాయను కలిగి ఉంటుంది.
4. అస్నిస తార అంటే విజేత అనేటువంటిది.
5 . హం స్వర నాదినీ తార అంటే హం అనే శబ్దాన్ని వెలువరించునది.
6. త్రైలోక్య విజయ తార అంటే మూడు లోకాలపై విజయం కోసం.
7. వాదిప్రమర్దినీ తార అంటే వ్యతిరేకతలను అణిచివేసెది.
8. వాసిత్తోత్తమదా తార అంటే అద్భుతమైన శక్తులను ఇచ్చేది.
9. వరదా తార అంటే వరాలను ప్రసాదించే తార.
10. శోకవినోదన తార అంటే దుఃఖాన్ని పోగొట్టేది.
11. జగదాకర్షణ తార అంటే సర్వ జీవులను ఆకర్షించే తార.
12. మంగళావబాస తార అంటే అదృష్ట దేవత.
13. పరిపక్వన్న తార అంటే పరిపూర్ణమైనది.
14. చలద్ భృకుటి తార అంటే కనుబొమ్మలు ఎగరవేయునది.
15. మహ శాంతి తార అంటే సమస్త శుభములు కలిగించే తార.
16. సంగనాశినీ తార అంటే భవబంధనహర నాశనం చేస్తుంది.
17. సుఖసిద్ది తార అంటే బ్రహ్మానందం ఇస్తుంది.
18. ప్రవృష్టి తార అంటే అభివృద్ధి ఇచ్చెది.
19. దుఃఖదహన తార అంటే సర్వ బాధలను తొలగించేతార.
20. సిద్ది సంభవ తార అంటే సమస్త సిద్దులకు మూలం అయినటువంటి తార.
21. పరిపూర్ణ తార అంటే పరిపూర్ణమైనది.

No comments:
Post a Comment