Friday, April 13, 2018

శని త్రయోదశి 

రేపు అనగా 14/4/18 శని త్రయోదశి .

శనివారంతో కలిసొచ్చిన త్రయోదశిని శని త్రయోదశిగా వ్యవహారిస్తుంటారు.
ఇ రోజు శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది.

నిజానికి శని బాధలు ఉన్నవాళ్లు మాత్రమే సనీశ్వరాలయనికి వెళ్ళాలి అనుకుంటారు
కానీ అది తప్పు అభిప్రాయం మాత్రమే.
ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన పూజ విధి.
    జీవితంలో కష్టాలు,భాధలు ఎదురైనప్పుడు,భయం కల్గినప్పుడూ ఎవరైనా ముందుగా "శనిదేవుని" నిందిస్తాము కానీ
చిటికలో కష్టాలను కడతేర్చి ,సుఖాలను అందిచటంలో ఆయనకు ఆయనే సాటి! స్వల్పమైన నైవేద్యానికి ప్రసన్నమయ్యే గ్రహాదేవతలలో శనేశ్చరుడు ప్రదనమైనవాడు.

శనిత్రయోదశి
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు.
ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
" నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం "
అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలితో ఉన్నా వాళ్లకు భోజనం పెట్టటం
7. ఈ రోజున ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోరాదు.

శనిగ్రహ దోష పరిహారాలు

శని అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్య గ్రహం.జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు ‘పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎం తో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’’గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.

మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్‌ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. మనసులలో జోక్యం, అనారోగ్యా లు, చేద్దామనుకున పనులన్నీ వాయిదాలు, మానసి క శాంతి అన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి .

శని వల్ల ‘నీలం’ ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు.పూ ర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.

శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి.సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది.

శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి.

తడికాళ్ళతో నిద్రించరాదు.పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా పూజ గది,బెడ్రూం,పరిశుబ్రంగా ఉండాలి.సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి.

శ్రమ జీవులు అయిన చీమలకు తేనే గాని చెక్కెర గాని వెయ్యాలి.ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపియ్యాలి.నల్ల కుక్కలకి,కాకులకి ఆహారం వెయ్యాలి.

ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి.మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం,వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి,మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చెయ్యాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.

శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు.అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి.ఇనుముతో చేసిన శివలింగాన్ని గాని,కాళికాదేవిని గాని పూజించాలి. ఏడమచేతి మద్యవేలికి గుర్రపు నాడా రింగ్ దరించాలి.అయ్యప్ప దీక్ష దారణ చెయ్యటంగాని,అయ్యప్ప భక్తులకు బోజనం పెట్టటంగాని చెయ్యాలి.

" శనీశ్వర జపం "
శనీశ్వరుడి జప మంత్రాలు

* నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం *

" ఓం శం శనయేనమ "
* ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః *

శని గాయత్రీ మంత్రం:

* ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ *
 
         ** ఓం నమో శనీశ్వరాయ నమః **

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS