Friday, April 13, 2018

14/4/18 శని త్రయోదశి . శనివారంతో కలిసొచ్చిన త్రయోదశిని శని త్రయోదశిగా వ్యవహారిస్తుంటారు. శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది.

శని త్రయోదశి 
 14/4/18 శని త్రయోదశి .
శనివారంతో కలిసొచ్చిన త్రయోదశిని శని త్రయోదశిగా వ్యవహారిస్తుంటారు.
శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది.
నిజానికి శని బాధలు ఉన్నవాళ్లు మాత్రమే సనీశ్వరాలయనికి వెళ్ళాలి అనుకుంటారు
కానీ అది తప్పు అభిప్రాయం మాత్రమే.
ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన పూజ విధి.
    జీవితంలో కష్టాలు,భాధలు ఎదురైనప్పుడు,భయం కల్గినప్పుడూ ఎవరైనా ముందుగా "శనిదేవుని" నిందిస్తాము కానీ
చిటికలో కష్టాలను కడతేర్చి ,సుఖాలను అందిచటంలో ఆయనకు ఆయనే సాటి! స్వల్పమైన నైవేద్యానికి ప్రసన్నమయ్యే గ్రహాదేవతలలో శనేశ్చరుడు ప్రదనమైనవాడు.
శనిత్రయోదశి
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు.
ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .
శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
" నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం "
అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలితో ఉన్నా వాళ్లకు భోజనం పెట్టటం
7. ఈ రోజున ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోరాదు.
శనిగ్రహ దోష పరిహారాలు
శని అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్య గ్రహం.జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు ‘పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎం తో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’’గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.
మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్‌ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. మనసులలో జోక్యం, అనారోగ్యా లు, చేద్దామనుకున పనులన్నీ వాయిదాలు, మానసి క శాంతి అన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి .
శని వల్ల ‘నీలం’ ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు.పూ ర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.
శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి.సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది.
శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి.
తడికాళ్ళతో నిద్రించరాదు.పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా పూజ గది,బెడ్రూం,పరిశుబ్రంగా ఉండాలి.సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి.
శ్రమ జీవులు అయిన చీమలకు తేనే గాని చెక్కెర గాని వెయ్యాలి.ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపియ్యాలి.నల్ల కుక్కలకి,కాకులకి ఆహారం వెయ్యాలి.
ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి.మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం,వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి,మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చెయ్యాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.
శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు.అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి.ఇనుముతో చేసిన శివలింగాన్ని గాని,కాళికాదేవిని గాని పూజించాలి. ఏడమచేతి మద్యవేలికి గుర్రపు నాడా రింగ్ దరించాలి.అయ్యప్ప దీక్ష దారణ చెయ్యటంగాని,అయ్యప్ప భక్తులకు బోజనం పెట్టటంగాని చెయ్యాలి.
" శనీశ్వర జపం "
శనీశ్వరుడి జప మంత్రాలు
* నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం *
" ఓం శం శనయేనమ "
* ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః *
శని గాయత్రీ మంత్రం:
* ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ *
 
          ఓం నమో శనీశ్వరాయ నమః
శనిత్రయోదశి మరియు మాస శివరాత్రి రెండూ కలిసి రావడం అనేది చాలా   అరుదైన రోజు.
సాధారణంగా   శనిత్రయోదశే ఏ  మూడు నాలుగు మాసాలకు ఒకసారి రావడం జరుగుతుంది. అంటే త్రయోదశి శనివారంతో   కలిసిరావడం. లాంటిది మాస శివరాత్రితో కూడా కలిసిరావడం   చాలా విశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ రెండింటికి ఏమిటి సంబంధం ? అనిపిస్తుంది   కదూ..?
మనము శని దేవుడిని కేవలం శని అని పిలవము. *శనీశ్వరుడు* అంటాము. అంటే ఆయన ఈశ్వర స్వరూపమైన గ్రహంగా భావిస్తాము. అలంటి ఈశ్వర స్వరూపమైన శని ని ఈ పవిత్ర దినమున పూజించిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఉదయం శనీశ్వరుడిని ప్రదోశంలో ఈశ్వరుడిని ఒకేదినములో పూజించిన వారికి కష్టాలు తప్పినట్లే !
ఈ విళంబి నామ సంవత్సరంలో ఈ కింది రాశులవారికి శని   బాధలు ఉన్నాయి కావున, ఆయా రాశులవారు కింద   సూచించిన మంత్ర పారాయణం అభిషేకం చేసుకోవడం చాలా మంచిది.
వృషభ రాశి ( అష్టమ శని ), మిధున రాశి ( సప్తమ శని ), కన్యా రాశి ( అర్దాష్టమ శని ), వృశ్చిక రాశి ( ఏలినాటి శని ), ధనుస్సు     రాశి ( జన్మ శని - ఏలినాటి శని ), మకర రాశి ( ఏలినాటి శని )
పై రాశుల వారు రేపు అవకాశం ఉంటే ఉదయం శనికి తైలాభిషేకం, ప్రదోశంలో శివుడికి రుద్రాభిషేకం చేయించండి.
వీలుంటే హోమం నల్ల నువ్వులు కిలో మరియు నలుపు వస్త్రము   దానం చేయడం మంచిది.
మీరు  చదువుకోవలసిన స్తోత్రం*
|కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం !!
*శని జపం చేసుకునే విధానం*
( *ఇది వేదం అర్హులైన వారికి మాత్రమే*)
అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర
గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే
శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః
కరన్యాసం
ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః
ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః
ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః
ఓం శంవాతః - అనామికాభ్యాం నమః
ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః
ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:
ఓం శమగ్ని: - హృదయాయ నమః
ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ
ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్
ఓం శంవాతః - కవచాయహు
ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్
ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం
ఓం శమగ్ని -- శ్రిదః !!
వ్యాస ప్రోక్త సోత్రం ( *అందరూ చదువుకోవచ్చ్చు* )
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం |
*శని కవచ స్తోత్రము*
శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!
నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!
హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!
ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!
పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!
*ఫలశ్రుతి*
య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!
శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!
నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!
షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!
శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః
ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః
ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః
ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః
ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః
ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః
ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః
ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః
ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః
ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః
ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః
*శని దశనామ స్తోత్రము *
కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః
*దశరథ శని స్తోత్రము*
కోనంతకో రౌద్ర యమాతః బబ్రుః కృష్ణః శనిః పింగళ మందః శౌరీః నిత్య స్మ్రుత్యో హరతే చ పీడః తస్మై నమః శ్రీ రవినందనయా॰
సురా అసురా కింపురుష రాజేంద్ర గంధర్వ విద్యాధర పన్నగాశ్చ పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰
నర నరేంద్ర పశవో మృగేంద్ర వన్యాశ్చ యే కీట పతంగ బ్రింగాః పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰
దేశాచ దుర్గాని వనాని యత్ర శేనానివేశ పుర పట్టణాని పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰
తిలైర్యవైర్మశా గుదాన్నదానై అయోహీన నీలాంబర దానతోవా ప్రీనతి మన్త్రైర్నివాశరేచ తస్మై నమః శ్రీ రవినందనయా॰
ప్రయాగ కూలే యమునా తటేచ సరస్వతీ పుణ్యజలే గుహాయం యో యోగినం ధ్యానగతోపి శూక్ష్మాశ్ తస్మై నమః శ్రీ రవినందనయా॰
అన్య ప్రదేశాత్ స్వగృహం ప్రవిష్తాశ్ తదీయవరేశా నర సుఖేశాత్ గృహద్ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీ రవినందనయా॰
స్రష్ట స్వయంభూర్ భువన త్రయస్య త్రత హరీశో హరతే పినాకీ ఏకాస్ త్రిధా రిగ్ యజుః సామ వేదాః తస్మై నమః శ్రీ రవినందనయా॰
కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః
ఏతాని దశ నామాని నిత్యం ప్రాధయ పటే శనైశ్చర కృత పీడా న కదాచిద్ భవిష్యతి
*దశరథ ప్రోక్త శని స్తోత్రము*
నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయచ నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతి జటాయచ నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక నమః పౌరుష గాత్రాయ స్థూల రోమాయతే నమః నమో నిత్యం క్షుదార్తాయ నిత్య తృప్తాయతే నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమో స్తుతే నమస్తే ఘోర రూపాయ దుర్నిరీక్ష్యాయతే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వతే అభయ దాయినే అధో దృష్టే నమస్తే-స్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయచ జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజ సూనవే తుష్టోదదాసి రాజ్యం త్యం క్రుద్ధో హరపి తత్‌క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే బ్రహ్మాశక్రో యమశ్చైవ మునయస్సప్తతారకాః రాజ్యభ్రష్టాః పతం తీహ తవ దృష్ట్యావలోకితాః త్వయావలోకితాస్తే-పి నాశయాంతి సమూలతః ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వ మర్ధితఃశని త్రయోదశి ప్రాముఖ్యత
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.
జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.
బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.
శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.
క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.
ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.
ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.
ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :
నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.
శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
(నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం)
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలిమద్యమాంసాదులను ముట్టరాదు.
వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.
శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)
ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.
పూర్వజన్మ కర్మ ఫలం:
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.
ఫలితం అనుభవించాల్సిందే:
ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.
భయపెట్టే దేవుడు కాదు:
భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ఓర్పు, సహనం ముఖ్యం:
మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.
శని దండనాధికారి:
జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS