Saturday, April 14, 2018

శ్రీచక్రం లో శివునీ శక్తినీ సూచించే త్రికోణాలు

శ్రీ చక్రం                      శ్రీచక్రం లో శివునీ శక్తినీ సూచించే త్రికోణాలు ఉన్నాయికదా. అందు శక్తికోణాలు అయిదు,శివకోణాలు నాలుగు.వెరసి నవ త్రికోణాత్మకమైనదే శ్రీచక్రం.లలితాత్రిశతి ఉత్తరపీఠికలో ఈవివరం అంతా ఉంటుంది.మీరు చాలాసార్లు దానిని చదివే ఉంటారు. ఆదిశంకరులు త్రిశతీభాష్యం వ్రాశారు.అంటే ఆ స్తోత్రానికి ఆయన ఎంతటి విలువను ఇచ్చారో గ్రహించవచ్చు.ఆ స్తోత్రానికి అంతటి మహత్యం ఎందుకు వచ్చిందంటే అందులో పంచదశీ మంత్రం ఇమిడి ఉన్నది.దానిని పారాయణ చేస్తే పంచదశీ మంత్రాన్ని జపించినట్లే.దాదాపుగా ఈ స్తోత్రం చెప్పిన భావాలనే భైరవయామళతంత్రం కూడా వివరించింది.*
శ్రీచక్రము:--- శక్తిచక్రాన్ని సృష్టిచక్రం అంటారు. శివచక్రాన్ని సంహారచక్రం అంటారు.సంహారచక్రాన్ని అందరూ ఉపాసించలేరు. శుద్ధ జ్ఞానాభిలాషులు మాత్రమె దానిని ఉపాసించగలరు.భోగాన్నీ మోక్షాన్నీ కూడా కోరుకునేవారు సృష్టిచక్రాన్ని ఉపాసిస్తారు.ఇదిగాక స్తితిచక్రమని ఇంకొక విధానం కూడా ఉన్నప్పటికీ అది ఆచరణలో పెద్దగా కనిపించదు.*                        దశ మహావిద్యలు:---   దశ మహావిద్యలలో ఎవరికీ వారే గొప్పవారు. వీరు ప్రత్యెక దేవతలు కారు. జగన్మాత యగు ఆద్యాశక్తి యొక్క వివిధ రూపములు. కనుక ఎవరిని ఉపాసించినా భుక్తి ముక్తులను ఇవ్వగలరు. కాని వారివారి లక్షణములను బట్టి ఒక్కొక్క ప్రత్యెక వరమును అధికముగా ఇవ్వ గలరు. కనుక జాతకమున గల ఒక్కొక్క దోషమునకు ఒక్కొక్క మహావిద్య ఉపాసన శ్రేష్టము.*                                 దేవీ ఉపాసనలలో లలితా ఉపాసన ముఖ్యము అని కొందరి అభిప్రాయము. లలితా ఉపాసన యగు శ్రీవిద్య సర్వశ్రేష్ట విద్య. దానిని ప్రక్కన ఉంచితే, జ్యోతిష పరంగా చూస్తె గ్రహములలో అత్యంత శుభ గ్రహములు గురు శుక్రులు. కనుక విద్యలలో సౌమ్యమైనవి, భయము గోలుపనివి తార మరియు కమల. వీరే సరస్వతి మరియు లక్ష్మి. వీరు సాత్విక దేవతలు.*
*రవి కుజులు రాజసిక గ్రహములు. కనుక త్రిపుర భైరవి, బగళాముఖి రాజసిక దేవతలు. వీరు ఉగ్రరూపులు. వీరి ఉపాసన కష్టతరము.ఇక బుధచంద్రులు మిశ్రమ గ్రహములు. అనగా వారి స్థితిని బట్టి మంచీ చెడూ రెండూ చేయ గలరు. కనుక మాతంగి, భువనేశ్వరి అనువారు వీరికి అధిదేవతలు. వీరి ఉపాసన సాత్వికమునకు, రాజసమునకు మధ్యస్తంగా ఉంటుంది            ఇక మిగిలినది శనీశ్వరులు. వీరికి కాళి అధిదేవత. రాహుకేతువులకు ఛిన్నమస్త, ధూమావతులు అధిదేవతలు. వీరి ఉపాసన బహు కష్టతరము. వివిధ ఆటంకములు, భయమును గొలిపే పరీక్షలతో కూడి ఉంటుంది. అంత మాత్రాన వీరిని తామసిక దేవతలు అనుట తప్పు.*             వీరందరికీ ప్రత్యెక యంత్రములు, మంత్రములు, తంత్రము ఉంటాయి. మంత్ర భేదములు కూడా కలవు. ఒక్క తారామంత్రములె దాదాపు పది వరకు కలవు. ఇక కాళీ మంత్రములు అనేకములు కలవు. వీటిలో చిన్నవైన బీజ మంత్రముల నుండి దండకముల వంటి మాలామంత్రముల వరకు అనేక రకములు కలవు.*
ఏదైనా, సాధకుని స్థితిని బట్టి, అర్హతను బట్టి ఉపాసన ఉంటుంది.ఉపాసనా రహస్యములను గురుముఖతా గ్రహించుట మంచిది.*
గురువు అనబడే వానికి కొన్ని అర్హతలు ఉండాలి.ఉపదేశింపబడే మంత్రములో ఆయన సిద్ధి పొంది ఉండాలి.అపుడే అది సిద్ధ మంత్రము అవుతుంది. మంత్ర ఉపాసనా విధానాన్ని శిష్యునకు ఉపదేశించగల జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడే ఆ మంత్రము సిద్ధిస్తుంది.గురువు పూర్తిగా నిస్వార్థ పూరితుడై ఉండాలి. బ్రహ్మ వేత్త అయి ఉండాలి.కోరికలకు అతీతుడై ఉండాలి.నియమ నిష్టాగరిష్టుడై ఉండాలి.అలాగే శిష్యుడు కూడా నిర్మలుడు, బ్రహ్మచర్య దక్షుడు, సాధన యందు పట్టుదల కలిగినవాడు, సత్యకాంక్షి అయి ఉండాలి. అప్పుడే తంత్రమైనా మంత్రమైనా సిద్ధిస్తుంది. లేకుంటే సిద్ధి కలుగదు.*

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS