Saturday, April 14, 2018

శనేశ్వర స్వామి దేవాలయం,మందపల్లి, కొత్తపేట మం.ii తూ.గో జిల్లా,

శనేశ్వర స్వామి దేవాలయం,మందపల్లి, కొత్తపేట మం.ii తూ.గో జిల్లా,


హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము "నవగ్రహాలలో" ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి.
మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శనిత్రయోదశి నాడు,మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.
మందపల్లి గ్రామం రాజమండ్రి కి 38 కి.మి., కాకినాడ కు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి.,రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS