Saturday, April 28, 2018

వైశాఖ పూర్ణిమ. మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది.

వైశాఖ పూర్ణిమ.  మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధామైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి, అమ్మవారి ఆరాధనకి, శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమావ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు.
అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. పూర్ణిమ..బుద్దపూర్ణిమ...!!శ్రీ
పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.
ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా పేరుపొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతిదినమూ పుణ్యదినమే.
అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు..వ్రతాలు పురాణగ్రంధాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.
వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి
నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం,
నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.
సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు.
అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.
వైశాఖ పూర్ణిమ - మహావైశాఖి.
వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపంను శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు.
అలాగే హిరణ్యకశిపుడిని అంతమొందించి ఉగ్రరూపంలో తిరుగుతూ ఉండిన నృసింహస్వామి ఉగ్రరూపాన్ని తొలగించేందుకు శివుడు శరభుడిగా అవతరించిన దినమూ ఇదే.
గౌతమ బుద్ధుడి జన్మదినం కూడా ఈరోజే. ఇంతటి విశిష్టమైన ఈనాడు సముద్రస్నానం చేయడం విష్ణువును పూజించడంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి ఈ దినం ఉన్నతమైనది.
వైశాఖ పూర్ణిమ. దీనికి మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది.
సంవత్సరంలో ప్రధామైన కాలములు..రెండు ఋతువులు చెప్పారు –
వసంత ఋతువు,
శరదృతువు.
శరదృతువు ఆశ్వయుజ కార్తికాలలో వస్తుంది.
వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది.
ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు.
ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది.
ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి –
చైత్ర పూర్ణిమ,
వైశాఖ పూర్ణిమ,
ఆశ్వయుజ పూర్ణిమ,
కార్తిక పూర్ణిమ.
ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం.
ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు.
అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి, అమ్మవారి ఆరాధనకి, శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది.
ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమావ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం.
ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు.
అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు.
బుద్ధ పూర్ణిమ..
విశాఖ నక్షత్రంతో కూడిన చంద్రుడు గల పూర్ణిమ- వైశాఖ పూర్ణిమ. బుద్ధుడు జన్మించిన పూర్ణిమ ఇది. బుద్ధ పూర్ణిమ.
శాక్య వంశంలో జన్మించాడు సిద్ధార్థుడు.
ఆ రాజకుమారుడు భవిష్యత్తులో సన్యాసి అవుతాడని పండితులు చెప్పారు. కష్టాలు, దుఃఖాలు అతడికి తెలియకుండా తండ్రి ఏర్పాట్లు చేశాడు.
అయినా, నాలుగు దృశ్యాలు అతడి కంటపడ్డాయి. అవి- వృద్ధుడు,
రోగి,
శవం (మరణం),
సన్యాసి.
ఆస్థితుల్నిచూసి చలించిన అతడుఅంతర్ముఖుడయ్యాడు. ఇల్లు వదిలి, భార్యను బిడ్డను వీడి వెళ్లిపోయాడు. బిహార్‌లోని బుద్ధగయలో బోధి వృక్షం కింద అతడికి జ్ఞానోదయమైంది. ఆర్య సత్యాలు వెల్లడించాడు. అష్టాంగ యోగ మార్గం బోధించాడు.
బుద్ధుడిగా జ్ఞానబోధను మొదట సారనాథ్‌లో ప్రారంభించాడు. దాన్ని ‘ధర్మచక్రం’ అంటారు.
పలు సంవత్సరాలు ధర్మబోధ చేసిన బుద్ధుడి తరవాత- బౌద్ధమతం హీనయాన, మహాయాన అని రెండు శాఖలుగా విడిపోయింది.
ఆయన ఉండగానే ఆ మతం చైనా, సింహళ, టిబెట్‌ వంటి దేశాల్లో వ్యాపించింది. ప్రస్తుతం అది విశ్వమంతా ఉంది.
వైశాఖ పౌర్ణమినాడే మహాపరినిర్వాణం.బుద్ధుడిది విశేష ధర్మసిద్ధాంతం. అహింస, కరుణ ఉండాలని; కోరికలు లేకుండా జీవించాలని మానవాళికి బోధించాడు. అందుకే ఆయనను లోకం ‘ప్రపంచ జ్యోతి’గా వర్ణించింది.
బోధగయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బోధగయ తర్వాత, బౌద్ధమతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సారనాథ్ లో బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి.
వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు పెద్ద పండుగ. బౌద్ధమత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు చాలా శాంతంగా వేడుక చేసుకుంటారు.
బుద్ధ పూర్ణిమ ఉత్సవాలలో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగరేస్తారు. బౌద్ధస్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు. ''ధర్మో రక్షతి రక్షితః'' అన్నారు కదా! ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. బౌద్ధం ఈ ధర్మసూత్రాన్ని నొక్కి వక్కాణిస్తుంది.
సత్యం, ధర్మం గురించిన కధలు గుర్తుచేసుకుంటారు. బౌద్ధమతస్తులు పూవులు, దీపాలు, అగరొత్తులు గురువుగారికి సమర్పించుకుంటారు.
అందమైన పూవులు కొంతసేపటికి వాడిపోతాయి. కాంతులొలికే దీపం, మధురమైన అగరొత్తులు కాసేపటికి ఆవిరైపోతాయి.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికి ప్రతీకలుగా గురువుగారికి వీటిని ఇస్తారు.
గౌతముడు అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు లాంటి దుఃఖాలను చూసి చలించిపోయాడు. కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ కుటుంబాన్ని వదిలి వెళ్లాడు. దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరికి గయలో, బోధివృక్షం కింద ''కోరికలే దుఃఖానికి మూల కారణం'' అని బోధపడింది. తాను కనుగొన్న నగ్నసత్యాన్ని ప్రచారం చేశాడు బుద్ధుడు.
'మనకు కష్టం కలుగుతోంది, దుఃఖిస్తున్నాము అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించమని ప్రబోధించాడు.
లోకంలో ఏదీ శాశ్వతము కాదు, ప్రతిదీ మార్పు చెందుతుంది, చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దాన్ని ఆమోదించాలి. మంచి, చెడు దేనికీ ప్రతిస్పందించవద్దు ' - బుద్ధుని ఈ బోధనలు ఉన్నతమైనవి, ఉత్కృష్టమైనవి.
బుద్ధం.. శరణం..గచ్ఛామి..
ధర్మం..శరణం..గచ్ఛామి..!!
                          శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS