ఆలయాల్లో సదా సాoప్రదాయంగా ఉండడం వల్ల అందరికీ దేవతల అనుగ్రహం కలుగుతుంది
చేయకూడని దోషాలు తెలుసుకుందాం.
*పద్మ పురాణే*
పురతో వాసుదేవస్య న స భాగవతం కలౌ| యానైర్వా పాదుకిభిర్వా యానం భగవతో గృహే|| దేవోత్సవేషు సేవా చ అప్రణామస్తదగ్రతః| ఉచ్ఛిష్టేచైవ చాశౌచే భగవద్వందనాదికం||
ఏక హస్త ప్రణామశ్చ తత్పురస్తాత్ అప్రదక్షిణం| పాదప్రసారణం చాగ్రే తథా పర్యంకసేవనం||
శయనం భక్షణం చాపి మిథ్యాభాషణమేవ చ| ఉచ్ఛైర్భాషమథో జల్పో రోదనాని చ విగ్రహః|| నిగ్రహానుగ్రహౌ చైవ స్త్రీషు సాకూతభాషణం|
కంబలావరణం చైవ పరనిందా పరస్తుతిః||
అశ్లీల భాషణం చైవ అధోవాయు విమోక్షణం|
శక్తి గౌణోపచారశ్చాప్య నివేదిత భక్షణం|| తత్తత్కాలోద్భవానాం చ ఫలాదీనామనర్పణం| వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యజనస్య యత్|| సృష్టికృత్తాశనం చైవ పరనిందా పరస్తుతిః|
గురౌ మౌనం నిజస్తోత్రం దేవతానిందనం తదా|| అపరాధస్తథా విష్ణోః ద్వాత్రింశత్పరికీర్తితాః||
వివరణ ఇలా***********
*పురతో వాసుదేవస్య న స భాగవతం కలౌ వాసుదేవుని (విష్ణువు) ముందు భగవద్భక్తులకు (భాగవతులకు) నమస్కరించకపోవడం.
*యానైర్వా పాదుకిభిర్వా యానం భగవతో గృహే వాహనాలపై లేదా పాదరక్షలతో భగవంతుని ఆలయంలోనికి వెళ్లడం.
*దేవోత్సవేషు సేవా చ అప్రణామస్తదగ్రతః దేవతలకు జరిగే ఉత్సవాలలో సేవ చేయకపోవడం లేదా దేవతలకు నమస్కరించకపోవడం.
*ఉచ్ఛిష్టేచైవ చాశౌచే భగవద్వందనాదికం
ఎంగిలిగా ఉన్నప్పుడు లేదా అశౌచం (మైల) ఉన్నప్పుడు భగవంతుని వందనం చేయడం.
*ఏక హస్త ప్రణామశ్చ
ఒక చేతితో నమస్కరించడం.
*తత్పురస్తాత్ అప్రదక్షిణం
ఆయన ముందు ప్రదక్షిణ చేయకపోవడం.
*పాదప్రసారణం చాగ్రే
దేవుని ముందు పాదాలు చాపుకోవడం.
*తథా పర్యంకసేవనం
అలాగే పరుపుపై మంచంపై కూర్చోవడం లేదా పడుకోవడం.
*శయనం
పరుండడం (దేవతా ముందు నిద్రపోవడం).
*భక్షణం చాపి
తిండీ తినడం.
*మిథ్యాభాషణమేవ చ
అబద్ధాలు ఆడడం.
*ఉచ్ఛైర్భాషమథో జల్పో
బిగ్గరగా మాట్లాడడం లేదా అనవసరమైన మాటలు మాట్లాడడం.
*రోదనాని చ ఏడవడం
రోదనo
*విగ్రహః
పోట్లాడడం
*నిగ్రహానుగ్రహౌ చైవ
కోపాన్ని (నిగ్రహం) లేదా అనుగ్రహాన్ని ప్రకటించడం.
*స్త్రీషు సాకూతభాషణం
స్త్రీలతో కూడిన సంభాషణ లేక కామ భావంతో మాట్లాడటం.
*కంబలావరణం చైవ
దుప్పటి కంబళి కప్పుకోవడం చలికాచుకోవడం.
*పరనిందా
ఇతరులను నిందించడం.
*పరస్తుతిః
ఇతరులను పొగడడం.
*అశ్లీల భాషణం చైవ
అసభ్యంగా మాట్లాడడం.
*అధోవాయు విమోక్షణం
అధోవాయువును గాలిని వదలడం.
*శక్తి గౌణోపచారశ్చాపి
దేవత పట్ల శక్తి ఉన్నా సరే, తక్కువైన (గౌణ) ఉపచారాలను పూజ, నైవేద్యం చేయడం.
*అనివేదిత భక్షణం
భగవంతునికి నివేదించకుండా తినడం.
*తత్తత్కాలోద్భవానాం చ ఫలాదీనామనర్పణం ఆయా కాలాల్లో లభించే పండ్లను మొదలైనవాటిని భగవంతునికి అర్పించకపోవడం.
*వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యజనస్య యత్
ముందుగా వాడినవి తరువాత మిగిలిన విసనకర్ర మొదలైన వాటిని సమర్పించడం.
*సృష్టికృత్తాశనం చైవ
దేవతలకు నివేదించని ఆహారాన్ని తినడం (లేదా సాధారణంగా తినకూడని ఆహారాన్ని తినడం).
*పరనిందా
దేవత ముందు ఇతరులను నిందించడం.
*పరస్తుతిః
దేవత ముందు ఇతరులను పొగడడం.
*గురౌ మౌనం
గురువు ముందు మౌనంగా ఉండడం (ఆయన ఆజ్ఞను పాటించకుండా లేదా సేవ చేయకుండా ఉండడం).
*నిజస్తోత్రం
తనను తాను స్తుతించుకోవడం.
*దేవతానిందనం
అలాగే ఇతర దేవతలను నిందించడం తప్పు.
*అపరాధస్తథా విష్ణోః ద్వాత్రింశత్పరికీర్తితాః
పైన చెప్పబడిన ముప్పై రెండు అపరాధాలు
దేవాలయాల్లో మరియు పూజా స్థానాలలో
శ్రీ మహా విష్ణు దేవత ముందు లేక ఈశ్వరుని పట్ల చేయకూడని కొన్ని దోషములు.
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
*రాళ్ళబండి శర్మ*

No comments:
Post a Comment