*🌺లలితాదేవి పటంలో కనిపించే దృశ్యం కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. 🌺*
*🌺అది శక్తి యొక్క అత్యున్నత రూపాన్ని సూచించే ఒక తాత్విక ప్రతీక. మీరు ఉదహరించిన "లలితా సహస్రనామ స్తోత్రం"లోని నామాలు దీనికి ఆధారాలు*.
*🌺"పంచ బ్రహ్మసనాసీనా": అంటే ఐదుగురు బ్రహ్మల (బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ) సింహాసనంపై కూర్చున్నది అని అర్థం. 🌺*
*🌺 ఈ ఐదుగురు బ్రహ్మలు సృష్టి, స్థితి, సంహార, తిరోధాన (లయం), మరియు అనుగ్రహం అనే ఐదు "పంచకృత్యాలను" నిర్వహిస్తారు*.
*🌺"పంచ ప్రేత మంచాధీశాయినీ": ఈ నామానికి ఐదుగురు మరణించిన వారి (పంచ ప్రేత) మంచంపై కూర్చున్నది అని అర్థం. ఇక్కడ పంచ ప్రేతలు అంటే తమ స్వంత శక్తులను ప్రదర్శించలేని ఐదుగురు బ్రహ్మలు*.
*🌺శివ-శక్తి అవిభాజ్యత ;*
*🌺🌈ఇక్కడ చెప్పినట్లుగా, "శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం" అనే సూత్రం శివ మరియు శక్తి యొక్క అవిభాజ్య సంబంధాన్ని వివరిస్తుంది. శక్తి లేకపోతే శివుడు కూడా తన కార్యాలను నిర్వహించలేడు ఆదిత్యయోగీ. 🌺*
*🌺 లలితాదేవి పటంలో శివుడు సింహాసనంగా ఉండటం, మిగతా నలుగురు బ్రహ్మలు సింహాసనానికి కాళ్ళుగా ఉండటం ఆ పరాశక్తి యొక్క సర్వోన్నత స్థానాన్ని సూచిస్తుంది. ఈ ఐదుగురు బ్రహ్మలు ఆ పరాశక్తి సహాయంతోనే పంచకృత్యాలను నిర్వహిస్తారు*.
*చిత్రణలోని అంతరార్థం..*
*🌈ఇక్కడ చూసిన పటంలోని అంతరార్థం ఏమిటంటే:*
*🌺🌈సింహాసనం: ఇది సృష్టిలోని అన్ని శక్తులపైన లలితాదేవికి ఉన్న అధికారాన్ని సూచిస్తుంది*.
*🌺🌈శివుడు: శివుడు పరాశక్తిని ధరించి, ఆమెకు ఆధారాన్ని ఇస్తున్నాడు. శక్తి లేకపోతే ఆయన కూడా నిర్గుణుడు, నిష్క్రియుడు. 🌺*
*🌺🌈నలుగురు బ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర): వీరు సృష్టి, స్థితి, లయ, మరియు ఇతర కార్యాలను నిర్వహిస్తారు. వీరు లలితాదేవికి ఆధీనంలో ఉండి ఆమె ఇచ్చే శక్తితో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు*.
*🌺ఈ పటం "శక్తియే మూలమైనది" మరియు శక్తి ద్వారానే సృష్టి, స్థితి, లయలు జరుగుతాయి అనే సనాతన ధర్మాన్ని సూచిస్తుంది.🌺*
*🌺శ్రీ_చక్రం_యొక్క_వివరణ🌺*
*🌺🌈శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం ఆధారితమైన శ్రీ విద్యా తంత్రము లో ఒక పవిత్రమైన యంత్రం.ఇది సమయ,బ్రహ్మవిద్యా,సంప్రదాయం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకురెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణు లైన,త్రిశక్తులతోకూడిన శ్రీవిద్య, లలితా దేవి లేదా త్రిపురసుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుషశక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్న ముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది.ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం అని లేదా నవ చక్రం అని కూడా పిలుస్తారు.🌺*
*🌺ఇందులోని కొన్నిరకాలు*
*🌺1,భూప్రస్తారం*
*🌺2,మేరు_ప్రస్తారం*: పిరమిడ్ వలె* *త్రిమీతీయంగాత్రీడైమంక్షన్ గా నిర్మాణించబడితే అది (మేరు పర్వతాన్ని సూచించే) మహా మేరు అని* *అంటారు.సరియైన బీజాలు, మంత్రాలు లేనిదే శ్రీ యంత్రము నిరుపయోగము. ప్రాణప్రతిష్ఠ, పూజలు చేయకున్నచో యంత్రము మరణించినట్లు సమానం. 🌺*
*🌺భూప్రస్తారం-మేరు ప్రస్తారం🌺*
*🌺శ్రీ చక్ర లోని*
*వివిధ భాగాలు🌺*
*🌺🌈మనశరీరములోనిదోషముల సవరించునవిగా శ్రీ చక్రం లోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచికగా భావిస్తారు. బయటి నుండి లోపలికి వెళ్ళే దిశామార్గములో శ్రీ చక్ర భాగ ములు-మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న*
*🌺🌈చతురస్రాకారము - త్రైలోక్యమోహనము లేదాభూపురము అనియూ పదహారు రేకులు గల వృత్తము సర్వాశాపరిపూరకము అనియూ,*
*🌺🌈ఎనిమిదిరేకులు గల వృత్త ము - సర్వ సంక్షోభనము అని,పధ్నాలుగు చిన్న త్రిభుజములు కలది సర్వసౌభాగ్యదాయకము అని, పది చిన్న త్రిభుజాలు కలది -సర్వ అర్థసాధకములు అని,పది చిన్న త్రిభుజాలుకలది - సర్వ రక్షాకరములు అని ఎనిమిదిచిన్న త్రిభుజాలు - సర్వ రోగహరములు అని మధ్యనున్నఒకత్రిభుజం - సర్వ సిద్ధిప్రదముఅనియూ*
*🌺బిందువు - సర్వ ఆనందమయి*
*🌷అనివివరణగాతేలియజేయుచున్నది అని బ్రహ్మశ్రీ ఇంద్రగంటి శంకరప్రసాదశర్మగారు,*
*🌈🌺తనువ్రాసిన శ్రీ మహాత్రిపురసుందరీ శ్రీ చక్రపూజాకల్పమనుగ్రంథము అనే తన పుస్తకంలో శ్రీ చక్రం గురించి ఈ విధంగా తెలిపారు ఆదిత్యయోగీ. 🌈🌺*
*🌈🌺వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిదిత్రిభుజాలు ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తిఉంటుంది ఈ కేంద్రము నుండే సమస్తవిశ్వము వ్యాపిస్తుంది*.
*🌺ఈ త్రికోణములచుట్టూముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకు లు గల వృత్తము దానితర్వాత పునరుత్పత్తిని సూచించేపదహా రు రేకులు గల వృత్తములు వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారాలు ఉంటాయి*.
*🌈బిందువు అంతరాలలో కామ కళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి ఎరుపు - అండము తెలుపు - వీర్యము రెండిటి కలయిక శివశక్తులసంగమము*.
*🌈ఈ సంగమమే*
*శ్రీ చక్ర కారకము*.
*🌈వామకేశ్వర తంత్రముననూ మరియూ శ్రీ చక్ర నిర్మాణ సంప్రదాయములను వామకేశ్వర తంత్రము రెండవ భాగమైన యోగినీ హృదయలో శ్రీ చక్రం గురించి ఈ విధంగా చెప్పబడింది. 🌺*
*🌺స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి.వీటి సంయోగముతోనే చక్రము ఆవిర్భవిస్తుంది.ఇదే చక్రము యొక్క మూలము*
*🌺మహోన్నతమైనస్త్రీశక్తిస్వేచ్ఛగా సృష్టి అనే రూపాంతరము దీనికి ప్రతిస్పందనగా చక్రము యొక్క సృష్టి కూడా జరిగింది.*
*🌈ఈ ప్రకంపనలతో శూన్యముని పోలిన విసర్గ (:) వలె చైతన్యస్థితిలో బిందువు ఉద్భవించినది. దివ్య శక్తి యొక్క ఈ స్థిర ప్రవాహంలో సంపూర్ణమైన వ్యవస్థ అనేసముద్రముఅవతరించింది*
*🌈ఇదే,ముగ్గురుఅమ్మల,మూలపుటమ్మ,చక్రంలో బైందవము, (బిందువు)కి మూడు రూపాలు ఉన్నాయి. ధర్మము, అధర్మము మరియు ఆత్మ.అనాత్మ, మేయ ము మరియు ప్రమము. నవయోని చక్రముచైతన్యానికి అనంత సౌఖ్యానికి సూచిక. మంత్రము యొక్క తొమ్మిది విభాగాలు కలది.🌺*
*🌺తంత్రశాస్త్రముశ్రీచక్రం*
*🌈శివశక్తుల సంయోగమే శ్రీ చక్రం. ఈ చక్రం మధ్యలో బిందువైన బీజము నుండి సమస్తలోకాలు, భూతాలు పుట్టినవి. కనుక శ్రీ చక్రము సమస్త కామిత ఫలము. ఆది,యందు పరమేశ్వరుడు ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొ క్కతంత్ర శాస్త్రం చొప్పున 64 తంత్ర శాస్త్రములను చెప్పారు. కామ్యములన్నింటిని పొందుటకు 64 తంత్రములను పూజించుట కష్ఠసాధ్యమని పరమేశ్వరుని,సులభమార్గంచూపించమనిదేవతలుప్రార్థించగా,పరమేశ్వరుడు శ్రీవిద్యోపాసనను ప్రసాదించినాడు*.
*🌈శ్రీ మహాత్రిపురసుందరి, శ్రీ చక్ర ము, శ్రీ విద్యామంత్ర ఉపాసన యే శ్రీ విద్యోపాసన. దీనివల్ల సమస్త కామ్యములు లభించును.ఇందులో 12 సంప్రదాయములు ఉన్నాయి.*
*🌺శ్రీ చక్రము*, *సహస్రారకమలము*
*ఒకటే🌺*.
*🌈బహిఃపూజలకు శ్రీయంత్రమును ఉంచి పూజిస్తారు. అంతః పూజలకు సహస్త్రార దీనిలోని బిందువు నుండేపంచ భూతాలు సమస్తంపుట్టినవి*.
*🌈అందుకే ''' సుధాసింధోర్మధ్యే''' అని అమ్మవారిని దీనిఅర్ధం:ఇదిఅమృతసముద్రం మధ్యలో మణిద్వీపం ఉంది. దానిలోకల్పకోద్యానవనము.దానిలో నీపోపవనం ఉంది. దీని మధ్య చింతామణిగృహం ఉంది*.
*🌈దీనిలో మంచంమీదపంచబ్రహ్మా కారంలో ఉన్న రత్న సింహానం మీద పరమశివుని పర్యంకం మీద చిదానందలహరి అయిన అమ్మవారు శ్రీ దేవీ ఉంన్నది. ఈమెయే శ్రీ చక్రోపాసనకుమూల దేవత. ఈ దేవిని గూర్చి వ్రాయబడిన ఆంధ్రలలితోపాఖ్యానములో ఇలా ఉన్నది:🌺*
*🌺భర్తమాట ధిక్కరించి పార్వతి దేవి తండ్రి దక్షుడు యజ్ఞంవద్దకు వెళ్ళగా తండ్రి ఆమెను తిర స్కరించగా యోగాగ్నిచేత భస్మమైనది. దేవి పద్మాసనంలో కూర్చొని, ప్రాణములను బంధించిమూలాధార చిద్వహ్నిని నెగయించి, నాసాగ్రనయనయై, చిదగ్నిని ప్రజ్వలింపజేసింది, ఈ అగ్ని ఆమె శరీరాన్ని భస్మరాసికూడా లేకుండా దహింపజేసినది. చిదగ్ని - ఆటం- అగ్ని ఒకటే అయిఉండవచ్చు. తదుపరి,పార్వతీదేవి పర్వత రాజుకు, కూతురుగా పుట్టింది. నారదులవారు, పర్వతరాజు వద్దకువచ్చి, నీతనయచతుర్దశ భువనజగన్మాతయైనపరమేశ్వరి అని చెప్పాడు. ఈమెను పరమేశ్వరునికి భార్యగా చేయవలెనని,పరమేశ్వరుని వద్ద వుంచాడు. పరమేశ్వరుడు మహాతపస్సులో ఉండికన్నులు తెరచిచూడలేదు. అప్పుడు,ఇంద్రుడు మన్మధుడు ని బ్రతిమాలగా అపుడు తన మిత్రుడు వసంతుని, సేనాని చంద్రుడుని, సాయంతో కామ బాణం ప్రయోగించగా,నిర్వికల్ప సమాథి స్థితిలో ఉన్నఈశ్వరుని మనస్సు చలించి, కళ్ళు తెరచి చూడగానేత్రాగ్నివలన,మన్మధుడు భస్మం కాగా అందులోంచి భస్మాసురుడు పుట్టినాడు. మన్మధుడులేకపోయినందువలన ప్రపంచము రసహీనమైనది. ఆఖరికి చెట్లు కూడా పుష్పించుట లేదు. పశు పక్షి మానవసృష్టి ఆగింది. ఇందుకు గాను ఆది శంభుడు మహాయజ్ఞం చేసి అందులో దేవ తలను త్రిమూర్తులను చిదగ్నిలో వ్రేల్చాడు. 🌺*
*🌺ఆ అగ్నికుండం నుంచి శ్రీ త్రిపురసుందరిలలితా దేవి ఆవిర్భవించినది*.
*🌈ఈ జగజ్జనని మళ్ళా సృష్టిని చేసినది అటుపై ఆమె భస్మాసురునితో తీవ్ర యుద్ధం చేసి ఆతడి ని వధించింది*.
*🌈ఈ యుద్ధం శూన్యకపురంలో జరుగింది. అందులోపురమూ భస్మాసుర్డుడు భస్మం అయినారు. ఇందులో అమ్మవారుని మహా పద్మాటవీ వర్ణన చేయబడెను. లలితాంబ యోగినీ చక్రదేవి పంక్తియందు19వసంఖ్య. దీనిమీద నాదాంతరమనే స్థాన ము ఉన్నది. అందులో వేయిసూర్యులప్రకాశ ముగల బిందుపీఠం ఉన్నది*.
*🌈అదే శ్రీ పీఠం,శ్రీ దేవి శ్రీ నగరము ను పాలించుచు భక్తుని అభీష్ఠములను ఇచ్చుచున్నదని ఐతి హ్యం, ఈకథకు,శ్రీ యత్రంలో ఉన్న శ్రీ చక్రమునకు, శ్రీవిద్యకు, సహస్రారంలోఉన్న,సుధాసింధువునకు ఏకసంబంధం ఉన్నది ఆదిత్యయోగీ. 🌺*
*🌺మంత్రం శబ్దంనుండి, శబ్దము ఆలోచననుండి పుట్టినవి. శబ్దము వల్ల శబ్ద తరంగాలు బయలుదేరుతవి.ఈ తరంగములు చక్రాకారంగా ఉండును.ఆయా శబ్దమును బట్టి, ఆచక్రా కారమునకు దళములు ఏర్పడును,మంత్రోచ్చారణ వల్లశరీరములో సూక్ష్మ నాడీ కూటము నందు కొన్ని స్పందనలు కలిగి అవి చక్రరూపంతాల్చును. చైతన్య రూపమును పొందిన ఈ సూక్ష్మ చక్రములు విశ్వప్రాణ మును ఆకర్షించి శక్తివంతములగును. ఈవిధముగాశబ్దసమూహమైన మంత్రము చైతన్యవంతమై సిద్ధి ప్రదమౌను. 🌺*
*🌺మానవుని వెన్నుముకలోసూక్ష్మరూపమున సుషుమ్న,యనే నాడి ఇది నిటారుగాఉన్నది,ఇదే క్రింది మానసికశక్తులకు,ఉన్నతమానసిక శక్తులకు కలుపునాడి. దీనిలో 7 చక్రములున్నవి. క్రింది5చక్రములు పంచభూతములు. ఆభూత సంబంధమైన అక్షరములు ఆకారములు దేవతలు దాహనములు బీజాక్షరములు. మొదటిదైన, ఆకాశముభూతము గలచక్రము కంఠం దగ్గర సప్తచక్రాలు లలో సుషుమ్నా నాడి ఉన్నందున,అందున్నది. అక్షరములలో అచ్చులు ప్రధానములు,"అ"నుంచి,"ఆః"వరకు, మొదలైనవి అచ్చు అక్షర ములుఈచక్రంలోఉన్నాయి, దీనిని, విశుద్ధిచక్రముఅంటారు. తరువాత, వాయు భూత ము, అనాహత చక్రములో ఉన్నది.హల్లులు,మొదటి దైన "క" అక్ష రము మొదలు కొని"ఠ" వరకు ఈ చక్రంలో ఉన్నాయి*.
*🌈దీని తరువాత అగ్నిభూత ము గల మణిపూరక చక్రము దీని లో "డ" నుండి"ఫ" వరకు గల,10 అక్షరములు ఉన్నాయి. దీని క్రింద ఉన్న స్వాధిష్ఠానచక్ర ములో *జలభూతము"బ" నుండి"ల" వరకుగల 6 అక్షర ములు ఉన్నాయి. అన్నిటికన్న క్రింద ఉన్న మూలా ధార చక్రము *పృధివీ భూత ము "వ" నుండి "స" వరకు అక్షరములున్నవి. అటుపై విశుద్ధచక్రం పైన భ్రూ స్థానం వద్ద, ఆకాశ భూత ము ఆగ్నేయచక్రముఉన్నది. అందులో, *మనస్తత్వం కల దు, బ్రహ్మ బీజాక్షరములైన "హ", "క్ష"లు రెండు ఉన్నాయి, వీటితో మొ త్తం 50 అక్షరము లు అవును.20X50=1000అక్షరములపైన సహస్రారంలో ఉన్నాయి. మనము ఏ అక్షరమును పలికి నా అ అక్షరమునకు సంబంధిం చిన శక్తి పుట్టునుఅని,శ్రీ చక్రం లోని ఒక ఉద్దేశము. 🌺*
*🌺మణిద్విపవర్ణనస్తోత్రము, ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్రీ చక్రమే అమ్మ నివాసస్దానమ్. శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె*,
*🌈ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన,శ్రీ చక్రంలో అమ్మవారికి చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిదిమంది,మాతృకలు, స్థాపించబడ్డారు. వీరుఅమ్మవారికి,అష్టదిగ్భంధనగా ఉన్న రక్షణ కవచాలు .. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాము.వీరిలోతూర్పువైపునబ్రాహ్మీ,దక్షిణమునమహేశ్వరి, పశ్చిమున కౌమారి,ఉత్తరమున వైష్ణవి, ఆగ్నేయమున వారాహీ నైరుతిన,మాహేంద్రి,వాయువ్యమున,చాముండి, ఈశాన్యమున మహాలక్ష్మి ,అమ్మవార్లు ఉంటారు*.
*🚩ఈ అష్టమాతృకలతో శ్రీ యంత్రం అష్టదిగ్భంధనగా చే యబడింది.. దీనికి తంత్రమార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.. శ్రీచక్ర తంత్రము తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు*..
*🌈వారే గొప్ప శక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలుకూడా ఏమీ చేయలేవు ఇది ముమ్మాటి కినీ,సత్యము.. ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆగృహం లో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు అనుట అతిశయోక్తికానేరదు*
...... *🚩ఇలా జరగాలంటే గృహస్థుకూడా ఇంటిలో ప్రతిష్ఠించబడిన శ్రీ చక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యంసమర్పించాలి. ఈ పైవిదానమును పాటించదలచిన లేక పాటిస్తూయున్న వారికి ఆచారము🌺*
*🌈శ్రీమహాలక్ష్మి*
*🌈ఓంనమోనారాయణా*
*🌈ఓంనమఃశివాయ*
No comments:
Post a Comment