ప్రస్తుత సమాజంలో అనేకమంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తమ సంతానం యొక్క వివాహం విషయం. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ముందుగా ఉద్యోగంలో స్థిరపడాలి తరువాత వివాహం చేసుకోవాలి అనే భావనతో ఉన్నారు. జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు జాతకంలో ఉండే కొన్ని సమస్యలు వివాహాన్ని మరింత ఆలస్యం చేస్తున్నాయి.వివాహ సమస్యలు అనగా.. ఆలస్య వివాహము మరియు వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య సమస్యలు అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్యలకు ప్రధానంగా నాలుగు కారణాలు.
1.*కుజదోషము.*
లగ్నం నుండి 1 4 7 8 12 స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషంగా పరిగణించాలి. వీరికి 25 సంవత్సరాల తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంటుంది.వివాహ పొంతనలో అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ కుజదోషం ఉండాలి లేదా ఇద్దరికీ ఉండకూడదు. వివాహ పొంతన పరిశీలించకుండా వివాహం చేస్తే దంపతుల మధ్య శాశ్వతంగా దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది.
2 *పితృ దోషం.*
జాతక చక్రంలో రవి,శని భగవానునికి, శని రాహువులకు సంబంధం ఏర్పడినప్పుడు ఈ దోషం ఉంటుంది. దీనివలన ఆలస్య వివాహం, కుటుంబంలో కొంతమంది వివాహం కాకుండా మిగిలిపోవడం, వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య ఎడబాటు,సంతానం లేకపోవడం, సంతానం ఆలస్యం, స్వల్ప ఆయుష్షుగల సంతానం, అవయవాలు సరిగా లేని సంతానం, తల్లిదండ్రులకు సంతానానికి మధ్య సమస్యలు ఉంటాయి.
3 *గురు బలం*
గురు భగవానుడు శుభకార్యాలకు, వివాహం,సంతానం వంటి అనేక మంచి విషయాలకు కారకులు. గురు బలం తగ్గినప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది అనే విషయం చాలామందికి తెలిసినదే. గురుడు నీచబడి,నీచ భంగ రాజ యోగం కలగకపోయినా, పాప గ్రహాలతో సంబంధం ఏర్పడినా, గురు భగవాను బలహీనం అవుతారు. ఈ కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది,
4 *శుక్ర బలం* సహజ వివాహ కారకుడు శుక్ర భగవానుడు. శుక్రుడు పాపగ్రహాలతో సంబంధం ఏర్పడినా, నీచ పొంది,నీచ భంగ రాజయోగం కలగకపోయినా, శుక్రుడు కేతువుతో కానీ రాహువుతో కానీ కలిసినా, ఆలస్య వివాహం, వివాహం తరువాత దంపతులమధ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం, వివాహేతర సంబంధాలు, వివాహానికి ముందే సంబంధాలు ఏర్పరచుకోవడం ఇటువంటి చాలా విషయాలు జాతకంలో శుక్ర భగవానుడు బలహీనంగా ఉన్న కారణంగా ఏర్పడతాయి.
జాతకంలో ఏ కారణంతో వివాహం ఆలస్యం అవుతుంది తెలుసుకొని దానికి తగిన పరిహారాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. పై వాటికి పరిహారాలు తెలియజేయడానికి ఈ ఆర్టికల్ సరిపోదు. ఈ పరిహారాలు గురించి మరొకసారి తెలియజేస్తాను. కొన్ని పరిహారాలు ఎవరికి వారే పాటించేటంత సులభంగా కూడా ఉంటాయి.మీకు కొద్దిపాటి జ్యోతిష్య పరిజ్ఞానం ఉంటే మీ జాతక చక్రం పరిశీలించుకుని వివాహపరమైన సమస్యలలో ప్రధానమైన పై నాలుగింటిలో ఏ సమస్య అనేది గుర్తించి దానికి తగిన రెమెడీస్ పాటించగలరు.
.jpg)
No comments:
Post a Comment