Friday, October 3, 2025

ముత్తయిదువ లక్షణాలు

ముత్తయిదువ లక్షణాలు
                      *మరియు*
                  *ఉపయోగాలు*

                  ➖➖➖

*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..*

*1). కాళ్ళకి పట్టీలు, మెట్టెలు*
*2). చేతులకి గాజులు*
*3). మెడలో మంగళసూత్రం*
*4). తలలో పువ్వులు*
*5). నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..*

*1). మొదటగా కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం:*
*కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది.

*ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది.

*ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

*అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

*అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

*ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

*గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

*అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

*2). ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..*
*గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..!

*మన చేతి మణికట్టు దగ్గర ‘రేడియల్ నెర్వ్’ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.

*ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.  అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

*అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని! పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

*అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి  శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

*అందునా పొలం పనులు, కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

*ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

*3). మూడవది మెడలో మంగళసూత్రం..!*
*దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.

*అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు… మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని!  మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

*ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది.

*ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.

*4). ఇక నాల్గవది తలలో పూవులు..*

*వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయికసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.

*5). ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..*`

*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్, పసుపు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

*ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.🧘
నకలు

No comments:

Post a Comment

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS