దేవతా పూజలలో వాడాల్సిన విశేష ధూపం లోని పదార్థాలు* *షడంగ ,దశాంగ , షోడశాoగ ధూపాలు ఏవీ*??? ధూప నిర్వచనం*???
మన దేవాలయాలలో మరియు మన గృహాలలో పవిత్రత కోసం పూజా స్థానాలలో సేవగా సుగంధ ధూపాలు వాడడం సంప్రదాయం అయితే దేవతలకు ప్రత్యేకంగా ఏ పదార్థాల ధూపములు వేయాలి తెలుసుకుందాం.
ధూపం దహేద్గణేశస్య ప్రియః ప్రోక్తస్తు గుగ్గులుః|
సర్జ దేవ్యా మహేశస్య నిర్యాసో దేవదారూజః||
విష్ణోః కృష్ణాగురూః శీతం భాస్కరస్య ప్రియం మతం| శక్తేర్దశాంగం వక్ష్యామి శైలేయం' మలయోద్భవం||
నఖం' కుష్టం సర్జరసం' మేకైకాంశం ప్రకల్పయేత్|
శిలారసా గురు జటామాంసీ భాగద్వయం మతం|| షడ్మాక్షిక సితా చాష్టౌ ధూపోఽయం శక్తిమోహనః|
హరీతకీ' సర్జరస మురమాంస్యః కుభాగికాః||
లాక్షా త్రిభాగాశ్చత్వారో భాగాః శైలజ ముస్తయోః| పంచభాగం నఖం ప్రోక్త షడ్భాగం కుష్ట ముచ్యతే|| ద్వాదశాంశో గుడో ఽర్కేశవిన్యవిష్ణుదశాంగకః|
మధు ముస్తా ఘృతం గంధో గుగ్గుల్వ గురు శైలజం||
సరలం సిల్హ సిద్ధార్థీ శేషదేవదశాంగకః||
*విశేష ధూపం లోని ద్రవ్యరకాలు*
ధూపం దహేద్గణేశస్య ప్రియః ప్రోక్తస్తు గుగ్గులుః|
సర్జ దేవ్యా మహేశస్య నిర్యాసో దేవదారూజః||
* గణేశుడికి దహించే ధూపం (ప్రియమైనదిగా) గుగ్గులం అని చెప్పబడింది.
* దేవికి (దుర్గ/పార్వతి) సర్జరసం (గుగ్గిలం వంటి ఒక రకం జిగురు),
* మహేశ్వరుడికి దేవదారు కాయల నుండి వచ్చే నిర్యాసం జిగురు ఇష్టం.
*విష్ణోః కృష్ణాగురూః శీతం భాస్కరస్య ప్రియం మతం|
* విష్ణువుకు ప్రియమైనదిగా కృష్ణాగరు (ఒక రకమైన అగరు) మరియు చల్లని ధూపం అభిమతం.
* సూర్యుడికి కూడా ఇవే ప్రియమైనవని అభిప్రాయం.
*అమ్మవారి రూపాలకు ధూపం*
శక్తేర్దశాంగం వక్ష్యామి శైలేయం' మలయోద్భవం||
నఖం' కుష్టం సర్జరసం' మేకైకాంశం ప్రకల్పయేత్|
శిలారసా గురు జటామాంసీ భాగద్వయం మతం||
* ఇప్పుడు దేవికి ప్రీతిపాత్రమైన దశాంగ ధూపాన్ని పది అంగములు కలిగిన ధూపములుగు
* శైలేయం (ఒక రకమైన శిలాజం), మలయోద్భవం (చందనం వంటివి), నఖం (గోరసము), కుష్టం (చెంగల్వకోష్టు), సర్జరసం (గుగ్గిలం వంటి జిగురు) - ఇవి ఒక్కొక్క భాగం తీసుకోవాలి.
* శిలారసము (శిలాజిత్తు), అగరు, జటామాంసి - ఇవి రెండు భాగాల చొప్పున తీసుకోవాలి.
షడ్మాక్షిక సితా చాష్టౌ ధూపోఽయం శక్తిమోహనః|
* మాక్షికం (తేనె) ఆరు భాగాలూ, సితా (చక్కెర) ఎనిమిది భాగాలూ కలిపితే శక్తిమోహనం (శక్తిని సమ్మోహింపజేసే) అనే ధూపం తయారవుతుంది.
హరీతకీ' సర్జరస మురమాంస్యః కుభాగికాః||
లాక్షా త్రిభాగాశ్చత్వారో భాగాః శైలజ ముస్తయోః|
పంచభాగం నఖం ప్రోక్త షడ్భాగం కుష్ట ముచ్యతే||
* ఇది మరొక ధూప మిశ్రమం వివరణ
* హరీతకీ (కరక్కాయ), సర్జరసం, మురమాంసి (నఖం వంటిది) - ఇవి ఒక భాగం చొప్పున.
* లాక్షా (లక్క) - మూడు భాగాలు.
* శైలజం (శిలాజిత్తు), ముస్త (తుంగముస్త) - నాలుగు భాగాలు.
* నఖం (గోరసము) - ఐదు భాగాలు.
* కుష్టం (చెంగల్వకోష్టు) - ఆరు భాగాలు.
ద్వాదశాంశో గుడో ఽర్కేశవిన్యవిష్ణుదశాంగకః|
* గుడం (బెల్లం) - పన్నెండు భాగాలు కలిపితే, ఇది
* సూర్యు,గణపతి విష్ణువులకు*
ఇష్టమైన దశాంగక (పది వస్తువులతో కూడిన) ధూపం అవుతుంది.
మధు ముస్తా ఘృతం గంధో గుగ్గుల్వ గురు శైలజం||
సరలం సిల్హ సిద్ధార్థీ శేషదేవదశాంగకః||
* మధు (తేనె), ముస్తా (తుంగముస్త), ఘృతం (నెయ్యి), గంధం (చందనం), గుగ్గులు, అగరు, శైలజం (శిలాజిత్తు), సరలం (పైన్ చెక్క), సిల్హ (ద్రవ్యము), సిద్ధార్థీ (తెల్ల ఆవాలు) - ఈ పది వస్తువుల మిశ్రమం మిగిలిన దేవతలకు ప్రీతిపాత్రమైన దశాంగక ధూపం.
తంత్రాంతరే-
గుగ్గు ల్వగురూకో శీర శర్కరా మధు చందనైః| ధూపయేదాజ్యసంమిశ్రనీచైర్దేవస్య దేశికః||
సితా 'జ్య మధు సంమిశ్ర గుగ్గు ల్వగురు చందనం| షడంగధూపమేతత్ తు సర్వదేవప్రియం సదా|| రోగరోగహరరోగదకేశాః సురతరుజతులఘుపత్రవిశేషాః| వక్త్రవివర్జితవారిదముస్తాధూపవర్త్తిరిహ సుందరి శస్తా||
గుగ్గులం సరలం దారు పత్రం మలయసంభవం|
హ్రీవేర మగురుం కుష్టం గుడం సర్జరసం ఘనం||
హరీతకీ నఖీ లాక్షా జటామాంసీ చ శైలజం| పోడశాంగ విదుర్ధూపం దైవ పైత్రే చ కర్మణి||
మధు ముస్తం ఘృతం గంధో గుగ్గు ల్వగురు శైలజం|
చందనం సిహ్న సిద్ధార్థోం దశాంగో ధూప ఇష్యతే||
గుగ్గు ల్వగురూకో శీర శర్కరా మధు చందనైః|
ధూపయేదాజ్యసంమిశ్రనీచైర్దేవస్య దేశికః||
గుగ్గులు, అగరు, ఉశీరం (వట్టివేరు), శర్కర (చక్కెర), మధు (తేనె), చందనం (గంధం) - వీటిని ఆజ్యము (నెయ్యి) తో కలిపి, నీచ దేవతలకు (తక్కువ స్థాయి దేవతలకు/ఒక వర్గం దేవతలకు) దేశికుడు (గురువు/పూజారి) ధూపం వేయాలి.
*షడంగ ధూపం*
సితా 'జ్య మధు సంమిశ్ర గుగ్గు ల్వగురు చందనం| షడంగధూపమేతత్ తు సర్వదేవప్రియం సదా||
సిత (చక్కెర), ఆజ్యము (నెయ్యి), మధు (తేనె), గుగ్గులు, అగరు, చందనం - ఈ ఆరు వస్తువులు కలిపిన ధూపాన్ని షడంగ ధూపం అంటారు. ఇది సమస్త దేవతలకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైనది.
రోగరోగహరరోగదకేశాః సురతరుజతులఘుపత్రవిశేషాః| వక్త్రవివర్జితవారిదముస్తాధూపవర్త్తిరిహ సుందరి శస్తా||
ఓ సుందరీ! ఈ లోకంలో ధూపం కోసం రోగాలను హరించే రోగద కేశములు, సురతరువు (దేవదారు/కల్పవృక్షం) యొక్క జట (వేళ్లు/చెక్క), లఘుపత్ర విశేషాలు (చిన్న ఆకులు), వక్త్రము లేని వారిదము (అంటే మంచి పరిమళం కలిగిన తుంగముస్త) - వీటిని కలిపి చేసిన ధూపవర్తి (ధూపం కడ్డీ/వత్తి) శ్రేష్ఠమైనది.
*షోడశాంగ ధూపం*
గుగ్గులం సరలం దారు పత్రం మలయసంభవం|
హ్రీవేర మగురుం కుష్టం గుడం సర్జరసం ఘనం||
హరీతకీ నఖీ లాక్షా జటామాంసీ చ శైలజం| పోడశాంగ విదుర్ధూపం దైవ పైత్రే చ కర్మణి||
గుగ్గులం, సరలం (ఒక రకమైన చెట్టు జిగురు/పైన్), దారుపత్రం (దేవదారు ఆకులు/చెక్క), మలయసంభవం (చందనం/శైలజం), హ్రీవేరం (వట్టివేరు), అగరు, కుష్టం (చెంగల్వకోష్టు), గుడం (బెల్లం), సర్జరసం (గుగ్గిలం జిగురు), ఘనం (కర్పూరం/ముస్తా), హరీతకీ (కరక్కాయ), నఖీ (గోరసము), లాక్షా (లక్క), జటామాంసి, శైలజం (శిలాజిత్తు/ఒక రకమైన జిగురు) - ఈ పదహారు వస్తువులతో కూడిన ధూపాన్ని దైవకర్మలకు (దేవతా పూజలకు) మరియు పైత్ర కర్మలకు (పితృ దేవతల కర్మలకు) శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.
*దశాంగ ధూపం*
మధు ముస్తం ఘృతం గంధో గుగ్గు ల్వగురు శైలజం|
చందనం సిహ్న సిద్ధార్థోం దశాంగో ధూప ఇష్యతే||
తేనె, తుంగముస్త , నెయ్యి, చందనం, గుగ్గులు, అగరు, శైలజం (శిలాజిత్తు), సుగంధ ద్రవ్యాలు, సిహ్న (సాoబ్రాణి ), సిద్ధార్థం (తెల్ల ఆవాలు) - ఈ పది వస్తువుల మిశ్రమం దశాంగ ధూపం.
*యామలే*
దశాంగధూపః శ్యామాయాః సుందర్యాః షోడశాంగకః|
అష్టాదశాంగస్తారాయా భైరవ్యాశ్చ గజాంగకః|| పంచాంగశ్ఛిన్నమస్తాయాః ప్రియోఽన్యాసాం షడంగకం|
అభావే సర్వవిద్యాసు గుగ్గుల్వగురుచందనం||
*మేరవే*
హృదాణునాఽ థవాఽస్త్రేణ ఘంటాం సంపూజ్య వాదయేత్||
మీయామల తంత్రం నుండి:
ఈ శ్లోకాలు వివిధ మహావిద్యలకు (దేవతా రూపాలు) ప్రీతికరమైన ధూపం (సాంబ్రాణి/పొగ) ద్రవ్యాల సంఖ్యను (అంగాలను) వివరిస్తున్నాయి:
దశాంగధూపః శ్యామాయాః సుందర్యాః షోడశాంగకః|
అష్టాదశాంగస్తారాయా భైరవ్యాశ్చ గజాంగకః||
పంచాంగశ్ఛిన్నమస్తాయాః ప్రియోఽన్యాసాం షడంగకం|
*శ్యామ (కాళీ దేవి)కి దశాంగ ధూపం (పది రకాల ద్రవ్యాలు) ప్రీతికరం.
*లలితా త్రిపురసుందరీ కి షోడశాంగక ధూపం (పదహారు రకాల ద్రవ్యాలు) ప్రీతికరం.
*తారాదేవికి అష్టాదశాంగ ధూపం (పద్దెనిమిది రకాల ద్రవ్యాలు) ప్రీతికరం.
*భైరవి దేవికి గజాంగక ధూపం (ఎనిమిది రకాల ద్రవ్యాలు, 'గజము' అష్టదిక్కులను సూచిస్తుంది కాబట్టి అష్టాంగం అని భావించవచ్చు) ప్రీతికరం.
*ఛిన్నమస్తా దేవికి పంచాంగ ధూపం (ఐదు రకాల ద్రవ్యాలు) ప్రీతికరం.
*ఇతర దేవతలకు/విద్యా రూపాలకు షడంగకం (ఆరు రకాల ద్రవ్యాలు) ప్రీతికరం.
అభావే సర్వవిద్యాసు గుగ్గుల్వగురుచందనం||
***** ఈ ప్రత్యేక ధూప ద్రవ్యాలు లభించని పక్షంలో, సమస్త దేవతలకు గుగ్గులo, అగరు, చందనం ఉపయోగించడం శ్రేయస్కరం.*****
హృదాణునాఽ థవాఽస్త్రేణ ఘంటాం సంపూజ్య వాదయేత్||
హృదయ మంత్రంతో గాని (హృదయాయ నమః వంటి బీజాక్షరంతో గాని),
లేదా అస్త్ర మంత్రంతో గాని (అస్త్రాయ ఫట్ వంటి బీజాక్షరంతో గాని),
గంటను (పూజా గంటను) సమగ్రంగా పూజించి ఆ తరువాత దానిని మ్రోగించాలి.
*తత్రైవ*
తారో జయధ్వనిపదం మంత్రమాతోఽగ్నిగేహినీ|
ఏకాదశాక్షరో మంత్రో ఘంటాయాః సర్వసిద్ధదః|| ఆవాహనేఽర్ధే ధూపే చ పుష్పే నైవేద్యదీపయోః|
ఘంటానాదం ప్రకుర్వీత విశేషాద్ధూపదీపయోః|| పూజాకాలం కువినాఽన్యత్రర్యాదస్యాః ప్రవాదనం|
నానయా చ వినా పూజాం కారయేత్ సిద్ధిలాలసః||
రాఘవభట్టాః -
ధూపభాజనమస్త్రేణ ప్రోక్ష్యాభ్యర్చ్య హృదాఽణునా|
అస్త్రేణ పూజితాం ఘంటాం వాదయన్ గుగ్గులం దహేత్||
ధూపపదార్థ ఉక్తః కుర్లాణవే-
ధూతాశేషమహాదోషపూతిగంధప్రహారితః| పరమామోదజననాద్ధూప ఇత్యభిధీయతే||
తారో జయధ్వనిపదం మంత్రమాతోఽగ్నిగేహినీ|
ఏకాదశాక్షరో మంత్రో ఘంటాయాః సర్వసిద్ధదః||
ఓం (తార: ప్రణవం), జయధ్వనిపదం (జయధ్వని), మంత్రమాత (స్వాహా, మంత్రాల తల్లి), మరియు అగ్నిగేహిని (వహ్ని ప్రియా/స్వాహా అని కూడా అర్థం) - ఇవన్నీ కలిపి పదకొండు అక్షరాల మంత్రం (ఉదాహరణకు: ఓం జయధ్వని స్వాహా వంటిది)
ఘంటకు సర్వసిద్ధులను ఇచ్చేదిగా చెప్పబడింది.
ఆవాహనేఽర్ధే ధూపే చ పుష్పే నైవేద్యదీపయోః|
ఘంటానాదం ప్రకుర్వీత విశేషాద్ధూపదీపయోః||
ఆవాహనం (దేవతను ఆహ్వానించడం), అర్ఘ్యం (నీరు సమర్పించడం), ధూపం (సాంబ్రాణి), పూలు, నైవేద్యం, దీపం - ఈ సమయాలలో గంటానాదం చేయాలి.
పూజాకాలం కువినాఽన్యత్రర్యాదస్యాః ప్రవాదనం|
నానయా చ వినా పూజాం కారయేత్ సిద్ధిలాలసః||
పూజా కాలంలో తప్ప, ఇతర సమయాలలో ఈ గంటను మ్రోగించకూడదు.
సిద్ధిని (ఆధ్యాత్మిక విజయాన్ని) కోరుకునేవాడు గంట లేకుండా పూజను చేయకూడదు.
ధూపభాజనమస్త్రేణ ప్రోక్ష్యాభ్యర్చ్య హృదాఽణునా|
అస్త్రేణ పూజితాం ఘంటాం వాదయన్ గుగ్గులం దహేత్||
ధూపం ఉంచే పాత్రను (ధూపభాజనంను) అస్త్ర మంత్రంతో (అస్త్రాయ ఫట్ వంటి మంత్రంతో) ప్రోక్షించి (నీళ్లు చిలకరించి శుద్ధి చేసి),
ఆపై హృదయ మంత్రంతో (హృదయాయ నమః వంటి మంత్రంతో) పూజించి,
అస్త్ర మంత్రంతో పూజించిన గంటను మ్రోగిస్తూ (గుగ్గులం వంటి) ధూపాన్ని వెలిగించాలి.
🔥 *ధూప నిర్వచనం*
ధూతాశేషమహాదోషపూతిగంధప్రహారితః|
పరమామోదజననాద్ధూప ఇత్యభిధీయతే||
ఏది ధూపo అయితే సమస్త మహాదోషాలను తొలగిస్తుందో మరియు పూతిగంధాలను (దుర్వాసనలను),
మరియు పరమ ఆమోదాన్ని (అత్యంత మంచి సువాసనను) జనింపజేస్తుందో (కలిగిస్తుందో) - దానిని ధూపం అని పిలుస్తారు.
*మహాదేవ మహాదేవ శ్రీ మాత్రే నమః*
*రాళ్ళబండి శర్మ* 🙏🙏🙏🙏

No comments:
Post a Comment