ఆయుష్షును హరించే అగంతక మృత్యువులు అంటే ఏంటి*??? కాలమృత్యువు అన్న ఏంటి???
*అగంతక మృత్యువులు*
ఏకోత్తరం మృత్యుశత మస్మిస్ ప్రతిష్ఠితం!
తత్రైకః కాలసంయుక్త శేషాస్తాగంతవః స్మృతాః॥
మనిషి శరీరంలో మొత్తం 101 రకాల మృత్యువులు ఉంటాయని చెప్పబడింది.
వీటిలో *100 అగంతు మృత్యువులు* అనేవి అనుకోకుండా, బయటి కారణాల (ప్రమాదాల)వల్ల లేదా వ్యాధుల రూపంలో వచ్చేవి. మిగిలిన ఒకే *కాలమృత్యువు*.
*కాలమృత్యువు* అంటే మనిషికి నిర్ణయించబడిన ఆయుష్షు తీరిపోయి, సమయం వచ్చినప్పుడు సంభవించే మరణం. దీనిని ఆపడానికి లేదా నివారించడానికి ఎలాంటి మార్గమూ (ఉపాయం) లేదు.
మిగతా 100 అగంతు మృత్యువులు రోగాల రూపంలో లేదా ముందు చేసిన కర్మల (ఆగామి కర్మలు) ఫలితంగా వస్తాయి.
ఈ 100 రకాల మృత్యువులు జపాలు, దానాలు, హెూమాలు (యాగాలు), మందులు (ఔషధాలు) వంటి వాటి ద్వారా నివారించవచ్చు.
*కాలమృత్యువు*
ఆయుష్యే కర్మణి క్షీణే లోకేయాందూయతేమయా నౌషథాని న మంత్రాశ్చన హెూమ నపునర్జపాః। త్రాయంతే మృత్యునోవేతం జరయాపిచ మానవమ్|| జ్యోతిస్తత్వము
ఆయుష్యము, కర్మము క్షీణించి మహామృత్యువు చేతను, ముసలితనము చేతను ఆవరించబడిన మనుష్యుని ఔషధములుగాని, మంత్రములుగాని హెూమజపాదులు కాని రక్షించవు.
ఒక మనిషి యొక్క ఆయుష్షు మరియు కర్మఫలం బలం పూర్తిగా క్షీణించిపోయి, అతను మహామృత్యువు (పెద్ద మరణం లేదా కాలం తీరిన మరణం) మరియు ముసలితనం (వృద్ధాప్యం) చేత పూర్తిగా ఆవరించబడినప్పుడు (పట్టుబడినప్పుడు), అతడిని మందులు (ఔషధములు) గానీ, మంత్రాలు గానీ, హెూమాలు, జపాలు వంటి పూజా కార్యక్రమాలు గానీ రక్షించలేవు (కాపాడలేవు)
వేదాంగ జ్యోతిష శాస్త్రం లో
మృత్యుకారక గ్రహములెవరు?????
రంధేశ్వరో రంధ్రయుక్తో రంధ్రదృష్టా ఖగేశ్వరః రంధ్రాధిపతియుతశ్చైవ చతుఃషష్ఠ్యాంశనాయకః॥ రంధేశ్వరాతి శత్రుశ్చ సప్త ఛిద్రగ్రహాః స్మృతాః తేషమధ్యే బలీయస్తు తస్యదాయే మృతింవదేత్|| జా.పా 5-52/53
అష్టమాధిపతి, అష్టమంలో ఉన్న గ్రహం, అష్టమాన్ని చూసేగ్రహం, 22వ ద్రేక్కాణాధిపతి,అష్టమాధిపతితో కలసిన గ్రహం, 64వ నవాంశాధిపతి (చంద్రుని నుండి) అష్టమాధిపతికి అతిశత్రుగ్రహము వీరిలో బలవంతుడు మృత్యుకారకుడు అవుతాడు.
(ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా చాలా ఉంటాయి పరిశీలన లో)
తరువాత మృత్యుంజయ దేవతలు?????
*మహాదేవ మహాదేవ మహాదేవ*
*రాళ్ళబండి శర్మ*
No comments:
Post a Comment