ఒకరు పళనివేల్ ఇంకొకరు తారకమణి
పళనివేల్ తారకమణికి వ్యాపారంలో నష్టం వచ్చిందని పళని సుబ్రమణ్య స్వామి ముందే ఆలయంలో కొంత డబ్బుని అప్పుగా ఇచ్చి నీకు వ్యాపారంలో లాభం వస్తే నేనిచ్చిన డబ్బును ఈ పళని సుబ్రమణ్య స్వామి ఆలయానికి ఉత్సవాలకు అన్నదానానికి ఇవ్వు నష్టం వస్తే మా ఇంట్లో వారిని డబ్బు అడిగి ఆలయానికి ఖర్చు చెయ్యి అని వ్యాపారం కోసం విదేశానికి వెళ్ళాడు.
6 సంవత్సరాల తర్వాత తిరిగివచ్చి తారకమణి దగ్గరకు వెళ్ళాడు.
అప్పటికే లాభాలు వచ్చి స్థిరపడ్డాడు తారకమణి.
అప్పుగా నేనిచ్చిన డబ్బు ఇవ్వు అని పళనివేల్ అడిగాడు.
నాకెప్పుడు ఇచ్చావ్ డబ్బు ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురా అన్నాడు తారకమణి.
సరే కోర్టులో చూసుకుందాం అని పళనివేల్ కేస్ వేసాడు.
కోర్టుకి మురుగన్ అనే వ్యక్తి వచ్చి తారకమణికి పళనివేల్ డబ్బు ఇవ్వడం నేను చేసాను అని సాక్ష్యం చెప్పాడు.
అంతా అయ్యాక తారకమణి ఈ మురుగన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడిగితే నీ మీద కేసు వేసాక కలలో నాకు కనిపించి నేను సాక్ష్యం చెప్తా అని వచ్చి చెప్పాడు అన్నాడు పళనివేల్.
ఈ మురుగన్ పళని ఆలయం బయట పూలు అమ్మేవాడు నాకు నువ్వు డబ్బులు ఇవ్వడం చూసాడు కానీ ఇతను చనిపోయి 3 సంవత్సరాలు అయ్యింది.
ఈయన రూపంలో ఆ సుబ్రమణ్య స్వామి వచ్చాడని తెలుసుకుని తీసుకున్న డబ్బుకి రెండింతలు ఇచ్చాడు తారకమణి ఈ విషయం అందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు..
ఇది 1972 లో జరిగింది..
ఇక్కడ పళని సుబ్రమణ్య స్వామి పిలిస్తే పలుకుతారు. 🙏🙏
.jpg)
No comments:
Post a Comment