Wednesday, September 10, 2025

ఆరోగ్యంవిషయాలు

 ఆరోగ్యంవిషయాలు

.
1. తలకు నూనె తప్పక రాసుకోండి . కనీసం రాత్రి రాసుకుని ఉదయం తలంటుకోండి . అందువలన డాండ్రఫ్ రాదు .
.
2. వారానికి ఒక్కసారి తలకు పెరుగు పట్టించండి , డాండ్రఫ్ నుండి విముక్తి పొందండి .
.
3. కాలి పగుళ్ళకు హారతి కర్పూరం , కొబ్బరి నూనె / ఆవ నూనె మిశ్రమం రాయండి . లేదంటే క్రేక్ హీల్ రాసుకోండి . (పతంజలి ఉత్పాదన )
.
4. ఉదయం లేవగానే కళ్లపై నీళ్ళను చల్లుకోండి . నెలలో ఒక్కసారైనా త్రిఫల నీళ్ళతో కళ్ళను కడుక్కోండి . రోజూ కాకపోతే వారానికి ఒక్కసారైనా కళ్ళల్లో “దృష్టి” ఐ డ్రాప్స్ వేసుకోండి .లేదా తేనె వేసుకోండి . లేదా నెయ్యి వేసుకోండి . లేదా గులాబ్ జల్ వేసుకోండి . కళ్ళ వ్యాధులు రాకుండా చూసుకోండి .
.
5. నన్ను అడిగితే వారం లో ఆరు రోజులు దంత కాంతి టూత్ పౌడర్ తో పళ్ళు తోముకోండి . ఒక్క రోజు దంత కాంతి టూత్ పేస్ట్ తో తోముకోండి. కనీసం ఒకటి రెండు రోజులైనా టూత్ పౌడర్ తో తోముకోండి . తోముకున్నాక మీరు అయిదు నిముషాల తర్వాత నీళ్ళతో కడుక్కోండి . అలా చెయ్యడం వలన మూలికల శక్తి లోపలకు వెడుతుంది .
.
.
6. చర్మ సౌందర్యం కోసం మీరు చర్మాన్ని రుద్ది రుద్ది తోమండి . తువ్వాలుతో గట్టిగా తుడవండి . చేతులను అడ్డంగా రుద్దండి . పైనుండి క్రిందకు కాదు . ఉసిరికాయ రసం త్రాగండి . వారానికి ఒకసారి ఉసిరి రసం రాసుకోండి .
.
.
7. ఎముకలు బలంగా ఉండడానికి ఉదయం పెరుగు , మద్యాహ్నం మజ్జిగ రాత్రి పాలు త్రాగండి . ఆకుకూరలు , పచ్చికూరాల వలన హిమోగ్లోబిన్ సరిగా ఉంటుంది .
.
.
8. మీరు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోండి .
.
.
9. ఉదయం లేవగానే ఒకటినుండి నాలుగు గ్లాసుల నీరు త్రాగండి . ఉదయం లేవగానే తులసి , తిప్పతీగ , వెల్లుల్లి , ఉసిరి , కలబంద .... ఇవి తీసుకోవడం వలన రోజంతా తీసుకున్న చేడుపదార్దాల వలన ఏర్పడిన మలినాలు తొలగుతాయి . ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి రెండు గ్రాములు తీసుకోవచ్చు . ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుంది .
.
.
10. ఉదయం తీసుకునే అల్పాహారం రోజూ ఒకే రకం తీసుకోకండి . రోజుకు ఒక రకం తీసుకోండి . మొలకెత్తిన ధాన్యాలూ , ఇడ్లీ , ఉప్మా ....ఇలా రకరకాలుగా ఉండేలా చూసుకోండి . వారానికి లేదా పదిహేను రోజులకి ఒక సారి ఉపవాసం ఉండాలి . ఉపవాసమూ , ఉపాసన భారతీయ జీవన పద్ధతులు .
.
.
11. భోజనం చేసిన ఒక గంట తర్వాత నీరు త్రాగండి . భోజనం నమిలి నమిలి తినండి . 99 శాతం మంది నమిలి తినరు . మీరు భోజనం చెయ్యడానికి ఇపుడు ఎంత సమయం తీసుకుంటున్నారో అంతకు రెండు మూడు రెట్లు ఎక్కువ సమయం కేటాయించండి . ఇలా చెయ్యడం వలన మీకు జీర్ణకోశ వ్యాధులు రావు . గేస్ , అజీర్తి కొల్లైటిస్ వంటి వ్యాధి ఏదీ మీ దగ్గరకు రాదు . భోజనం ప్రశాంతంగా తినండి . తక్కువ మాట్లాడండి . లేదా మౌనంగా తినండి . టి వి చూడకుండా తింటే  మంచిది . కోపంతో తినకండి . ప్రశాంతంగా తినండి . తర్వాత వజ్రాసనం వెయ్యండి . సాయంత్రం భోజనం చేశాక అటూ ఇటూ తిరగండి .
.
.
12. యోగా కానీ శారీరక శ్రమ గానీ చేశాక ఒక పావుగంట తర్వాత స్నానం చెయ్యండి
.
.
13. అర్తరైటిస్ వాళ్ళూ , ఆస్తమా వాళ్ళూ , అధిక బరువు వాళ్ళూ వేడినీళ్ళు త్రాగండి . మిగిలిన వారు మామూలు నీళ్ళు త్రాగండి . రాగిపాత్రలో నీరు కూడా మంచిదే .
.
.
14. ఎప్పుడూ సంతోషంగా ఉండండి . బద్ధకం వదలండి . మీ పురుషార్ధం మీరు చెయ్యండి . ఎవరినీ ద్వేషించకండి. 
.
..
అందరితో ప్రేమపూర్వకంగా జీవించండి . నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి .
ఓం శాంతి శాంతి శాంతి

No comments:

Post a Comment

RECENT POST

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.

నాగదేవతల గురించి..... పవిత్రమైన కార్తికమాస శుక్ల పక్ష చవితికి 'నాగుల చవితి' పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు.  నాగదేవత...

POPULAR POSTS