Saturday, September 27, 2025

దశ మహావిద్యలు ఏ దేవతలు??

దశ మహావిద్యలు ఏ దేవతలు??
*అత్యంత శక్తివంతమైన దశ మహావిద్యలు వాటి
లఘు సూత్ర వివరణ * 2
*జయంతులు*


*దశ మహావిద్యలు*
కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ|
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమావతీ తథా|
బగళా సిద్ధవిద్యా చ మాతంగీ కమలాత్మికా|
ఏతా దశ మహావిద్యాః సిద్ధవిద్యాః ప్రకీర్తితాః||

*ఈ దశ మహావిద్య వ్యాసం లో 6 నుండి 10 వరకు విద్య విషయాలు మరిన్ని విశేషములు*

*ప్రచండ చండిక ఛిన్నమస్త  మహావిద్య*
షష్ఠి సా దశసు మహావిద్యాసు ॥
భైరవ్యాసత్త్వేన ప్రచండచండికాయాస్తత్త్వం వ్యాఖ్యాతం|
తత్ర పృథివీస్థానా ముఖ్యా ॥
అత్రాంతరిక్షస్థానేతి విశేషః|ఇంద్రాణ్యధిదైవతమిత్యుక్తం భవతి|
ప్రభోరయుధభూతా ప్రచండచండికేతి విశేషః|
అత ఏవ వజ్రవైరోచనీయేతి కథ్యతే ॥
వజ్రంహ్యాయుధం ప్రభోః ॥
కుండలినీశక్తిరధ్యాత్మం
ఏకత ఏవ మూలాన్నిర్గచ్ఛత భైరవీ ప్రచండచండికే శరీరేషు ॥
ఏక సదా వాచే ॥
పరా యోగీనామేవోల్లసంతీ శిరసో ద్రావణాయ ॥
వ్యపోహ్య శీర్షకపాలే ఇతి శృతిరత్ర భవతి ॥
 తస్మాదేతాం శక్తిం ఛిన్నమస్తాం వ్యవహరంతి ॥
రేణుకా తాంత్రికైః ॥

దశమహావిద్యలలో ప్రచండచండిక విద్య ఆరవది.
భైరవీ తత్వము చేత ప్రచండచండిక తత్వము వ్యాఖ్యానింపబడినది|
ఆ విద్యకు పృథివీ స్థానము గలది ముఖ్యము.
అంతరిక్షస్థానము గలది విశేషమైయున్నది|
ఇంద్రాణ్యధిదైవతమని చెప్పినట్లైనది|
ప్రభువునకు అనగా ఇంద్రునకు ఆయుధమైన ప్రచండచండిక యని విశేషము|
అందువల్లనే వజ్రవైరోచనీ యని చెప్పబడినది.
వజ్రమే ఇంద్రుని యొక్క ఆయుధము|

కుండలినీ శక్తి ఆత్మకు సంబంధించినది|
భైరవి, ప్రచండచండికలు శరీరములయందు ఒకే మూలము నుండి వెలువడుతున్నారు|
మరొకరు యోగులలోనే ప్రకాశించునదై శిరస్సును ద్రవింపుటకై|

కుండలిని శిరస్సున సహస్రారకమలం చేరుకున్నప్పుడు, అమృతం స్రవిస్తుంది|
కుండలిని శిరస్సున సహస్రారకమలం
 చేరుకున్నప్పుడు, అమృతం స్రవిస్తుంది|

ఇట శిరస్సను కపాలమును భిన్నమొనర్చుటపై శృతివాక్య ప్రమాణము.అందువల్ల ఈ శక్తిని ఛిన్నమస్తయని వ్యవహరిస్తారు|
ఉపాధిరీత్యా సుషుమ్ననాడి కూడా 'ప్రచండచండిక' యని చెప్పబడుచున్నది|
తాంత్రికులు దీనిని 'రేణుక' అందురు|

సా చ ఛిన్నమస్తోచ్యతే ఛిన్నశీర్షత్వాత్ ॥
అస్మాకం సుషుమ్నామార్గే గ్రంధిత్రయమస్తి
ఏకోమూలాధారే
సబ్రహ్మగ్రంథిరుచ్యతే
అపరో మణిపూరే ॥ స విష్ణుగ్రంథి రుచ్యతే ॥
ఇతర ఆజ్ఞాచక్రే ॥
స రుద్రగ్రంథిరుచ్యతే ॥
తద్గ్రంథిత్రయప్రతిబంధాదస్మాసు శక్తిరంతరిక్షాత్ర బహులమవతరతి|
భిన్నగ్రంథా తు బహులం ప్రవహేత్ ॥
సిద్ధానాం వ్యష్టినాడీ సమష్టినాడ్యా మిలిత్వా మహామహిమా స్యాత్ ॥

ఛిన్నశీర్షము వల్ల ఛిన్నమస్తయని చెప్పబడును.
మన యొక్క సుషుమ్నా మార్గమందు మూడు గ్రంధులున్నవి|
ఒకటి మూలాధారచక్రమునందు కలదు.దానిని బ్రహ్మగ్రంథి అందురు|
మరొకటి మణిపూరచక్రము నందు కలదు. దానిని విష్ణుగ్రంథి అందురు|
చివరది ఆజ్ఞాచక్రమునందు కలదు. దానిని రుద్రగ్రంథి అందురు|

గ్రంథిత్రయప్రతిబంధము వల్ల మనలో శక్తి ఆకాశము నుండి మిక్కిలిగా దిగదు|
భిన్నగ్రంథులయందు మిక్కిలిగా ప్రవహించును|
సిద్ధుల యొక్క వ్యష్టిసమష్టినాడుల కలయిక మహామహిమ యగును|

క్రమేణ గ్రంథీనాం మోక్షః ॥
రుద్రగ్రంథొ భిన్నే నిఃశ్రేయసం హస్తస్థం స్యాత్ ॥
ఇయమేవ కాశీయదాజ్ఞాచక్రం

కాలక్రమేణ గ్రంథులకు విడుదల కలుగుసు.
రుద్రగ్రంథి భిన్నమైనప్పుడు మోక్షము అరచేతిలో నుండును|

కాశ్యాం తు మరణాన్ముక్తిరితి శ్లోకపాదోత్ర భవతి ॥
కాశీయందు మరణము వల్ల ముక్తి ప్రాప్తియని శ్లోకపాదము ఇక్కడ అనుసంధానించుకొనవలెను.
ఈ కాశీయే ఆ ఆజ్ఞాచక్రమైయున్నది|

ఛిన్నస్వమస్తకరవాలభృద్ ద్విభుజా కంఠోద్గతరక్తత్రిధారా ద్వే పిబంతీభ్యాం ॥ డాకినీ వర్ణినీభ్యాం సేవితపార్శ్వాన్యాం ధారాం స్వయం పిబంతీ రతికామాసనా ధ్యేయా ॥

ఛిన్నమైన తన శిరస్సు కత్తిని తన రెండు చేతులతో ధరించి మూడు రక్తధారలతో నున్న పైకెత్తిన కంఠము కలిగి , రెండు రక్తధారలు త్రాగుచున్న డాకిని వర్ణిని ఇరుపక్కల సేవిస్తుండగా , మరొక రక్తధారను స్వయంగా పానం చేస్తూ రతి కామమనే ఆసనంలో నున్న రూపంలో ధ్యానం చేయాలి|

ఛిన్నమస్తాయాః సుషుమ్నాయాః స్వాయత్తత్వన్మస్తకం కరస్థం|
కబంధాదుర్గతం రక్తధారాత్రికం నాడ్యగ్రాదుద్గతమమృతధారాత్రికం|
ఏకయా స్వశిరస్తర్పణం
తద్వారా సర్వస్య దేహస్య ॥
రతికామయోః పాదాభ్యామపష్టంభేన శక్తేః కామజిత్వం వ్యజ్యతే ॥
ప్రచండచండికోపాసనాపార
శక్తిర్భవేదపారశక్తిర్భవేత్|

తలఛిన్నమైయున్న సుషుమ్న తనకు అధీనమైనందున శిరస్సు చేతియందున్నట్లే|

కబంధము నుండి పైకి లేచిన మూడు రక్తధారలు నాడి యొక్క అగ్రభాగము నుండి పైకి లేచిన మూడు రక్తధారలు|
ఒక రక్తధారతో శిరస్సుకు తర్పణము జరుగును|

నీటి ద్వారా సమస్త దేహమునకు తర్పణము జరుగును|
రతి, మన్మథులు పాదములతో ఒత్తిడి చేయటం వలన శక్తికి మన్మథుని జయించే లక్షణము వ్యక్తమగుచున్నది|
ప్రచండచండిక ఉపాసన వలన అపారమైన శక్తి కలుగును. ఇది నిక్కము|

*శ్రీ ధూమావతి మహావిద్య*
సప్తమీ సా దశసు మహావిద్యాసు ॥
అస్యాః శుద్ధముపాసనం వ్యతికేణైన భవతి ॥
నీలా కృశా క్షుధా.. వసన్నా సమ్మార్జనీహస్తా ధ్యేయా 

దశమహావిద్యలలో ఈ విద్య ఏడవది|
నల్లని వర్ణము, కృశత్వము, ఆకలితోమాడుట, చేతియందు చీపురు గల రూపముగా ధ్యానించవలెను ఈ ఉపాసన వ్యతిరిక్తతో జరుగును|

జ్యేష్ఠాధి దైవతం ॥
సముచ్చయేన విద్యా... విద్యే ఉపాస్యే ॥
విద్యా చ పూర్ణా స్వతఃసిద్ధా
అవిద్యా విషయాణాం ॥
ధూమావత్తుపాసనాద్భవం తరేద్భవం తరేత్|

జేష్టాదేవి అధిదైవతము|
అయినప్పటికి విద్య, అవిద్యలు రెంటిని అధ్యయనం చెయ్యాలి|

విద్య పూర్ణమైనది. సహజముగా ఏర్పడినది కూడా|
అవిద్య ప్రాపంచికవిషయములదైయున్నది|
ధూమావతి ఉపాసన వల్ల జీవుడు సంసారము నుండి తరించును తప్పక తరించును|

*శ్రీ బగళా మహావిద్య*

అష్టమీ సా దశసు మహావిద్యాసు ॥
తారాయాస్తత్త్వేన బగలాముఖ్యాస్తత్త్వం వ్యాఖ్యాతం|
విభూతిభేదాద్విద్యాభేదః|
ధృవయా స్మత్యా వర్తనాన్మంత్రాస్తేజోమయాః స్యుః|
తస్మాదేవ బగలాముఖీ బ్రహ్మాస్త్రముచ్యతే|
బ్రహ్మైవాస్త్రం బ్రహ్మాస్త్రం న బ్రహ్మణోzస్త్రం|

శతృనిస్తరణకామో బగలాముఖీముపాసీత*
దశమహావిద్యలలో ఈ విద్య ఎనిమిదవది.
తారవిద్య తత్త్వముచే బగళాముఖి తత్త్వము వ్యాఖ్యానింపబడినది|
వారివారి విభూతులనుసరించి విద్యాభేదముండును|

వ్యక్తమైన తేజోరూపం పొందిన శబ్దము బగళాముఖి|
స్థిరమైన స్మృతితో మంత్రములు తేజోమయములు|
అందువల్లనే బగలాముఖి బ్రహ్మాస్త్రమని చెప్పబడుచున్నది|
బ్రహ్మయే అస్త్రము| బ్రహ్మ యొక్కయని కాదు|
శతృజయమును కోరువారు బగళాముఖిని ఉపాసించవలెను|

తత్రేంద్రో దేవతా నేంద్రాణితి చేత్|
పీతా గదా హస్తా శతృవిధ్వంసినీ ధ్యేయా ॥

ఆ ఉపాసనలో ఇంద్రుడే దేవత. ఇంద్రాణి కానేరదు|
పచ్చని వర్ణము గలది, చేతిలో గద కలిగి, శతృనాశినిగా ధ్యానించదగినది|

శుద్దోపాసనేన ధృవాయా స్మృత్యాం తత్రమంత్రం సంస్థాప్యావర్తయేత్
గ్రంథిచ్ఛేదనశ్చ ధృవయా స్మృత్యా
స్మృతిలంభే సర్వగ్రంథీనాం మోక్ష ఇతి శృతి ॥
బగలాముఖ్యుపాసనాస్త్రసిద్ధిర్భవేదస్త్రీసిద్ధిర్బవేత్||

శుద్ధోపాసనచే ధృవాస్మృతియందు మంత్రమును నిలిపి ఆవృత్తి చేయవలెను|
స్మృతి చేత గ్రంథిచ్ఛేదము కూడా జరుగును|
స్మృతి నాదముచే సర్వగ్రంథులకు మోక్షము కలుగును|
బగళాముఖి ఉపాసకులకు అస్త్రసిద్ధి ప్రాప్తించును|

*శ్రీ రాజ మాతంగి మహావిద్య*
నవమీ సాదశను మహావిద్యాసు ॥
శ్రోత్రగాహ్యః శబ్లో మాతంగీ
సరస్వత్యాధి దైవతం ॥
శ్యామా వీణా ధారిణీధ్యేయా ॥

ఈ విద్య దశమహావిద్యలలో తొమ్మిదవది.
చెవులచే గ్రహింపదగ్గ శబ్దమే మాతంగి|
సరస్వతి అధిదైవతమైయున్నది|
నల్లని వర్ణముగలదిగాను, వీణాధారిణిగాను ధ్యానము చేయవలెను|

శుక్లా వా ॥
అవతారరూప దృష్ట్యా శ్యామా ॥
మూలదేవతారూప దృష్ట్యా శుక్లా ॥
మతంగస్య పుత్రీ హి వాగ్దేవ్య అవతారః ॥
ఏతేనాస్యాః శక్తేర్మాతంగీత్వం వ్యాఖ్యాతం

లేక శుక్లవర్ణము గలదిగాను ధ్యానింపవలెను|
అవతారరూపతత్త్వముననుసరించి శ్యామవర్ణము కలది|
మూలదేవతరూపముననుసరించి శుక్లవర్ణము కలది|
మతంగ ఋషి పుత్రికయే వాగ్దేవి స్వరూపము|
వీనిచే శక్తి యొక్క మాతంగిలక్షణము వ్యాఖ్యానింపబడినది|

నాడీ నామ్నా వా సరస్వతీ ॥
జిహ్వాయాం వాగ్వాహినీ హి సరస్వతీ ॥
సదీ నామ్నా వా సరస్వతీ ॥
నదీదేవతయోః సంబంధో భిమానాత్
స్తనితస్య మేధస్థానత్వాద్వా సరస్వతీ ॥

నాడీ నామముచేనైనను సరస్వతియై యున్నది|
నాలుకయందు ప్రవహించు వాక్కుయే సరస్వతి.
లేక సరస్వతి నామము గల నదియై యుండవచ్చును|
నదీదేవత ఈ సంబంధము అభిమానము వల్ల కావచ్చును|
వాక్కు సరస్సుయై యున్నది|
నాదస్థానస్థితిచేత సరస్వతి గావచ్చును|

స్తనితం హి సరస్వత్యాః స్వరూపవిశేషః 
అత్రార్ధ మేధ ఏవ సరః ॥
స్వాధ్యాయాధ్యయనమస్యాః శుద్ధముపాసనం|
మాతంగద్యుపాసనాద్విదితవేదితవ్యో| భవేదితవేదితవ్యో భవేత్|

నాదమే సరస్వతి యొక్క స్వరూప విశేషము.
ఇట మేధయే సరస్సని గ్రాహ్యము|
స్వాధ్యాయము, అధ్యయనము మాతంగి యొక్క శుద్ధమైన ఉపాసనయైయున్నవి|
మాతంగి ఉపాసన వలన తెలుసుకోదగిన విషయములను తెలుసుకొనవలెను|

*శ్రీ కమలాత్మికా మహావిద్య*

అన్త్యా సా దశసు మహావిద్యాసు ॥
భైరవ్యాస్తత్త్వేన కమలాత్మికాయాస్తత్త్వం వ్యాఖ్యాతం|
అత్ర పృథివీస్థానా దేవతా|
అత్ర ద్యుస్థానేతి విశేషః ॥
ఉషోదేవీ ప్రాచాం భాషాయాం ॥
లక్ష్మీ రర్వాచాం|
పీతా పద్మాసనా వరాభయదా ధ్యేయా ॥

దశమహావిద్యలలో ఈ విద్య చివరది|
భైరవితత్త్వము చేత కమలాత్మిక యొక్క తత్త్వము వివరింపబడినది|

అక్కడ కమలాత్మిక పృథివీస్థాన దేవత స్వరూపము|
ఇచట స్వర్ణోక స్థానదేవత యని విశేషము|
ప్రాక్దేశీయుల భాషలో ఉష్ణోదేవి|
లక్ష్మియని మరొక అభిప్రాయమైయున్నది|

పసుపు వర్ణము గల శరీరముతో పద్మమందాసీనయై వరాభయముద్రలతోయున్న రూపముగా ధ్యానము చేయదగినది|

ధీప్రచోదకత్వాత్స వితాపరమ ఏవ న సూర్య ఇతి చేత్ ॥
సూర్యస్య ధీప్రచోదకత్వం నాసిద్ధమిత్య దోషః
సూర్యరశ్మయశ్చైతన్యవాహినో న ಜ:|
అథాస్యాః శుద్ధముపాసనం ॥ రశ్మీనేవ ధ్యాయేత్ ॥
ఇయం మధువిద్యోపనిషత్సు గీయతే|
కమలాత్మికోపాసనాదుత్తమో భవేదుత్తమో భవేత్|
బుద్ధిని ప్రేరేపించునది కనుక సవితయే పరమ స్వరూపము సూర్యుడు కానేరడు అన్నచో.

సూర్యునికి బుద్ధి ప్రచోదకత్వం లేకపోలేదు|
సూర్యకాంతులు చైతన్యవాహికలే కనుక జడములు కానేరవు|
ఆ విధముగా కమలాత్మిక ఉపాసన శుద్ధమైనది| కిరణములను ధ్యానించవలెను|
ఈ విద్య మధువిద్య ఉపనిషత్తునందు గానము చేయబడినది|
కమలాత్మిక విద్య ఉపాసన వల్ల ఉపాసకులు ఉత్తములగుదురు|

*మహావిద్యలు వాటి భైరవులు*

మహాకాలీ-కాలభైరవః
శృణు చార్వఙ్గి సుభగే కాలికాయాశ్చ భైరవమ్ |
మహాకాలం దక్షిణాయా దక్షభాగే ప్రపూజయేత్ |
మహాకాలేన వై సార్ధం దక్షిణా రమతే సదా ||

తారా-అక్షోభ్యభైరవః
తారాయా దక్షిణే భాగే అక్షోభ్యం పరిపూజయేత్ |
సముద్రమథనే దేవి కాలకూటం సముత్థితమ్ ||
సర్వే దేవాః సదారాశ్చ మహాక్షోభమవాప్నుయుః |
క్షోభాదిరహితం యస్మాత్పీతం హాలాహలం విషమ్ ||
అత ఏవ మహేశాని అక్షోభ్యః పరికీర్తితః |
తేన సార్ధం మహామాయా తారిణీ రమతే సదా ||

మహాత్రిపురసున్దరీ-పఞ్చవక్త్రభైరవః
మహాత్రిపురసున్దర్యా దక్షిణే పూజయేచ్ఛివమ్ |
పఞ్చవక్త్రం త్రినేత్రం చ ప్రతివక్త్రే సురేశ్వరి ||
తేన సార్ధం మహాదేవీ సదా కామకుతూహలా |
అత ఏవ మహేశానీ పఞ్చమీతి ప్రకీర్తితా ||

భువనేశ్వరీ-త్ర్యమ్బకభైరవః
శ్రీమద్ భువనసున్దర్యా దక్షిణే త్ర్యమ్బకం యజేత్ |
స్వర్గే మర్త్యే చ పాతాలే యా చాద్యా భువనేశ్వరీ ||
ఏతాస్తు రమతే యేన త్ర్యమ్బకస్తేన కథ్యతే |
సశక్తిశ్చ సమాఖ్యాతః సర్వతన్త్రప్రపూజితః ||

త్రిపురభైరవీ-దక్షిణామూర్తిభైరవః
భైరవ్యా దక్షిణే భాగే దక్షిణామూర్తిసంజ్ఞకమ్ |
పూజయేత్ పరయత్నేన పఞ్చవక్త్రం తమేవ హి ||

ఛిన్నమస్తా-కబన్ధభైరవః
ఛిన్నమస్తా దక్షిణాంశే కబన్ధం పూజయేచ్ఛివమ్ |
కబన్ధపూజనాద్దేవి సర్వసిద్ధీశ్వరో భవేత్ ||

ధూమావతీ
ధూమావతీ మహావిద్యా విధవారూపధారిణీ ||

బగలాముఖీ-ఏకవక్త్రభైరవః
బగలాయా దక్షభాగే ఏకవక్త్రం ప్రపూజయేత్ |
మహారుద్రేతి విఖ్యాతం జగత్సంహారకారకమ్ ||

మాతఙ్గీ-మతఙ్గభైరవః
మాతఙ్గీ దక్షిణాంశే చ మతఙ్గం పూజయేచ్ఛివమ్ |
తమేవ దక్షిణామూర్తిం జగదానన్దరూపకమ్ ||

కమలాత్మికా-సదాశివభైరవః
కమలాయా దక్షిణాంశే విష్ణురూపం సదాశివమ్ |
పూజయేత్ పరమేశాని స సిద్ధో నాత్ర సంశయః ||

అన్నపూర్ణా-దశవక్త్రభైరవః
పూజయేదన్నపూర్ణాయా దక్షిణే బ్రహ్మరూపకమ్ |
మహామోక్షప్రదం దేవం దశవక్త్రం మహేశ్వరమ్ ||

దుర్గా-నారదభైరవః
దుర్గాయా దక్షిణే దేశే నారదం పరిపూజయేత్ |
నాకారః సృష్టికర్తా చ దకారః పాలకః సదా |
రేఫః సంహారరూపత్వాన్నారదః పరికీర్తితః ||

మహావిద్యలు | యక్షులు

1.కలి | మహామధుమతి

2.తారా| తరిణి

3.చిన్నమస్తా|లంపటా

4.భువనేశి |త్రైలోక్య మోహిని

5.త్రిపుర | బ్రమరీ

6.ధూమావతి |భీషణి

7.భైరవి |చంద్ర రేఖ

8.బగల | బదాలికా

9.మాతంగి |మనోహారిణి

10.కమల |ధనాధుడు

దశ మహావిద్యా జయంతులు 

1- కాలీ  భాద్రపద కృష్ణ అష్టమీ
2- తారా  చైత్ర శుక్ల నవమీ 
3- లలితా  మాఘ శుక్ల పూర్ణిమా
4- భువనేశ్వరీ  భాద్రపద శుక్ల ద్వాదశీ 
5- భైరవీ  మార్గశీర్ష శుక్ల పూర్ణిమా
6- ఛిన్నమస్తా  వైశాఖ శుక్ల చతుర్దశీ
7- ధూమావతీ  జ్యేష్ఠ శుక్ల అష్టమీ 
8- బగలాముఖీ  వైశాఖ శుక్ల చతుర్థీ 
9- మాతంగీ  వైశాఖ శుక్ల చతుర్దశీ
10- కమలా  కార్తిక కృష్ణ అమావస్యా

దస సిద్ధవిద్యా జయంతులు 

1- కుబ్జికా  వైశాఖ కృష్ణ త్రయోదశీ మధ్య రాత్రి 
2- చండికా  వైశాఖ శుక్ల పూర్ణిమా 
3- మాత్రా  మార్గశీర్ష కృష్ణ చతుర్దశీ 
4- సిద్ధలక్ష్మీ  వైశాఖ శుక్ల చతుర్దశీ
5- సరస్వతీ  మాఘ శుక్ల పంచమీ
6- అన్నపూర్ణా  మార్గశీర్ష కృష్ణ చతుర్దశీ 
7- గాయత్రీ  శ్రావణ శుక్ల పూర్ణిమా
8- పార్వతీ  ఆషాఢ శుక్ల నవమీ 
9- అపరాజితా  ఆశ్విన శుక్ల నవమీ
10- వింధ్యవాసినీ  భాద్రపద కృష్ణ అష్టమీ 

పై జయంతులు గురు సంప్రదాయాల్లో వేరుగా ఉండవచ్చు

*దశ మహావిద్యలు  దశావతార విష్ణు రూపమూలే*

కృష్ణస్తు కాళికా సాక్షాత్ రామమూర్తిశ్చ తారిణీ
వరాహో భువనా ప్రోక్తా నృసింహో భైరవీశ్వరీ
ధూమావతీ వామనఃస్యా చ్ఛిన్నా భృగుకులోద్భవః
కమలాఃమత్స్యరూపః స్యాత్ కూర్మస్తు బగళాముఖీ
మాతంగీ బౌద్ధ ఇత్యేషా షోడశీ కల్కిరూపిణీ||

కృష్ణావతారం సాక్షాత్తూ కాలికాదేవి|
తార రామావతారం|
భువనేశ్వరి వరాహావతారం|
నారసింహావతారం త్రిపురభైరవి|
ధూమావతి వామనావతారం|
ఛిన్నమస్త పరశురామావతారం|
కమల మత్స్యావతారం|
కూర్మం బగళాముఖి|
మాతఙ్గి బుద్ధావతారం|
షోడశి ఆఖరుది కల్కి అవతారం|
అంటే ఉపాసనా భేదాల చేత ఒకేతత్వం భిన్నభిన్నంగా కనబడుతున్నది|

శ్రీ.మహావిష్ణు దశ అవతార తిథులు కూడా ఉపాసనలు చేయవచ్చు

ఇంత వైవిధ్యంగా ఉన్న విద్యలు కాబట్టి సాధారణ వ్యక్తులకు సాధన అంత సులువు కాదు|
సంపూర్ణ దీక్ష గా ఉన్న వ్యక్తులు యోగులు వీటిని అనుసరిస్తారు|
*శక్తిని ఎంత అనుసరిస్తే అంతే శక్తి ప్రాప్తమౌతుంది*

*శ్రీ మాత్రే నమః* 
సేకరణ *మహాదేవ మహాదేవ రాళ్ళబండి శర్మ*

No comments:

Post a Comment

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS