Saturday, September 13, 2025

శ్రీకాళహస్తి లో ఉన్న పాతాళ గణపతి ఆలయం

శ్రీకాళహస్తి లో ఉన్న పాతాళ గణపతి ఆలయం



*శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకు 40 అడుగుల లోతు లోని
రాతి గుహలో కొలువై ఉన్నాడు.*

*పంచభూత లింగాలలో శ్రీ కాళ హస్తి క్షేత్రం ఒకటి ఇక్కడ అ పరమేశ్వరుడు వాయు లింగేశ్వర గా పార్వతి దేవి జ్ఞానాంబికగా పూజలందుకుంటున్నారు.*

*ఇదే క్షేత్రంలో వారి ముద్దుల కుమారుడు గజాననుడు కూడా పాతాళ గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడా లేని విధంగా భూతలానికి 40 అడుగుల దిగువన ఒక రాతి గృహలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి విశేషం ఆ విశేషం ఏమిటో తెలుసుకుందాం.* 

*పాతాళ గణపతి ప్రస్తావన వందల ఏళ్ల నాటి కావ్యాలలోని ఉందని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు శ్రీ నాథుడు రచించిన హరవిలాసం శివపురాణంలో కాళహస్తి వినాయకుడి గురించి పేర్కొన్నట్లు చరిత్ర చెబుతుంది.* 

*స్థల పురాణాన్ని చూస్తే కాళహస్తిలో జీవనదిని ప్రవహింపచేయాలన్న ఉద్దేశంతో అగస్త్యుడు పరమశివుని ప్రార్థించాడు.* 
*అగస్త్యుని తపోబలనికి పరమ శివుని అనుగ్రహం తోడై స్వర్ణముఖి నది ఆవిర్భవించింది.* 

*నది ఏర్పడింది కానీ అందులో నీళ్లు లేవు ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచించగా సకల శుభాలకు మూలం గణపతి ఆరాధన చేయకుండానే తపస్సుకు పూనుకున్న విషయం గుర్తొస్తుంది.*

*ఆ తప్పును సవరించుకోడానికి గజాననుని అనుగ్రహం కోసం మళ్లీతపస్సు మొదలుపెడతారు.*

*అసుర సంహారం చేసి పాతాళమార్గం ద్వారా వస్తున్న వినాయక స్వామి అగస్త్యుని గమనించి అతనికి దర్శన భాగ్యం కల్పిస్తారు.* 

*అతని కోరిక మేరకు స్వర్ణ ముఖి లో జలధార కురిపిస్తాడు. తనకు దర్శనం ఇచ్చిన చోటే కొలువు తీరమని గణపతిని కోరటంతో అక్కడే స్వామి పాతాళ గణపతిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు* 

*రాతి గుహలో వినాయకుని దర్శించుకోవాలంటే భక్తులు ఒంపులు తిరిగి ఉండే 30 మెట్లను జాగ్రత్తగా దిగి లోపలికి చేరుకోవాలి ఒకప్పుడు స్వర్ణ నది నీటిమట్టం ఎంత పెరిగితే స్వామి వారి దగ్గర అంత ఎత్తులో నీళ్లు ఉరేవట..!* 
*కానీ ఇప్పుడు అక్కడ టైల్స్ వేయడంతో నీటి జాడ కనిపించడం లేదు..*

No comments:

Post a Comment

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS