కలియుగం లో అంత్యంత విశేషఫలం ఇచ్చే పార్థివ శివలింగ పూజన మాహాత్మ్య వర్ణన
*స్త్రీలు పిల్లలు అందరూ శివార్చన చేయవచ్చా* ??
*ఇంతకు ముందు చాలా తలకు అయిన లింగములు వివరాలు తెలుసుకున్నాం* .....
*కలియుగం లో అంత్యంత విశేష ఫలితం ఇచ్చే పార్థివ శివార్చన తెలుసుకొందాం*....
*ఋషయ ఊచుః*
సూత ! సూత ! చిరంజీవ ! ధన్యస్త్వం శివభక్తిమాన్|
సమ్యగుక్తస్త్వయా లింగమహిమా సత్ఫలప్రదః||
యత్ర పార్థివమాహేశలింగస్య మహిమాఽధునా|
సర్వోత్కృష్టశ్చ కథితో వ్యాసతో బ్రూహి తం పునః||
ఓ సూతా! నీవు చిరంజీవిగా ఉండు! గొప్ప శివభక్తి కలవాడవైన నీవు ధన్యుడవు. సత్ఫలితాలను ఇచ్చే లింగమహిమ నీచేత చక్కగా చెప్పబడింది. ఈ సందర్భంలో, అన్నిటికంటే శ్రేష్ఠమైనదిగా చెప్పబడిన ఆ మట్టితో చేసిన *పార్థివ శివలింగం* యొక్క గొప్పదనాన్ని మరల, మరింత వివరంగా చెప్పండి.
*సూత ఉవాచ*
శృణుధ్వమృషయః సర్వే సద్భక్త్యాదరతోఽఖిలాః| శివపార్థివలింగస్య మహిమా ప్రోచ్యతే మయా||
ఉక్తేష్వేతేషు లింగేషు పార్థివం లింగముత్తమం|
తస్య పూజనతో విప్రాః బహవః సిద్ధిమాగతాః||
హరిర్బ్రహ్మా చ ఋషయః సప్రజాపతయస్తథా|
సంపూజ్య పార్థివం లింగం ప్రాపుః సర్వేప్సితం ద్విజాః||
దేవాసురమనుష్యాశ్చ గంధర్వోరగరాక్షసాః|
అన్యేఽపి బహవః సిద్ధిం సంపూజ్యం తం గతాః పరం||
ఓ ఋషులారా! మీరందరూ (సమస్తమైన వారూ), మంచి భక్తితో మరియు ఆదరంతో వినండి. శివుని యొక్క పార్థివ లింగం (మట్టి లింగం) యొక్క గొప్పదనం (మహిమ) నాచేత చెప్పబడుచున్నది
ఈ లింగాలలో, మట్టితో చేసిన పార్థివ లింగం అన్నిటికంటే ఉత్తమమైనది. ఓ ఋషులారా!
ఆ పార్థివ లింగాన్ని పూజించడం వలన అందరూ సిద్ధిని గొప్ప ఫలితాన్ని/ మోక్షాన్ని పొందారు.
ఓ ద్విజులారా! శ్రీమహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఋషులు మరియు ప్రజాపతులు కూడా పార్థివ లింగాన్ని చక్కగా పూజించి, వారు కోరిన అన్నిటినీ (సర్వేప్సితాలను) పొందారు.
కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమసంభవం|
ద్వాపరే పారదం శ్రేష్ఠం పార్థివం తు కలౌ యుగే|
అష్టమూర్తిషు సర్వాసు మూర్తిర్వై పార్థివీ వరా|
అనన్యపూజితా విప్రాస్తతస్తస్మాన్ మహత్ఫలం||
కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో బంగారు లింగం, ద్వాపరయుగంలో పాదరస లింగం శ్రేష్ఠమైనవి. అయితే, కలియుగంలో మాత్రం పార్థివ లింగం (మట్టి లింగం) అత్యంత శ్రేష్ఠమైనది.
శివుని అష్టమూర్తులన్నింటిలో కూడా పార్థివ మూర్తియే (మట్టి రూపమే) గొప్పది. ఓ విప్రులారా! ఈ పార్థివ లింగాన్ని పూజించడం వలన గొప్ప ఫలితం లభిస్తుంది. ఈ అష్టమూర్తుల వివరణ తరువాత వ్యాసం లో ఉంటుంది.
*మహాదేవుడు ద్వారా పార్థివలింగ విశేష వర్ణన*
యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠః శ్రేష్ఠో మహేశ్వరః|
ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే||
యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్ఠతమా స్మృతా|
తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే||
యథా వ్రతేషు సర్వేషు శివరాత్రివ్రతం పరం|
తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే|
యథా దేవీషు సర్వాసు శైవీ శక్తిః పరా స్మృతా|
తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే||
దేవతలందరిలో శివుడు ఎలా శ్రేష్ఠుడో, లింగాలన్నిటిలో *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది
పట్టణాలన్నిటిలో కాశీ ఎలా శ్రేష్ఠమో.
లింగాలన్నిటిలో *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది
వ్రతాలన్నిటిలో శివరాత్రి వ్రతం ఎలా ఉత్తమమైనదో, లింగాలన్నిటిలో *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది.
దేవతా శక్తులన్నిటిలో శివశక్తి ఎలా పరమోన్నతమైందో, లింగాలన్నిటిలో
*పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది.
*నిత్య పార్థివ శివార్చన*
శివం యః పూజయేన్నిత్యం కృత్వా లింగం తు పార్థివం|
యావజ్జీవనపర్యంతం స యాతి శివమందిరం||
మృడేనాప్రమితాన్ వర్షాంఛివలోకే హి తిష్ఠతి|
సకామః పునరాగత్య రాజేంద్రో భారతే భవేత్||
నిష్కామః పూజయేన్నిత్యం పార్థివం లింగముత్తమం|
శివలోకే సదా తిష్ఠేత్ తస్య సాయుజ్యమాప్నుయాత్||
ఎవడైతే ప్రతిరోజూ, జీవితాంతం మట్టితో చేసిన పార్థివ లింగాన్ని పూజిస్తాడో, వాడు చివరకు శివలోకాన్ని చేరుకుంటాడు.
పార్థివ లింగ పూజ చేసినవాడు లెక్కలేనన్ని సంవత్సరాలు శివలోకంలో ఉండి, తర్వాత ఏదైనా కోరిక మిగిలి ఉంటే, భారతదేశంలో గొప్ప చక్రవర్తిగా జన్మిస్తాడు.
నిష్కాముడై (కోరికలు లేకుండా) ఈ ఉత్తమమైన పార్థివ లింగాన్ని పూజించేవాడు , ఎల్లప్పుడూ శివలోకంలో ఉండి, చివరకు శివుని సాయుజ్యాన్ని మోక్షాన్ని పొందుతాడు.
నిత్య లింగార్చన ఒక ప్రత్యేక ఉపాసన దానికి ఉపదేశ దీక్ష ఉన్నది సూత్రం ఈ విధంగా ఉన్నది
*ఏకైక లింగం ద్విగణాదినాథ పంచా ఉమాఖ్యా త్రిచ శూలపాణే ద్వౌ కార్తికేయౌ ఫణి యుగ్మ నేత్రౌ
లింగస్య యానం ఇతి పార్థివేశ:
*అఖండ చర స్థిర భేదం*
అఖండం తు చరం లింగం ద్విఖండమచరం స్మృతం|
ఖండాఖండవిచారోయం సచరాఽచరయోః స్మృతః||
*శివ లింగం రేoడు రకాలు*
1 *అచరం*
ఇది రెండు ఖండాలుగా ఉంటుంది కలిపి ప్రతిష్ఠ చేసి పూజలు చేయాలి గుడిలో శివలింగాలు లాంటివి.
2 *చరo*
పార్థివ లింగాలు ఇవి అఖండంగా
(మట్టి ముద్ద వెడతీయకుండా చేయాలి) చేసి అర్చించాలి.
పై పద్ధతులు పాటించకపోతే శివార్చన ఫలం ఉండదు పైగా చేసే వ్యక్తికి హాని కలుగుతుంది.
*శివ పూజలో తప్పని సరిగా వాడాల్సిన
శివనామాలు*
హరో మహేశ్వరః శూలపాణిః శంభుః పినాకధృక్|
శివః పశుపతిశ్చైవ మహాదేవ ఇతి క్రమాత్|| మృదాహరణసంఘట్టప్రతిష్ఠాహ్వానమేవ చ|
స్నపనం పూజనం చైవ క్షమస్వేతి విసర్జనం||
ఓంకారాదిచతుర్థ్యంతైర్నమోఽన్తైర్నామభిః క్రమాత|
కర్తవ్యాశ్చ క్రియాః సర్వా భక్త్యా పరమయా ముదా||
అందరూ శ్లోక పద్ధతి తో ఆరాధన చేయాలి
లేక శివ మూల మంత్రం చెప్పి ఆరాధన చేస్తూ ముఖ్య స్థానాలలో ఇలా వాడాలి....
*హర నామం తో లింగ ప్రతిష్ఠా
*మహేశ్వర నామం తో ఆవాహన
*శూలపాణి నామం తో స్నాన
*శంభు నామం తో పూజన
*పినాకధారీ నామం తో క్షమాయాచనా
*శివ నామంతో ప్రార్థనా
*పశుపతి మంత్ర తో విసర్జన చేయాలి.
*పూర్వం నుండి బ్రహ్మాది దేవతలు మహర్షులు
కూడా లింగార్చన వల్ల ఫలాలు పొందారు*
హరిబ్రహ్మాదయో దేవా మునయో యక్షరాక్షసాః|
గంధర్వాశ్చారణాః సిద్ధా దైతేయా దానవాస్తథా||
నాగాః శేషప్రభృతయో గరుడాద్యాః ఖగాస్తథా| సప్రజాపతయశ్చాన్యే మనవః కిన్నరా నరాః||
పూజయిత్వా మహాభక్త్యా లింగ సర్వార్థసిద్ధిదం|
ప్రాప్తాః కామానభీష్టాంశ్చ తాంస్తాన్ సర్వాన్ హృది స్థితాన్||
విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, దైత్యులు, దానవులు, శేషుడిని మొదలుకొని నాగులు, గరుడుడు మొదలైన పక్షులు, ప్రజాపతులు, మనువులు, కిన్నరులు మరియు మనుష్యులు... వీరందరూ గొప్ప భక్తితో, అన్ని కోరికలను సిద్ధింపజేసే ఆ *పార్థివ లింగాన్ని* పూజించి, తమ హృదయంలో దాగి ఉన్న ఆయా కోరికలన్నిటినీ పొందారు.
*వైదిక బ్రాహ్మణులు సదా వైదిక పద్ధతి ద్వారానే శివార్చన చేయాలి*
ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం వరం| అన్యేషామపి జంతూనాం వైదికేన న సమ్మతం| వైదికానాం ద్విజానాం చ పూజా వైదికమార్గతః|
కర్తవ్యా నాన్యమార్గేణ ఇత్యాహ భగవాంఛివః||
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదిక మార్గం వేదాల ద్వారా చెప్పబడిన ఆచారాలు ద్వారానే పూజలు చేయడం శ్రేష్ఠం. మిగతావారు అందరూ శ్లోక ఆరాధన ఫలితాన్నిస్తుంది , అయితే వైదికమైన ఆచారాలు గల ద్విజులు, తప్పనిసరిగా వైదిక మార్గం ద్వారానే పూజలు చేయాలి, వేరే మార్గాలను అనుసరించకూడదు అని భగవంతుడైన శివుడు స్వయంగా చెప్పాడు.
దధీచిగౌతమాదీనాం శాపేనాదగ్ధచేతసాం|
ద్విజానాం జాయతే శ్రద్ధా నైవ వైదికకర్మణి||
యో వైదికమానదృత్య కర్మ స్మార్తమథాపి వా|
అన్యత్ సమాచరేన్ మర్యో న సంకల్పఫలం లభేత్||
ఇత్థం కృత్వార్చనం శంభోర్నైవేద్యాంతం విధానతః| పూజయేదష్టమూర్తీశ్చ తత్రైవ త్రిజగన్మయీః||
దధీచి, గౌతముడు మొదలైన మహర్షుల శాపాల కారణంగా, కొంతమంది ద్విజులకు వైదిక కర్మల పట్ల శ్రద్ధ కలగడం లేదు.
(వాటి శాపోద్దారములు ఉంటాయి)
ఎవడైతే వైదిక కర్మను కానీ, స్మార్త కర్మను కానీ వదిలిపెట్టి, వేరే కర్మను ఆచరిస్తాడో, ఆ మనుష్యుడు ఆ కర్మ యొక్క సంకల్పించిన ఫలాన్ని పొందలేడు. నిత్యవిధులు చేస్తూ
ఈ విధంగా, శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పించే వరకు శివుని అర్చన చేసిన తరువాత, ముల్లోకాలలో వ్యాపించి ఉన్న శివుని అష్టమూర్తులను కూడా ఆ పూజలోనే పూజించాలి.
*పరివార్చన తప్పనిసరి*
క్షితిరాపోఽనలో వాయురాకాశః సూర్య్యసోమకౌ|
యజమాన ఇతి త్వష్టౌ మూర్తయః పరికీర్తితాః||
శర్వో భవశ్చ రుద్రశ్చ ఉగ్రో భీమ ఇతీశ్వరః|
మహాదేవః పశుపతిరేతాన్ మూర్తిభిరర్చయేత్|
పూజయేత్ పరివారం చ తతః శంభోః సుభక్తితః| ఈశానాదిక్రమాఅగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా|
తత ఏకాదశాన్ రుద్రాన్ పూజయేద్ విధినా తతః||
శంభుని (శివుని) పూజ నైవేద్యం వరకు పూర్తి చేసిన తరువాత, గొప్ప భక్తితో ఆయన పరివార దేవతలను కూడా పూజించాలి. ఈశానుడిని మొదలుకొని ఆ క్రమంలో, చందనం, అక్షతలు మరియు పత్రాలను ఉపయోగించి పూజ చేయాలి. ఈ క్రమంలో ఈశానుడు, నంది, చండుడు, మహాకాలుడు, భృంగి, వృషభం, స్కందుడు, కపర్దీశుడు, సోముడు మరియు శక్రుడు అనే దేవతలను పూజించాలి.
ఆ తరువాత, గొప్ప భక్తితో శివుని యొక్క పరివార దేవతలను కూడా పూజించాలి. ఈశానుడిని మొదలుకొని ఆ క్రమంలో, చందనం, అక్షతలు మరియు పత్రాలను ఉపయోగించి పూజ చేయాలి
*శివలింగం అర్చన అందరూ అర్హులే*
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః|
పూజయేత్ సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరం|
కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః| అధికారోఽస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః||
శివుని పూజ విషయంలో కుల, లింగ భేదం లేదు. బ్రాహ్మణుల నుండి ప్రతీ వారు మరియు స్త్రీలకు మరియు ఇతర మనుష్యులందరికీ కూడా శివలింగాన్ని పూద్ధించే సంపూర్ణ అధికారం ఉందని ఇది స్పష్టం చేస్తుంది *తత్తన్ మంత్రేణ సాధనం*
వారికి చెప్పబడిన విధంగా చేయాలి . శివారాధనలో భక్తి మాత్రమే ప్రధానమైనది.
*అయితే సాలగ్రామం ఉన్న పంచాయతన మాత్రం స్త్రీలకు స్పర్శ నిషిద్ధం అని నియమం ఉన్నది*
*ఆచారం అందరి క్షేమం కోసమే దాన్ని విమర్శించి భగవద్ అనుగ్రహం వదిలి వేయకూడదు*
*మహాదేవ మహాదేవ* *రాళ్ళబండి శర్మ*
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment