గెడ్డం గీసుకోవడం రోజూ చేయవచ్చా...?
*ఆచారాల్లో అంతరార్థాలు చాలా ఉంటాయి. ఒక రోజును తిథి దేవతలు, నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు పాలిస్తుంటారు. ఆయా దేవతలకు కొన్ని ప్రీతికర కర్మలు, కొన్ని అనిష్ట కర్మలు ఉంటాయి. వాటిని గమనించిన సూక్ష్మదర్శన శక్తిగల ఋషులీ ధర్మశాస్త్రాల ద్వారా అనేక ఆచారాలను అందజేశారు.*
*క్షౌరంభూతే రతం ధర్మే*
*వర్ణయేచ్ఛ జిజీవిషుః.*
*క్షౌరం నకుర్యాదభక్త*
*భుక్తస్నాత విభూషితాః ॥*
*ప్రయాణ సమరారంభే*
*న రాత్రౌ నచ సంధ్యయోః |*
*శ్రాద్ధాహే ప్రతిపద్రిక్తా*
*వ్రతాహ్ని చ నవైధృతౌ ॥* -
*వంటి నియమాలు ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అన్నిటినీ పరిశీలిస్తే - ఇవే ఆ నియమాలు:*
*జన్మతిథి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చవితి, షష్ఠి తిథులలో క్షౌరం కూడదు. ప్రయాణ దినాన, యుద్ధారంభాన, రాత్రిపూట, సంధ్యాసమయాలలోనూ, శ్రాద్ధ దినాలలోనూ, పాడ్యమి, శూన్యతిథులు, వ్రత దినాలలో క్షౌరం (క్షురకర్మ) పనికి రాదు.*
*శుక్ర, మంగళవారాలు కూడా. అయితే కొన్ని కర్మలకు క్షురకర్మ చేసుకుంటేగానీ పనికిరాదు-అప్పుడు తిథి వారాలను చూడరాదు. యజ్ఞం, ప్రేతకర్మ-మొదలైన వేళల్లో క్షౌరం, ముండపం చేయవలసిందే. తండ్రి గలవారు తరచుగా ముండనం (గుండు గీయించుకోవడం) చేసుకోరాదు.*
*రాజకార్య నియుక్తానాం*
*నరాణాం భూపజీవినాం ।*
*శ్ముశ్రులోమనఖచ్ఛేదే*
*నాస్తికాల విశోధనమ్ ||*
*రాజకార్యంలో పనిచేసేవాడు, రాజు (ప్రభుత్వం) వద్ద పనిచేసి పోషింపబడేవాడు - శ్ముశ్రుకర్మ (గెడ్డం గీసుకోవడం), గోళ్ళు తీసుకోవడం విషయంలో పెద్దగా కాల నియమం పాటించవలసిన పనిలేదు. ఇలా చాలా విషయాలు ఈ అంశంలో చెప్పినా, కొన్ని ప్రధానమైనవి ఇక్కడ పేర్కొనడమయ్యింది. అయితే-ఎప్పుడు క్షురకర్మ, శ్మశ్రు కర్మ చేసుకున్నా - ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే, దానికి సంబంధించిన దోషాలు పరిహరింపబడతాయి.*
*ఆనర్తో హిచ్ఛత్రః*
*ఆనర్తనో ఆహిచ్ఛత్రః*
*పాటలీపుత్రో, అదితిర్దితిః |*
*శ్రీశః క్షౌరౌ స్మరణాదేషాం*
*దోషాన్నశ్యంతి నిశ్శేషాః ।*
*"ఆనర్తదేశం, అహిచ్ఛత్రము (పాము గొడుగు), పాటలీపుత్రం, అదితి, దితి, విష్ణువు వీరిని క్షార (శ్మశ్రు) కాలంలో స్మరిస్తే సమస్త దోషాలు నశిస్తాయి". వేళాపాళా చూడకుండా క్షురకర్మాదులాచరిస్తే అరిష్ట శక్తులు ఆశ్రయిస్తాయి. అనాచారాలే వాటికి ఆశ్రయస్థానాలు...!*
.jpg)
No comments:
Post a Comment