నవదుర్గా వైభవం:
నవదేవి, నవదుర్గా వైభవంలో భాగంగా నవరాత్రులలో నాలుగవ రోజు తిథి చవితి. ఈ రోజు విజయవాడలో అలంకారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అనగానే శివునికి భిక్ష వేస్తున్న అమ్మవారి మూర్తి జ్ఞాపకమొస్తుంది. ఈ తల్లి చిత్రపటాలు కాశీలో లభిస్తాయి. అందుకే అమ్మవారిని "కాశిపురాధీశ్వరి" అంటారు. అన్నపూర్ణా దేవిని ధ్యానించి, పూజిస్తే అన్నపానాదులులకు లోటు ఉండదు. ఎవరైనా! అన్నపానాదులుకు లోటు లేకుండా ఉండాలంటే! మీ వంటింట్లో అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి. వంటల రుచిగానే కాకుండా, చిత్రపటం ఉంటే మనం చేసే వంటలన్నీ ఆమెకు నివేదన చేయబడతాయి. ఆ తల్లి అనుగ్రహం వల్లే ఏదైనా వండగలుగుతున్నాం. దసరా ఉత్సవాల్లో భాగంగా మైసూర్ లో వైష్ణవిదేవిగా పూజిస్తారు. శ్రీశైలంలో కుష్మాండ దేవతగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో రోహిణిగా పూజిస్తారు. రోహిణి అనగానే బలరాముని భార్య, చంద్రుని భార్య గుర్తుకొస్తుంది. ఏది చూసినా ఆ తల్లి స్వరూపమే! కుమారి పూజలో రోహిణిని పూజిస్తే రోగ నాశనం కలుగుతుంది. ఐదు సంవత్సరాల వయస్సుగల పాపని కుమారి పూజలో పూజిస్తారు. నైవేద్యంగా చిల్లు లేకుండా అల్లపు గారెలు నివేదన చేయాలి. వృక్షాలలో మేడి వృక్షాన్ని పూజిస్తారు. ఈరోజు చదువు కావలసినవి అన్నపూర్ణా దేవి అష్టోత్తరం, సహస్ర నామాలు..
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే!..
No comments:
Post a Comment