Tuesday, September 30, 2025

కలియుగం లో అంత్యంత విశేషఫలం ఇచ్చే పార్థివ శివలింగ పూజన మాహాత్మ్య వర్ణన

కలియుగం లో అంత్యంత విశేషఫలం ఇచ్చే పార్థివ శివలింగ పూజన మాహాత్మ్య వర్ణన 
*స్త్రీలు పిల్లలు అందరూ శివార్చన చేయవచ్చా* ??
*నిత్యార్చన* *పార్థివ శివార్చన విశేషాలు* 1


*ఇంతకు ముందు చాలా తలకు అయిన లింగములు వివరాలు తెలుసుకున్నాం* .....
*కలియుగం లో అంత్యంత విశేష ఫలితం ఇచ్చే పార్థివ శివార్చన తెలుసుకొందాం*....

*ఋషయ ఊచుః*
సూత ! సూత ! చిరంజీవ ! ధన్యస్త్వం శివభక్తిమాన్|
సమ్యగుక్తస్త్వయా లింగమహిమా సత్ఫలప్రదః||

యత్ర పార్థివమాహేశలింగస్య మహిమాఽధునా|
సర్వోత్కృష్టశ్చ కథితో వ్యాసతో బ్రూహి తం పునః||

ఓ సూతా! నీవు చిరంజీవిగా ఉండు! గొప్ప శివభక్తి కలవాడవైన నీవు ధన్యుడవు. సత్ఫలితాలను ఇచ్చే లింగమహిమ నీచేత చక్కగా చెప్పబడింది. ఈ సందర్భంలో, అన్నిటికంటే శ్రేష్ఠమైనదిగా చెప్పబడిన ఆ మట్టితో చేసిన *పార్థివ శివలింగం* యొక్క గొప్పదనాన్ని మరల, మరింత వివరంగా చెప్పండి.

*సూత ఉవాచ*
శృణుధ్వమృషయః సర్వే సద్భక్త్యాదరతోఽఖిలాః| శివపార్థివలింగస్య మహిమా ప్రోచ్యతే మయా||

ఉక్తేష్వేతేషు లింగేషు పార్థివం లింగముత్తమం|
తస్య పూజనతో విప్రాః బహవః సిద్ధిమాగతాః||

హరిర్బ్రహ్మా చ ఋషయః సప్రజాపతయస్తథా|
సంపూజ్య పార్థివం లింగం ప్రాపుః సర్వేప్సితం ద్విజాః||
దేవాసురమనుష్యాశ్చ గంధర్వోరగరాక్షసాః|
అన్యేఽపి బహవః సిద్ధిం సంపూజ్యం తం గతాః పరం||

ఓ ఋషులారా! మీరందరూ (సమస్తమైన వారూ), మంచి భక్తితో మరియు ఆదరంతో వినండి. శివుని యొక్క పార్థివ లింగం (మట్టి లింగం) యొక్క గొప్పదనం (మహిమ) నాచేత చెప్పబడుచున్నది

ఈ లింగాలలో, మట్టితో చేసిన పార్థివ లింగం అన్నిటికంటే ఉత్తమమైనది. ఓ  ఋషులారా!
 ఆ పార్థివ లింగాన్ని పూజించడం వలన అందరూ సిద్ధిని గొప్ప ఫలితాన్ని/ మోక్షాన్ని పొందారు.

ఓ ద్విజులారా! శ్రీమహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఋషులు మరియు ప్రజాపతులు కూడా పార్థివ లింగాన్ని  చక్కగా పూజించి, వారు కోరిన అన్నిటినీ (సర్వేప్సితాలను) పొందారు.

కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమసంభవం|
ద్వాపరే పారదం శ్రేష్ఠం పార్థివం తు కలౌ యుగే|
అష్టమూర్తిషు సర్వాసు మూర్తిర్వై పార్థివీ వరా|
అనన్యపూజితా విప్రాస్తతస్తస్మాన్ మహత్ఫలం||

కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో బంగారు లింగం, ద్వాపరయుగంలో  పాదరస లింగం శ్రేష్ఠమైనవి. అయితే, కలియుగంలో మాత్రం పార్థివ లింగం (మట్టి లింగం) అత్యంత శ్రేష్ఠమైనది.

శివుని అష్టమూర్తులన్నింటిలో కూడా పార్థివ మూర్తియే (మట్టి రూపమే) గొప్పది. ఓ విప్రులారా! ఈ పార్థివ లింగాన్ని పూజించడం వలన గొప్ప ఫలితం లభిస్తుంది. ఈ అష్టమూర్తుల వివరణ తరువాత వ్యాసం లో ఉంటుంది.

*మహాదేవుడు  ద్వారా పార్థివలింగ విశేష వర్ణన* 

యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠః శ్రేష్ఠో మహేశ్వరః|
ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే||

యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్ఠతమా స్మృతా|
తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే||
యథా వ్రతేషు సర్వేషు శివరాత్రివ్రతం పరం|
తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే|
యథా దేవీషు సర్వాసు శైవీ శక్తిః పరా స్మృతా|
తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే||

దేవతలందరిలో శివుడు ఎలా శ్రేష్ఠుడో, లింగాలన్నిటిలో *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది
పట్టణాలన్నిటిలో కాశీ ఎలా శ్రేష్ఠమో.

 లింగాలన్నిటిలో *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది
వ్రతాలన్నిటిలో శివరాత్రి వ్రతం ఎలా ఉత్తమమైనదో, లింగాలన్నిటిలో *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది.

దేవతా శక్తులన్నిటిలో శివశక్తి ఎలా పరమోన్నతమైందో, లింగాలన్నిటిలో
 *పార్థివ లింగం* అలా శ్రేష్ఠమైనది.

*నిత్య పార్థివ శివార్చన*
శివం యః పూజయేన్నిత్యం కృత్వా లింగం తు పార్థివం|
 యావజ్జీవనపర్యంతం స యాతి శివమందిరం||

మృడేనాప్రమితాన్ వర్షాంఛివలోకే హి తిష్ఠతి|
సకామః పునరాగత్య రాజేంద్రో భారతే భవేత్||

నిష్కామః పూజయేన్నిత్యం పార్థివం లింగముత్తమం|
శివలోకే సదా తిష్ఠేత్ తస్య సాయుజ్యమాప్నుయాత్||

ఎవడైతే ప్రతిరోజూ, జీవితాంతం మట్టితో చేసిన పార్థివ లింగాన్ని పూజిస్తాడో, వాడు చివరకు శివలోకాన్ని చేరుకుంటాడు.

పార్థివ లింగ పూజ చేసినవాడు లెక్కలేనన్ని సంవత్సరాలు శివలోకంలో ఉండి, తర్వాత ఏదైనా కోరిక మిగిలి ఉంటే, భారతదేశంలో గొప్ప చక్రవర్తిగా జన్మిస్తాడు.

నిష్కాముడై (కోరికలు లేకుండా) ఈ ఉత్తమమైన పార్థివ లింగాన్ని పూజించేవాడు , ఎల్లప్పుడూ శివలోకంలో ఉండి, చివరకు శివుని సాయుజ్యాన్ని మోక్షాన్ని పొందుతాడు.

నిత్య లింగార్చన ఒక ప్రత్యేక ఉపాసన దానికి ఉపదేశ దీక్ష ఉన్నది సూత్రం ఈ విధంగా ఉన్నది
*ఏకైక లింగం ద్విగణాదినాథ పంచా ఉమాఖ్యా త్రిచ శూలపాణే ద్వౌ కార్తికేయౌ ఫణి యుగ్మ నేత్రౌ
లింగస్య యానం ఇతి పార్థివేశ:

*అఖండ చర స్థిర భేదం*
అఖండం తు చరం లింగం ద్విఖండమచరం స్మృతం| 
ఖండాఖండవిచారోయం సచరాఽచరయోః స్మృతః||

*శివ లింగం రేoడు రకాలు*
 1 *అచరం*
 ఇది రెండు ఖండాలుగా ఉంటుంది కలిపి  ప్రతిష్ఠ చేసి పూజలు చేయాలి గుడిలో శివలింగాలు లాంటివి.

2 *చరo*
పార్థివ లింగాలు ఇవి అఖండంగా
 (మట్టి ముద్ద వెడతీయకుండా చేయాలి) చేసి అర్చించాలి.

పై పద్ధతులు పాటించకపోతే శివార్చన ఫలం ఉండదు పైగా చేసే వ్యక్తికి హాని కలుగుతుంది.

*శివ పూజలో తప్పని సరిగా వాడాల్సిన
శివనామాలు*

హరో మహేశ్వరః శూలపాణిః శంభుః పినాకధృక్|
శివః పశుపతిశ్చైవ మహాదేవ ఇతి క్రమాత్|| మృదాహరణసంఘట్టప్రతిష్ఠాహ్వానమేవ చ|
స్నపనం పూజనం చైవ క్షమస్వేతి విసర్జనం||
ఓంకారాదిచతుర్థ్యంతైర్నమోఽన్తైర్నామభిః క్రమాత|
కర్తవ్యాశ్చ క్రియాః సర్వా భక్త్యా పరమయా ముదా||

అందరూ శ్లోక పద్ధతి తో ఆరాధన చేయాలి 
లేక శివ మూల మంత్రం చెప్పి ఆరాధన చేస్తూ ముఖ్య స్థానాలలో ఇలా వాడాలి....
*హర నామం తో లింగ ప్రతిష్ఠా
*మహేశ్వర నామం తో ఆవాహన
*శూలపాణి నామం  తో స్నాన
*శంభు నామం తో పూజన
*పినాకధారీ నామం తో క్షమాయాచనా
*శివ నామంతో ప్రార్థనా
*పశుపతి మంత్ర తో విసర్జన చేయాలి.

*పూర్వం నుండి బ్రహ్మాది దేవతలు  మహర్షులు 
కూడా లింగార్చన వల్ల ఫలాలు పొందారు*

హరిబ్రహ్మాదయో దేవా మునయో యక్షరాక్షసాః|
గంధర్వాశ్చారణాః సిద్ధా దైతేయా దానవాస్తథా||

నాగాః శేషప్రభృతయో గరుడాద్యాః ఖగాస్తథా| సప్రజాపతయశ్చాన్యే మనవః కిన్నరా నరాః||

పూజయిత్వా మహాభక్త్యా లింగ సర్వార్థసిద్ధిదం|
ప్రాప్తాః కామానభీష్టాంశ్చ తాంస్తాన్ సర్వాన్ హృది స్థితాన్||

విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, దైత్యులు, దానవులు, శేషుడిని మొదలుకొని నాగులు, గరుడుడు మొదలైన పక్షులు, ప్రజాపతులు, మనువులు, కిన్నరులు మరియు మనుష్యులు... వీరందరూ గొప్ప భక్తితో, అన్ని కోరికలను సిద్ధింపజేసే ఆ *పార్థివ లింగాన్ని* పూజించి, తమ హృదయంలో దాగి ఉన్న ఆయా కోరికలన్నిటినీ పొందారు.

*వైదిక బ్రాహ్మణులు సదా వైదిక పద్ధతి ద్వారానే శివార్చన చేయాలి*

ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం వరం| అన్యేషామపి జంతూనాం వైదికేన న సమ్మతం| వైదికానాం ద్విజానాం చ పూజా వైదికమార్గతః|
కర్తవ్యా నాన్యమార్గేణ ఇత్యాహ భగవాంఛివః||

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదిక మార్గం వేదాల ద్వారా చెప్పబడిన ఆచారాలు ద్వారానే పూజలు చేయడం శ్రేష్ఠం.  మిగతావారు అందరూ శ్లోక  ఆరాధన ఫలితాన్నిస్తుంది , అయితే వైదికమైన ఆచారాలు గల ద్విజులు, తప్పనిసరిగా వైదిక మార్గం ద్వారానే పూజలు చేయాలి, వేరే మార్గాలను అనుసరించకూడదు అని భగవంతుడైన శివుడు స్వయంగా చెప్పాడు.

దధీచిగౌతమాదీనాం శాపేనాదగ్ధచేతసాం|
ద్విజానాం జాయతే శ్రద్ధా నైవ వైదికకర్మణి||

యో వైదికమానదృత్య కర్మ స్మార్తమథాపి వా|
అన్యత్ సమాచరేన్ మర్యో న సంకల్పఫలం లభేత్||

ఇత్థం కృత్వార్చనం శంభోర్నైవేద్యాంతం విధానతః| పూజయేదష్టమూర్తీశ్చ తత్రైవ త్రిజగన్మయీః||

దధీచి, గౌతముడు మొదలైన మహర్షుల శాపాల కారణంగా, కొంతమంది ద్విజులకు  వైదిక కర్మల పట్ల శ్రద్ధ కలగడం లేదు. 
(వాటి శాపోద్దారములు ఉంటాయి)

ఎవడైతే వైదిక కర్మను కానీ, స్మార్త కర్మను కానీ వదిలిపెట్టి, వేరే కర్మను ఆచరిస్తాడో, ఆ మనుష్యుడు ఆ కర్మ యొక్క సంకల్పించిన ఫలాన్ని పొందలేడు. నిత్యవిధులు చేస్తూ

ఈ విధంగా, శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పించే వరకు శివుని అర్చన చేసిన తరువాత, ముల్లోకాలలో వ్యాపించి ఉన్న శివుని అష్టమూర్తులను కూడా ఆ పూజలోనే పూజించాలి.

*పరివార్చన తప్పనిసరి*
క్షితిరాపోఽనలో వాయురాకాశః సూర్య్యసోమకౌ|
యజమాన ఇతి త్వష్టౌ మూర్తయః పరికీర్తితాః||
శర్వో భవశ్చ రుద్రశ్చ ఉగ్రో భీమ ఇతీశ్వరః|
మహాదేవః పశుపతిరేతాన్ మూర్తిభిరర్చయేత్|

పూజయేత్ పరివారం చ తతః శంభోః సుభక్తితః| ఈశానాదిక్రమాఅగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా|
తత ఏకాదశాన్ రుద్రాన్ పూజయేద్ విధినా తతః||

శంభుని (శివుని) పూజ నైవేద్యం వరకు పూర్తి చేసిన తరువాత, గొప్ప భక్తితో ఆయన పరివార దేవతలను కూడా పూజించాలి. ఈశానుడిని మొదలుకొని ఆ క్రమంలో, చందనం, అక్షతలు మరియు పత్రాలను ఉపయోగించి పూజ చేయాలి. ఈ క్రమంలో ఈశానుడు, నంది, చండుడు, మహాకాలుడు, భృంగి, వృషభం, స్కందుడు, కపర్దీశుడు, సోముడు మరియు శక్రుడు అనే దేవతలను పూజించాలి.

ఆ తరువాత, గొప్ప భక్తితో శివుని యొక్క పరివార దేవతలను కూడా పూజించాలి. ఈశానుడిని మొదలుకొని ఆ క్రమంలో, చందనం, అక్షతలు మరియు పత్రాలను ఉపయోగించి పూజ చేయాలి

*శివలింగం అర్చన అందరూ అర్హులే*

బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః|
పూజయేత్ సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరం|
కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః| అధికారోఽస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః||

శివుని పూజ విషయంలో కుల, లింగ భేదం లేదు. బ్రాహ్మణుల నుండి ప్రతీ వారు మరియు స్త్రీలకు మరియు ఇతర మనుష్యులందరికీ కూడా శివలింగాన్ని పూద్ధించే సంపూర్ణ అధికారం ఉందని ఇది స్పష్టం చేస్తుంది *తత్తన్ మంత్రేణ సాధనం*
వారికి చెప్పబడిన విధంగా చేయాలి . శివారాధనలో భక్తి మాత్రమే ప్రధానమైనది.

*అయితే సాలగ్రామం ఉన్న పంచాయతన మాత్రం స్త్రీలకు స్పర్శ నిషిద్ధం అని నియమం ఉన్నది*

*ఆచారం అందరి క్షేమం కోసమే దాన్ని విమర్శించి భగవద్ అనుగ్రహం వదిలి వేయకూడదు*

*మహాదేవ మహాదేవ* *రాళ్ళబండి శర్మ*
🙏🙏🙏🙏🙏

Saturday, September 27, 2025

దశ మహావిద్యలు ఏ దేవతలు??

దశ మహావిద్యలు ఏ దేవతలు??
*అత్యంత శక్తివంతమైన దశ మహావిద్యలు వాటి
లఘు సూత్ర వివరణ * 2
*జయంతులు*


*దశ మహావిద్యలు*
కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ|
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమావతీ తథా|
బగళా సిద్ధవిద్యా చ మాతంగీ కమలాత్మికా|
ఏతా దశ మహావిద్యాః సిద్ధవిద్యాః ప్రకీర్తితాః||

*ఈ దశ మహావిద్య వ్యాసం లో 6 నుండి 10 వరకు విద్య విషయాలు మరిన్ని విశేషములు*

*ప్రచండ చండిక ఛిన్నమస్త  మహావిద్య*
షష్ఠి సా దశసు మహావిద్యాసు ॥
భైరవ్యాసత్త్వేన ప్రచండచండికాయాస్తత్త్వం వ్యాఖ్యాతం|
తత్ర పృథివీస్థానా ముఖ్యా ॥
అత్రాంతరిక్షస్థానేతి విశేషః|ఇంద్రాణ్యధిదైవతమిత్యుక్తం భవతి|
ప్రభోరయుధభూతా ప్రచండచండికేతి విశేషః|
అత ఏవ వజ్రవైరోచనీయేతి కథ్యతే ॥
వజ్రంహ్యాయుధం ప్రభోః ॥
కుండలినీశక్తిరధ్యాత్మం
ఏకత ఏవ మూలాన్నిర్గచ్ఛత భైరవీ ప్రచండచండికే శరీరేషు ॥
ఏక సదా వాచే ॥
పరా యోగీనామేవోల్లసంతీ శిరసో ద్రావణాయ ॥
వ్యపోహ్య శీర్షకపాలే ఇతి శృతిరత్ర భవతి ॥
 తస్మాదేతాం శక్తిం ఛిన్నమస్తాం వ్యవహరంతి ॥
రేణుకా తాంత్రికైః ॥

దశమహావిద్యలలో ప్రచండచండిక విద్య ఆరవది.
భైరవీ తత్వము చేత ప్రచండచండిక తత్వము వ్యాఖ్యానింపబడినది|
ఆ విద్యకు పృథివీ స్థానము గలది ముఖ్యము.
అంతరిక్షస్థానము గలది విశేషమైయున్నది|
ఇంద్రాణ్యధిదైవతమని చెప్పినట్లైనది|
ప్రభువునకు అనగా ఇంద్రునకు ఆయుధమైన ప్రచండచండిక యని విశేషము|
అందువల్లనే వజ్రవైరోచనీ యని చెప్పబడినది.
వజ్రమే ఇంద్రుని యొక్క ఆయుధము|

కుండలినీ శక్తి ఆత్మకు సంబంధించినది|
భైరవి, ప్రచండచండికలు శరీరములయందు ఒకే మూలము నుండి వెలువడుతున్నారు|
మరొకరు యోగులలోనే ప్రకాశించునదై శిరస్సును ద్రవింపుటకై|

కుండలిని శిరస్సున సహస్రారకమలం చేరుకున్నప్పుడు, అమృతం స్రవిస్తుంది|
కుండలిని శిరస్సున సహస్రారకమలం
 చేరుకున్నప్పుడు, అమృతం స్రవిస్తుంది|

ఇట శిరస్సను కపాలమును భిన్నమొనర్చుటపై శృతివాక్య ప్రమాణము.అందువల్ల ఈ శక్తిని ఛిన్నమస్తయని వ్యవహరిస్తారు|
ఉపాధిరీత్యా సుషుమ్ననాడి కూడా 'ప్రచండచండిక' యని చెప్పబడుచున్నది|
తాంత్రికులు దీనిని 'రేణుక' అందురు|

సా చ ఛిన్నమస్తోచ్యతే ఛిన్నశీర్షత్వాత్ ॥
అస్మాకం సుషుమ్నామార్గే గ్రంధిత్రయమస్తి
ఏకోమూలాధారే
సబ్రహ్మగ్రంథిరుచ్యతే
అపరో మణిపూరే ॥ స విష్ణుగ్రంథి రుచ్యతే ॥
ఇతర ఆజ్ఞాచక్రే ॥
స రుద్రగ్రంథిరుచ్యతే ॥
తద్గ్రంథిత్రయప్రతిబంధాదస్మాసు శక్తిరంతరిక్షాత్ర బహులమవతరతి|
భిన్నగ్రంథా తు బహులం ప్రవహేత్ ॥
సిద్ధానాం వ్యష్టినాడీ సమష్టినాడ్యా మిలిత్వా మహామహిమా స్యాత్ ॥

ఛిన్నశీర్షము వల్ల ఛిన్నమస్తయని చెప్పబడును.
మన యొక్క సుషుమ్నా మార్గమందు మూడు గ్రంధులున్నవి|
ఒకటి మూలాధారచక్రమునందు కలదు.దానిని బ్రహ్మగ్రంథి అందురు|
మరొకటి మణిపూరచక్రము నందు కలదు. దానిని విష్ణుగ్రంథి అందురు|
చివరది ఆజ్ఞాచక్రమునందు కలదు. దానిని రుద్రగ్రంథి అందురు|

గ్రంథిత్రయప్రతిబంధము వల్ల మనలో శక్తి ఆకాశము నుండి మిక్కిలిగా దిగదు|
భిన్నగ్రంథులయందు మిక్కిలిగా ప్రవహించును|
సిద్ధుల యొక్క వ్యష్టిసమష్టినాడుల కలయిక మహామహిమ యగును|

క్రమేణ గ్రంథీనాం మోక్షః ॥
రుద్రగ్రంథొ భిన్నే నిఃశ్రేయసం హస్తస్థం స్యాత్ ॥
ఇయమేవ కాశీయదాజ్ఞాచక్రం

కాలక్రమేణ గ్రంథులకు విడుదల కలుగుసు.
రుద్రగ్రంథి భిన్నమైనప్పుడు మోక్షము అరచేతిలో నుండును|

కాశ్యాం తు మరణాన్ముక్తిరితి శ్లోకపాదోత్ర భవతి ॥
కాశీయందు మరణము వల్ల ముక్తి ప్రాప్తియని శ్లోకపాదము ఇక్కడ అనుసంధానించుకొనవలెను.
ఈ కాశీయే ఆ ఆజ్ఞాచక్రమైయున్నది|

ఛిన్నస్వమస్తకరవాలభృద్ ద్విభుజా కంఠోద్గతరక్తత్రిధారా ద్వే పిబంతీభ్యాం ॥ డాకినీ వర్ణినీభ్యాం సేవితపార్శ్వాన్యాం ధారాం స్వయం పిబంతీ రతికామాసనా ధ్యేయా ॥

ఛిన్నమైన తన శిరస్సు కత్తిని తన రెండు చేతులతో ధరించి మూడు రక్తధారలతో నున్న పైకెత్తిన కంఠము కలిగి , రెండు రక్తధారలు త్రాగుచున్న డాకిని వర్ణిని ఇరుపక్కల సేవిస్తుండగా , మరొక రక్తధారను స్వయంగా పానం చేస్తూ రతి కామమనే ఆసనంలో నున్న రూపంలో ధ్యానం చేయాలి|

ఛిన్నమస్తాయాః సుషుమ్నాయాః స్వాయత్తత్వన్మస్తకం కరస్థం|
కబంధాదుర్గతం రక్తధారాత్రికం నాడ్యగ్రాదుద్గతమమృతధారాత్రికం|
ఏకయా స్వశిరస్తర్పణం
తద్వారా సర్వస్య దేహస్య ॥
రతికామయోః పాదాభ్యామపష్టంభేన శక్తేః కామజిత్వం వ్యజ్యతే ॥
ప్రచండచండికోపాసనాపార
శక్తిర్భవేదపారశక్తిర్భవేత్|

తలఛిన్నమైయున్న సుషుమ్న తనకు అధీనమైనందున శిరస్సు చేతియందున్నట్లే|

కబంధము నుండి పైకి లేచిన మూడు రక్తధారలు నాడి యొక్క అగ్రభాగము నుండి పైకి లేచిన మూడు రక్తధారలు|
ఒక రక్తధారతో శిరస్సుకు తర్పణము జరుగును|

నీటి ద్వారా సమస్త దేహమునకు తర్పణము జరుగును|
రతి, మన్మథులు పాదములతో ఒత్తిడి చేయటం వలన శక్తికి మన్మథుని జయించే లక్షణము వ్యక్తమగుచున్నది|
ప్రచండచండిక ఉపాసన వలన అపారమైన శక్తి కలుగును. ఇది నిక్కము|

*శ్రీ ధూమావతి మహావిద్య*
సప్తమీ సా దశసు మహావిద్యాసు ॥
అస్యాః శుద్ధముపాసనం వ్యతికేణైన భవతి ॥
నీలా కృశా క్షుధా.. వసన్నా సమ్మార్జనీహస్తా ధ్యేయా 

దశమహావిద్యలలో ఈ విద్య ఏడవది|
నల్లని వర్ణము, కృశత్వము, ఆకలితోమాడుట, చేతియందు చీపురు గల రూపముగా ధ్యానించవలెను ఈ ఉపాసన వ్యతిరిక్తతో జరుగును|

జ్యేష్ఠాధి దైవతం ॥
సముచ్చయేన విద్యా... విద్యే ఉపాస్యే ॥
విద్యా చ పూర్ణా స్వతఃసిద్ధా
అవిద్యా విషయాణాం ॥
ధూమావత్తుపాసనాద్భవం తరేద్భవం తరేత్|

జేష్టాదేవి అధిదైవతము|
అయినప్పటికి విద్య, అవిద్యలు రెంటిని అధ్యయనం చెయ్యాలి|

విద్య పూర్ణమైనది. సహజముగా ఏర్పడినది కూడా|
అవిద్య ప్రాపంచికవిషయములదైయున్నది|
ధూమావతి ఉపాసన వల్ల జీవుడు సంసారము నుండి తరించును తప్పక తరించును|

*శ్రీ బగళా మహావిద్య*

అష్టమీ సా దశసు మహావిద్యాసు ॥
తారాయాస్తత్త్వేన బగలాముఖ్యాస్తత్త్వం వ్యాఖ్యాతం|
విభూతిభేదాద్విద్యాభేదః|
ధృవయా స్మత్యా వర్తనాన్మంత్రాస్తేజోమయాః స్యుః|
తస్మాదేవ బగలాముఖీ బ్రహ్మాస్త్రముచ్యతే|
బ్రహ్మైవాస్త్రం బ్రహ్మాస్త్రం న బ్రహ్మణోzస్త్రం|

శతృనిస్తరణకామో బగలాముఖీముపాసీత*
దశమహావిద్యలలో ఈ విద్య ఎనిమిదవది.
తారవిద్య తత్త్వముచే బగళాముఖి తత్త్వము వ్యాఖ్యానింపబడినది|
వారివారి విభూతులనుసరించి విద్యాభేదముండును|

వ్యక్తమైన తేజోరూపం పొందిన శబ్దము బగళాముఖి|
స్థిరమైన స్మృతితో మంత్రములు తేజోమయములు|
అందువల్లనే బగలాముఖి బ్రహ్మాస్త్రమని చెప్పబడుచున్నది|
బ్రహ్మయే అస్త్రము| బ్రహ్మ యొక్కయని కాదు|
శతృజయమును కోరువారు బగళాముఖిని ఉపాసించవలెను|

తత్రేంద్రో దేవతా నేంద్రాణితి చేత్|
పీతా గదా హస్తా శతృవిధ్వంసినీ ధ్యేయా ॥

ఆ ఉపాసనలో ఇంద్రుడే దేవత. ఇంద్రాణి కానేరదు|
పచ్చని వర్ణము గలది, చేతిలో గద కలిగి, శతృనాశినిగా ధ్యానించదగినది|

శుద్దోపాసనేన ధృవాయా స్మృత్యాం తత్రమంత్రం సంస్థాప్యావర్తయేత్
గ్రంథిచ్ఛేదనశ్చ ధృవయా స్మృత్యా
స్మృతిలంభే సర్వగ్రంథీనాం మోక్ష ఇతి శృతి ॥
బగలాముఖ్యుపాసనాస్త్రసిద్ధిర్భవేదస్త్రీసిద్ధిర్బవేత్||

శుద్ధోపాసనచే ధృవాస్మృతియందు మంత్రమును నిలిపి ఆవృత్తి చేయవలెను|
స్మృతి చేత గ్రంథిచ్ఛేదము కూడా జరుగును|
స్మృతి నాదముచే సర్వగ్రంథులకు మోక్షము కలుగును|
బగళాముఖి ఉపాసకులకు అస్త్రసిద్ధి ప్రాప్తించును|

*శ్రీ రాజ మాతంగి మహావిద్య*
నవమీ సాదశను మహావిద్యాసు ॥
శ్రోత్రగాహ్యః శబ్లో మాతంగీ
సరస్వత్యాధి దైవతం ॥
శ్యామా వీణా ధారిణీధ్యేయా ॥

ఈ విద్య దశమహావిద్యలలో తొమ్మిదవది.
చెవులచే గ్రహింపదగ్గ శబ్దమే మాతంగి|
సరస్వతి అధిదైవతమైయున్నది|
నల్లని వర్ణముగలదిగాను, వీణాధారిణిగాను ధ్యానము చేయవలెను|

శుక్లా వా ॥
అవతారరూప దృష్ట్యా శ్యామా ॥
మూలదేవతారూప దృష్ట్యా శుక్లా ॥
మతంగస్య పుత్రీ హి వాగ్దేవ్య అవతారః ॥
ఏతేనాస్యాః శక్తేర్మాతంగీత్వం వ్యాఖ్యాతం

లేక శుక్లవర్ణము గలదిగాను ధ్యానింపవలెను|
అవతారరూపతత్త్వముననుసరించి శ్యామవర్ణము కలది|
మూలదేవతరూపముననుసరించి శుక్లవర్ణము కలది|
మతంగ ఋషి పుత్రికయే వాగ్దేవి స్వరూపము|
వీనిచే శక్తి యొక్క మాతంగిలక్షణము వ్యాఖ్యానింపబడినది|

నాడీ నామ్నా వా సరస్వతీ ॥
జిహ్వాయాం వాగ్వాహినీ హి సరస్వతీ ॥
సదీ నామ్నా వా సరస్వతీ ॥
నదీదేవతయోః సంబంధో భిమానాత్
స్తనితస్య మేధస్థానత్వాద్వా సరస్వతీ ॥

నాడీ నామముచేనైనను సరస్వతియై యున్నది|
నాలుకయందు ప్రవహించు వాక్కుయే సరస్వతి.
లేక సరస్వతి నామము గల నదియై యుండవచ్చును|
నదీదేవత ఈ సంబంధము అభిమానము వల్ల కావచ్చును|
వాక్కు సరస్సుయై యున్నది|
నాదస్థానస్థితిచేత సరస్వతి గావచ్చును|

స్తనితం హి సరస్వత్యాః స్వరూపవిశేషః 
అత్రార్ధ మేధ ఏవ సరః ॥
స్వాధ్యాయాధ్యయనమస్యాః శుద్ధముపాసనం|
మాతంగద్యుపాసనాద్విదితవేదితవ్యో| భవేదితవేదితవ్యో భవేత్|

నాదమే సరస్వతి యొక్క స్వరూప విశేషము.
ఇట మేధయే సరస్సని గ్రాహ్యము|
స్వాధ్యాయము, అధ్యయనము మాతంగి యొక్క శుద్ధమైన ఉపాసనయైయున్నవి|
మాతంగి ఉపాసన వలన తెలుసుకోదగిన విషయములను తెలుసుకొనవలెను|

*శ్రీ కమలాత్మికా మహావిద్య*

అన్త్యా సా దశసు మహావిద్యాసు ॥
భైరవ్యాస్తత్త్వేన కమలాత్మికాయాస్తత్త్వం వ్యాఖ్యాతం|
అత్ర పృథివీస్థానా దేవతా|
అత్ర ద్యుస్థానేతి విశేషః ॥
ఉషోదేవీ ప్రాచాం భాషాయాం ॥
లక్ష్మీ రర్వాచాం|
పీతా పద్మాసనా వరాభయదా ధ్యేయా ॥

దశమహావిద్యలలో ఈ విద్య చివరది|
భైరవితత్త్వము చేత కమలాత్మిక యొక్క తత్త్వము వివరింపబడినది|

అక్కడ కమలాత్మిక పృథివీస్థాన దేవత స్వరూపము|
ఇచట స్వర్ణోక స్థానదేవత యని విశేషము|
ప్రాక్దేశీయుల భాషలో ఉష్ణోదేవి|
లక్ష్మియని మరొక అభిప్రాయమైయున్నది|

పసుపు వర్ణము గల శరీరముతో పద్మమందాసీనయై వరాభయముద్రలతోయున్న రూపముగా ధ్యానము చేయదగినది|

ధీప్రచోదకత్వాత్స వితాపరమ ఏవ న సూర్య ఇతి చేత్ ॥
సూర్యస్య ధీప్రచోదకత్వం నాసిద్ధమిత్య దోషః
సూర్యరశ్మయశ్చైతన్యవాహినో న ಜ:|
అథాస్యాః శుద్ధముపాసనం ॥ రశ్మీనేవ ధ్యాయేత్ ॥
ఇయం మధువిద్యోపనిషత్సు గీయతే|
కమలాత్మికోపాసనాదుత్తమో భవేదుత్తమో భవేత్|
బుద్ధిని ప్రేరేపించునది కనుక సవితయే పరమ స్వరూపము సూర్యుడు కానేరడు అన్నచో.

సూర్యునికి బుద్ధి ప్రచోదకత్వం లేకపోలేదు|
సూర్యకాంతులు చైతన్యవాహికలే కనుక జడములు కానేరవు|
ఆ విధముగా కమలాత్మిక ఉపాసన శుద్ధమైనది| కిరణములను ధ్యానించవలెను|
ఈ విద్య మధువిద్య ఉపనిషత్తునందు గానము చేయబడినది|
కమలాత్మిక విద్య ఉపాసన వల్ల ఉపాసకులు ఉత్తములగుదురు|

*మహావిద్యలు వాటి భైరవులు*

మహాకాలీ-కాలభైరవః
శృణు చార్వఙ్గి సుభగే కాలికాయాశ్చ భైరవమ్ |
మహాకాలం దక్షిణాయా దక్షభాగే ప్రపూజయేత్ |
మహాకాలేన వై సార్ధం దక్షిణా రమతే సదా ||

తారా-అక్షోభ్యభైరవః
తారాయా దక్షిణే భాగే అక్షోభ్యం పరిపూజయేత్ |
సముద్రమథనే దేవి కాలకూటం సముత్థితమ్ ||
సర్వే దేవాః సదారాశ్చ మహాక్షోభమవాప్నుయుః |
క్షోభాదిరహితం యస్మాత్పీతం హాలాహలం విషమ్ ||
అత ఏవ మహేశాని అక్షోభ్యః పరికీర్తితః |
తేన సార్ధం మహామాయా తారిణీ రమతే సదా ||

మహాత్రిపురసున్దరీ-పఞ్చవక్త్రభైరవః
మహాత్రిపురసున్దర్యా దక్షిణే పూజయేచ్ఛివమ్ |
పఞ్చవక్త్రం త్రినేత్రం చ ప్రతివక్త్రే సురేశ్వరి ||
తేన సార్ధం మహాదేవీ సదా కామకుతూహలా |
అత ఏవ మహేశానీ పఞ్చమీతి ప్రకీర్తితా ||

భువనేశ్వరీ-త్ర్యమ్బకభైరవః
శ్రీమద్ భువనసున్దర్యా దక్షిణే త్ర్యమ్బకం యజేత్ |
స్వర్గే మర్త్యే చ పాతాలే యా చాద్యా భువనేశ్వరీ ||
ఏతాస్తు రమతే యేన త్ర్యమ్బకస్తేన కథ్యతే |
సశక్తిశ్చ సమాఖ్యాతః సర్వతన్త్రప్రపూజితః ||

త్రిపురభైరవీ-దక్షిణామూర్తిభైరవః
భైరవ్యా దక్షిణే భాగే దక్షిణామూర్తిసంజ్ఞకమ్ |
పూజయేత్ పరయత్నేన పఞ్చవక్త్రం తమేవ హి ||

ఛిన్నమస్తా-కబన్ధభైరవః
ఛిన్నమస్తా దక్షిణాంశే కబన్ధం పూజయేచ్ఛివమ్ |
కబన్ధపూజనాద్దేవి సర్వసిద్ధీశ్వరో భవేత్ ||

ధూమావతీ
ధూమావతీ మహావిద్యా విధవారూపధారిణీ ||

బగలాముఖీ-ఏకవక్త్రభైరవః
బగలాయా దక్షభాగే ఏకవక్త్రం ప్రపూజయేత్ |
మహారుద్రేతి విఖ్యాతం జగత్సంహారకారకమ్ ||

మాతఙ్గీ-మతఙ్గభైరవః
మాతఙ్గీ దక్షిణాంశే చ మతఙ్గం పూజయేచ్ఛివమ్ |
తమేవ దక్షిణామూర్తిం జగదానన్దరూపకమ్ ||

కమలాత్మికా-సదాశివభైరవః
కమలాయా దక్షిణాంశే విష్ణురూపం సదాశివమ్ |
పూజయేత్ పరమేశాని స సిద్ధో నాత్ర సంశయః ||

అన్నపూర్ణా-దశవక్త్రభైరవః
పూజయేదన్నపూర్ణాయా దక్షిణే బ్రహ్మరూపకమ్ |
మహామోక్షప్రదం దేవం దశవక్త్రం మహేశ్వరమ్ ||

దుర్గా-నారదభైరవః
దుర్గాయా దక్షిణే దేశే నారదం పరిపూజయేత్ |
నాకారః సృష్టికర్తా చ దకారః పాలకః సదా |
రేఫః సంహారరూపత్వాన్నారదః పరికీర్తితః ||

మహావిద్యలు | యక్షులు

1.కలి | మహామధుమతి

2.తారా| తరిణి

3.చిన్నమస్తా|లంపటా

4.భువనేశి |త్రైలోక్య మోహిని

5.త్రిపుర | బ్రమరీ

6.ధూమావతి |భీషణి

7.భైరవి |చంద్ర రేఖ

8.బగల | బదాలికా

9.మాతంగి |మనోహారిణి

10.కమల |ధనాధుడు

దశ మహావిద్యా జయంతులు 

1- కాలీ  భాద్రపద కృష్ణ అష్టమీ
2- తారా  చైత్ర శుక్ల నవమీ 
3- లలితా  మాఘ శుక్ల పూర్ణిమా
4- భువనేశ్వరీ  భాద్రపద శుక్ల ద్వాదశీ 
5- భైరవీ  మార్గశీర్ష శుక్ల పూర్ణిమా
6- ఛిన్నమస్తా  వైశాఖ శుక్ల చతుర్దశీ
7- ధూమావతీ  జ్యేష్ఠ శుక్ల అష్టమీ 
8- బగలాముఖీ  వైశాఖ శుక్ల చతుర్థీ 
9- మాతంగీ  వైశాఖ శుక్ల చతుర్దశీ
10- కమలా  కార్తిక కృష్ణ అమావస్యా

దస సిద్ధవిద్యా జయంతులు 

1- కుబ్జికా  వైశాఖ కృష్ణ త్రయోదశీ మధ్య రాత్రి 
2- చండికా  వైశాఖ శుక్ల పూర్ణిమా 
3- మాత్రా  మార్గశీర్ష కృష్ణ చతుర్దశీ 
4- సిద్ధలక్ష్మీ  వైశాఖ శుక్ల చతుర్దశీ
5- సరస్వతీ  మాఘ శుక్ల పంచమీ
6- అన్నపూర్ణా  మార్గశీర్ష కృష్ణ చతుర్దశీ 
7- గాయత్రీ  శ్రావణ శుక్ల పూర్ణిమా
8- పార్వతీ  ఆషాఢ శుక్ల నవమీ 
9- అపరాజితా  ఆశ్విన శుక్ల నవమీ
10- వింధ్యవాసినీ  భాద్రపద కృష్ణ అష్టమీ 

పై జయంతులు గురు సంప్రదాయాల్లో వేరుగా ఉండవచ్చు

*దశ మహావిద్యలు  దశావతార విష్ణు రూపమూలే*

కృష్ణస్తు కాళికా సాక్షాత్ రామమూర్తిశ్చ తారిణీ
వరాహో భువనా ప్రోక్తా నృసింహో భైరవీశ్వరీ
ధూమావతీ వామనఃస్యా చ్ఛిన్నా భృగుకులోద్భవః
కమలాఃమత్స్యరూపః స్యాత్ కూర్మస్తు బగళాముఖీ
మాతంగీ బౌద్ధ ఇత్యేషా షోడశీ కల్కిరూపిణీ||

కృష్ణావతారం సాక్షాత్తూ కాలికాదేవి|
తార రామావతారం|
భువనేశ్వరి వరాహావతారం|
నారసింహావతారం త్రిపురభైరవి|
ధూమావతి వామనావతారం|
ఛిన్నమస్త పరశురామావతారం|
కమల మత్స్యావతారం|
కూర్మం బగళాముఖి|
మాతఙ్గి బుద్ధావతారం|
షోడశి ఆఖరుది కల్కి అవతారం|
అంటే ఉపాసనా భేదాల చేత ఒకేతత్వం భిన్నభిన్నంగా కనబడుతున్నది|

శ్రీ.మహావిష్ణు దశ అవతార తిథులు కూడా ఉపాసనలు చేయవచ్చు

ఇంత వైవిధ్యంగా ఉన్న విద్యలు కాబట్టి సాధారణ వ్యక్తులకు సాధన అంత సులువు కాదు|
సంపూర్ణ దీక్ష గా ఉన్న వ్యక్తులు యోగులు వీటిని అనుసరిస్తారు|
*శక్తిని ఎంత అనుసరిస్తే అంతే శక్తి ప్రాప్తమౌతుంది*

*శ్రీ మాత్రే నమః* 
సేకరణ *మహాదేవ మహాదేవ రాళ్ళబండి శర్మ*

Friday, September 26, 2025

అమ్మవారి రూపాలలో ముఖ్యమైన నవదుర్గలు నవదుర్గల ఆవిర్భావం రూప వర్ణన మహిమా ఫలాలు

అమ్మవారి రూపాలలో ముఖ్యమైన నవదుర్గలు
నవదుర్గల ఆవిర్భావం రూప వర్ణన 
మహిమా ఫలాలు


భారతీయులు తమ కులదేవతగా నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలలో ఈ తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రూపాల పేర్లను సాక్షాత్తూ బ్రహ్మ దేవుడే చెప్పాడని దేవీకవచంలో ఉంది.

*నవదుర్గలు అంటే శ్రీ దుర్గాదేవి తొమ్మిది రూపాలు*
*శక్తి సర్వస్య దేవత* 
దేవతలకు సైతం శక్తిని ఇచ్చే దేవత కాబట్టి అది శక్తి అంటారు  యావత్ ప్రపంచం లో అమ్మవారికి మించిన శక్తి ఎక్కడ ఉండదు , శ్రీ దేవియే అత్యున్నత శక్తి అనే నిర్ధారణ ఋగ్వేద దేవీ సూక్తం ఇతర వేదాలలో మరియు పురాణాలలో చెప్పబడింది.

మహిషాసుర సంహార వృత్తాంత  సమయం లో మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి జగన్మాత దుర్గాదేవిగా అవతరించింది. 

 ఈ తొమ్మిది రూపాలు  దేవాసుర యుద్ధం లో అమ్మవారికి సహాయంగా నవదుర్గలుగా  అవతరించాయి, అమ్మవారి ముఖ్య ఘట్టాలు అన్ని తపస్సుకు, శక్తికి ప్రతీక.

శరన్నవరాత్రులలో  తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా ఆవిర్భవించాయి , మహిషాసురుడితో యుద్ధం చేసి, విజయదశమి రోజున అతన్ని సంహరించిందని దేవీ భాగవతం ,
మార్కండేయ పురాణం ,సప్తశతీ లో వివరణ చూడవచ్చు.

 *దుష్టశిక్షణ, లోక సంరక్షణ* కోసం శక్తి స్వరూపిణి ఎత్తిన అవతారాలే *నవదుర్గలు*

*ఆ రూపాలు ఈ విధంగా ఉంటాయి*
*ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ|
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం|
పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ| సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌| నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః*||

1 శైలపుత్రి ,2 బ్రహ్మచారిణీ ,3చంద్రఘంట
4 కూష్మాండ , 5 స్కందమాత,6 కాత్యాయనీ
7 కాళరాత్రి , 8 మహాగౌరీ , 9.సిద్ధిధాత్రి

*ఈ నవదుర్గా అమ్మవార్ల రూప వర్ణన +మహిమ*

1. *శైలపుత్రి*
సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించి, ఆ తర్వాత పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా (పుత్రిగా) జన్మించింది కాబట్టి  *శైలపుత్రి* అని పేరు వచ్చింది.

స్వరూపం: వృషభం (ఎద్దు) వాహనం, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం (పద్మం) ఉంటాయి. తలపై చంద్రవంక ఉంటుంది.

మహిమ: వాంఛితాలను (కోరికలను) ప్రసాదించే తల్లి.

2. *బ్రహ్మచారిణి*
'బ్రహ్మచారిణి' అంటే తపస్సు చేసే తల్లి, బ్రహ్మమునందు చరించేది. శివుడిని భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసి ఉమ అని కూడా ప్రసిద్ధి చెందింది.

*స్వరూపం* : కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి ఉంటుంది. స్వరూపం ప్రకాశవంతంగా, శుభకరంగా ఉంటుంది.

*మహిమ* : ఈ దేవి ఆశీస్సుల వలన భక్తులకు నిశ్చలమైన దీక్ష, అన్నింటా విజయం లభిస్తాయి.

3. *చంద్రఘంట*
ఈ తల్లి శిరస్సుపై ఉన్న అర్ధచంద్రుడు గంట ఆకారంలో ఉండటం వలన 'చంద్రఘంట' అని పేరు వచ్చింది.

*స్వరూపం* : బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుంది. సింహం వాహనం. పది చేతులలో ఖడ్గాలు, బాణాలు వంటి ఆయుధాలు ఉంటాయి. ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండే ముద్రలో ఉంటుంది.

*మహిమ* : ఈమె ఘంటా శబ్దం విని రాక్షసులు భయపడతారు. భక్తులకు మాత్రం శాంతంగా కనిపిస్తుంది. ఈమె ఆరాధన తక్షణమే ఫలాలను ఇస్తుంది. భక్తుల కష్టాలను వేగంగా నివారిస్తుంది. భక్తులు సింహం వలె పరాక్రమశాలురుగా, నిర్భయులుగా ఉంటారు.

4. *కూష్మాండ*
ఈ దేవి నవ్వుతూ (అవలీలగా) బ్రహ్మాండమును సృష్టించింది కాబట్టి 'కూష్మాండ'గా పిలవబడుతుంది.

*స్వరూపం* : సూర్యమండలంలో ఉంటుంది. తన తేజస్సుతోనే దశ దిశలు ప్రకాశిస్తాయి. ఈమె అష్టభుజా దేవి అని కూడా అంటారు. సింహం వాహనం. ఎనిమిది చేతులలో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద, మరియు సర్వసిద్ధులను ప్రసాదించే జపమాల ఉంటాయి.

*మహిమ* : ఈ దేవి భక్తుల రోగాలను, శోకాలను తొలగిస్తుంది. ఆయుష్షు, కీర్తి, బలం, ఆరోగ్యం, భాగ్యం పెరుగుతాయి.

5. *స్కందమాత*
 స్కందుడి తల్లి కాబట్టి ఈమెను 'స్కందమాత' అంటారు. నవరాత్రులలో 5వ రోజు పూజిస్తారు.

*స్వరూపం* : నాలుగు భుజాలు ఉంటాయి. ఒక కుడిచేతితో బాల స్కందుని ఒడిలో పట్టుకొని, మరొక చేతిలో పద్మం ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో కమలం ధరించి ఉంటుంది. సింహం వాహనం, పద్మాసనంలో కూర్చుంటుంది.

*మహిమ* : భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ లోకంలోనే శాంతి, సుఖాలు అనుభవిస్తారు. తను సూర్యమండలానికి అధిష్ఠాత్రి కాబట్టి, ఉపాసకులకు దివ్య తేజస్సు లభిస్తుంది.

6. *కాత్యాయనీ*
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది.

*స్వరూపం* : బంగారు వర్ణంలో ఉంటుంది. సింహం వాహనం. నాలుగు భుజాలు ఉంటాయి. కుడిచేతులలో అభయ ముద్ర, వరముద్ర; ఎడమచేతులలో ఖడ్గం, పద్మం శోభిస్తుంటాయి.

*మహిమ* : ఈమెను ఆరాధించి గోపికలు శ్రీ కృష్ణుడిని పొందారు. ఈమెను సేవించినవారికి ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాల ఫలం లభిస్తుంది. రోగాలు, భయాలు, పాపాలు నశిస్తాయి.

7. *కాళరాత్రి*
అమ్మవారు శరీర వర్ణం గాఢాంధకారం వలె నల్లనిది.

*స్వరూపం* : గాడిద (గార్దభము) వాహనం. కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి. మెడలోని హారం విద్యుత్ కాంతులు వెదజల్లుతుంది. మూడు కన్నులు ఉంటాయి. నాశిక నుండి అగ్ని జ్వాలలు వస్తుంటాయి. ఒక కుడిచేతితో వరముద్ర, మరొక చేతితో అభయ ముద్రను చూపిస్తుంది. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధం, మరొక చేతిలో ఖడ్గం ధరించి ఉంటుంది.

*మహిమ* : స్వరూపం భయానకంగా ఉన్నా, తను ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదిస్తుంది కాబట్టి ఈమెను "శుభంకరి" అని కూడా అంటారు. స్మరించినంత మాత్రాన దానవులు, భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి. అగ్ని, జలము, జంతువుల భయాలు, శత్రు భయాలు తొలగిపోతాయి.

8. *మహాగౌరి*
 ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో ఉంటుంది.  మేని రంగు మల్లెపూవు, శంఖము, చంద్రుని వలె తెల్లగా (గౌరవర్ణంగా) ఉంటుంది. అందుకే 'మహాగౌరి' అని అంటారు.

*స్వరూపం* : వృషభం (ఎద్దు) వాహనం. నాలుగు భుజాలు ఉంటాయి. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం; ఎడమచేతులలో ఢమరుకం, వరముద్ర ఉంటాయి. దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.

*మహిమ* : శివుడిని భర్తగా పొందడానికి తపస్సు చేసినప్పుడు శరీరం నలుపెక్కింది. శివుడు గంగాజలంతో అభిషేకించగా శ్వేత వర్ణశోభితయైంది. తన శక్తి అమోఘమైనది. ఈమెను ఉపాసించిన భక్తుల పాపాలన్నీ నశిస్తాయి. భవిష్యత్తులో కూడా దుఃఖాలు వారిని దరిచేరవు. కష్టాలు మాయమై, అసంభవమైన పనులు కూడా సులువుగా పూర్తవుతాయి.

9. *సిద్ధిధాత్రి*
అన్ని రకాల సిద్ధులను (శక్తులను) ప్రసాదించే తల్లి కాబట్టి 'సిద్ధిదాత్రి' అంటారు. శివుడు కూడా ఈ దేవి దయవలనే అన్ని సిద్ధులను పొందారని దేవీపురాణం చెబుతోంది.

*స్వరూపం* : సింహం వాహనం, పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. నాలుగు భుజాలు ఉంటాయి. కుడివైపున చక్రం, గద; ఎడమవైపున శంఖం, కమలం ధరించి ఉంటుంది. శివుడి శరీరంలో అర్ధభాగమై నిలిచింది.

*మహిమ* : నిష్ఠతో ఆరాధించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారమార్థిక కోరికలన్నీ నెరవేరుతాయి. భక్తులకు ఇంక ఏ కోరికలు మిగిలి ఉండవు. అమ్మవారి ధ్యానం, పూజల ప్రభావం వలన ఈ సంసారం నిస్సారమైనదిగా బోధపడి, పరమానందాన్ని ఇచ్చే మోక్షపదం ప్రాప్తిస్తుంది.

ఈ నామాల స్మరణ అర్చన విశేషం  ఏ అమ్మవారి యాగం లో అయినా ఈ దేవత పూజలు తప్పక చేస్తారు ,  ఒక్కో రోజు విడివిడిగా పూజలు చేయవచ్చు ,కానీ  పూజ ఆవాహన  మాత్రం 9 దుర్గాలను ఒకేసారి ఆవాహన చేసి పూజించాలని నియమం ఉన్నది. 
 *జయ దుర్గే హర దుర్గే*
 *రాళ్ళబండి శర్మ * 🙏🙏🙏🙏🙏

Wednesday, September 24, 2025

మంత్రజపంఎన్ని విధాలు, ?? మంత్రజపంవల్ల లాభమేమిటి?

మంత్రజపంఎన్ని విధాలు, ?? మంత్రజపంవల్ల లాభమేమిటి?

 
మంత్ర జపం యోగజపం కృత్వ పాప నివారణమ్,
పరం మోక్ష మవాప్నోతి మానుషో నాత్ర సంశయః!

#మానవుడు జ్ఞానమునకు నిధి, మంత్ర జపము వలన పాప నివారణ జరుగును.అటువంటి మంత్ర సాధన మానవ జన్మ వలనే సాధ్యమగును. దాని వలనే తత్వ జ్ఞానము సిధ్దించును.

మంత్ర జపం అంటే ఒక మంత్రాన్ని లేదా దైవనామాన్ని పదే పదే ఉచ్చరించడం. ఇది ధ్యానం, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం. 

సాధారణంగా మంత్రాలు భక్తితో, ఒక నిర్దిష్ట సంఖ్యలో జపించ బడతాయి. మంత్ర జపం యొక్క ముఖ్య అంశాము అనేది ఒక పవిత్రమైన శబ్దం, పదం లేదా పదబంధం . ఇది ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు.

జపం అంటే మంత్రాన్ని పదే పదే ఉచ్చరించడం లేదా మనస్సులో పఠించడం.మంత్ర జపం సాధారణంగా ఒక నిర్దిష్ట సంఖ్యలో చేయబడుతుంది, ఉదాహరణకు 108 సార్లు.

మంత్ర జపం భక్తితో, ఏకాగ్రతతో చేయాలి. అలా చేసే మంత్ర జపం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు రోగనిరోధక శక్తి పెరుగుతాయని నమ్ముతారు. 
మంత్ర జపం యొక్క రకాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బిగ్గరగా జపించడం: 
మంత్రాన్ని స్పష్టంగా, బిగ్గరగా పఠించడం.

నిశ్శబ్దంగా జపించడం:
 మంత్రాన్ని మనస్సులోనే పఠించడం.

లిఖిత జపం: 
మంత్రాన్ని పదే పదే రాయడం.

ఆడియో మంత్రాలు: 
మంత్రాలను వింటూ జపం చేయడం. 

మంత్ర జపం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఎంటో తెలుసా జపం చేసేటప్పుడు ఇతర ఆలోచనలను నివారించి, ఏకాగ్రతతో ఉండాలి.

నియమబద్ధత:
రోజువారీ మంత్ర జపం అలవాటు చేసుకోవడం మంచిది. ప్రశాంతమైన ప్రదేశంలో జపం చేయడం ఉత్తమం.

ఇతర జీవులలో జ్ఞాన గుణము లేదు. కేవలం పుణ్యము చేయుట వలనే మనుష్య జన్మ లభించుచున్నది. 

అటువంటి మనుష్యుడు సాధన చేతనే దేవతా సమానమగుచున్నాడు. దేహము లేనిదే పురుషార్ధము సిధ్ధించదు. కనుక ఈ శరీరమును రక్షించుకొనుచూ జ్ఞాన ప్రాప్తికి సాధన చేయవలెను...

మననం చేయడం వలన కాపాడేది మంత్రం మనస్సుకు చాంచల్య స్వభావం (ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది)

ఈ చంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్నీ ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది.

మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు దూరమౌతాయి. మంత్ర సాధన వల్ల దేవతలు తమకు తామై దిగివస్తారు. నానావిధ సిద్ధులు సిద్ధిస్తాయి. మంత్రజప సాధన వలన సిద్ధులు కలుగుతాయని యోగా దర్శనం చెబుతుంది

ఎందరో మునులు, ఋషులు ఈమంత్రజపం వలనే సిద్ధులు సాధించారు.

సాధన వలన అధర్మపరుడిని ధర్మపరుడిగా, దానవుణ్ణి మానవునిగా, పాషండుని సదాచార పరాయనునిగా, దుఃఖ వంతుడిని, సుఖవంతుడిగా, కోపిని శాంతునిగా, ధరిద్రుడిని ధనవంతుడిగా, లోభిని త్యాగిగా, కాముని, జితేంద్రియునిగా, నాస్తికుడిని ఆస్తికుడిగా, తెజోవిహీనుడిని తేజోవంతునిగా, రోగిని ఆరోగ్యవంతునిగా, చేస్తుంది.

అంధకారం నుండి ప్రకాశం వైపు మృత్యువు నుండి అమృతం వైపు, నరకం నుండి స్వర్గం వైపు, హింస నుండి అహింస వైపు, దిర్భుద్ధి నుండి సద్బుద్ధి వైపు,తీసుకొనిపోతుంది. మంత్రమే దేవతా రూపాన్ని పొంది అత్మసక్షాత్కారాన్ని కలిగిస్తుంది.

జపం అనేది మూడు విధాలు

1.బాహ్య జపం 
2.ఉపాంశు జపం 3.మానసికజపం

1.బాహ్య జపం

ఒక జపమాల తీసుకుని దానిని ఒక నామాన్నో లేక మంత్రాన్నో ఉచ్ఛరిస్తూ కనుక విధిగా అభ్యాసం చేసినట్లైతే అది బాహ్య జపం !!

2.ఉపాంశు జపం

ఈ దశలో జపం జరిగే సమయంలో మాల తిరుగుతుంది, పెదవులు కదులుతుంటాయి కాని శబ్దం బయటకు వినపడకుండా సాగుతుంది !!

3.అంతరంగ జపం

ఇక్కడ ఈ స్థితిలో జపం నిరంతరాయమానముగా కొనసాగుతూనే ఉంటుంది ...

జపమాల తిరుగుతూనే ఉంటుంది కాని పెదవులు నాలుక కదలవు కేవలం మనసులో మాత్రమే నామస్మరణ (మంత్ర జపం) సాగుతూ ఉంటుంది


జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది.

ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు 'అజపజపం' అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.

మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది.

ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం.

అది నిర్విరామంగా సాగినా, జపమాల సాయంతో సాగినా.... మన జీవితాన్ని దైవ చైతన్యంతో అనుసంధానం కావడానికి, తనను తాను తరింప చేసుకోవడానికి ఒక నామాన్ని తలచుకోమని చెప్పడమే జప/మంత్ర సాధనలోని పరమార్థం.

🕉️ ఓం నమశ్శివాయ ||

|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||

🔱 జై మహాకాల్ ||

🔱 జై మహాకాళి ||

🔯 ఓం శ్రీ మాత్రే నమః ||🙏🙏🙏

సప్తమాతృకలు

దేవీ శక్తులలో ముఖ్యమైన  సప్తమాతృకలు
*రూప వర్ణన* *దేవత వాహనాలు పూజా ఫలం


సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని 
స్పష్టంచేసే పురాణాల్లో వ్యక్తం చేయబడ్డాయి.

పరాశక్తి ‘సప్తమాతృకలు’గా అవతరించింది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.

1  *బ్రాహ్మీ* ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షరమాల, కమండలం ధరించిన శక్తి.

2.*మహేశ్వరి* శివుని శక్తి శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.

3.*కౌమారి*కుమారస్వామి శక్తి 
శక్తి (బల్లెం) హస్త, మయూర వాహనారూఢ.

4.*వైష్ణవి*విష్ణుశక్తి శ్రీమాహావిష్ణువువలె గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులలో శంఖచక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.

5.*వారాహి*హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.

6.*చాముండి*శక్తి దేవి, త్రిశూలం, ఖడ్గాన్ని ఆయుధంగా కలిగి, గుడ్లగూబ లేదా శవాన్ని అధిరోహించిన యోగిని, మాత.

7.*ఐంద్రీ*ఇంద్రశక్తి  ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.

 *సప్తమాతృకల ఆవిర్భావo* 
బ్రాహ్మీ ,మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.
ఈ  దేవతలను *సప్త మాతృకలు* అంటారు. 
దేవీ భాగవత, బ్రహ్మవైవర్త, విష్ణుధర్మోత్తర మరియు స్కంద పురాణాల లో  సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను తెలియచేస్తాయి.

పూర్వం జగన్మాత రాక్షసులతో పోరాడుతున్న సమయంలో రాక్షసుల మాయవల్ల తిరిగి అవిర్భవిస్తూ వస్తున్న రాక్షసుల సంహారం కోసం దేవతలు వారి లోని అమ్మవారి శక్తి రూపాలను అమ్మవారికి సహాయంగా యుద్ధానికి పంపుతారు. 

*ఏ శక్తి రూపం ఏ దేవత నుండి అవిర్భవించింది*

*బ్రహ్మ పంపిన బ్రాహ్మీ హంస వాహనంపై,

*విష్ణుమూర్తి పంపిన వైష్ణవి గరుడ వాహనంపై, 

*కుమార స్వామి పంపిన కౌమారీ నెమలి వాహనంపై,

*వరాహమూర్తి పంపిన వారాహి మహిష వాహనంపై,     

*ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ఐరావతంపై,

*యముడు పంపిన చాముండి శవ వాహనంపై యుద్ధభూమికి చేరుకున్నాయి.

*సప్తమాతృకల వాహనాలు*
శ్రీ బ్రాహ్మీ  వాహనంగా *హంస* 
శ్రీ మహేశ్వరి వాహనంగా *వృషభం*
శ్రీ కౌమారి వాహనంగా *నెమలి*
శ్రీ వైష్ణవి వాహనంగా *గరుడ పక్షి*
శ్రీ వారాహి వాహనంగా *మహిషం*
శ్రీ ఇంద్రాణి వాహనంగా ఏనుగు*
శ్రీ చాముండి వాహనంగా 'శవం' కనిపిస్తాయి.

ఇలా *సర్వంశక్తిమయం* అయిన మాతృక దేవతలు  దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడిన జగన్మాత స్వరూపాలే  ఈ సప్త మాతృకలు! 

*పూజ ఫలం* ఈ నామాలు జపించిన +పూజించిన వారికి  మనలోని మనకు తెలియకుండా ఉన్న దుర్గుణాలు, లోభం, అసూయ వంటి గుణాల నుండి మనల్ని రక్షించమని ఆ తల్లిని ప్రార్ధించాలి, చెడు నుండి మనల్ని కాపాడమని కోరుకోవాలి, నాలోని బలం ఆ తల్లి! అనే భావన బలపడాలి ఆ భావనే భక్తి. 

ఆ భక్తే ముక్తి అవుతుంది అదే మానవ జీవిత సార్థకత ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం 
 ఆ వరాన్నే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.

ఈ దేవతల అనుగ్రహం ఉంటే అరిష్టాలు అన్ని తొలగిపోతాయి.
సేకరణ *శ్రీ మాత్రే నమః రాళ్ళబండి శర్మ*

Tuesday, September 23, 2025

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
●మహాప్రస్థానం - శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది - బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి
●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం - పింగళి సూరన
●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం - గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర - భట్టుమూర్తి
●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు - కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన
●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి
●సౌందర నందము - పింగళి, కాటూరి
●విజయవిలాసం - చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి
●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత - దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
●పానశాల - దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
● మహోదయం - కెవి రమణారెడ్డి
●నారాయణరావు - అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం
●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం - నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు
●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము - ముద్దు పళని
● స్వప్న లిపి – అజంతా
●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
●అను క్షణికం - వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
●గద్దర్ పాటలు – గద్దర్
●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి
●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం - నన్నే చోడుడు
●మైనా - శీలా వీర్రాజు
●మాభూమి - సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి
●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి - మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్
●నీతి చంద్రిక - చిన్నయ సూరి
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు
●నీలిమేఘాలు – ఓల్గా
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
●కొయ్య గుర్రం – నగ్నముని
●నగరంలో వాన – కుందుర్తి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి

RECENT POST

తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం

  తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం                  *1.  సూర్యుని ఏఏ సమయాల్లో చూడర...

POPULAR POSTS