#రామాయణకాలనిర్ణయం!!
#రామసేతువుఎప్పటిది??
#కోటిఎనబైఒకలక్షలఎనబైఐదువేలుక్రితంఅట
ఆశ్చర్యపోతున్నారా!! ఔను నిజం!!
మన భారతీయ కాలగణన ప్రకారము మనము ఇప్పుడు శ్వేతవరాహకల్పములో #వైవస్వత
మన్వంతరములో 27 మహాయుగాలు గడచి
#28వమహాయుగం కృత, త్రేత, ద్వాపర
యుగములు గడిచిన తరువాతకలియుగంలో
వున్నాము!!
ఇపుడు కలి 5119 సం!!రాలు జరిగుతున్నవి!!
#మహాభారతయుద్ధము #కాలనిర్ణయం
ఇప్పుడు నడుస్తున్న కలియుగానికి 36 సం!!
పూర్వము #మహాభారతయుద్ఘం జరిగింది!!
యుద్ధం తరువాత యుధిష్ఠురుడు పట్టాభి
షేకం చేసుకుని 36 సం!!రాలు పరిపాలన
చేశాడు!! శ్రీకృష్ణభగవానుడు అవతారం
చాలించిన రోజునే కలియుగం ప్రారంభమైంది
పంచ పాండవులు ద్రౌపదీ సహితంగా
మహాప్రస్థానానికి బయలు దేరారు!!
అంటే
#మహాభారతకాలము ఇప్పుడు నడుస్తున్న
28 వ మహాయుగంలోని "ద్వాపరం"లోనిది
అన్నమాట!!
మనము సాధారణంగా మహాభారతము కంటె
ముందు రామాయణం జరిగింది కావున ఈ
28వ మహాయుగంలోని త్రేతాయుగంలోనే జరిగినది అని అనుకుంటాం!!
8 లక్షల సం!! క్రితం అని కొందరు 17లక్షల సం! క్రితం అని కొందరు వాదిస్తుంటారు!!
మొన్న అమెరికా సైన్స్ చానల్ వారు రామసేతు నిజమైనదని అది మానవనిర్మిత
మైనదని ప్రసారము చేశారు!!కానీ కాలాన్ని
చాలా తక్కువ చేసి చూయించారు!! వారు 7000 సం!!రాల పూర్వము అయి వుండవచ్చని అభిప్రాయం వ్యక్త పరిచారు!!
మహాభారతగ్రంథము మరియు మన ప్రాచీన ధర్మ గ్రంథాల ప్రకారం #రామాయణం 24వ మహాయుగంలోని త్రేతాయుగలోజరిగినది!!
#భీమాంజనేయులసమాగమం!!
పంచపాండవులు అరణ్యవాసము చేస్తున్న
సమయంలో ద్రౌపది కోరికపై భీముడు
#సౌగంధికపుష్పం తేవటానికి గంధమాదన
పర్వతము పై అన్వేషిస్తున్న సమయంలో
అక్కడ కదలళీవనంలో నున్న ఆంజనేయుడు తనతమ్ముడైన భీమసేనుని పరీక్షించదలచి "ముసలికోతి" రూపంలో దారికి అడ్డంగా నుండగ భీముడు అహంకారముతో దారి నుండి పక్కకు తప్పుకోల అంటే తను అనారోగ్యంతో వున్నానని నీవే తోకను పక్కకు తొలగించుకోమని తెలుప
ఆ ముసలి కోతి తోకను తొలగించలేక
భీమునికి గర్వభంగమైనది!! తన తప్పు
తెలుసుకుని ఆయన తన అన్న అయిన
వాయునందనుడు ఆంజనేయుడని తెలిసి సంపూర్ణ శరణాగతి వేడుకుంటాడు !!
హనుమంతుడు కరుణిస్తాడు!!జైహనూమాన్!!
"భీమాంజనేయ-సంవాదం" "మహాభారత" "వనపర్వంలో ఆంజనేయస్వామి స్వయంగా యుగధర్మ, యుగలక్షణాల గురించి భీమునికి
తెలియజేస్తూ రామాయణకాలం గిరించి
ప్రస్తావన చేశాడు!! భీముని కోరికపై సముద్ర
ఉల్లంఘన సమయంలోని విశ్వరూపాన్ని
చూయించాడు!!
రామాయణ కాలానికి ఆంజనేయస్వామికి
మించిన సాక్షముంటుందా చెప్పండి!!
ఆధారం!! వ్యాసమహాభారతం!!
#రామాయణంకాలము
ఈ లెక్కప్రకారం 1కోటి 81లక్షల 85 వేల సం!!
రాల క్రితం "#రామాయణం జరిగింది!!
#రామసేతువు ను వానరులుఅప్పుడే
నిర్మించారు!! ఇదీ రామకథ!!జై శ్రీరామ్!!
(కృత,త్రేత,ద్వాపర,కలి సం!!రాలప్రమాణం
మరియు మహాయుగముల యొక్క ప్రమాణంలను కలిపి లెక్క వేసి చూడండి)
No comments:
Post a Comment