పుష్యమాసంలోని పున్నమి తిది నాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది.
ఈ మాసం లో పంటలు పండి.. ధాన్యం ఇండ్లకు చేరడము వల్ల రైతుల శ్రమ, కష్టం ఫలించి ఫలం లభించే మాసం. చాంద్రమాసం ప్రకారం ఈ మాసంను శూన్య మాసం అంటారు. ఈ మాసములో పగలు తక్కువ. రాత్రి అధికము.
పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కనుక ఈ నెలలో శనిదేవుడి ప్రభావము అధికంగా వుంటుంది. శనిదేవుడికి ప్రతీకమైన మాసము కనుక ఈ నెలఅంతా శనిదేవుడిని పూజించవలెను.
ఈ మాసములోని ఆదివారాల్లో ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యభగవానుడిని పూజించాలని శాస్త్ర వచనము . ముఖ్యంగా ఆదివారంనాడు సూర్యుడిని ఆవుపాలతో అభిషేకించి, జిల్లేడు పూలతొ పూజించవలెను. ఈ నెలలో వచ్చే సప్తమిని మార్తాండ సప్తమి అంటారు. ఆ రోజు సూర్యుడిని పూజ చేయడము వల్ల మంచి ఫలితము వస్తుంది.
సంవత్సరంలోని పదవ మాసం పుష్యము. సూర్యుడు ' భగ ' అను పేరుతొ రథముపై సంచరించి ప్రపంచమునకు వెలుగునిస్తాడు. ఆ రథములో అరిష్టనేమి అను గంధర్వువుడు, పుర్వచిట్ట అను అప్సరస, ఊర్నుడు అను యక్షుడు, కర్కోటకుడు అను పాము, ఆయువు అను ఋషి, స్ఫూర్ణ అను రాక్షసుడు ప్రయాణిస్తారు.
తిథి, వార, మాస, సంవత్సర, ఆయనములు, ఘటికలు మొదలగు కాలముయొక్క భాగములు భగాదిత్యుడి అధిపతి పదకొండు వేల కిరణముల ప్రకాశాములతో ఉండును. ఎర్రని రంగు కిరణములో ఉంటుంది. ప్రకృతి అంతటా ఐశ్వర్య రూపముతో పుస్యమాసమంతా తిరుగుతాడు.
సూర్యుడు, శివుడు, చంద్రుడు, సౌభాగ్యము, ప్రసన్నత, కీర్తి, అందము, ప్రేమ , మంచిగుణములు, ధర్మములు, ప్రయత్నములు, మోక్షము, శక్తి అన్నీ భాగాదిత్యుని రూపాలే. ప్రకృతియందు దివ్యశోభ నింపుతాడు.
పుష్యమాసంలో సూర్యున్ని ఉపాసించే వారికి సంపదలు, మోక్షము ఇస్తాడు. అసలుభాగము అంటేనే ఐశ్వర్యము, ధర్మమూ, జ్ఞానము, వైరాగ్యము. ఈ ఆరు లక్షణాలను భగము అంటారు. పుష్యమాసమున భగాదిత్య స్వామికి బియ్యము, నువ్వులు కలిపి పొంగలి చేసి నివేదించాలి. నారించ రసముతో అర్గ్యము ఇవ్వాలి. ఆరోగ్యము, ఆనందము ఇస్తాడు.
పుష్య అమావాస్య నాడు ఇంటిలోని ఒక చోట శుబ్రపరచి బియ్యపిండితో అష్టదళ పద్మములు వేసి దానిపైన కుంపటి పెట్టి దాంట్లో ఆవు పిడకలు వేసి వెలిగించి దానిమీద కాంస్య పాత్రలో పాయసము చేసి ఉంచవలెను. ప్రక్కనే శివలింగం వుంచవలెను. కంచుపాత్ర యందు బ్రహ్మ దీవుడిని, పాయసము నందు శ్రీ మహా విష్ణువును , శివలింగం నందు శివుడిని ఆవాహన చేసి పూజించవలెను.
బ్రాహ్మణుడికి దక్షిణ తాబూలాలు ఇవ్వవలెను. తరువాత శివలింగాన్ని, ఆ పాత్రను బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను. ఈ విధంగా చేయడము వల్ల భూదాన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలితము లభిస్తాయి.
ఈ విధంగా ఎన్నో విశిష్టతలను కలిగిన ఈ పుష్యమాసములో చేసే పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆయురారోగ్యాలు చేకూరుతాయని మన గ్రంధాలలో చెపుతారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసంలో మన అందరమూ కూడ ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాలని పొందుదాము.
పుష్య మాసం ప్రారంభం.
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.
ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటితో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.
No comments:
Post a Comment