పంచాయుధ స్తోత్రం
దేవతలు ధరించిన ఆయుధాలు జడశక్తులు కావు. అవి ఆ దేవత యొక్క లీలా విభుతులు . ఆయుధాలకు కూడా ప్రత్యేక అధిష్ఠాన దేవతలు,మంత్రాలు ఉన్నాయి. ఆయా మంత్రాలను అనుష్టించిన వారిలో ఆ ఆయుధశక్తులు ప్రతిష్టితమైన అమోఘ కార్యాలను సాధిస్తాయి.
శ్రీమన్నారాయణుడు ధరించిన ఆయుధాలలో ఒక్కొక్క ఆయుధ దేవతకు ప్రత్యేక మహిమలు ఉన్నాయి.
పంచాయుధ స్తోత్రం
చక్రం – సుదర్శనం
స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్
సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే
శంఖం – పాంచజన్యం
విష్ణో ర్ముఖోత్థా నిల పూరితస్య
యస్యధ్వని ర్దానవ దర్పహంతా
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే
గద – కౌమోదకి
హిరణ్మయీం మేరుసమానసారాం
కౌమోదకీం దైత్యకులైక హంత్రీమ్
వైకుంఠ వామాగ్ర కరాగ్రమృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే
ధనస్సు – శార్ఙ్ఞం
య జ్జ్యానినాద శ్రవణా త్సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః
భవంతి దైత్యాశని బాణవర్షైః
శార్ఙ్ఘం సదాహం శరణం ప్రపద్యే
ఖడ్గం – నందకం
రక్షో సురాణాం కఠినోగ్రకంఠ
ఛ్ఛేక్షరత్ క్షోణిత దిగ్ధ స్సరం
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే
ఇమం హరేః పంచ మహాయుధానాం
స్తవం పఠేద్యోనుదినం ప్రభాతే
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి
వనేరణే శత్రుజలాగ్నిమధ్యే
యదృచ్ఛయాయాపత్సు మహాభయేషు
పఠేత్త్విదం స్తోత్రమనాకులాత్మా
సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః
సశంఖ చక్రం సగదాసి శార్ఙ్గం
పీతాంబరం కౌస్తుభవత్స చిహ్నమ్
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే
జలే రక్షతు వారాహః స్ధలే రక్షతు వామనః
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః
సుదర్శన దేవతా మంత్రాలు,సుదర్శన హోమాలు మనకు పరిచితమే. చక్రదేవత ,శంఖ దేవత భరత శత్రుఘ్నులుగా అవతరించారు కూడా. ఇలా ఆయుధాలు కూడా చైతన్య స్వరూపాలు. దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసే భగవద్కారుణ్యం ఈ ఆయుధాల ద్వారా వ్యక్తమవుతుంది. ఈ ఆయుధాలు మనల్ని కాపాడాలని ప్రార్థించితే చాలు – ఆ దేవతల ప్రసాదంతో మనకు సర్వరక్ష లభిస్తుంది.
పంచభూతాలలోను,ప్రవాసాలలోను,భయాలలోను, విదేశాలలోను కూడా మనకు అన్ని విధాల రక్ష లభించే విధంగా ఈ “పంచాయుధ స్తోత్రం” ఋషిప్రోక్తం అయ్యింది.
ఈ స్తోత్రం గొప్ప కవచం లాంటిది.
ఇందులో విష్ణు రక్ష లభించే దివ్యమంత్ర శక్తుల్ని అక్షరాలలో నిబద్ధం చేశారు.ఎటువంటి పరిస్థితులలోనైనా ఈ స్తోత్రాలను చదువుకోవచ్చు. నియముగా పారయణ చేస్తే మనకే కాక ,మనం ఎవర్ని ఉద్దేశించి చేస్తే వారికి రక్ష లభిస్తుంది.
No comments:
Post a Comment