Sunday, December 10, 2017

సూర్యుని జనన విశేషాలు



సూర్యుని జనన విశేషాలు

కశ్యపుడు, అదితిలకు జన్మించినవాడే సూర్యుడు. ఈయననే ఆదిత్యుడు అని కూడా అంటారు. దేవదూత అయిన అదితి కోరిక మేరకు సూర్యుడు ఆమె గర్భమున జన్మించాడు. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు.

సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథము నందు పండ్రెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు - నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి.

ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు.

1. చైత్రమాసంలో - ధాతా

2. వైశాఖమాసంలో - ఆర్యముడు

3. జ్యేష్ఠమాసంలో - మిత్రుడు

4. ఆషాడమాసంలో - వరుణుడు

5. శ్రావణమాసంలో - ఇంద్రుడు

6. భాద్రపదమాసంలో - వివస్వంతుడు

7. ఆశ్వీజమాసంలో - పూషా

8. కార్తీకమాసంలో - పర్జన్యుడు(విశ్వావసువు)

9. మార్గశీర్షంలో - అంశుమంతుడు

10. పుష్యమాసంలో - భగ

11. మఘమాసంలో - త్వష్టా

12. ఫాల్గుణమాసంలో - విష్ణు

అని సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు.

ఇందుకు సంబంధించిన చక్కని విశేషాలు పురాణాలలో ఉన్నాయి. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటారనడంతో పాటు సూర్యుని గురించి మరెన్నో విశేషాలను తెలుసుకోవచ్చు. సూర్యుని రథసారథి అనూరుడు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS