ధనుర్మాసం ప్రారంభం
16-12-2017 మంగళ వారం ధనుర్మాసం ప్రారంభమవుతున్నది.ఈ నెలరోజులు బాలికలు,మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ ముగ్గులు పెట్టి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో ఉంచి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో,పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు చివరరోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముం isదు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు .(ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం గా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు ) హరి దాసులు (మాల దాసరులు హరిమాల ధరించిన వారు వీరినే మాలలు అని ప్రస్తుతం పిలుస్తున్న హరిభక్తులు) వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు.చివరలో గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. వాటికి కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు.
ఈ మాసము శ్రీ మహా విష్ణు వుకు ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. " శ్రీ ఆండాళ్ పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి కటు పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు ) నివేదించి భక్తు లకు ప్రసాదములు పంచిపెట్తారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది (ప్రతి చలికాలంలో మన శరీరంలో రక్త మార్పిడి జరుగుతుంది.అందువలన ఆసమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది )
అనంత శయనమువందున్న విష్ణు చిత్తుడను భ్రాహ్మ ణుని ఏకైక పుత్రిక గోదాదీవి అత్యద్భుత సౌందర్యరాశి . ఆమె తోటలోని పూలను కోసి రకరకములుగ అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్ర తి బింబమును చూచుకొని మురిసి పోవుచూ .ఆమాలలను పదిలంగా తండ్రి కివ్వగా , ఆవిషయము తేలియని ఆమహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు .ఇదే విధంగా ప్ర తి రోజూ జరుగ సాగింది .అయితే గోదాదేవి స్వామి వారి రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్త గా ఊహించుకొనేది . చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రి కరణ శుద్ధిగా నిర్ణయించుకుంది . ఎప్పటివలెనే మాలలను ధరించి తనప్ర క్కనే తన మనోధుడువ్నట్లు గా భావించిమురిసి పోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా .ఒక పర్యాయము పూజార్లు ఆమాలలను అలంకరించు సమయమందు ఆమాలలొ దాగియున్నోపొడవాటి కేశము(వెంట్రుక ) ను కను గోన్నారు. అది స్త్రీ కేశమని తెలుసు కున్నారు. ఆమాలలను తెచ్చిన ఆమహాభక్తునినానాదుర్భాషలాడారు.అంత విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికివెళ్ళగా , ఆచ్చటమాలలదంకరించుకుని స్వామి వారి తోభాషించుచున్న పుత్రికను చూచి అమితమైన ఆగ్ర హము తో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా తన ప్ర ణయ వృత్తాంతమును విసిదపర్చింది .కాని , ఆబ్రాహ్మణుడు ఆమె మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగాఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్ర మూతప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ప్రి యమని తెలియ పరచి ఆందరి సమక్షమున శ్రీ రంగనాథస్వామి గోదాదేవినివివాహమాడాడు.అప్పటినుండిగోదాదేవి ఆండాళ్ గాపిలువబడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు " ఆముక్త మాల్యద "అను పేర ( విష్ణు చిత్తియం అనిగూడ అందురు ) గ్రంధరచన గావించెను .ఆముక్తమాల్యద అనగా 'తీసి వేసినదండ 'అని అర్థము.
కొసమెరుపు - ఈ మాసమందే వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి ) వచ్చును. ఆరోజు బ్రాహ్మీ ముహూర్త ముందు అందరూ ఉత్తర ద్వారదర్శనమున స్వామి వారిని దర్శించెదరు .
ఇది ప్రకృతి ఆరాధన
శుభం భూయాత్ !!Significance of Dhanurmasam ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ?
ధనుర్మాసము
ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము (నెల)
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు .
ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .
ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా . . . పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐన ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది . కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.
ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.
కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.
ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.
ధనుర్మాసం ఫలశ్రుతి:
ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయిన మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య స్థలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును.
No comments:
Post a Comment