Monday, December 4, 2017

మూఢమి

మూఢమి

ప్ర. మూఢమి అంటే ఏమిటి ?  మూఢాలు  ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు  ఏమిటి ?

జ . మూఢాలు అంటే  అశుభ దినాలు , అశుభ రోజులు .చీకటి  రోజులు , రోజులు చెడు దినాలు . శుభ కార్యాలు  చేసు కోవడానికి  వీలు కాని రోజులు . మంచి రోజులు కావు అని అర్థం . మూఢాలు అంటే ఖచ్చితంగా  విడవదగిన కాలం  అని అర్థం . 

మూఢాలు రెండు  రకాలు . అవి ఒకటి  గురు మూఢమి , రెండవది  శుక్ర మూఢమి.  మూఢాల ను  మౌఢ్యములు అని కూడా అంటారు .

సామాన్యులకు కూడా  అర్థమయ్యే  విధంగా  చెప్పాలంటే , గురువు  సూర్యునికి  దగ్గరగా వచ్చినప్పుడు  ఏర్పడే దానిని  గురు మూఢమని  . అలానే శుక్రుడు సూర్యునికి  దగ్గరగా  వచ్చి నప్పుడు  ఏర్పడే దానిని శుక్ర మూఢమని  అంటారు .

దీనినే సాంగత్వ  దోషమని  అంటారు . శుభ గ్రహాలు  అస్తాంగత్వంలో  ఉన్నపుడు  మూఢమి  వస్తుంది . సూర్యునికి  దగ్గరగా  గురు , శుక్రులు  వచ్చి నప్పుడు , గురు శుక్రుల  శక్తులు  తగ్గి పోతాయి . బలం తగ్గి పోతుంది . బలహీన మౌతాయి . నీరస పడుతాయి . సన్నగిల్లుతాయి . వేయి  వాట్స్  బల్బు ముందు , ఒక  చిన్న క్యాండిల్  పెడితే , ఆ క్యాండిల్ శక్తి  ఎంత మాములుగా  ఉంటుందో , అలానే సూర్యుడి  ముందు  గురు శుక్రుల శక్తి  అంత తక్కువగా , బల హీనంగా  ఉంటుంది . అందుకే శుభ కార్యాలు  ఆ రోజులలో  జరుప కూడదు అని అంటారు .

అందువలన , ఈ కాలంలో  శుభ కార్యాలు , "ముఖ్యంగా  వివాహాది శుభ కార్యాలు జరుప కూడదు, లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహాలకు  సంబంధించిన   మాటలు  మాట్లాడుకోరాదు.పుట్టు వెంట్రుకలు తీయకూడదు.

గృహ శంకుస్థాపనలు  చేయ రాదు . ఇండ్లు మారకూడదు." ఎందుకంటే ఇవన్నీ జీవితంలో ఒకే సారి చేయడం జరుగుతుంది . ఎవరయినా మంచి జరుగాలనే కోరు కుంటారు .  అందుకని  మూఢాలలో  శుభ కార్యక్రమాలు  చేయ కూడదు.

మనందరికీ  తెలుసు , ఏ  శుభ కార్యక్రమానికైనా  గురు శుక్రులు బాగుండాలని . దివ్యంగా ఉండాలని . శక్తి మంతంగా ఉండాలని . గురు శుక్రులు బాగుంటేనే  శుభాలు ఎలాంటి ఆటంకం లేకుండా  జరుగుతాయి . పెండ్లిల్లకు  గురు బలం బాగుండాలి .

అయితే , మూఢాలలో అన్న ప్రాసన చేసుకోవచ్చు.ప్రయాణాలు చేయవచ్చు రిపేర్లు చేసుకోవచ్చు .  తప్పవు అనుకున్న  పనులు చేసు కోవచ్చు .భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం , ఉద్యోగాలలో చేరడం , విదేశాలకు వెళ్ళడం అబ్బాయిలను అమ్మాయిలను చూడటం  , వ్యాపారాలు మొదలు పెట్టడం , వెహికిల్స్ కొనుక్కోవడం , బట్టలు కొనుక్కోవడం  మొదలైనవి  చేసు కోవచ్చు .

ప్రస్తుతం ఈ సంవత్సరం గురుమూఢమి 12-10-2017 నుండి 9-11-2017 శుక్ర మూఢమి 28-11-2017 నుండి 19-2-2018 వరకు ఉన్నది

మూఢాల కాలంలో శుభ కార్యాలు చేస్తే ఏమవుతుంది ?

మహర్షులు, జ్యోతిష్య పండితులు, అనుభవస్తులు శుభ కార్యాలు చేయ  కూడదని చెప్పారు ఏమవుతుందంటే
పెద్దలు చెప్పిన దాని ప్రకారం ,  ఏదయినా అశుభం వినవల్సి రావచ్చు.కష్టం కలుగవచ్చు , నష్టం  వాటిల్లవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో శుభకార్యాలు చేయరాదు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS