Thursday, December 7, 2017

కాశీ లో దత్త దేవుడు

కాశీ క్షేత్రం – దత్తాత్రేయుడు..!!💐శ్రీ💐

శ్రీ గురు దత్తాత్రేయుల వారు ప్రతీ రొజూ కాశీలో స్నానము మరియు జపము చేస్తారని విన్నాము (కాశీస్నానజప ప్రతిదివసీ).. కానీ దత్తాత్రేయుల వారు కాశీలో ఎక్కడ స్నానం చేస్తారో తెలుసా?!.. ఎక్కడ జపమాచరిస్తారో తెలుసా?!..💐

II విశ్వేశం మాధవం ధుణ్డిం దణ్డపాణించ భైరవం వన్దే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం II💐

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే.. దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా..నృసింహ సరస్వతి దిగంబరా.. దత్తబంధువులందరికీ జైగురుదత్త..💐

ప్రతీ హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం వారణాసి. కాశీ ఒక నిండైన దత్త క్షేత్రం. కాకపోతే చాలామంది భక్తులకు కాశీ క్షేత్రంలో గల దత్తక్షేత్ర స్థానాలు తెలియవు.

దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక కదా!, అదికూడా అమ్మవారితో కలిపి కూడా కదా!. సరిగా చూస్తే కాశీపురిలో మొత్తం అణువణువునా అలాగే కనిపిస్తుంది, దత్తాత్రేయుడే నిండి ఉన్నాడనే భావన కలుగుతుంది. శ్రీపాద శ్రీ వల్లభ దివ్య చరితామృతంలో, శ్రీ గురుచరిత్రలో అదేవిధంగాశ్రీపాద శ్రీ వల్లభ లీలామృతం  వంటి గ్రంథాలలో కాశీ గురించిన విశేషమైన వివరణ ఉంది. కాశీ గురించి ఎంత వ్రాసినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. 

ఈ సారి Varanasi కి వెళ్లినప్పుడు Sri Dattatreya Ashramam తప్పకదర్శించండి. River Ganga తో కూడిన, రెండు నదీ సంగమ స్థానాలు (Varuna – Assi) కలిగిన ఈ దివ్య క్షేత్రాన్ని దత్తభక్తులందరూ తప్పక దర్శిస్తారని ఆశిస్తూ…జైగురు దత్త...!!💐

-Keerthi Vallabha (keerthivallabha@gmail.com
Dattatreya Kshetra Sthala In Varanasi

1. Sri Dattatreya Mutt - Near NaradGhat - RajGhat
2. Sripada Sri Vallabha (Sri Charana Vishnu Paaduka) Paduka - Near ManikarnikaGhat
3. Sri Nrusimha Saraswthi Swamy Paduka Mandir / Deeksha Sthali (Dattatreya Paduka Mandir) - SchindiaGhat
4. Dattatreya AnnaPrasada Ashramam - Lakshmi Kund Road
5. Dattatreya Mandir At Bindumadhava Temple (Near PanchaGangaGhat / Trilinga Swamy Mutt)
6. Dattatreya Mandir At Baba KinaRam Aghora Shakthi Sthal, Durga Temple Road
7. Ekamukha Dattatreya Temple Near Brahma Ghat (Close To PanchaGanga Ghat)
BGHAT

💐ఇది..కీర్తి వల్లభ అను ఆయన కాశీ లో  దత్త అవతారం అయిన నృసింహా సరస్వతి..వంశస్టులను కలుసున్న అనుభవాలు share చేశారు.. అందరూ తెలుసుకుంటారని..కాశీ వెళ్ళినపుడు తప్పకుండా..ఆ ఆశ్రమము కూడా దర్శిస్తారని...ఆశిస్తూ....!! శ్రీకళ💐

My Visit To Sri Dattatrya Mutt At NaradGhat

నేను: జై గురు దత్త. నాపేరు కీర్తి వల్లభ, నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నేను ఈ Dattatreya Mutt ని చూడాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉంటున్న కాలే / కాలియా (Kale / Kaaliya Surname) అనే ఇంటి పేరు కలిగిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంశస్థులని (Descendants of Sri Nrusimha Saraswathi Swamy) కలవాలనుకుంటున్నాను. హరిసాధు గారు నాకు బాగా తెలుసు. నేను వస్తున్నట్లు సాధు గారు గురువు గారికి చెప్పే ఉంటారు.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి: మఠాన్ని మీరు చూడవచ్చు. సాధుగారు Dasara ఉండడంవల్ల Katra (Vaishno Devi) వెళ్లారు.

నేను: గుడి మూసేసి ఉందికదా!
అక్కడ ఉన్న ఒక వ్యక్తి: ఒక్కనిముషం ఉండండి తెరుస్తాను. మీరు ఊరికే వచ్చారా?.. లేదా ఏదైనా పని పడి వచ్చారా?.. నృసింహ సరస్వతి స్వామి వారి వంశస్థులు ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలుసు? నేను కూడా స్వామి వారికి చెందిన వాడినే. మేము Karanja నుండి వచ్చాము.

నేను:మేము ఈ మధ్య కాలంలో నృసింహ సరస్వతి స్వామి వారి మీద ఒక Audio CD చేయించాము. అది వారి వంశస్థులకు అందిస్తే బావుంటుందని వచ్చాను.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి: గురువు గారు ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు. ఇక్కడ వారు ఉండే మఠాలు ఇంకా అయిదారు ఉన్నాయి. వారు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఆ మఠాలన్నింటికీ Phone చేస్తే కానీ తెలియదు. మీరు మళ్ళీ రేపు రాగలరా? అప్పటికి నేను కనుక్కుని ఉంటాను.

నేను: జై గురు దత్త. మేము రేపు Chitrakoot వెళుతున్నాము. రేపు కుదరకపోవచ్చు.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి: ఉండండి. గురువుగారు మన మఠంలోనే ఉన్నారేమో… పైకి వెళ్లి చూసి వస్తాను.

నేను:సరే మంచిది జై గురు దత్త.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి: గురువుగారు మన మఠం లోనే ఉన్నారు. దయచేసి నేను చెప్పేది వేరొక విధంగా తీసుకోక వినండి. గురువుగారికి దాదాపుగా 90 సంవత్సరాలు. వచ్చిపోయే వాళ్ళని కలవడానికి ఆయన అంతగా ఇష్టపడడంలేదు. మనము పైకి వెళ్లి వారి గది తలుపు కొడదాము. తలుపు తీసారా సరే…లేదంటే మీరు వెళ్లిపోక తప్పదు. అంతే కాకుండా పైన శ్రీచక్రం వంటి అనేక శక్తి స్థానాలు ఉన్నాయి. కాబట్టి మా ఆశ్రమ పద్దతులను మీరు గౌరవిస్తానంటేనే వెళదాము.

నేను: మీ మఠంలో ఉన్నప్పుడు మీ పద్ధతులు పాటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
అక్కడ ఉన్న ఒక వ్యక్తి: అయితే మీ యజ్ఞోపవీతాన్ని కుడి చేతిలోకి తీసుకుని 24 సార్లు గాయత్రి చెయ్యండి. ఈ పసుపు కుంకుమ యజ్ఞోపవీతానికి కొంచెంపెట్టండి.

నేను: షర్ట్ విప్పమంటా?…
అక్కడ ఉన్న ఒక వ్యక్తి: లేదు అవసరం లేదు. చేతితో ముట్టుకుని చెయ్యండి చాలు.

గాయత్రి చేసిన అనంతరం పైకి వెళ్లి గురువుగారి గది తలుపు కొట్టాము. గురువుగారు ‘తలుపు తీసే ఉంది’ లోపలకి రమ్మని గట్టిగా కేక పెట్టారు.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి: తాత ఈయన హైదరాబాద్ నుండి వచ్చారు. మీకిదివరకే సాధుబాబా చెప్పారట కదా వీరి గురించి. నృసింహ సరస్వతి స్వామి వారి పాటలు చేయించారట. అది మీకు ఇవ్వడానికి వచ్చారు (కన్నడ భాషలో).

తాతగారు (గురువు గారు): అబ్బాయి కూర్చో. హరిసాధు మీరు వస్తున్నట్టు ముందే చెప్పాడు. అబ్బాయికి కొన్ని ఆవు పాలు పొయ్యండి (హసువినాహలు). ఏంటి నృసింహ సరస్వతి స్వామి వారి పాటలు చేయించారా ? చాలా ఆనందకరమైన విషయం. తప్పకుండా వింటాను (Audio CDs చేతికి ఇచ్చాను,తీసుకున్నారు)

నేను: తాత గారు SchindiaGhat దగ్గర గల నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాస దీక్ష తీసుకున్న ప్రదేశానికి (Datta Paduka Mandir) వెళ్లి వచ్చాను. స్వామి వారి సన్యాస దీక్ష గురించిన విషయాలేమైనా చెబుతారా?

తాతగారు (గురువు గారు): నృసింహ సరస్వతి స్వామి వారు రమారమి 630 సంవత్సరాల క్రితం క్రీ.శ. 1387 లో ఇక్కడే ‘శ్రీకృష్ణ సరస్వతి స్వామి’ అనే గురువు గారి వద్ద సన్యాసదీక్ష తీసుకున్నారు. ఆ దీక్షా స్వీకార స్థలం ప్రస్తుతం SchindiaGhat వద్ద ఉంది.

అప్పట్లో ఆ ప్రదేశం మొత్తం ManikarnikaGhat క్రిందకే వచ్చేది. ఈ మధ్య కాలం లోనే (1935 నుండి) దీనిని SchindiaGhat అని పిలుస్తున్నారు. ఈ SchindiaGhat కట్టడం వల్ల అక్కడ బలమైన రాతి పలకలు వెయ్యడం వల్ల అక్కడ ఉన్న ఒక దేవాలయం (Sunken Temple) బరువు ఆపుకోలేక నీటిలోకి ఒరిగి పోయింది.

నిజానికి సన్యాసదీక్ష అనేది స్మశానంలో తీసుకోవాలి. అదే చేశారు మన స్వామి. కానీ కాలం మారిపోయింది. ప్రస్తుతం సన్యాస దీక్షలు గుళ్ళలో, చెట్ల క్రింద కూడా ఇస్తున్నారు. కాశీ ఎంతో శక్తి వంతమైన క్షేత్రం అందుకనే స్వామి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. పంచభూతాలను, నాడీ కేంద్రాలను ఆధారంగా చేసుకుని నిర్మించబడ్డదీ నగరం.

అయితే గడచిన కొద్ది దాశాబ్ధాలుగా కాశీ చాలా మారిపోయింది.. ఒకప్పుడు కాశీ నగరంలో 25000 కు పైగా ఆలయాలు ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాటి సంఖ్య దాదాపు 2400, అంతేగాక వీటిలో చాలావరకు పునర్నిర్మాణం జరుపుకున్నవే కానీ అప్పటివికాదు.

కాశీ విశ్వనాథుని ఆలయం కూడా పునర్నిర్మించబడినదే. కాశీ విధ్వంసం పాక్షికంగా జరిగింది. కాశీ నగరంలో అమర్చిన యంత్రశక్తి ఇప్పటికీ సజీవంగానే ఉంది. అయితే ఉండాల్సిన పద్ధతిలో ఉండాల్సినంత మాత్రం ప్రస్తుతం లేదు. ఆ యంత్రశక్తికి పూజాదికాల సహకారంతోడైతే మళ్లీ సంపూర్ణశక్తి సమకూరుతుంది. నిజానికి ఆనాటి పూజాదికాలు ఏవీ ఇప్పుడు జరగడంలేదు. చాలా చోట్ల సంప్రదాయాలకు నీళ్లొదిలేశారు. శక్తి ఇప్పటికీ ఉంది..,కాని వైభవమే తగ్గింది.

ఈ నగరం మొత్తం Shaligraamaala తో నిర్మించబడినది. ‘కాశీ’ శివుని ఆజ్ఞ మేరకు శ్రీమహావిష్ణువు నిర్మించిన నగరం. ఈ విషయం చాలామందికి తెలియదు.

కాశీలో చేసిన స్వల్ప పుణ్యం మహాపుణ్యాన్ని, ఇక్కడ చేసిన స్వల్ప పాపం మహాపాపాన్ని ఇస్తుంది. ఒక్క క్షణమైనా గురుసేవ చేసిన వారు మాత్రమే కాశీ క్షేత్ర దర్శనానికి అర్హులు. కాశీలో కలి పురుషుడు అతి శక్తి వంతంగా ఉంటాడు. కలి మాయ వల్లనే కాశీ క్షేత్రాన్ని ఎక్కువ మంది భక్తులు సరిగ్గా దర్శనం చేయలేరు.

కాశీ క్షేత్రంలో ఏదో ఒకటి వదలాలని నానుడి. కాశీ ఉంది మీకిష్టమైన బెండకాయలు,వంకాయలు, Sweet వంటివి వదలడానికి కాదు! కాశీలో అరిషడ్వార్గాలను వదలాలి. అది భక్తులు తెలుసుకోవాలి.

ఇందాక మనము చెప్పుకున్న SchindhiaGhat ఉన్న ప్రదేశమే ‘అగ్నిదేవుని స్థానము’. అక్కడ ఉన్న Atma Veereshwara Lingam ని పూజిస్తే సంతానం తప్పకుండా కలుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు మన స్వామి అయిన Nrusimha Saraswathi Swamy వారు చెప్పింది. నృసింహ సరస్వతి స్వామి అంటే ఎవరో చాలామందికి తెలియదిక్కడ. అందుకనే Dattatreya Paduka అని వ్రాసాము.

నృసింహ సరస్వతి స్వామి అంటే ‘ఉగ్ర నారసింహస్వామేమో’ అని అనుకుంటున్నారు. నృసింహ సరస్వతి స్వామి వంశీకులమైన మేము ఇక్కడ ఉన్నట్లు తెలుసుకుని, స్వామి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఇక్కడికి ఇప్పటికీ వస్తుండడం ఆనందదాయకం. అది పరిస్థితి.

SchindiaGhat దగ్గర గల Nrusimha Saraswathi Paduka దర్శించావు కదా! అక్కడ నీకు ఎలా అనిపించింది.?..

నేను: చాలా అద్భుతమైన ప్రదేశం తాత గారు అది. నేను వెళ్లే టప్పటికి ఒక కుక్క స్వామి వారి పాదుకలకు పూజ చేస్తోంది. అది చేసుకున్నాక మేముపూజ చేసుకున్నాము.ఇంకా అక్కడ రెండు ప్రతిష్టించిన శివలింగాలు కనబడ్డాయి. .

తాతగారు (గురువు గారు): అవును బాబు అక్కడ చాలా కుక్కలు ఆవిధం గా చేస్తాయి. అలాగే పేదవారు ఉన్మత్తులు అక్కడ కూర్చుని సేద తీరుతారు. అలాగే SriCharana Paduka వద్ద ఎప్పుడు చూసినా గోవులు ఉంటాయి. ఆరెండూ శ్రీపాదలింగం మరియు నృసింహ (Datta) లింగాలు.

కాశీస్నానజప ప్రతిదివసీ.. అని అందరూ వినే ఉంటారు. కానీ దత్తాత్రేయుల వారు కాశీలో ఎక్కడ స్నానం చేస్తారో ఎక్కడ జపమాచరిస్తారో చాలామందికి తెలియదు.

దత్తాత్రేయ స్వామి వారు గంగామాత యొక్క ప్రార్ధన మేరకు ఇక్కడే NaradGhat ప్రక్కనేగల DattatreyaGhatలో (Now RajGhat) ప్రతినిత్యం ఉదయం 04:30 కు స్నానమాచరిస్తారు. అటునుండి వారు Lolark Kund చేరుకొని అక్కడ జపమును చేస్తారు.

Dattatreyulaవారు స్నానానికి వచ్చినప్పుడు అంతపొద్దున్నే ఎక్కడెక్కడనుండో గోవులు,శునకాలు Ghat దగ్గరకు వస్తాయి. ఇది కొత్తవారికి చాలా వింతగా ఉంటుంది.

నేను: ఇక్కడ Naradeshwara, Atrieshwara, Vasukeshwara and Dattatreyeshwara లింగాలు ఉన్నట్లు చెప్పారు. కానీ నాకు అవి కనపడలేదు.

తాతగారు (గురువు గారు): .. (Just Smile)

తాతగారు (గురువు గారు): ఇంకొక రహస్యాన్ని నీకు చెపుతాను విను. నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాస దీక్ష తీసుకునే సమయంలో అక్కడకి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు కూడా వచ్చారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి సమక్షంలో శ్రీ కృష్ణ సరస్వతి స్వామి ద్వారా నృసింహ సరస్వతి స్వామి వారు సన్యాసదీక్ష తీసుకున్నారు.

శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి పాదుకలు Sri Charana Paduka అనే పేరుతో నృసింహ సరస్వతి స్వామి పాదుకలకు కొద్ది దూరం లోనే ఉంటాయి. అయితే ఇక్కడ Sripada / SriCharana ( శ్రీపాద / శ్రీ చరణ) అంటే ఎవరు గుర్తు పట్టరు. అందుకే అవి SriCharana Vishnu Paduka గా ప్రచారంలోకి వచ్చాయి.

నేను: జై గురు దత్త. SriCharana Paduka కూడా దర్శించాను. ఇప్పుడే మీద్వారానే వాటి విశిష్టత తెలిసింది. చాల ధన్యవాదములు.

తాతగారు (గురువు గారు): మీకు నృసింహ సరస్వతి స్వామి వారు ధరించిన కాషాయ వస్త్రాలు మరియు పావుకోళ్ళు (Kashaya Vastra & Wood Sandles of Sri Nrusimha Saraswathi Swamy) చూపిస్తాను చుడండి. ఎందుకో మీకు చూపించాలనిపిస్తోంది. కానీ ఫోటోలు అవి తీయ్యద్దు అలాగే చేతితో తాకే ప్రయత్నం చెయ్యద్దు.

సాధారణంగా South India వాళ్ళకి పాదుకలను తలకు ఆనించి నమస్కరించే అలవాటు ఉంటుంది. అందుకే చెబుతున్నా. ఫోటోలు బైట తీసుకోండి. మా మనవడితో ఫోటోలు దిగండి, క్రింద మందిరంలో లోపలకివెళ్లి తీసుకోండి. నాకేమి అభ్యంతరం లేదు.

నేను: చాల చాల ధన్యవాదములు తాతగారు. స్వామి వారు ధరించిన కాషాయ వస్త్రాలు మరియు పావుకోళ్ళు చూపించినందుకు. జై గురు దత్త.. జై నృసింహ సరస్వతి స్వామి. దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా. చాలా సంతోషం గా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. వెళ్ళొస్తాను తాతగారు. జై గురు దత్త.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS