నవగ్రహాల గురించి కోన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఏక్కువ దోషప్రదంగా ఉంటే ఆయా గ్రహాల ప్రత్యేక దేవాలయాలను గ్రహాల అధిదేవతల పుణ్య క్షేత్రము లను దర్శించి గ్రహబాధలు పోగొట్టుకోగలము...
"ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః-"-
అంటూ ప్రతి హిందువూ ఉదయాన్నే స్నానానంతరం మిగిలిన ప్రార్ధనలతో పాటుగా ఈ నవగ్రహ శ్లోకాన్ని పఠించడం జరుగుతుంటుంది. గ్రహాలంటే సౌరకుటుంబంలో వేనా? లేక ఇవి వేరైనవా అనే సందేహమూ కొందరికి రావచ్చు. అసలు ఈ నవగ్రహాల గురించిన సమాచారం అందరికీ తెలిసిందే ఐనా , ఈ కార్తీకమాసంలో కాస్త ఈ గ్రహాల సమాచారం చెప్పుకుందాం.
భారతదేశంలో జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మేవారు అధిక సంఖ్యాకులే ఉంటారు. ముఖ్యంగా కష్ట
సమయంలో ఈ శాస్త్రం పై నమ్మకం పెరుగుతుంది. అందుకే ప్రతి హిందువూ దైనందిన జీవిత క్రమంలో నూ, ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత నిస్తాడు. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మందికి గట్టి నమ్మకం ఉంటుంది..
మనకు అధిపతులున్నట్లే నవగ్రహాలకూ అధిపతులున్నారు….సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ.
మన రుచుల ఎంపికకు ఈ నవగ్రహాలు మనపై చూపే ప్రభావం కొంత కారణం కావచ్చు. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపు- వగరు రుచులకు అధిపతులు.
సూర్యుడు 'ఆయనము'కు, చంద్రుడు 'క్షణము'కు, కుజుడు 'ఋతువు'కు, బుధుడు 'మాసము'కు, గురువు 'పక్షము'కు, శుక్రుడు 'సంవత్సరానికీ అధిపతులు.
నవ గ్రహాలను పూజించడం,జపాలుచేయడం, హిందువుల ఆచారవ్యవహారాలలో ఉన్నదే! . చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.
పేరు ఆంగ్లంలో గుణము సూచిక
సూర్యుడు --ఆంగ్లంలో-Sun[సన్] అంటాము. సూర్యుని గుణము-సత్వము ,ఆత్మపై తనప్రభావం చూపుతాడు. రాజయోగం, పదోన్నతి, పితృయోగం కలిగిస్తాడు
చంద్రుడు -ఆంగ్లంలో -Moon [మూన్] అంటాము.చంద్రుని -గుణము-సత్వము ,మనసుపై ప్రభావం చూపుతాడు., రాణి యోగం కలిగిస్తాడు., మాతృత్వానికీ చంద్రుడే అధిపతి..
కుజుడు --Mars[ మార్స్ ] గుణము-తామసము శక్తి, విశ్వాసం, అహంకారాలకు అధిపతి..
బుధుడు-- Mercury-- గుణము-రజస్సు --వ్యవహార నైపుణ్యంకలిగిస్తాడు.
బృహస్పతి [గురువు] Jupiter [జూపిటర్] గుణము-సత్వము -విద్యాబోధనలోనైపుణ్యాన్నికలిగిస్తాడు.
శుక్రుడు--Venus-[వీనస్] -గుణము- రజస్సు ;ధనలాభం, సౌఖ్యం, సంతానం-కలిగిస్తాడు.
శని---Saturn [శని] గుణము-తామసము ; ఉద్యోగోన్నతి, చిరాయువు- కలిగిస్తాడు.
రాహువు-- పాముతలగల గ్రహం - చంద్రగ్రహణ సమయంలో , చంద్రుని మింగుతాడని మనం అనుకునే గ్రహం.
గుణము-తామసము ,తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం కలవాడు .
కేతువు --- పాముతోక శరీరంగాకలగ్రహం - సూర్యగ్రహసమయంలో సూర్యుని మింగేగ్రహంగా భావిస్తాం -
గుణము-తామసము- విపరీత ప్రభావాలు-కలిగిస్తాడు.
నవగ్రహ అలయాలన్నీ తమిళనాడులోకొయిల్
నవగ్రహాల ఆలయాలు
నవగ్రహ అలయలు మొత్తముగా తమిళనాడులో ఉన్నాయి. అవి 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొయిల్ 2. బుధ గ్రహానికి గాను తిరువంగాడ్ 3. శుక్ర గ్రహానికి గాను కంజనూర్ 4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ 5. గురు గ్రహానికి గాను ఆలంగుడి 6. శని గ్రహానికి గాను తిరునల్లారు 7. రాహువు గ్రహానికి గాను తిరునాగేశ్వరమ్ 8. చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు 9. సూర్య గ్రహానికి గాను సూరియానార్ కొయిల్
నవగ్రహాలు మరికొన్ని విశేషాలు
ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఉంది.
తెలుపు రంగు - శుక్ర, చంద్రులకు ;
పసుపు రంగు - గురువుకు ;
ఎరుపు వర్ణం - అంగారక, సూర్యులకు ;
ఆకుపచ్చ రంగు - బుధునికి ;
నలుపు వర్ణము - శనికి,
పొగరంగు (దూమ్ర వర్ణం ) - రాహువు, కేతువులకు ఉంటుందని తెలుస్తున్నది.
గ్రహాలకు [ రాశులకు ] జాతులుకూడా ఉంటాయి.--,
గురువు, శుక్రుడు - బ్రాహ్మణ జాతికి,
సూర్యుడు, కుజుడు -క్షత్రియులు గానూ ;
బుధుడు, చంద్రుడు - వైశ్యులు గానూ ;
శని - శూద్రునిగానూ,
రాహువు - చంఢాలుడుగానూ ;
కేతువు - సంకరునిగానూ భావిస్తారు..
గురువు, శుక్రుడు, బుధుడు, చర రాశిలో ఉన్న కేతువు --- -శుభగ్రహాలు గానూ,
సూర్యుడు, కుజుడు, శని, పాపులతో చేరిన బుధుడు,- స్థిర, ద్వంద్వస్వభావయుతుడైన కేతువు-పాపగ్రహాలుగానూ చెప్తారు.,.
గ్రహముల ద్రవ్యములు -
సూర్యుడికి తామ్రము [రాగి],
చంద్రుడికి మణులు,
కుజుడికి పగడము ,
బుధుడికి ఇత్తడి,
గురువుకు కంచు ,బంగారము ;--
శుక్రుడికి వెండి,
శనికి ఇనుము, సీసము.
మనశ రీరభాగాలన్నింటి లోనూ ఈ నవగ్రహాలు నివశిస్తూ తమప్రభావంచూపుతాయనేనమ్మకం ఉంది.
సూర్యుడు ఎముకలకు,
చంద్రుడు నెత్తురుకు,
బుధుడు చర్మము,
శుక్రుడు రేతస్సు,
గురువు మెదడు,
శని నరములకు,
కుజుడు మజ్జలకూ
మనశరీరభాగాలలో గ్రహములుతమ ఆధిపత్యం చూపు తాయి.
అగ్నికి సూర్యుడు, కుజుడు. భూమికి బుధుడు ఆధిపత్యం వహిస్తారు..
సూర్యుడు తూర్పు దిక్కు -
చంద్రుడు వాయవ్య దిక్కు-
కుజుడు దక్షిణము-
బుధుడు ఉత్తరము-
గురువు ఈశాన్యము-
శుక్రుడు ఆగ్నేయము -
శని పశ్చిమము దిక్కులకు అధిపతులు.
సూర్యుని అనుగ్రహం వల్లకోరిన విద్యలు లభిస్తాయి...
చంద్రుని శుభదృష్టి వల్ల మానసిక సంబంధమైన సమస్యలన్నీ తొలగి పోతాయి. వక్రదృష్టితో వీక్షించడం వల్ల మనస్సు వికలమవుతుంటుంది. మూగతనం కూడా రావచ్చు.
బృహస్పతి-[గురుగ్రహం ]ఈయనకు మంగళుడని కూడా పేరు.ఈయన దేవగురువు. ఈయన భూ, యుద్ధకారకుడనీ, దంపతుల మధ్య అనురాగం, సఖ్యత ఈ గ్రహదృష్టి పైనే ఆధారపడిఉంటుంది.. మానవులకు బుద్ధిబలాన్ని, మేధస్సును ప్రసాదిస్తాడనీ,. కావ్యరచనా శక్తి, గణిత శాస్త్రంలో ప్రజ్ఞా పాటవాలుఈయన అనుగ్రహంవల్లే లభిస్తాయంటారు. ఈయన వక్రదృష్టివల్ల బుద్ధి మందగిస్తుంది. శుభదృష్టితో వీక్షించడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు ,సంపదలు పొందవచ్చును .బుధుని అనుగ్రహంవలన స్పష్టమైన సంభాషణ,వాక్చాతుర్యం,విద్యారంగంలో ఉన్నతస్థానం లభిస్తాయి. శుక్రుని అనుగ్రహంతో సకల శుభాలూ కల్గుతాయి.శని ఆయుష్షును ప్రసాదిస్తాడు. స్థిరత్వాన్ని, వైరాగ్యాన్నీ కలిగిస్తాడు, వక్రదృష్టివల్ల కష్టాలు కలుగుతాయి.చివరకుమాత్రం సుఖాలను ప్రసాదిస్తాడు. రాహుగ్రహం వక్రంగా వీక్షించడం వల్ల అష్టకష్టాలపాలవకతప్పదు.కేతుగ్రహ అనుగ్రహం వలన జననమరణాల చక్రం నుండీ విముక్తి లభిస్తుంది.
నవగ్రహాల తల్లిదండ్రులు , భార్యలు --
రవి[సూర్యుని] తల్లిదండ్రులుఅతిది -కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
చంద్రుని -తల్లిదండ్రులు అనసూయ -అత్రి మహర్షి-భార్య రోహిణి .
కుజుని-తల్లిదండ్రులు-భూమి,భరద్వాజుడు - భార్యశక్తి దేవి
బుధునితల్లిదండ్రులు- తార ,చంద్రుడు -భార్య జ్ఞాన శక్తి దేవి
గురునితల్లిదండ్రులు- తార ,అంగీరసుడు -భార్య తారాదేవి
శుక్రునితల్లిదండ్రులు-ఉష,భ్రుగు -భార్య సుకీర్తి దేవి
శని తల్లిదండ్రులు-ఛాయ,రవి -భార్య జ్యేష్ట దేవి
రాహువు తల్లిదండ్రులు- సింహిక ,కశ్యపుడు-భార్య కరాళి దేవి
కేతువు తల్లిదండ్రులు-సింహిక,కశ్యపుడు-భార్య చిత్రా దేవి
నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి.
రవి- జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర- దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ-- ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ-- ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు- దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర-- హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని- నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు- అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు- ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్
ప్రతి రోజూ ఈ ధ్యానశ్లోకాలను ధ్యానం చేసి నవగ్రహ దేవతల అనుగ్రహమునకు పాత్రులు కావలసింది గా
కోరుతూ...... మీ దుష్యంత్
No comments:
Post a Comment