Sunday, December 31, 2017

హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది?



హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది?

సింధూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సింధూర ప్రియుడు కావడం వెనుక కథను ‘పరాశరసంహిత’ వర్ణించింది. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రామయ్యకు చాలా ఇష్టమని చెప్పింది. దీంతో వెంటనే హనుమంతుడు సింధూరాన్ని ఒంటినిండా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండటం చేత ఆ సింధూరం వెంటనే రాలిపోయేది. దీంతో ఆయన నూనెతో కలిపిన గంగ సింధూరాన్ని ఒంటినిండా పట్టించుకున్నాడట. ఈ అమాయకపు పని చేసిన ఆంజనేయుడ్ని చూసిన శ్రీరాముడు ‘ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడను’ అని అన్నాడట. అటువంటి భక్తులకు సమస్త దోషాలూ తొల‌గి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చాడు. అందుకే హనుమంతుడి ఒంటి నిండా సింధూరం పూసి ఉంటుంది.

Saturday, December 30, 2017

నవగ్రహాల గురించి కోన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి



నవగ్రహాల గురించి కోన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఏక్కువ దోషప్రదంగా ఉంటే ఆయా గ్రహాల ప్రత్యేక దేవాలయాలను గ్రహాల అధిదేవతల పుణ్య క్షేత్రము లను దర్శించి గ్రహబాధలు పోగొట్టుకోగలము...

"ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః-"-

అంటూ ప్రతి హిందువూ ఉదయాన్నే స్నానానంతరం మిగిలిన ప్రార్ధనలతో పాటుగా ఈ నవగ్రహ శ్లోకాన్ని పఠించడం జరుగుతుంటుంది. గ్రహాలంటే సౌరకుటుంబంలో వేనా? లేక ఇవి వేరైనవా అనే సందేహమూ కొందరికి రావచ్చు. అసలు ఈ నవగ్రహాల గురించిన సమాచారం అందరికీ తెలిసిందే ఐనా , ఈ కార్తీకమాసంలో కాస్త ఈ గ్రహాల సమాచారం చెప్పుకుందాం.
భారతదేశంలో జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మేవారు అధిక సంఖ్యాకులే ఉంటారు. ముఖ్యంగా కష్ట
సమయంలో ఈ శాస్త్రం పై నమ్మకం పెరుగుతుంది. అందుకే ప్రతి హిందువూ దైనందిన జీవిత క్రమంలో నూ, ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత నిస్తాడు. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మందికి గట్టి నమ్మకం ఉంటుంది..
మనకు అధిపతులున్నట్లే నవగ్రహాలకూ అధిపతులున్నారు….సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ.
మన రుచుల ఎంపికకు ఈ నవగ్రహాలు మనపై చూపే ప్రభావం కొంత కారణం కావచ్చు. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపు- వగరు రుచులకు అధిపతులు.
సూర్యుడు 'ఆయనము'కు, చంద్రుడు 'క్షణము'కు, కుజుడు 'ఋతువు'కు, బుధుడు 'మాసము'కు, గురువు 'పక్షము'కు, శుక్రుడు 'సంవత్సరానికీ అధిపతులు.
నవ గ్రహాలను పూజించడం,జపాలుచేయడం, హిందువుల ఆచారవ్యవహారాలలో ఉన్నదే! . చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.
పేరు ఆంగ్లంలో గుణము సూచిక
సూర్యుడు --ఆంగ్లంలో-Sun[సన్] అంటాము. సూర్యుని గుణము-సత్వము ,ఆత్మపై తనప్రభావం చూపుతాడు. రాజయోగం, పదోన్నతి, పితృయోగం కలిగిస్తాడు
చంద్రుడు -ఆంగ్లంలో -Moon [మూన్] అంటాము.చంద్రుని -గుణము-సత్వము ,మనసుపై ప్రభావం చూపుతాడు., రాణి యోగం కలిగిస్తాడు., మాతృత్వానికీ చంద్రుడే అధిపతి..
కుజుడు --Mars[ మార్స్ ] గుణము-తామసము శక్తి, విశ్వాసం, అహంకారాలకు అధిపతి..
బుధుడు-- Mercury-- గుణము-రజస్సు --వ్యవహార నైపుణ్యంకలిగిస్తాడు.
బృహస్పతి [గురువు] Jupiter [జూపిటర్] గుణము-సత్వము -విద్యాబోధనలోనైపుణ్యాన్నికలిగిస్తాడు.
శుక్రుడు--Venus-[వీనస్] -గుణము- రజస్సు ;ధనలాభం, సౌఖ్యం, సంతానం-కలిగిస్తాడు.
శని---Saturn [శని] గుణము-తామసము ; ఉద్యోగోన్నతి, చిరాయువు- కలిగిస్తాడు.
రాహువు-- పాముతలగల గ్రహం - చంద్రగ్రహణ సమయంలో , చంద్రుని మింగుతాడని మనం అనుకునే గ్రహం.
గుణము-తామసము ,తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం కలవాడు .
కేతువు --- పాముతోక శరీరంగాకలగ్రహం - సూర్యగ్రహసమయంలో సూర్యుని మింగేగ్రహంగా భావిస్తాం -
గుణము-తామసము- విపరీత ప్రభావాలు-కలిగిస్తాడు.

నవగ్రహ అలయాలన్నీ తమిళనాడులోకొయిల్

నవగ్రహాల ఆలయాలు
నవగ్రహ అలయలు మొత్తముగా తమిళనాడులో ఉన్నాయి. అవి 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొయిల్ 2. బుధ గ్రహానికి గాను తిరువంగాడ్ 3. శుక్ర గ్రహానికి గాను కంజనూర్ 4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ 5. గురు గ్రహానికి గాను ఆలంగుడి 6. శని గ్రహానికి గాను తిరునల్లారు 7. రాహువు గ్రహానికి గాను తిరునాగేశ్వరమ్ 8. చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు 9. సూర్య గ్రహానికి గాను సూరియానార్ కొయిల్

నవగ్రహాలు మరికొన్ని విశేషాలు
ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఉంది.
తెలుపు రంగు - శుక్ర, చంద్రులకు ;
పసుపు రంగు - గురువుకు ;
ఎరుపు వర్ణం - అంగారక, సూర్యులకు ;
ఆకుపచ్చ రంగు - బుధునికి ;
నలుపు వర్ణము - శనికి,
పొగరంగు (దూమ్ర వర్ణం ) - రాహువు, కేతువులకు ఉంటుందని తెలుస్తున్నది.
గ్రహాలకు [ రాశులకు ] జాతులుకూడా ఉంటాయి.--,
గురువు, శుక్రుడు - బ్రాహ్మణ జాతికి,
సూర్యుడు, కుజుడు -క్షత్రియులు గానూ ;
బుధుడు, చంద్రుడు - వైశ్యులు గానూ ;
శని - శూద్రునిగానూ,
రాహువు - చంఢాలుడుగానూ ;
కేతువు - సంకరునిగానూ భావిస్తారు..
గురువు, శుక్రుడు, బుధుడు, చర రాశిలో ఉన్న కేతువు --- -శుభగ్రహాలు గానూ,
సూర్యుడు, కుజుడు, శని, పాపులతో చేరిన బుధుడు,- స్థిర, ద్వంద్వస్వభావయుతుడైన కేతువు-పాపగ్రహాలుగానూ చెప్తారు.,.
గ్రహముల ద్రవ్యములు -
సూర్యుడికి తామ్రము [రాగి],
చంద్రుడికి మణులు,
కుజుడికి పగడము ,
బుధుడికి ఇత్తడి,
గురువుకు కంచు ,బంగారము ;--
శుక్రుడికి వెండి,
శనికి ఇనుము, సీసము.
మనశ రీరభాగాలన్నింటి లోనూ ఈ నవగ్రహాలు నివశిస్తూ తమప్రభావంచూపుతాయనేనమ్మకం ఉంది.
సూర్యుడు ఎముకలకు,
చంద్రుడు నెత్తురుకు,
బుధుడు చర్మము,
శుక్రుడు రేతస్సు,
గురువు మెదడు,
శని నరములకు,
కుజుడు మజ్జలకూ
మనశరీరభాగాలలో గ్రహములుతమ ఆధిపత్యం చూపు తాయి.
అగ్నికి సూర్యుడు, కుజుడు. భూమికి బుధుడు ఆధిపత్యం వహిస్తారు..
సూర్యుడు తూర్పు దిక్కు -
చంద్రుడు వాయవ్య దిక్కు-
కుజుడు దక్షిణము-
బుధుడు ఉత్తరము-
గురువు ఈశాన్యము-
శుక్రుడు ఆగ్నేయము -
శని పశ్చిమము దిక్కులకు అధిపతులు.
సూర్యుని అనుగ్రహం వల్లకోరిన విద్యలు లభిస్తాయి...
చంద్రుని శుభదృష్టి వల్ల మానసిక సంబంధమైన సమస్యలన్నీ తొలగి పోతాయి. వక్రదృష్టితో వీక్షించడం వల్ల మనస్సు వికలమవుతుంటుంది. మూగతనం కూడా రావచ్చు.
బృహస్పతి-[గురుగ్రహం ]ఈయనకు మంగళుడని కూడా పేరు.ఈయన దేవగురువు. ఈయన భూ, యుద్ధకారకుడనీ, దంపతుల మధ్య అనురాగం, సఖ్యత ఈ గ్రహదృష్టి పైనే ఆధారపడిఉంటుంది.. మానవులకు బుద్ధిబలాన్ని, మేధస్సును ప్రసాదిస్తాడనీ,. కావ్యరచనా శక్తి, గణిత శాస్త్రంలో ప్రజ్ఞా పాటవాలుఈయన అనుగ్రహంవల్లే లభిస్తాయంటారు. ఈయన వక్రదృష్టివల్ల బుద్ధి మందగిస్తుంది. శుభదృష్టితో వీక్షించడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు ,సంపదలు పొందవచ్చును .బుధుని అనుగ్రహంవలన స్పష్టమైన సంభాషణ,వాక్చాతుర్యం,విద్యారంగంలో ఉన్నతస్థానం లభిస్తాయి. శుక్రుని అనుగ్రహంతో సకల శుభాలూ కల్గుతాయి.శని ఆయుష్షును ప్రసాదిస్తాడు. స్థిరత్వాన్ని, వైరాగ్యాన్నీ కలిగిస్తాడు, వక్రదృష్టివల్ల కష్టాలు కలుగుతాయి.చివరకుమాత్రం సుఖాలను ప్రసాదిస్తాడు. రాహుగ్రహం వక్రంగా వీక్షించడం వల్ల అష్టకష్టాలపాలవకతప్పదు.కేతుగ్రహ అనుగ్రహం వలన జననమరణాల చక్రం నుండీ విముక్తి లభిస్తుంది.
నవగ్రహాల తల్లిదండ్రులు , భార్యలు --
రవి[సూర్యుని] తల్లిదండ్రులుఅతిది -కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
చంద్రుని -తల్లిదండ్రులు అనసూయ -అత్రి మహర్షి-భార్య రోహిణి .
కుజుని-తల్లిదండ్రులు-భూమి,భరద్వాజుడు - భార్యశక్తి దేవి
బుధునితల్లిదండ్రులు- తార ,చంద్రుడు -భార్య జ్ఞాన శక్తి దేవి
గురునితల్లిదండ్రులు- తార ,అంగీరసుడు -భార్య తారాదేవి
శుక్రునితల్లిదండ్రులు-ఉష,భ్రుగు -భార్య సుకీర్తి దేవి
శని తల్లిదండ్రులు-ఛాయ,రవి -భార్య జ్యేష్ట దేవి
రాహువు తల్లిదండ్రులు- సింహిక ,కశ్యపుడు-భార్య కరాళి దేవి
కేతువు తల్లిదండ్రులు-సింహిక,కశ్యపుడు-భార్య చిత్రా దేవి
నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి.
రవి- జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర- దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ-- ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ-- ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు- దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర-- హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని- నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు- అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు- ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్

ప్రతి రోజూ ఈ ధ్యానశ్లోకాలను ధ్యానం చేసి నవగ్రహ దేవతల అనుగ్రహమునకు పాత్రులు కావలసింది గా
కోరుతూ...... మీ దుష్యంత్ 

*శ్రీ రుద్రం విశిష్టత :*



*శ్రీ రుద్రం విశిష్టత :*

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం.
ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం.

జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది.
మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది.
శ్రీ రుద్రాన్ని రుద్ర ప్రశ్న అని కూడా అంటారు.
వేద మంత్రాలలో ఏంతో ఉత్కృష్టమైనది.

శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని నమకం అంటారు.

రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.

చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
అని అర్థం,

*నమకం విశిష్టత :*

నమకం, చమకం 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు.

మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయిదాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది.

శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది.
ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి.
కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి....

*అనువాకం – 1:*

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

*అనువాకం – 2 :*

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన..
శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

*అనువాకం – 3:*

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది.
అతడు సర్వాత్మ.
ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు.
ఈ అనువాకం వ్యాధి నివారనంకు కూడా చదువుతారు...

*అనువాకం – 4:*

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే,
ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.

*అనువాకం – 5:*

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు.
అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృషి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

*అనువాకం – 6:*

ఇందులో రుద్రుడు కాలరూపుడు.
అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షనకు కూడా చదువుతారు.

*అనువాకం – 7:*

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న ర్ద్రుని వర్ణిస్తుంది.
ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

*అనువాకం – 8:*

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు.
యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

*అనువాకం –9:*

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ స్కక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

*అనువాకం – 10:*

ఈ అనువాకంలో మల్ల రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపసమించి, పినాకధారియైనా, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

*అనువాకం – 11:*

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి.
ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్తి దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

*చమకం విశిష్టత:*

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం.
ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది.
జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం.
సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే...

Friday, December 29, 2017

ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు




ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు
చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది

ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి)
ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి

శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ

భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి

కార్తీక శుద్ధ ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)

మార్గశిర శుద్ధ ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
మార్గశిర బహుళ ఏకాదశి - 'విమలా' -(సఫలా) - అజ్ఞాన నివృత్తి

పుష్య శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
పుష్య బహుళ ఏకాదశి - 'కళ్యాణీ' (షట్ తిలా) ఈతిబాధా నివారణం

మాఘ శుద్ధ ఏకాదశి - 'కామదా' (జయా) - శాపవిముక్తి
మాఘ బహుళ ఏకాదశి - 'విజయా' - సకలకార్య విజయం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'ఆమలకీ' - ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'సౌమ్య' - పాపవిముక్తి
(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్లవిషయంలో కొన్ని బేధాలున్నాయి.)

24 ఏకాదశులలోనూ - సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి"గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సౌరమానం ధనుర్మాసం కాగా, అందువచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నరాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా --- కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.

ఏకాదశి ప్రాశస్త్యం
భారతీయులకు ఉన్నన్ని పండుగలు ఇతర దేశస్థులకు లేవు. ప్రతీ పండుగలోనూ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆరోగ్యాది విశేషాలు లీనమై ఉంటాయి. వాటిని గుర్తించి, ఆంతర్యాన్ని గ్రహించి, ఆయా పండుగలు, వ్రతాలు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఐహికముష్మిక ఫలాలు సిద్ధిస్తాయి.

సర్వమూ కాలాధీనం. “కాలః కలయతా మహమ్” అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది. కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు. అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం, చాంద్రం, సావనం, నక్షత్రం – అని నలుగు విధాలుగా సూచించి, గణించడం జరిగింది. దక్షిణాదిలో సౌరచాంద్రమానాలే గణనీయాలు. మనం చైత్ర వైశాఖ మాసాలని, పాడ్యమి, విదియ తిథులని చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాము. చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు. సూర్యుణ్ణి ఆధారంగా – సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించి ఉండే నెలరోజులకూ ఆయా మాసంగా చెప్పబడుతుంది. సౌరమానం మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలినవై ఎక్కువ శాతం ఆయా తేదీలలోనే వస్తుంటాయి. కనుకనే తమిళులకు ఏప్రియాల్ ఒకటవ తేదీన మేషమాసం ఆరంభమై సంవత్సరాది అవుతుంది. “రవేః సంక్రమణం రాశౌ సంక్రాంతి రితి కథ్యతే” అనుటచేత ఒక్కొక్క మాసమూ ఒక్కొక్క సంక్రాంతి అవుతుంది. అదే విధంగా మకర సంక్రాంతి జనవరి 14 నుండి, కర్కాటక సంక్రాంతి జూలై 16 వరకు ఉత్తరాయణం... జూలై 17 నుండి జనవరి 13 వరకు దక్షిణాయనం అని అంటున్నాం.
“ఆయనే దక్షిణే రాత్రి రుత్తరే తు దివా భవేత్” అని కపింజల సంహిత వాక్యం. దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు మానవులకు ఒక సంవత్సర కాలమైతే, దేవతలకు ఒక అహోరాత్రమైన దినం. సూర్యుడు ధనూరాశిలో ఉండే మాసం ధనుర్మాసం. ఈ నెలలో ఉషఃకాలం చాలా ప్రాముఖ్యమైనది. “ధనుః సంక్రాంతి మారభ్య మాస మేకం వ్రతం చరేత్” అనుటచే ధనుర్మాసం నెలరోజులూ శ్రీహరిని విధిగా బ్రాహ్మీకాలంలో పూజించాలి. ఈవిధంగా ఆచరిస్తే

“కోదండస్థే సవితరి ప్రత్యూషః పూజయే ద్ధరిమ్
సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతి”

ధనుర్మాసంలో ఒక్కరోజు ఉషఃకాలంలో శ్రీహరిని అర్చిస్తే వెయ్యేళ్ళు నిత్యమూ అర్చించిన ఫలితం సిద్ధిస్తుంది. 30 రోజులు అర్చించేవారికి ౩౦ వేలయేళ్ళు అర్చించిన అనంత ఫలం లభిస్తుంది. అనంతుడిని అనంతంగా అర్చిస్తే అనంత ఫలమే సిద్ధిస్తుంది.

ధనుర్మాసం సౌరమాసానుసారం రాగా, శుక్లపక్ష ఏకాదశి చాంద్రమానమైన తిథి ప్రతీమాసంలోనూ రెండు ఏకాదశులు(శుక్ల-బహుళ) వస్తాయి. (అధికమాసంలో మరో రెండు అధికం) మొత్తమ్మీద సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశి ఎంతో పవిత్రమైనది.

గృహస్థో బ్రహ్మచారీన ఆహితాగ్నిస్తథైవచ
ఏకాదశ్యాం న భుంజీత పక్షయో రుభయోరపి

బ్రహ్మచారి, గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రుడు ఎవరైనా కావచ్చు, ఉభయ ఏకాదశులలో భోజనం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇంత నిష్ఠతో కూడుకున్న ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమైనది.అందుకే ఏకాదశిని "హరివాసరం" అన్నారు పెద్దలు.

మరో వృత్తాంతం ---- మధుకైటభులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్యరూపాలు ధరించి, దివ్యజ్ఞాన్నాన్ని పొంది, "దేవా ! వైకుంఠము వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పూజ చేసి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వారమార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠప్రాప్తి కలిగించు" అని ప్రార్థించిరి. స్వామి "తథాస్తు" అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి "మోక్షోత్సవదినం" అని కూడా అంటారు. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక "ముక్కోటి ఏకాదశి" అని పేరు(ముక్కోటి అనేది 33 కోట్లకు సంకేతమని అంటారు). వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక "వైకుంఠ ఏకాదశి", భగవద్దర్శనం కలిగిస్తుంది కనుక "భగవదవలోకనదినం" అని పిలుస్తుంటారు.

సుకేతుడనే రాజు విశ్వేదేవతలా ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, భగవదనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడు.

సకల పాపాల నుండి విముక్తి పొంది, శ్రీకైవల్యప్రాప్తితో జన్మరాహిత్యం చెందటానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతాచరణ లేదు.

దేవదానవులు ఈ ఏకాదశిరోజున ఉపవాసంతో రాత్రింబవళ్ళు శ్రమించి, క్షీరసాగరాన్ని మధించగా, ద్వాదశినాడు మహాలక్ష్మీ సముద్రం నుండి ఉద్భవించి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది.

ఆనాటి నుండి ఏకాదశినాడు పగలు, రాత్రి ఉపవాసంతో ఉండి, జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృపవల్ల ముక్తి లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది.

శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవకళ చంద్రునిలోకి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్రమండలం నుండి పదకొండవకళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకల వలెనే ఏకాదశి అనే పేరు సార్థకమైనది. "ఏకాదశ్యా ముపవస్యే న్న కదాచి దతిక్రమేత్" - ఏకాదశినాడు తప్పక ఉపవాసం చెయ్యాలి. ఉపవాసంనాడు "ఉపవాసః స విజ్ఞేయః సర్వభోగవివర్జితః" --- పాపకృత్యాలకు దూరంగా(చేయకుండా) ఉండి, సకలభోగాలను వదిలి, పుణ్యకార్యాలు చేయటమే ఉపవాసం అని పెద్దలమాట. 11 ఇంద్రియాలను(పంచ కర్మేంద్రియ+ పంచ జ్ఞానేంద్రియ + మనస్సులు = 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపచేయునదియే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈవ్రతాన్ని ఆచరించవచ్చు. ఎనిమిదేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు, ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు ఉపవాసం చేయాల్సిన పనిలేదని కొన్ని శాస్త్రాలలో పేర్కొనబడ్డాయి.

ఏకాదశీ దేవి జననము
పూర్వం కృతయుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురుడు' అనే రాక్షసుడుండేవాడు. దేవతలని జయించి, వేధించేవాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి, అలసి, విశ్రాంతికై బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలో చేరి నిద్రించాడు. మురుడు శ్రీహరిని చేరి సంహరించడానికి సిద్ధపడగా, స్వామి శరీరంనుండి దివ్యతేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య దివ్యాశ్త్రాలతో యుద్ధంచేసి, మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని కన్యను, మరణించిన మురుణ్ణి చూసి ఆశ్చర్యపడినాడు. కన్య నమస్కరించి, జరిగినదంతా వివరించింది. సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి వరం కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో "దేవా ! నేను ఏకాదశినాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక ఈనాడు నా వ్రతం చేస్తూ, ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుంచి తరించేట్లుగా వరమిచ్చి, అనుగ్రహించండి" అని ప్రార్థించింది. స్వామి "అట్లే అగుగాక" అని వరమిచ్చి, అదృశ్యమైనాడు. నాటి నుండి ఏకాదశీ వ్రతం భక్తితో ఆచరించేవారు సకలపాపాలనుండి విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ప్రశస్తి ఏర్పడింది. ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశీదేవి. ఈమె విష్ణు దేహము నుండి ఉత్పన్నమైనది కనుక, ఈమె స్త్రీమూర్తియైన మహావిష్ణువే. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసంఉంటుంది కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బ తీస్తుందని అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఈరోజు గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు.

ఏకాదశీ వ్రత ప్రభావాన్ని వివరించే కథలు

పుత్రద ఏకాదశి
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ.... పూర్వం మహారాజు "సుకేతుడు" 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.

కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడు.
ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టేక్కాడు.
రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తినొందాడు. సకల దేవతా కృపాపాత్రుడైనాడు. మోక్షగామి అయినాడు.
వైఖానసరాజు ఆచరించి పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు.
అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితమే.
క్షీరసాగర మథనం - లక్ష్మీదేవి ఆవిర్భావం ఏకాదశినాడే జరిగింది.

ఆధ్యాత్మిక స్ఫూర్తి
వ్రతాలూ, పూజలూ అన్నీ ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై, జ్ఞానవిజ్ఞాన ఘనులై ముక్తులగుట కొరకే ఏర్పడిన విశిష్టసాధనాలు. ఆధ్యాత్మికతత్వం అంతర్లీనం కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధింపదు. సర్వకర్మలు జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయన్నది భగవద్గీత. కనుక వైకుంఠ ఏకాదశీ వ్రతంలోనూ ఆధ్యాత్మిక నిధి విధిగా ఉంటుంది. యథాశక్తిగా ఏకాదశి అంతర్గత తాత్విక ఆనందాన్ని ఆస్వాదిస్తాం.

తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు "నిహితం గుహాయాం విభ్రాజతే". అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం, ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

వైకుంఠ ఏకాదశి నాడు చేయవలసిన విధివిధానాలు
ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటిఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి, శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పెద్దలు చెబుతున్నారు.

ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చేసిన పాపలు తొలగుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి మొదలైన వైష్ణవ ఆలయాలను దర్శించుకోవచ్చు.

వైకుంఠ + ఏకాదశి అర్థ వివరణ
వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ - ఏకాదశి అని రెండు పదాలున్నాయి. 'వైకుంఠ' - అంటే 'విష్ణువును', విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. 'చాక్షుషమన్వంతరం' లో 'వికుంఠ' అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠుడు" అయ్యాడు. వైకుంఠము - శ్వేతదీపమైన విష్ణుదేవుని స్థానం, పునరావృత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరమధామం. జీవులు వైకుంఠుడుని అర్చించి, ఉపాసించి, వైకుంఠానికి చేరుటే ముక్తి. ఇంద్రియాలు ఇంద్రియాధిస్ఠాన నారాయణున్ని సేవించుటే భక్తి కదా ! వైకుంఠము అంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం.

"మనః షష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి" - అంటే గీతావాక్యానుసారం మనస్సు+10 ఇంద్రియములు అనగా పదకొండు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా జీవాత్మ ఆకర్షిస్తుంది. అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాలను+ప్రాణాలను+బుద్ధిని కూడా తనతో తీసుకొని పోతుంది. జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు మొదటి శరీరం నుండి మనస్సుతో ఇంద్రియాలనూ ఆకర్షించి తీసుకువెళుతుంది. మనస్సంటే 'అంతఃకరణం'.
ఈ పదకొండు ఇంద్రియాలు వైకుంఠునికి అర్పింపబడి, వైకుంఠుడిని అర్చించి, సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రములై వాటిద్వారా సుఖానుభూతి పొందే జీవుణ్ణి వైకుంఠములో చేరుస్తాయి. కాగా "ఏకాదశేంద్రియాలను వైకుంఠార్పణం చేసి, వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తిని పొంది, ధన్యులవ్వండి - అని బోధిస్తుంది.

"వైకుంఠ ఏకాదశి" - వికుంఠమంటే ... దెబ్బతిననిది. ఇంద్రియాలు "వికుంఠాలు" అయినప్పుడే వైకుంఠ సమర్చన ప్రశాంతంగా జరుగుతుంది.
ద్వాదశి - 12వ స్థితి. ఇదే ఇంద్రియాతీతదివ్యానంద స్థితి. ఏకాదశినాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం. ఒక వస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొక వస్తువు ఉంచినప్పుడే మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండవదానిపై ప్రభావం చూపిస్తాయి కదా ! అదేవిధంగా ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ వైకుంఠునికి - ఉప = సమీపంలో, వాసః =నివసించటం వలన అత్యంత దగ్గర సాన్నిధ్య ప్రభావం కారణంగా, జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. అంతట జీవుడు శుద్ధుడవుతాడు.
ఇంతటి ప్రభావసంపన్నమైన వైకుంఠ ఏకాదశినీ, ద్వాదశినీ భక్తిశ్రద్దలతో ఆచరించినవారికి పునర్జన్మ ఉండదు.
సర్వేజనా సుఖినోభవంతు



ప్ర'పంచ' దంపతులు



ప్ర'పంచ' దంపతులు



ఈ లోకంలో
కోట్లాది కోట్ల దంపతులున్నా
వాళ్ళంతా 5 విధాలు
గానే ఉంటారు.

*మొదటిది* *లక్ష్మీనారాయణులు* విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట

*రెండవది*
*గౌరీశంకరులు* అర్థనారీశ్వరరూపం,
తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

*మూడవది*
*బ్రహ్మ సరస్వతుల జంట*
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా
ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

*నాల్గవది*
*ఛాయా సూర్యులు* సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

*ఐదవది*
*రోహిణీ చంద్రులు*
రోహిణీ కార్తెలో
రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.
*చదివారు కదా*
ఇంతకీ ఈ 5 జంటలలో *మీరు ఏ జంట అయ్యారో* చెప్పండి.

kshetramulu






Friday, December 22, 2017

శనివార మహిమ - శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం



శనివార మహిమ - శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం

శనివారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి .అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శని వారం శ్రేష్టమైనది .
’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’

బీఅంటే ప్రతి శని వారం భరతుడు హనుమను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి .తైలంతో కూడిన గంధసి0దూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశోవంతు లైన పుత్రులు కలుగుతారు .

మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమము ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీపించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శనీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమశిరస్సు మీద ఉంటానని చెప్పాడు .

సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

‘’ మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది .

సాధారణం గా శని బాధ తట్టు కోవటం చాలా కష్టం .అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు .అయితే పేద వారు చేయ లేరు కదా .నూనె తో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండక పోవచ్చు .ఇలాంటి వారి కోసం శ్రీ మద్రామాయణం లోని సుందర కాండ లో ని 48 వ సర్గ ను శని వారం ఉదయం ,సాయంకాలం పఠిస్తేశని దేవుని అనుగ్రహం పొంద గలరు .ఖర్చు లేని పని .ఇప్పుడు ఆ సర్గ లో ఉన్న విషయాన్ని తెలుసు కొందాం
ఆంజనేయుడు లంక లో ఉన్న రాక్షసులను కాలితో ,చేతులతో కొండలతో తోక తో చంపి పారేస్తున్నాడు .రావణుడు పంపిన అక్ష కుమారుణ్ణి ససైన్యం గా హతమార్చాడు .చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ‘’ఇంద్ర జిత్ ‘’అనే బిరుదు పొందిన తన పుత్ర రత్నం మేఘ నాదుడిని సైన్యం తోడూ ఇచ్చి హనుమ పైకి యుద్ధానికి పంపించాడు.పంపిస్తూ కొడుకు తో ఇలా చెప్పాడు ‘’నాయనా !నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు .రణ వేత్తవు .ఇద్రు డిని సునాయాసం గా గెలిచి రాక్హస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు .బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించు కొన్నావు .నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడ లేరు .మూడు లోకాల్లో నిన్ను జయించ గల మగాడు లేడు .నీ చేత ఓడిమ్పబడని వాడూ లేడు .నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది .ఏయే కాలాలలో ఏయే ప్రదేశాలలో ఏమి చేయాలో నీకు బాగా తెలుసు .నీకు యుద్ధం లో అసాధ్యమైనది లేదు .సూక్ష్మ బుద్ధి తో ఆలోచించి కార్య సాధన చేయ గల సర్వ సమర్దుడవు .నీ భుజ ,వీర్య ,తపో బలాలు నాతో సమాన మైనవి .యుద్ధ సమయం లో నేను నిర్ణ యించిన పని చిటికెలో నువ్వు చేయ గల వాడివి .నువ్వు అండగా ఉండ బట్టే నేను ఇంత నిక్షేపం గా లంకా రాజ్య పాలన చేస్తున్నాను .ఎవడో కోతి మన మహా వీరు లందర్నీ అశోక వనం దగ్గర ఉండి మట్టు పెడు తున్నాడు .అక్షయ కుమారుడిని చంపేశాడు .జంబుమాలి ,పంచ సేనాగ్ర నాయకులు వాడి చేతి లో మరణించారు . .మన సైన్యం దాదాపు అంతా క్షీణించి పోయింది .నువ్వే ఇప్పుడు లంకా రాజ్యాన్ని రక్షించ గల ఏకైక వీరుడివి .ఎంత మంది సైనికుల్ని పంపినా ఆ కోతి సునాయాసం గా చంపేసి భయం కల్గిస్తున్నాడు .వారి వల్ల ఇక కార్యం సాను కూల పడదు .ఆ కోతి పరాక్రమం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చాడో ఆతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో .దాన్ని బట్టి నీ దగ్గ ర ఉన్న సర్వశాస్త్రాలను ధైర్యం గా ప్రయోగించు .వాడిని వదించటం తక్షణ కర్తవ్యం .నువ్వే తగిన వాడివి .నిన్ను పంపటం నాకు సుత రామూ ఇష్టం లేక పోయినా తప్పని సరి గా పంపువలసి వస్తోది .లంకా రాజ్య భవిష్యత్తు అంతా నీ చేతి లో ఉంది .విజయం సాధించి తిరిగి రా .నా ఆశీస్సులు ,లంకా వాసుల ఆశీస్సులు నీకు లభించు గాక ‘’అని చెప్పి ఉత్సాహ పరచి ఇంద్ర జిత్ ను పంపాడు
రెట్టించిన ఉత్సాహం తో ,ఉప్పొంగిన పరాక్రమం తో ఇంద్రజిత్ సకల సేనా సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి ఆశీస్సులు గ్రహించి ప్రణామం చేసి బయల్దేరాడు .ఉప్పొంగే సముద్రం లా ఉన్నాడు .గరుత్మంతుని వేగం తో కదిలాడు .నాలుగు ఏనుగులున్న రధాన్ని ఎక్కాడు .సుశిక్షితు లైన విలుకాన్ద్రను వెంట బెట్టు కొన్నాడు .హనుమ ఉన్న ప్రదేశానికి క్షణాల్లో చేరాడు .అప్పడు పది దిక్కుల్లో దుశ్శకునాలు కలిగాయి క్రూర మృగాలు అరిచాయి .వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు ,సిద్ధులు ,సాధ్యులు దేవతలు అందరు ఆకాశవీధి లోఉత్కంథ గా చేరి చూస్తున్నారు .
ఇంద్ర జిత్ విచిత్ర ధ్వని కలిగేటట్లు ధనుష్టన్కారం చేశాడు .హనుమ ఇంద్ర జిత్తులు యుద్ధం ప్రారంభించారు .అతి వేగం గా ఇంద్ర జిత్ బాణ ప్రయోగం చేస్తున్నాడు .మహాకాయుడు అయిన ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తున్నాడు .ఆకాశ మార్గం లో సంచరిస్తూ అతనికి అంద కుండా అసహనాన్ని కల్గిస్తున్నాడు .ఎన్నో రకాల శరాలను లాఘవం గా సందిస్తున్నాడు రావణ పుత్రుడు .వాటిని అతి తేలిక గా తప్పించు కొంటున్నాడు వాయు పుత్రుడు .అతని బాణ ధ్వని ,రాధ ధ్వని భేరీ ల ధ్వని విని ఆకాశం లోకి అంద నంత ఎత్తు కు యెగిరి తప్పించు కొంటున్నాడు మారుతి .ఒకరి కొకరు తీసి పోకుండా యుద్ధం చాలా సేపు చేశారు .ఎంత చేసినా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అర్ధం కాలేదు .అతని అతి శక్తి వంత మైన బాణాలన్ని వ్యర్ధమే అయ్యాయి .హనుమంతుని ,ఇసుమంతైనా ఏమీ చేయ లేక పోయాయి .హనుమ ను వోడించటం అసాధ్యం అని ఇంద్రజిత్ నిర్ణయానికి చ్చాడు .మరి ఉపాయం ?బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమ ను బంధించాలి అని నిశ్చయించు కొన్నాడు .
మంత్ర పూతం గా బ్రహ్మాస్త్రాన్ని హనుమ పై ఇంద్ర జిత్ ప్రయోగించాడు .అరి వీర భయంకరుడైన హరి వీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింప బడ్డాడు .ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం .అయితే అది తను ఏమీ చేయదు అన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది .నమస్కరించి బద్ధుదయాడు .,బంధుడు అయాడు .ఈ బ్రహ్మాస్త్ర బంధనం తనకు మేలే చేస్తుందని ,రావణుడిని చూసే ఆవ కాశం కలుగు తుందని ,దానితో అతని పరాక్రమం ,వ్యూహం తెలుసు కొ వచ్చునని భావించాడు .రాక్షసులు బలాత్కారం గా పట్టి లాగుతున్నా ,ఏమీ మాట్లాడ లేదు .తప్పించు కొనే ప్రయత్నమూ చేయ లేదు .అతని నిర్వి చేష్టతను గమనించి రాక్షసులు హనుమ ను గొలుసు లతో నార వస్త్రాలతో కట్టే శారు .బ్రహ్మ వరం పని చేసింది .బంధింప బడ గానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచి పోయింది .వేరే బంధం ఉంటె బ్రహ్మాస్త్ర బంధం పని చేయదు .అది హనుమ కు మాత్రమే తెలుసు .ఈ విషయం ఇంద్ర జిత్ అర్ధం చేసు కొన్నాడు .తను కష్ట పడి బంధించింది అంతా వ్యర్ధమైనదని దుఃఖించాడు .ఇక ఈ మాయా కపి వల్ల లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని ఊహించాడు .ఏమీ చేయ లేక మౌనంగా తండ్రి దగ్గరకు ,సైన్యం హనుమను ఈడ్చుకొని వస్తుంటే చేరాడు .విషయాన్ని అంతటిని తండ్రికి వివ రించాడు .హనుమ ను చూసి రాక్షసు లందరూ ‘’చంపండి ,నరకండి ‘’అని అరుస్తున్నారు .
హనుమ రావణ సింహా సనం దగ్గరకు వెళ్లాడు .అక్కడి పెద్దలన్దర్నీ తేరి పార జూశాడు .రావణుడు మంత్రులతో ‘’ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసు కొండి ‘’అని ఆజ్ఞా పించాడు .వారు హనుమను వివరాలు అడిగారు .అప్పుడు హనుమంతుడు ‘’నేను రామ బంటును .హనుమ నామ దేయుడిని .సుగ్రీవుని మంత్రిని .సీతా మాత శ్రీ రాముని ఇల్లాలు .నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెదికిఆమె జాడ తెలుసు కోమని దక్షిణ దిక్కు కు పంపితే ఇక్కడ ఉందని తెలుసు కొని లంక చేరాను. దుస్తర మైన సముద్రాన్ని ఆవ లీల గా దాటాను .ఇది నా శక్తి కాదు శ్రీ రాముని దివ్య విభూతి మాత్రమే ..’’అని చెప్పాడు –కనుక శని పీడా బాధితులు శని వారం నాడు సుందర కాండ లోని ఈ నలభై ఎనిమిదవ సర్గ ను భక్తీ తో పఠిస్తే ఆ పీడ నుంచి విరగడ పొందుతారు
జై హనుమాన్
మీ
భాను ప్రకాష్ ఆదూరి

గురుగ్రహ దోష నివారణకు "దక్షిణామూర్తి స్తోత్రం"



గురుగ్రహ దోష నివారణకు

"దక్షిణామూర్తి స్తోత్రం"

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా....

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్



Tuesday, December 19, 2017

రాహుకాల పూజ..!!



రాహుకాల పూజ..!!

రాహుకాలం అనగానే, ఆ సమయంలో ఎదైన పని మీద బయలుదేరటంగాని, కొత్తగా..ఏదైనా ..పనిని మొదలు పెట్టడం గాని చెయ్యొద్దు అని మన ఇళ్ళలో అంటూ ఉంటారు. కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి.

రాహువు..మంత్రాలకు..అధిదేవత. రాహువుకు దుర్గాదేవి..అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అందుకే గ్రహణ సమయంలో..మంత్రం తీసుకున్నవాళ్ళు మంత్రజపం చేసుకుంటారు.

ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి.

ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, ఏదైనా శ్రీదుర్గా స్తోత్రం...చదివి నైవేద్యం పెట్టాలి.

రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది.

కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడ్తారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది.. లేదూ ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో..బయట తులసి కోట దగ్గర పెట్టాలి..ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు..ఒకరే వెలిగించాలి..

రాహుకాల సమయం :..
సోమవారం - ఉ 7:30 -9:00
మంగళవారం - మ 3:00 -4:30
బుధవారం - మ 12.00 - 1:30
గురువారం - మ 1:30 - 3:00
శుక్రవారం - ఉ 10:30 - 12:00
శనివారం - ఉ 9:00 - 10:30
ఆదివారం - సా 4:30 - 6:00

సూర్యోదయం..రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది..దాన్నిబట్టి రాహుకాల టైమ్ మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి...ముందు ఒక అరగంట..వెనుక ఒక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోండి.అంటే ఉదాహరణకు..
సోమవారం ..ఉ 7.30 to 9.00 అంటే 8 to 8.30 ఇలా చూసుకోండి...

Monday, December 18, 2017

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం.



పుష్యమాసంలోని పున్నమి తిది నాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది.

ఈ మాసం లో పంటలు పండి.. ధాన్యం ఇండ్లకు చేరడము వల్ల రైతుల శ్రమ, కష్టం ఫలించి ఫలం లభించే మాసం. చాంద్రమాసం ప్రకారం ఈ మాసంను శూన్య మాసం అంటారు. ఈ మాసములో పగలు తక్కువ. రాత్రి అధికము.

పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కనుక ఈ నెలలో శనిదేవుడి ప్రభావము అధికంగా వుంటుంది. శనిదేవుడికి ప్రతీకమైన మాసము కనుక ఈ నెలఅంతా శనిదేవుడిని పూజించవలెను.

ఈ మాసములోని ఆదివారాల్లో ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యభగవానుడిని పూజించాలని శాస్త్ర వచనము . ముఖ్యంగా ఆదివారంనాడు సూర్యుడిని ఆవుపాలతో అభిషేకించి, జిల్లేడు పూలతొ పూజించవలెను. ఈ నెలలో వచ్చే సప్తమిని మార్తాండ సప్తమి అంటారు. ఆ రోజు సూర్యుడిని పూజ చేయడము వల్ల మంచి ఫలితము వస్తుంది.

సంవత్సరంలోని పదవ మాసం పుష్యము. సూర్యుడు ' భగ ' అను పేరుతొ రథముపై సంచరించి ప్రపంచమునకు వెలుగునిస్తాడు. ఆ రథములో అరిష్టనేమి అను గంధర్వువుడు, పుర్వచిట్ట అను అప్సరస, ఊర్నుడు అను యక్షుడు, కర్కోటకుడు అను పాము, ఆయువు అను ఋషి, స్ఫూర్ణ అను రాక్షసుడు ప్రయాణిస్తారు.

తిథి, వార, మాస, సంవత్సర, ఆయనములు, ఘటికలు మొదలగు కాలముయొక్క భాగములు భగాదిత్యుడి అధిపతి పదకొండు వేల కిరణముల ప్రకాశాములతో ఉండును. ఎర్రని రంగు కిరణములో ఉంటుంది. ప్రకృతి అంతటా ఐశ్వర్య రూపముతో పుస్యమాసమంతా తిరుగుతాడు.

సూర్యుడు, శివుడు, చంద్రుడు, సౌభాగ్యము, ప్రసన్నత, కీర్తి, అందము, ప్రేమ , మంచిగుణములు, ధర్మములు, ప్రయత్నములు, మోక్షము, శక్తి అన్నీ భాగాదిత్యుని రూపాలే. ప్రకృతియందు దివ్యశోభ నింపుతాడు.

పుష్యమాసంలో సూర్యున్ని ఉపాసించే వారికి సంపదలు, మోక్షము ఇస్తాడు. అసలుభాగము అంటేనే ఐశ్వర్యము, ధర్మమూ, జ్ఞానము, వైరాగ్యము. ఈ ఆరు లక్షణాలను భగము అంటారు. పుష్యమాసమున భగాదిత్య స్వామికి బియ్యము, నువ్వులు కలిపి పొంగలి చేసి నివేదించాలి. నారించ రసముతో అర్గ్యము ఇవ్వాలి. ఆరోగ్యము, ఆనందము ఇస్తాడు.

పుష్య అమావాస్య నాడు ఇంటిలోని ఒక చోట శుబ్రపరచి బియ్యపిండితో అష్టదళ పద్మములు వేసి దానిపైన కుంపటి పెట్టి దాంట్లో ఆవు పిడకలు వేసి వెలిగించి దానిమీద కాంస్య పాత్రలో పాయసము చేసి ఉంచవలెను. ప్రక్కనే శివలింగం వుంచవలెను. కంచుపాత్ర యందు బ్రహ్మ దీవుడిని, పాయసము నందు శ్రీ మహా విష్ణువును , శివలింగం నందు శివుడిని ఆవాహన చేసి పూజించవలెను.

బ్రాహ్మణుడికి దక్షిణ తాబూలాలు ఇవ్వవలెను. తరువాత శివలింగాన్ని, ఆ పాత్రను బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను. ఈ విధంగా చేయడము వల్ల భూదాన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలితము లభిస్తాయి.

ఈ విధంగా ఎన్నో విశిష్టతలను కలిగిన ఈ పుష్యమాసములో చేసే పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆయురారోగ్యాలు చేకూరుతాయని మన గ్రంధాలలో చెపుతారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసంలో మన అందరమూ కూడ ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాలని పొందుదాము.
పుష్య మాసం ప్రారంభం.

చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.

ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటితో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికం గా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

శ్రీగోదా పూజా విధానము

శ్రీగోదా పూజా విధానము
నిత్య ఆరాధనలో లక్ష్మీ అష్టోత్తరం తరువాత శ్రీకృష్ణఅష్టోత్తర శతనామావళి, శ్రీగోదా అష్టోత్తర శతనామావళి చేర్చి పూజ చేయండి.
ధనుర్మాస పూజా విధానము
గోదాయై నమః శ్రీమతే రామానుజాయ నమః
స్నానానంతరం పరిశుద్ధ వస్త్రములు ధరించి ఊర్ధ్వపుండ్రాన్ని పెట్టుకొని గురుపరంపరను అనుసంధించుకొని, పెరుమాళ్ళ సన్నిధి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకములను అనుసంధించాలి.
అమర్యాదః క్షుద్రశ్చలమతిరసూయా ప్రసవభూః
కృతఘ్నో దుర్మానీ స్మర పరవశో వంచన పరః |
నృశంసః పాపిష్ఠః కథ మహమితో దుఃఖజలధేః
అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః ||
నమో నమో వాఙ్మనసాతి భూమయే
నమో నమో వాఙ్మనసైక భూమయే |
నమో నమోనంత మహావిభూతయే
నమో నమోనంత దయైక సింధవే ||
న ధర్మ నిష్ఠోస్మి నచాత్మవేదీ
న భక్తి మాన్ త్వహ్చరణారవిందే |
అంకిచనో నన్యగతిశ్శరణ్యః
త్వ త్పాద మూలం శరణం ప్రపద్యే ||
కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలా కాన్త త్రైలోక్యం మంగళం కురు ||
తతోఖిల జగత్పద్మ భోధాయాచ్యుత భానునా |
దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||
ఇతి కర తాళత్రయేన భగవంతం ప్రభోధ్య, కవాటం విముచ్య
(3 సార్లు చప్పట్లు చరిచి, ద్వారములు తీసి పెరుమాళ్ళను మేల్కొలపాలి)
నిర్మాల్యము తొలగించి, మనసులో చేయదలచిన ఆరాధనను ఒకసారి పరిపూర్ణముగా భావించి, పంచపాత్రలలో పరిమళ తీర్థమును నింపి, తులసీదలము వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలెను.
ముందుగా మనసులో ఆచార్యారాధన చేసుకొని
స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం ( అని పెరుమాళ్ళతో విన్నవించి)
స్వ శేష భూతేన మయా స్వీయైః సర్వ పరిచ్ఛదైః |
విధాతుం ప్రీత మాత్మానం దేవః ప్రక్రమతే స్వయం ||
భగవన్! పుండరీకాక్ష! హృద్యాగంతు మయాకృతం |
ఆత్మ సాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యగర్భయే ||
(అని ప్రార్థించి పాదముల చెంత తులసిని అర్పించాలి)
1. ధ్యానము
కూర్మాదీన్ దివ్యలోకాన్, తదను మణిమయం
మంటపం తత్రశేషం |
తస్మిన్ ధర్మాది పీఠం, తదుపరి కమలం
చామర గ్రాహిణీశ్చ |
విష్ణుం దేవీర్విభూషాయుధగణ, మురగం
పాదుకే వైన తేయం
సేనేశం ద్వార పాలాన్ కుముదముఖ గణాన్
విష్ణు భక్తాన్ ప్రపద్యే
సవ్యం పాదం ప్రసార్య, ఆశ్రిత దురిత హరం
దక్షిణం కుంచయిత్వా
జానున్యాధాయ సవ్యేతర మితరభుజం
నాగ భోగే నిధాయ |
పశ్చాద్భాహుద్వయేన ప్రతిభట శమనే
ధారయన్ శంఖ చక్రే |
దేవీ భూషాది జుష్టో జనయతు
జగతాం శర్మ వైకుంఠ నాథః
(శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా యుంచి మనస్సులో కూడా వారిని నిలుపుకొంటూ)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
శ్రీ-భూ-నీళా-గోదాది దేవిభ్యో నమః
అనంత గరుడ విష్వక్సేనాది నిత్య సూరి గణేభ్యో నమః
శ్రీపరాంకుశ పరకాల యతివర వరవర మున్యాది ఆళ్వారాచార్యేభ్యో నమః
ఓం సర్వాన్ ధ్యాయామి
2. స్వాగతం (నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి)
ఆవాహయామి (స్వాగత ముద్ర చూపాలి)
3.సింహాసనం ( మన ఆరాధన అందుకోవడానికి మూర్తి ఉన్న స్థానంలో కూర్చోమని చెప్పండి)
రత్న సింహాసనం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
4. అర్ఘ్యం
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(అర్ఘ్య పాత్ర నుండి పెరుమాళ్ళ చేతికి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
5. పాద్యం
పాదయోః పాద్యం సమర్పయామి (పాదాలకు రెండు సార్లు నీటిని అందించాలి)
(పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
6. ఆచమనీయం
ముఖే ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించాలి)
(ఆచమాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
దంత కాష్ఠ జిహ్వా నిర్లేఖన గండూషణ
ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన
అంగోద్వర్తన ఆమలకతోయ హరిద్రాలేపన
స్నాన కూర్చ ప్రసారణాని సమర్పయామి
7. పవిత్ర స్నానం
స్నానం సమర్పయామి
(స్నాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ప్లోత వస్త్రం సమర్పయామి ( పూల రెక్కతో తడి ఆరునట్లు అద్దాలి)
8. వస్త్ర యుగ్మం
వస్త్ర యుగ్మం సమర్పయామి (నూతన పట్టు వస్త్రాలు/ పుష్పాన్ని సమర్పించండి)
9. ఊర్ధ్వ పుణ్డ్రం
ఊర్ధ్వ పుణ్డ్రాన్ సమర్పయామి ( తిరునామము/శ్రీచూర్ణం సమర్పించండి)
10. యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
11. చందనం
దివ్య శ్రీ చందనం సమర్పయామి (చందనం సమర్పించండి)
12. ఆభరణములతో అలంకారం
సర్వాభరణాలంకారాన్ సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
(ఈ విధముగనే పరివారమునకందరకూ అలంకరణ పర్యంతము చేసి)
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
13. నామావళి
ఓం శ్రీరంగనాయక్యై నమః
తులసీ దళైః పుష్పైశ్చ పూజయామి
(తులసీ దళములు, పుష్పములతో కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ
హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దానియంది మన ప్రేమని నింపి అర్చన చేయాలి)
01 ఓం కేశవాయ నమః
02 ఓం నారాయణాయ నమః
03 ఓం మాధవాయ నమః
04 ఓం గోవిందాయ నమః
05 ఓం విష్ణవే నమః
06 ఓం మధుసూదనాయ నమః
07 ఓం త్రివిక్రమాయ నమః
08 ఓం వామనాయ నమః
09 ఓం శ్రీధరాయ నమః
10 ఓం హృషీకేశాయ నమః
11 ఓం పద్మనాభాయ నమః
12 ఓం దామోదరాయ నమః
13 ఓం సంకర్షణాయ నమః
14 ఓం వాసుదేవాయ నమః
15 ఓం ప్రద్యుమ్నాయ నమః
16 ఓం అనిరుద్ధాయ నమః
17 ఓం పురుషోత్తమాయ నమః
18 ఓం అధోక్షజాయ నమః
19 ఓం నారసింహాయ నమః
20 ఓం అచ్యుతాయ నమః
21 ఓం జనార్దనాయ నమః
22 ఓం ఉపేంద్రాయ నమః
23 ఓం హరయే నమః
24 ఓం శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి
01 ఓం శ్రీకృష్ణాయ నమః
02 ఓం కమలానాథాయ నమః
03 ఓం వాసుదేవాయ నమః
04 ఓం సనాతనాయ నమః
05 ఓం వసుదేవాత్మజాయ నమః
06 ఓం పుణ్యాయ నమః
07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః
08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
09 ఓం యశోదావత్సలాయ నమః
10 ఓం హరయే నమః
11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః
12 ఓం దేవకీనందనాయ నమః
13 ఓం శ్రీశాయ నమః
14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః
15 ఓం యమునావేగ సంహారిణే నమః
16 ఓం బలభద్రప్రియానుజాయ నమః
17 ఓం పూతనాజీవిత హరాయ నమః
18 ఓం శకటాసురభంజనాయ నమః
19 ఓం నందవ్రజ జనానందినే నమః
10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః
22 ఓం నవనీతనటాయ నమః
23 ఓం అనఘాయ నమః
24 ఓం నవనీతనవాహారాయ నమః
25 ఓం ముచికుందప్రసాదకాయ నమః
26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27 ఓం త్రిభంగినే నమః
28 ఓం మధురాకృతయే నమః
29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః
30 ఓం గోవిందాయ నమః
31 ఓం యోగినాంపతయే నమః
32 ఓం వత్సవాటచరాయ నమః
33 ఓం అనంతాయ నమః
34 ఓం ధేనుకాసురభంజనాయ నమః
35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36 ఓం యమళార్జునభంజనాయ నమః
37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః
38 ఓం తమాలశ్యామలాకృతయే నమః
39 ఓం గోపగోపీశ్వరాయ నమః
40 ఓం యోగినే నమః
41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః
42 ఓం ఇలాపతయే నమః
43 ఓం పరంజ్యోతిషే నమః
44 ఓం యాదవేంద్రాయ నమః
45 ఓం యదూద్వహాయ నమః
46 ఓం వనమాలినే నమః
47 ఓం పీతవాససే నమః
48 ఓం పారిజాతాపహారకాయ నమః
49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః
50 ఓం గోపాలాయ నమః
51 ఓం సర్వపాలకాయ నమః
52 ఓం అజాయ నమః
53 ఓం నిరంజనాయ నమః
54 ఓం కామజనకాయ నమః
55 ఓం కంజలోచనాయ నమః
56 ఓం మధుఘ్నే నమః
57 ఓం మధురానాధాయ నమః
58 ఓం ద్వారకానాయకాయ నమః
59 ఓం బలినే నమః
60 ఓం బృదావనాంత సంచారిణే నమః
61 ఓం తులసీదామభూషణాయ నమః
62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః
63 ఓం నరనారాయణాత్మకాయ నమః
64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః
65 ఓం మాయినే నమః
66 ఓం పురమపురుషాయ నమః
67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః
68 ఓం సంసారవైరిణే నమః
69 ఓం కంసారయే నమః
70 ఓం మురారయే నమః
71 ఓం నరకాంతకాయ నమః
72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః
74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః
75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః
76 ఓం విదురాక్రూరవరదాయ నమః
77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
78 ఓం సత్యవాచే నమః
79 ఓం సత్యసంకల్పాయ నమః
80 ఓం సత్యభామారతాయ నమః
81 ఓం జయినే నమః
82 ఓం సుభద్రాపూర్వజాయ నమః
83 ఓం విష్ణవే నమః
84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
85 ఓం జగద్గురవే నమః
86 ఓం జగన్నాథాయ నమః
87 ఓం వేణూనాదవిశారదాయ నమః
88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః
89 ఓం బాణాసుర కరాంతకాయ నమః
90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః
92 ఓం పార్థసారథయే నమః
93 ఓం అవ్యక్తాయ నమః
94 ఓం గీతామృతమహోదధయే నమః
95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
96 ఓం దామోదరాయ నమః
97 ఓం యజ్ఞభోక్త్రే నమః
98 ఓం దానవేంద్రవినాశకాయ నమః
99 ఓం నారాయణాయ నమః
100 ఓం పరస్మై బ్రహ్మణే నమః
101 ఓం పన్నగాశనవాహనాయ నమః
102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
103 ఓం పుణ్యశ్లోకాయ నమః
104 ఓం తీర్థపాదాయ నమః
105 ఓం వేదవేద్యాయ నమః
106 ఓం దయానిధయే నమః
107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
108 ఓం సర్వ గ్రహరూపిణే నమః
109 ఓం పరాత్పరాయ నమః
శ్రీ లక్ష్మీ అష్టోత్తరము
వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్‌ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం
పార్వ్శే పంకజ శంఖపద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
 
సరసిజనయనే! సరోజహస్తే!
ధవళతరాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి! ప్రసీద మహ్యమ్‌ ||
1.ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదామ్‌ |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్‌ ||
2.వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్‌ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్‌ ||
3.అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్‌ |
నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవామ్‌ ||
4.అనుగ్రహ పరాం ఋద్ధిం అనఘాం హరి వల్లభామ్‌ |
అశోకా మమృతాం దీప్తాం లోకశోక వినాశినీమ్‌ ||
5.నమామి ధర్మనిలయాం కరుణాం లోక మాతరమ్‌ |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసున్దరీమ్‌ ||
6.పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమామ్‌ |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్‌ ||
7.పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదా భిముఖీం ప్రభామ్‌ |
నమామి చన్ద్రవదనాం చన్ద్ర్రాం చన్ద్రసహోదరీమ్‌ ||
8.చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందు శీతలామ్‌ |
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్‌ ||
9.విమలాం విశ్వ జననీం తుష్టిం దారిద్ర్య నాశినీమ్‌ |
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్ల మాల్యాంబరాం శ్రియమ్‌ ||
10.భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్‌ |
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమ మాలినీమ్‌ ||
11.ధనధాన్యకరీం సిద్ధిం స్రైణసౌమ్యాం శుభప్రదామ్‌ |
నృపవేశ్మ గతా నందాం వరలక్ష్మీం వసుప్రదామ్‌ ||
12.శుభాం హిరణ్య ప్రాకారాం సముద్ర తనయాం జయామ్‌ |
నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థల స్థితామ్‌ ||
13.విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితామ్‌ |
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్‌ ||
14.నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్‌ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీమ్‌ ||
 
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాఙ్కురామ్‌ |
శ్రీమన్మన్ద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్‌ ||
 
మాతర్నమామి కమలే! కమలాయతాక్షి!
శ్రీవిష్ణుహృ త్కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే! కమల కోమల గర్భగౌరి!
లక్ష్మి! ప్రసీద సతతం నమతాం శరణ్యే ||
ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్
శ్రీగోదా అష్టోత్తర శతనామావళి
01 ఓం శ్రీరంగనాయక్యై నమః
02 ఓం గోదాయై నమః
03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
04 ఓం సత్యై నమః
05 ఓం గోపీవేషధరాయై నమః
06 ఓం దేవ్యై నమః
07 ఓం భూసుతాయై నమః
08 ఓం భోగశాలిన్యై నమః
09 ఓం తులసీకాననోద్భుతాయై నమః
10 ఓం శ్రీయై నమః
11 ఓం ధన్విపురవాసిన్యై నమః
12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
14 ఓం అమూక్త మాల్యదాయై నమః
15 ఓం బాలాయై నమః
16 ఓం రంగనాథ ప్రియాయై నమః
17 ఓం పరాయై నమః
18 ఓం విశ్వంభరాయై నమః
19 ఓం కలాలాపాయై నమః
20 ఓం యతిరాజసహోదర్యై నమః
21 ఓం కృష్ణానురక్తాయై నమః
22 ఓం సుభగాయై నమః
23 ఓం సులభశ్రియై నమః
24 ఓం సలక్షణాయై నమః
25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
26 ఓం శ్యామాయై నమః
27 ఓం దయాంచిత దృగంచలాయై నమః
28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
29 ఓం రమ్యాయై నమః
30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
33 ఓం నారాయణసమాశ్రితాయై మనః
34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
37 ఓం బ్రహ్మణ్యాయై మనః
38 ఓం లోకజనన్యై మనః
39 ఓం లీలామానుషరూపిణ్యై మనః
40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః
41 ఓం అనుగ్రహాయై నమః
42 ఓం మాయాయై నమః
43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
44 ఓం మహాపతివ్రతాయై నమః
45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
47 ఓం నిత్యాయై నమః
48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః
49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
50 ఓం మంజుభాషిణ్యై నమః
51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
52 ఓం రంగమంగళ దీపికాయై నమః
53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
54 ఓం తారకాకారనఖరాయై నమః
55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
57 ఓం శోభనపార్షికాయై నమః
58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
60 ఓం పరమాయై నమః
61 ఓం అణుకాయై నమః
62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
66 ఓం విశాలజఘనాయై నమః
67 ఓం పీనసుశ్రోణ్యై నమః
68 ఓం మణిమేఖలాయై నమః
69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః
71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః
73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
74 ఓం కల్పమాలానిభభుజాయై నమః
75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః
78 ఓం కంబుకంఠ్యై నమః
79 ఓం సుచుబుకాయై నమః
80 ఓం బింబోష్ఠ్యై నమః
81 ఓం కుందదంతయుజే నమః
82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః
84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
88 ఓం సుగంధ వదనాయై నమః
89 ఓం సుభ్రువే నమః
90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః
91 ఓం పూర్ణచంద్రాననాయై నమః
92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
93 ఓం సౌందర్యసీమాయై నమః
94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః
101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
106 ఓం శ్రీరంగనిలయాయై నమః
107 ఓం పూజ్యాయై నమః
108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః
ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం శ్రీమహాలక్శ్మై నమః
ఓం శ్రీభూదేవ్యై నమః
ఓం శ్రీనీళాదేవ్యై నమః
ఓం శ్రీగోదాదేవ్యై నమః
ఓం శ్రీఅనంతాయ నమః
ఓం శ్రీగరుడాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
ఓం శ్రీపరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః
ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
    

*గాయిత్రి మంత్రము-ప్రత్యేకత



*గాయిత్రి మంత్రము-ప్రత్యేకత*


హిందూమతంలో పూజలలోమంత్రోచ్ఛారణకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది. దేవాలయాలలో ఆ దైవాన్ని పూజిస్తూ పూజారులు ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రోచ్ఛారణ చేయడాన్ని మీరు గమనించే ఉంటారు. అసలు ఈ మంత్రాలను ఎందుకు వల్లిస్తారు? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు, వేరు వేరు దేవతలకు వేరు వేరు మంత్రాలెందుకుంటాయి? వివిధ మంత్రాలలో ఉండే బేధాలేమిటి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడి సన్నిధిలో పఠించే మంత్రాలకు ఎంతో ప్రభావం ఉందట.

సంస్కృత భాషలోనే మంత్రాలు ఉంటాయి. మంత్రంలోని ఉపయోగించే ప్రతి అక్షరానికి ప్రత్యేక ధ్వని ఉంటుంది. సంస్కృత మంత్రాలను పఠించడంలో జాగ్రత్త వహించాలి. ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పలకాలి. మంత్ర పఠన మీలో శక్తిని, బలాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది. మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి. పచ్చటి ఆకుల మీంచి వీచే చల్లని పిల్లగాలి వల్ల మనకు కలిగే ఆహ్లాదం, గలగలమని పారే సెలయేరు ధ్వని మనకు కలిగించే హాయి, ఉరుములు, మెరుపుల వల్ల కలిగే బాధ, భయం ఎలా కలుగుతాయో అలాగే మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.

మంత్రాలను చదవడం వల్ల మనలోనున్న చైతన్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వ్యాధులను నిరోధించే శక్తి మంత్రాలకు ఉంది. చెడు శక్తులను దూరంగా తరిమేయగల శక్తి మంత్రాలకు ఉంది. సంపదను చేకూర్చే శక్తి అలాగే సూపర్ న్యాచురల్ శక్తులను పెంపొందించే శక్తి మంత్రాలకుంది. ఆనందకరమైన స్థితికి తీసుకువెళ్ళే శక్తి మంత్రాలను చదవడం ద్వారా సిద్ధిస్తుందని గమనించాలి.

అటువంటి శక్తివంతమైన మంత్రాలలో ప్రథమ స్థానం గాయత్రీ మంత్రానికి ఉంది. గాయత్రీ మంత్రంలో అత్యద్భుతమైన స్వస్థతను ప్రసాదించే శక్తి ఉంది. మానవులలో మూడు రకాలుగానున్న చైతన్య వ్యవస్థపై ఈ మంత్రం చూపించే ప్రభావం అనిర్వచనీయం. నిద్రావస్థ, స్వప్నావస్థ, మేలుకుని ఉన్నప్పుడు ఇలా మూడు రకాల చైతన్య వ్యవస్థలపై గాయత్రీ మంత్ర ప్రభావం ఎంతో ఉంది. మరి గాయత్రీ మంత్రంలోనున్న అద్భుతమైన హీలింగ్ పవర్స్ గురించి తెలుసుకోవాలని ఉందా? తెలుసుకుందాం మరి.


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్

*భావం*

'మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము' అని అర్థం.

గాయత్రీ మంత్రం యొక్క ప్రాముఖ్యతను 'గాయత్రీ' అనే పదమే వివరిస్తుంది. సంస్కృత భాషలో 'గయంతం త్రియతే ఇతి' అనే పదం నుంచి గాయత్రీ అనే పదం ఉద్భవించింది. ఈ మంత్రాన్ని చదివిన వారు అనేక రకాల బాధల నుంచి విముక్తులవుతారని ఈ పదానికి అర్థం. గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఓం - ఓ బ్రహ్మ లేదా ఓ దైవమా

భూహ్ - కీలక ఆధ్యాత్మిక శక్తి స్వరూపిణి

భువః - బాధలను నశింపచేసే

స్వః - ఆనంద స్వరూపులు

తత్ - ఆ

సవితుర్ - సూర్యుడి వంటి ప్రకాశవంతమైన

వరేణ్యం - అత్యున్నత

భర్గో - పాపాలను నశింపచేసే

దేవస్య - దైవికమైన

ధీమహి - ఇమిడించుకొని

ధియో - తెలివి

యో - అయిన

నః - మన

ప్రచోదయాత్ - స్ఫూర్తి

వేదాలలో గాయత్రీ మంత్రం యొక్క మూలం ప్రస్తావించబడి ఉన్నది. అత్యంత శక్తివంతమైన మంత్రంగా గాయత్రీ మంత్రాన్ని పేర్కొంటారు. ఈ మంత్రానికున్న అపూర్వ శక్తుల వల్ల ఈ మంత్రం కొన్నేళ్ళపాటు యోగులు, గురువులచే రహస్యంగానుంచబడింది.
ఈ మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల కలిగే స్పందనలు ఎన్నో లాభాలను చేకూరుస్తోంది
1. అడ్డంకులను తొలగిస్తుంది
2. ప్రమాదాల నుంచి రక్షిస్తుంది
3. అజ్ఞానాన్ని తొలగిస్తుంది
4. ఆలోచనలకు పవిత్రతనిస్తుంది
5. సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది
6. మనో నేత్రాన్ని తెరిపిస్తుంది
గాయత్రీ శక్తి అనే శక్తి కేంద్రం తేజం, విజయం, విజ్ఞానం అనే మూడు ముఖ్య శక్తులకు కేంద్రబిందువు. గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించినప్పుడు ఈ మూడు రకాల శక్తులు మీలో స్పష్టంగా కనిపిస్తాయి. మీకు దీవెనలు అందించే శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఎవరినైతే దీవిస్తారో వారికి కూడా ఈ శక్తి ప్రాప్తిస్తుంది. మీ తెలివితేటలకు పదును పెట్టి మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.
గాయత్రీ మంత్రాన్ని పఠించడానికి ఉషోదయం మరియు సంధ్యాసమయం ఉత్తమమైనవి. ఈ సమయాలలో వెలుగు, చీకటి పూర్తిగా ఉండవు. ఈ వేళలలో మనస్సు ఒక రకమైన అపస్మారక స్థితికి చేరుతుంది. మన ఆత్మపై మనం దృష్టి సారించడానికి అనుకూల వేళలివి. మనస్సు త్వరగా గందరగోళస్థితికి చేరుతుంది. ఈ సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా బద్దకాన్ని వదిలించుకుని, నిశ్చలస్థితికి చేరుకోవచ్చు. తద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. క్రమం తప్పకుండా గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మీలో సానుకూల పరిస్థితి పెంపొందుతుంది. తద్వారా, ఎల్లవేళలా ఉత్సాహవంతంగా, ఉల్లాసంగా ఉంటారు.

Sunday, December 17, 2017



ముక్కోటి ఏకాదశి రోజున ఏమి చేయాలి..? ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి Vaikunta Ekadasi

Vaikunta Ekadasi Vratha Vidhanam Significance of Mukkoti Ekadasi కోటి పుణ్యాలకు సాటి – ఈ ముక్కోటి ఏకాదశి
హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి! సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత (సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు…

ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురూ. అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది.

అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు, విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమే ఏకాదశి అనే దేవత! ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందనీ, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారనీ వరాన్ని ఒసగాడు. అందుకనే ప్రతి ఏకాదశినాడూ మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీని వల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యమూ, ఆరోగ్యమనే పురుషార్థమూ రెండూ లభించేవి. అయితే సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.
వైకుంఠ ఏకాదశినాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమినాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశినాడు కేవలం తులసితీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశినాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని ఉంటారు. ఏకాదశినాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు… ధ్యానంతోనూ, జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నారు కదా! ఆ ఆకలి, నిద్రలు రెంటినీ తట్టుకుని, వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్ఠత. ఇక మరునాడు ద్వాదశినాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి.
వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పుణీతులవుతారు.
ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు. వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాగా ఆచరించాడట. ఆతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.డా. దెందుకూరి విద్యానాథ్

మల్లన్న_జాతర



మల్లన్న_జాతర

సర్వకాల సర్వావస్థల్లో జీవకోటికి చైతన్యం కలిగించే రూపమే శివుడని ‘శివపురాణం’ చెబుతుంది. నిశ్చలంగా ప్రకాశించే మహా ప్రాణదీపం మహేశ్వరుడు. జీవశక్తిగా వెలిగే పరంజ్యోతి. ఆయన జలనిధిగా గోచరమయ్యే అపరిమిత ఆనంద సాగరుడన్నది ‘శివజ్ఞానామృతోపనిషత్‌’ వాక్యం.
సమస్త జీవరాశి ఏ విధంగా సంభావిస్తే, ఆ విధంగా అనుగ్రహించే భగవచ్ఛక్తి- శివపరమాత్మ. హృదయ కమలాన్ని వికసింపజేసే భగవానుడాయన. సులభ ప్రసన్న దైవం. అందరి మనోమందిరాల్లోనూ కొలువుతీరే అంతర్యామిగా శివుణ్ని ‘స్కాందపురాణం’ వర్ణిస్తుంది. నిర్గుణ నిరాకారుడైన ఆ పరంధాముడికి అనేక నామాలున్నాయి. అవన్నీ విభిన్న కోణాల్లో శివమహిమ వైభవ సూచకాలంటుంది ‘హరివంశం’.
దైవారాధనకు సంబంధించి మంత్ర సహితమైన శిష్ట సంప్రదాయానికి ఎంత ప్రత్యేకత ఉందో, జానపదుల ఆరాధనా రీతికీ అంతే విశిష్టత ఉంది. శివ మహాదేవుణ్ని అందరివాడిగా, ఆదుకునే దైవంగా భక్తులు కొలుస్తారు. జానపదులు వివిధ రూపాల్లో, పలు నామధేయాలతో ఆరాధిస్తుంటారు. ఆ సంవిధానంలోని విలక్షణ స్వరూపమే కొమరవెల్లి మల్లికార్జునస్వామి. భక్తులు ‘కొమరెల్లి మల్లన్న’ అని వ్యవహరిస్తూ, ఆ స్వామి పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
మార్గశిర మాసం ఆదివారంనాటి మల్లన్న జాతరలో భాగంగా కల్యాణోత్సవాన్ని కనువిందుగా నిర్వహిస్తారు. ఫాల్గుణ మాసం చివరి సోమవారంనాడు నిర్వహించే అగ్నిగుండాలతో జాతర ముగుస్తుంది. మూడు నెలలు కొనసాగే ఈ ఉత్సవాల్లో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ప్రతి ఆదివారం, బుధవారం కొలుపులు చేస్తారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలోని ఇంద్రకీల పర్వతంపై మల్లన్న ఆలయముంది. కాకతీయుల కాలం నుంచి ఆ వైభవం కొనసాగుతోంది.
మల్లన్న ఆవిర్భావం గురించి పలు జానపద సంప్రదాయ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒగ్గు కథ, చిందు భాగవతం, కన్నడ యక్షగాన కళారూపాల్లోనూ కొమరెల్లి మల్లన్న కథలకు అత్యంత ప్రాశస్త్యం ఉంది. శివభక్తుడైన కొమురయ్య నాడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. మెచ్చిన స్వామి అతడికి తన ఉనికిని తెలియజెప్పాడని ప్రతీతి. మల్లెతోటలోని ఓ పుట్టలో మహాలింగంగా మృత్తికా రూపాన కొలువై ఉన్నానంటాడు స్వామి. ఆ మట్టితో తన విగ్రహ రూపాన్ని తయారుచేసి ఆరాధించాలంటాడు. శివాజ్ఞ మేరకు కొమురయ్య ఆ స్థలాన్ని గుర్తించి, పుట్టమన్నుతో శివ స్వరూపాన్ని రూపొందించి, ఇంద్రకీల గుట్టపై ప్రతిష్ఠించాడనేది స్థలపురాణ గాథ. మల్లెపొదల పాదుల్లోని పుట్టలో ఉద్భవించిన మహేశుణ్ని అప్పటినుంచీ భక్తులు మల్లికార్జునుడిగా పూజించుకుంటున్నారు.
కొమురయ్య భక్తికి స్వామి ప్రసన్నుడైన ప్రదేశం కాబట్టి ‘కొమరవెల్లి’ అయింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘కుమారవల్లి’గా పిలిచేవారు. మల్లెతోటలో పుట్టలో ఉన్న మహాలింగాకృతిని, శివ తనయుడైన కుమారస్వామి సర్పరూపంలో తన ఇరు దేవేరులతో సదా పరిరక్షించాడంటారు. అందుకే వల్లీ సమేతమైన ఈ క్షేత్రానికి కుమారవల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు.
కొమరవెల్లి మల్లన్నను ఈశ్వర స్వరూపమైన మార్తాండ భైరవుడిగా భావిస్తారు. ఈ భైరవుణ్ని మహారాష్ట్రీయులు ‘ఖండోబా’ పేరిట అర్చిస్తారు. కర్ణాటకలో మల్హార దేవుడిగా ఆరాధించుకుంటారు. ఇదే మల్హార దేవుణ్ని తెలుగునాట మల్లన్నగా పేర్కొంటారు.
మల్లన్నకు ఇరువైపులా శక్తిస్వరూపాలైన కేతమ్మ, మేడలమ్మ విగ్రహాలు ఉంటాయి. మహాశివరాత్రి, సంక్రాంతి, ఉగాది పర్వదినాల్లో జాతర మరెంతో వైభవంగా సాగుతుంది. తంటాలు తీరితే టెంకాయ బంధనం కడతామని, పంటలు పండితే పట్నాలు (పాయసం) చేస్తామని భక్తులు మొక్కుకుంటారు. కష్టాలు తీర్చి కోరికలు నెరవేరిస్తే కోడెను అర్పిస్తామని, చల్లగా కాపాడితే చల్లకుండలెత్తుతామని వేడుకుంటారు. బోనాలు ఇస్తామనీ మొక్కి చెల్లించుకుంటారు. జానపదుల భక్తివిశ్వాసాలకు సమున్నత సూచిక- కొమరవెల్లి మల్లన్న వేడుక!
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Saturday, December 16, 2017

ॐ🌷✡️ యజ్ఞోపవీత మహిమ ✡️🌷ॐ





ॐ🌷✡️ యజ్ఞోపవీత మహిమ ✡️🌷ॐ




వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యము’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతో వారి వారి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ని బట్టి ఉపనయన సంస్కారం లో వేయడం జరుగుతుంది




యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.




’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్

తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’




బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.




యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.




యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -




‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’




మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.




‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.




’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’




ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.




’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’




నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.




యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.




’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’




అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.




బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి. అలాగే శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకోవాలి




యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి




. ఇదే యజ్ఞోపవీత

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS