Sunday, May 28, 2023

మీపైన నింద పడి నిరూపించుకోలేని స్థితిలో మీరు ఉంటే

మీపైన నింద పడి నిరూపించుకోలేని స్థితిలో మీరు ఉంటే


కొందరు తప్పు చేయకున్న వారిని నిందిస్తునప్పుడు ఈ తప్పు నేను చేయలేదు అని వాదించలేరు అంత సమర్థంగా మాట్లాడి వారి తప్పులేదు అని నిరూపించుకోలేరు ఎందుకంటే కల్పించి నిందించే వారు అన్ని విధాలా వాళ్ళని బాధపెట్టాలి అని నిర్ణయించుకుని నిందలు వేస్తుంటారు కనీసం అవతలి వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అలా మోసపోయే వారిలో అమాయకులే ఎక్కువగా ఉంటారు..వాళ్ళు గట్టిగా గర్దించి సమాధానం చెప్పుకోలేరు నిందలు భరించలేరు మౌనంగా రోదిస్తూ ఉంటారు అటువంటి వాళ్లకు చాలా సులభమైన పరిహారం ఒకటి ఉంది ..

గణపతిని గరికతో అర్చించి ఆ గరికను పడవేయకుండా మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వేసుకుని స్నానం చేయాలి..

అలాగే ఇక్కడ ఇచ్చిన అగ్నిదేవుని నామాలు నిత్యం ఒక జపం లాగా స్మరిస్తూ ఉండాలి ఒక దీపం ఎదురుగా పెట్టుకుని అందులో అగ్ని దేవున్ని దర్శించి నమస్కారం చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క అటుకులు నైవేద్యం పెట్టి ఈ అగ్ని నామాలు  వీలైనంత ఎక్కువ సార్లు అంటే కనీసం మీ వయసు ఎంత ఉంటే అన్ని నిముషాలు జపం చేయాలి తర్వాత నిరంతరం మనసులో అగ్ని దేవున్ని స్మరిస్తూ ఉండాలి.. మీరు జపం మొదలు పెట్టే సమయంలో మీ సమస్య ఆ అగ్ని దేవుడికి చెప్పుకోవాలి..ఎలా అంటే సర్వశ్య శరణాగతి తో నువ్వు నన్ను రక్షించాలి నిన్నే నమ్ముకున్నాను నన్ను రక్షించు అని కోరుకోవాలి..మీరు నమ్మిన నమ్మకపోయిన మీపట్ల ద్రోహం చేసిన వారికి ముందు కడుపులో మంట మొదలు అవుతుంది చెప్పుకోలేని చోట సెగెడ్డలు మొదలు అవుతాయి అనుక్షణం మీపట్ల చేసిన తప్పుని వారంతట వారే గుర్తు చేసుకొని పశ్చాత్తాప పడతారు..నిజం ఎదో విధంగా బయట పడుతుంది..

అలాగే మేము ఏమి పాపం చేసామో ఇలాంటి బాధలు పడుతున్నాము అనే మాట వింటూనే ఉంటాము కదా అలంటి బాధలో ఉన్న వారు ఎవరైనా సరే అగ్ని దేవున్ని ఇలా పూజించి శుభ ఫలితాలు పొందవచ్చు..

🌷🙏జపించాల్సిన అగ్ని నామాలు🙏🌷

ఓం జాతవేదసే నమః
ఓం పావకాయ నమః
ఓం జ్వలనాయ నమః 
ఓం విభావసే నమః
ఓం చిత్రభానునే నమః
ఓం భూరితెజసే నమః
ఓం శిఖినే నమః 
ఓం పింగేషునే నమః
ఓం హిరణ్యకృతనే నమః
ఓం ప్లవంగనే నమః 
ఓం మాతరిశ్వంతనే నమః
ఓం వైశ్వానర నమః 
ఓం ధూమకేతవే నమః 
ఓం తోమరాయుధనే నమః
ఓం అబ్జహస్తు నమః
ఓం శుక్రయే నమః
ఓం శుచియే నమః
ఓం రోహితస్వునే నమః 
ఓం చాగర్తయే నమః
ఓం సప్తజిహ్వయే నమః
ఓం నమో అగ్ని దేవాయ నమః

ఈ అద్భుతమైన నామాలు ఒక్క ఫలితం ఫభావం , ధూమావతి, వారాహి, భగల, అశ్వరూడా..ఉపాసకులకు బాగా తెలుస్తుంది.. 

👉 కుటుంబం లో బంధువులు వల్ల నిందలు, ఆఫీసులో వ్యాపారం లో నిందలు చేయని తప్పుకి శిక్షలు ఇలాంటి బాధితులు కొందరికి ఈ పరిహారమే ఇచ్చాను వారు ఎంత శ్రద్ధగా చేశారో గాని మంచి ఫలితాన్ని పొందారు.. ఇలా మేస్సంజర్ లో చాలా మందికి పెట్టిన పరిహారాలు గ్రూప్ లో పోస్ట్ చేసే సమయం లేక చాలా పెట్టడం లేదు అటువంటి చాలా పరిహారాలు గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను..

🌷🙏నమో అగ్ని దేవాయ🙏🌷
🌷🌷శ్రీ మాత్రే నమః🌷🌷

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS