Sunday, May 28, 2023

సుబ్రహ్మణ్య_అష్టకం కరావలంబ_స్తోత్రం

ఓం శ్రీవల్లిదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యకరావలంబ " స్తోత్రం అని కూడా పిలువబడే సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య, కుమార మరియు మురుగన్ అని కూడా పిలువబడే కార్తికేయ దేవునిపై ప్రసిద్ధ స్తోత్రం.


8 చరణాలతో కూడిన ఈ అందమైన స్తోత్రం అద్వైత తత్వాన్ని ఏకీకృతం చేసిన గురు ఆదిశంకరాచార్య స్వరపరిచారు. 

ఈ సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య భగవానుడి యొక్క దైవిక గుణాలను మరియు స్వభావాన్ని వివరిస్తుంది.
అతని ప్రతి ప్రత్యేక గుణాలు ప్రతి చరణంలో అందంగా సూచించబడ్డాయి మరియు మురుగన్ తన భక్తులను ఎలా చూసుకుంటాడు మరియు అతని కృపను ఎలా ప్రసాదిస్తాడో కూడా అవి వివరిస్తాయి.

ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది మరియు ఇది గత జన్మలలో మరియు ఈ జన్మలో చేసిన పాపాల బంధాల నుండి విముక్తి చేస్తుంది.

💥"#సుబ్రహ్మణ్య_అష్టకం" (#కరావలంబ_స్తోత్రం)💥

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥

💥అర్థం – హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥

💥అర్థం – దేవాదిదేవునిచే (శివుడిచే) ప్రశంసింపబడువాడా, దేవగణములకు అధిపతీ, దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మములవంటి పాదములు కలవాడా, దేవ ఋషి అయిన నారద మునీంద్రునిచే సంకీర్తనము చేయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥

💥అర్థం – నిత్యము అన్నదానము చేయువాడా, అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా, తద్వారా భక్తులకోరికలను తీర్చువాడా, శ్రుతులు (వేదములు), ఆగమములయందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥

💥అర్థం – అసురుల రాజును ఖండించిన శక్తిశూలం, పాశము మొదలయిన శస్త్రములతో అలంకరింపబడిన చేతులుకలిగి, శ్రీకుండలములు ధరించిన నాయకుడా, శిఖీంద్ర (నెమలి) చే మోయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥

💥అర్థం – దేవాదిదేవా, రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండువాడా, దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని, శూరత్వము కలిగి, సురకోటిచే ప్రశంసింపబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాఽమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥

💥అర్థం – వజ్రము మొదలగు రత్నములతో, మాణిక్యములతో చేయబడిన కిరీటము, హారములు, కేయూరములు, కుండలములు మరియు కవచముతో అందముగా అలంకరింపబడి, వీర తారకుడిని జయించి, దేవతా బృందముచే వందనము చేయబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥

💥అర్థం – పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలములతో, పంచామృతములతో, ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥

💥అర్థం – శ్రీకార్తికేయా, కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో, కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును, నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి, ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్​క్షణాదేవ నశ్యతి ॥

💥అర్థం – సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది. దీనిని యే ద్విజులు పఠించెదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు. ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించెదరో, వారి కోటిజన్మలలో చేసిన పాపము తక్షణం నశించును.

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ |

సేకరణ... ఈ అర్థం శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మ గారిచే స్ఫురించి వ్రాయబడినది💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS