Sunday, May 28, 2023

శత్రు రుణ రోగాలు పరిహారం

 శత్రు రుణ రోగాలు పరిహారం



జాతకంలో ఆరవ భావం శత్రు రుణ రోగాల గురించి తెలియజేస్తుంది.ఆరవ భావం శత్రువులుకు సంబంధించినది కావున అక్కడ  శుభగ్రహాలు ఉంటే జాతకునికి శత్రువులు రుణాలు రోగాలు అనేవి వృద్ధి చెందుతాయి. అదే ఆరవ భావంలో పాప గ్రహాలు ఉన్నప్పుడు జాతకునిది శత్రువులపై పైచేయి అవుతుంది.అనగా శత్రువులు ఈ జాతకుడిని ఏమీ చేయలేరు.జాతక రీత్యా పరిహారాలు ఉన్నప్పటికీ తాత్కాలిక ఉపశమనంగా కొన్ని పరిహారాలు చేయడంవలన వీటినుంచి కొంత వరకు ఉపశమనం పొందే  అవకాశం ఉంది.తెల్ల ఆవాలతో చిన్న పరిహారం చేయడం వలన శత్రువులపై విజయం సాధించడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి.ఈ విధి విధానాలు పాటించడం వలన  కొంత వరకూ అనుకూల స్థితి వస్తుంది.గృహంలోనికి బయటి వారు ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ల పాదాల ద్వారా నెగటివ్ ఎనర్జీ గృహంలోకి వచ్చే అవకాశం ఉంది లేదా వాళ్ల కన్ను దృష్టి ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు పై పడినప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ లేదా నకారాత్మక శక్తి అంటారు ఇది వచ్చే అవకాశం ఉంది.తెల్ల ఆవాలను ఉపయోగించి పోగొట్టవచ్చు. అదేవిధంగా శత్రు పలాయనము జరుగుతుంది. అనగా శత్రువులు  ఈ జాతకుడి కి అపకారం చేద్దాం అనే ఉద్దేశ్యం మానుకుంటారు.జాతకులకు వచ్చే అవకాశాలను పాడు చేయడం లేదా,లేని విషయాలు ఉన్నట్టుగా కల్పన చేస్తూ  జాతకుని గౌరవాన్ని దెబ్బతీయడం వంటివి ఇవి సాధారణంగా శత్రు స్థానం జాతకంలో బలంగా ఉంటే జరుగుతూ ఉంటాయి . అవి కూడా జాతకంలో 6 వ భావానికి సంబంధించినవే.గురువారం నాడు కొద్దిగా తెల్ల ఆవాలు తీసుకొని మీ ఇంట్లో నాలుగు మూలలా కొద్దికొద్దిగా చల్లండి .నలభై ఒకటి నిమిషాలు తర్వాత ఆవాలను జాగ్రత్తగా ఒక కాగితంలోకి ఎత్తివేసి దూరంగా  మనుషులు తొక్కని ప్రాంతంలో వేయండి.ఇలా ప్రతి గురువారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది .మరియు శత్రు పలాయనం జరుగుతుంది అంటే శత్రువులు మీ గురించి ఆలోచించడం మాని వేస్తారు.

జాతకంలో మరొక విషయం రుణాలు రోగాలు.కొంతమందికి చిన్నగా రుణాలు చేసినప్పటికీ అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగి పెద్ద రుణంగా అయిపోతుంది. మరికొంత మందికి ఆరోగ్య విషయంలో కూడా  దీర్ఘకాలిక ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి.ఇటువంటి వారు ఒక రాగి చెంబు లేదా పాత్ర తీసుకుని దానిలో కర్పూరం వెలిగించి  పిడికెడు తెల్ల ఆవాలు తీసుకొని ఆ మంటపైన వేయండి  చిటపటలాడుతూ శబ్దాలు చేస్తూ మొత్తం ఆవాలు బూడిదగా మారిపోతాయి.ఆ బూడిదను చెంబుతో సహా మీ చుట్టూ సవ్యదిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు దిష్టి తీయండి. తరువాత ఆ బూడిదను  ఎవ్వరూ నడవని ప్రాంతంలో దూరంగా వేయండి దీనివల్ల  దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం మరియు రుణాల నుంచి విముక్తి జరిగే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS