Sunday, May 28, 2023

శ్రీ వెంకటేశ్వర దేవాలయము. వైకుంఠపురం, తెనాలి

శ్రీ వెంకటేశ్వర దేవాలయము. వైకుంఠపురం, తెనాలి
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
వైకుంటపురం గుడి ఆవిర్భావం


వైకుంటపురం దేవస్థానము సరిగ్గా తెనాలి బస్టాండ్ కి 2 కి.మీ. మరియు రైలు స్టేషన్ కి 2 కి.మీ. దూరంలో ఉన్నది. 

ఒకనాడు ఈ దేవస్థానం వ్యవస్థాపకుడైన లేటు శ్రీ తుళ్ళూరు బాలనరసింహ రావు గౌడ గారికి ఒక కల వచ్చిందట. ఆ కలలో నాగదేవత కనిపించి, రేపల్లె-గుంటూరు రైలు లైనునకు దక్షిణంగా నిజాంపట్నం కాలువకి పక్కగా (సరిగ్గా ప్రస్తుతం గుడి ఉన్న ప్రదేశం) శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని నిర్మించాల్సినదిగా సూచించినది . అందుకే నాగదేవతని కూడా ఒక మూలన ప్రతిష్టించడం జరిగిందట. నాగదేవత ఆదేశానుసారం బాలనరసింహా రావు గారు ఆ ప్రదేశంలో ఎట్టి పరిస్థితులలో అయినా సరే వెంకటేశ్వర స్వామి గుడిని ఏర్పాటు చేయాలనే ధృడ నిచ్చయానికి వచ్చేశారట. పిదప ఆ ప్రదేశంలో గల భూమిని స్వచ్చందంగా విరాళంగా ప్రకటించారట.
ఆ తరువాత విరాళాల కోసం సేవా గుణం కలిగిన కొంతమందిని సంప్రదించడం జరిగింది. అంతేకాక ప్రస్తుతం శ్రీ లక్ష్మి పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా పిలవబడుతున్న ఈ వేంకటేశ్వరుని గుడి నిర్మాణానికి తన సొంత డబ్బుని కూడా ఖర్చు చేసారట బాలనరసింహా రావు గారు. ఆ విధంగా గుడి ఆవరణ 1961 ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరిగింది. 1972 ప్రాంతాలలో వేదోచ్చారముల నడుమ దేవతలని ప్రతిష్టించడం జరిగిందట. అప్పటి నుండి భక్తుల కోరికలు నేరవేరుతూ ఉండడంతో, ఈ దేవాలయానికి మంచి పేరు వచ్చి భక్తుల తాకిడి బాగా పెరుగుతూ వచ్చిందట.

 1973 వ సంవత్సరంలోనే ఈ గుడి ప్రాభవాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ, తన ఆధీనంలోకి చేర్చుకోవడం జరిగింది. 1973 వ సంవత్సరం నాటికి ఈ దేవాలయం ఆదాయం సంవత్సరానికి సుమారు రూ. 50,000 వరకు ఉండేది. 

ప్రస్తుతం, కేవలం గుంటూరు జిల్లా నుండే గాక, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులు ఈ గుడిని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం దీని ఆదాయం సంవత్సరానికి సుమారు రూ. 62 లక్షల పైమాటే. భక్తుల తాకిడి రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. భక్తులు ఇచ్చేటి కానుకలతో ఈ గుడిని మరింత అభివృద్ధి చేయటానికి ఆస్కారం ఉంది. గుడి చాలా విశాలంగా ఉండడంతో పెళ్ళిళ్ళకి ఎంతో అనువుగా ఉంటుంది. కేవలం మాఘమాసం మరియు వైశాఖమాసాలలో 2-3 వందల పెళ్ళిళ్ళు జరుగుతాయని ఒక అంచనా. ఇది నిజంగా ఒక అరుదే. ప్రతీ శనివారము నాగదేవతకి పొంగలి నైవేద్యం పెట్టడం ఒక ఆచారం. కార్తీక మాసంలో నాగుల చతుర్ది నాడు చాలా మంది భక్తులు ఇక్కడకు వచ్చి నాగ పూజ చేయడం కూడా ఒక ఆచారం. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేసి, ఆడపడుచులకి జాకెట్టు ముక్కలని పెట్టడం ఇక్కడ ఒక ఆచారంగా వస్తుంది.

ఈ దేవాలయానికి ఇతర దేవాలయాలలాగ మరెక్కడా భూములు లేవు. కేవలం భక్తులు ఇచ్చే కానుకలు, అర్చనలు, పెళ్ళిళ్ళు చేయడం మరియు హుండీ ఆదాయం ద్వారానే జరుగుబాటు అవుతుంది. దేవాలయ ప్రతిష్ట రోజు రోజుకీ పెరుగుతూ ఉండటంతో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ కమిటీ ఎప్పటికప్పడు ద్రుష్టి సారిస్తూ వస్తున్నది.

కొసమెరుపు: ఈ దేవాలయంలో వరుసగా 40 రోజులు ప్రదక్షిణలు చేయడం, 40 రోజులు నిద్రలు చేయడం మూలంగా కొంతమందికి చూపు వచ్చిందని, కొంతమంది సంతానం పొందగలిగారని, మరింత మంచి జరిగందని స్థానిక కథనం.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS