Tuesday, May 30, 2023

మహాకాళీ నిత్యలు


మహాకాళీ నిత్యలు :-


దశమహావిద్యలలో ఒకటైన లలితా త్రిపుర సుందరికి 16 నిత్యలు ఉండగా, కాళీకి 15 మంది నిత్యలు ఉంటారు. లలితకు చెందిన నిత్యలు చంద్రుని యొక్క శుక్లపక్షానికి చెందిన కళలుగా ఉంటె , కాళీకకు చెందిన నిత్యలు చంద్రుని యొక్క కృష్ణ పక్షానికి చెంది ఉంటాయి. 

1. కాళీ :- 

నిత్యలలో మొదటిది అయిన కాళీ , కృష్ణ పక్షంలోని మొదటి తిథి అయిన పాడ్యమికి చెంది ఉంటుంది. ఈమె భయంకర రూపాన్ని కలిగి ఉంటుంది. ఈమె అరుపు గుండెలు జలదరించేలా ఉంటుంది. ఈమె నల్లటీ రంగులో ఉంటుంది. మెడలో కపాలముల దండ , ఈమెకు బలమైన మరియు వ్రేలాడే స్థనములు ఉంటాయి. ఈమె తన కుడిచేతిలో ఒక గుండ్రగొడ్డలి ధరించి , ఎడమ చేత్తో బెదిరిస్తూ ఉన్న భంగిమలో ఉంటుంది. ఈమె శ్మశానాలలో సంచరిస్తూ ఉంటుంది. 

మంత్రం :- 

||ఓం హ్రీం కాళీ కాళీ మహాకాళీ కౌమారి మహ్యందేహి స్వాహా ||

2. కఫాలిని :-

రెండవది అయిన కఫాలిని ! కఫాలిని అంటే కఫాల కన్య అని అర్థం. అత్యంత సౌందర్యవంతమైన ముఖాన్ని కలిగి ఉంటుంది. ఈమె నల్లటీ రంగులో ఉంటుంది. జుట్టు విరబోసుకుని కనిపిస్తుంది. ఈమె నగ్నంగా ఉంటుంది. ఖండించబడిన శిరస్సుల యొక్క గుట్టమీద ఈమె కూర్చుని ఉంటుంది. ఈమె రెండు చేతుల్లో గండ్రగొడ్డలి , శూలము ఉంటాయి. ఈమెకు ఇంకొక రెండు చేతులలో ఒక చేయ్యి అభయ హస్తం ఇస్తుండగా, ఇంకో చేత్తో వరద హస్తముగా కనిపిస్తుంది.

మంత్రం :-

ఓం హ్రీం క్రీం కపాలిని మహాకపాల ప్రియే మానసే కపాలసిద్దింమే దేహి హం ఫట్ స్వాహా .

3. కుల్ల :- 

మూడవది అయిన నిత్యల్లో కుల్ల . ఈమెకు నాలుగు హాస్తాలు , మూడు నేత్రాలు ఉంటాయి. ఒక మృతదేహం పైన ఉంచబడిన పది శిరస్సులపై ఈమె కూర్చుని ఉంటుంది. ఈమె యొక్క ఎడమ చేతులలో ఒక చెయ్యి వరద హస్తముగా కనిపిస్తుంది. ఇంకొక చేత్తో అభయ హస్తం ఉంటుంది. కుడిచేతిలో ఒక చేతిలో పుస్తకం, ఇంకొక చేత్తో జపమాల ఉంటాయి. 

మంత్రం :-

||ఓం క్రీం కుల్య నమః||

4. కురుకుల్ల :-

నాలుగవ నిత్య అయిన కురుకుల్ల . ఈమెకు ఎత్తైన మరి పెద్దది అయిన స్థనములు ఉంటాయి. ఈమెకు అందమైన పిరుదులు ఉంటాయి. ఈమె నల్లటీ రంగులో ఉంటుంది. ఈమె జుట్టు విరబోసుకుని పుఱ్ఱెల దండను మెడలో ధరించి కనిపిస్తుంది. ఈమె ఒక మృతదేహం పైన కూర్చుని ఉంటుంది. ఈమె చేతులలో పుర్రె, కత్తెర, గండ్రగొడ్డలి మరి డాలు ఉంటాయి.

మంత్రం :-

|| క్రీం ఓం కురుకుల్లే క్రీం హ్రీం మమ సర్వజన వశమాయన క్రీం కురుకుల్లే హ్రీం స్వాహా ||

5. విరోధిని :-

ఐదవది అయిన విరోధిని. పుష్టిగా మరి ఉన్నతంగా ఉన్న వక్షోజములు కలిగి ఈ నిత్య . భోమికలు మరియు సర్పములతో తయారుచేసిన హారాన్ని ధరించి కనిపిస్తుంది. చూడటానికి భయంకరంగా కనిపించడం ఈ నిత్య విశేషం. ఈమె మూడు నేత్రాలను, నాలుగు హస్తాలతో కనిపిస్తుంది. ఈమె చేతులలో శూలం, గంట , డమరుకం మరియు సర్పముతో చేసిన పాశము ఉంటాయి. ఈమె పసుపు రంగు దేహాన్ని కలిగి ఉంటుంది. వంగపండు రంగు వస్ర్తాలను ధరించి ఉంటుంది. ఈమె ఒక మృతదేహం పై కూర్చుని ఉంటుంది. 

మంత్రం :- 

|| ఓం హ్రీం క్లీం హం విరోదినీ శుత్రూన్ ఉచ్చాటయ విరోదాయ శత్రు క్షయకారి హం ఫట్ || 

6. విప్రచిత్త :-

నిత్యలలో ఆరవది అయిన విప్రచిత్త ! ఈమె నాలుగు హస్తాలతో , మూడు రేఖలను కలిగి ఉంటుంది. ఈమె శరీరం నీలి కలువ పువ్వు రంగు లో ఉంటుంది. ఈమెకు ఎత్తైన బలిష్టమైన స్థనములు ఉంటాయి. ఈమె జుట్టు విరబోసుకుని కనిపిస్తుంది. ఈమె నాలుక తరచుగా నోట్లో నుండి బయటకు లోపలికి వెళుతూ ఉంటుంది. ఈమె చూడటానికి భయంకరంగా ఉంటుంది. ఈమె చేతులలో గండ్రగొడ్డలి , ఖండించబడిన శిరస్సు, కపాలం మరియు శిరస్సు ఉంటాయి. ఈమె తన పండ్లను చూపుతూ ఉంటుంది. ఈమె నోటి చివరల నుంచి రక్తం స్రవిస్తూ కనిపిస్తుంది. 

మంత్రం :-

|| ఓం శ్రీం క్లీం చాముండే విప్రచిత్తే దుష్టఘాతినీ శత్రూన్ నాశయ ఏతత్దిన వధీ ప్రియే సిద్దింమే దేహి హం ఫట్ స్వాహా|| 

7. ఉగ్ర :-

ఏడవది అయిన ఈ ఉగ్ర నిత్య , ఈమె చూడటానికి భయంకరంగా ఉంటుంది. ఈమె నగ్నంగా ఉంటుంది. ఈమె నోటి నుంచి భయంకరంగా కోరలు కనిపిస్తాయి. ఈమె కపాలమాలను ధరించి ఉంటుంది. నలుపు రంగులో ఉండే ఈ దేవీ , జుట్టు విరబోసుకుని కనిపిస్తుంది. ఈమె నాలుగు హస్తాలతో ఖడ్గం, కపాలం, చురిక మరియు కమలము కనిపిస్తాయి. ఈమె శ్మశానంలో సంచరిస్తూ ఉంటుంది.

మంత్రం :-

|| ఓం స్త్రీం హం హ్రీం ఫట్ ||

8. ఉగ్రప్రభ :-

ఎనిమిదవది అయిన ఈ ఉగ్రప్రభ ! ఈమె విరబోసుకున్న జుట్టుతో ఉబ్బెత్తుగా ఉండి పొడుచుకువచ్చిన స్థనములతో కనిపిస్తుంది. నీలి రంగులో ఉంటుంది. ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తుంది. ఈమె నాలుగు హస్తాలతో , మూడు నేత్రాలతో , ఈమె శవంపై ఆశీనురాలై ఉంటుంది. ఈమె చనిపోయిన జంతువు యొక్క కుళ్ళిన మాంసాన్ని తింటూ ఉంటుంది. ఈమె నడుము చుట్టూ, ఖండించబడిన హస్తాలతో చేసిన వడ్డాణం ధరించి ఉంటుంది. ఈమె చేతులలో గండ్రగొడ్డలి, శిరస్సు, కపాలపాత్ర మరియు చిన్నఖడ్గము ఉంటాయి. 

మంత్రం :-

|| ఓం హం ఉగ్రప్రభే దేవీ కాళీ మహాదేవి స్వరూపం దర్శయ హం ఫట్ స్వాహా|| 

9. దీప :-

తొమ్మిదవ నిత్య అయిన దీప ! ఈమె నాలుగు హస్తాలతో మూడు నేత్రాలతో తదేకంగా చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈమె పెద్దదిగా ఉండే ఇంద్రనీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె ఎడమ చేతులలో గండ్రగొడ్డలి, శిరస్సు ఉంటాయి! కుడిచేతులలో అభయ హస్తం మరియు వరద హస్తముగా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈమెకు నోటీ నుంచి బయటకు పొడుచుకొని వచ్చి ఉన్న కోరలు కనిపిస్తాయి. నగ్నంగా ఉండే ఈ నిత్య జుట్టు విరబోసుకుని కనిపిస్తుంది. మానవ కపాలాలతో తయారయిన కంకణాలను, మానవుల ఎముకలతో తయారయిన భుజకీర్తులను ఈమె ధరించి కనిపిస్తుంది.

మంత్రం :- 

|| ఓం క్రీం హం దిప్తాయై సర్వమంత్ర ఫలదాయై హాంఫట్ స్వాహా ||

10. నీల :-

పదవది అయిన ఈ నీల నిత్య ! పుర్రెలతో తయారయిన హారాన్ని ధరించి, మృతదేహం పై కూర్చుని ఉంటుంది. ఈమె నాలుక బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటుంది. కనుగుడ్లు ఎర్రగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఈమె నాలుగు హస్తాలతో మూడు నేత్రాలతో కనిపిస్తుంది. మానవ మాంసం మరియు ఎముకలతో తయారయిన ఆభరణాలను ఈమె ధరించి ఉంటుంది. ఈమె అందమైన ముఖాన్ని కలిగి ఉంటుంది. నీలి రంగులో ఉండి ప్రకాశించే ఆర్సెనిక్ అనే లవణం యొక్క శరీర ఛాయను కలిగి ఉంటుంది.

మంత్రం :- 

|| హం హం క్రీం హ్రీం హసబలమారి నీలపతకే హాంఫట్ స్వాహా || 

11. ఘన :-

పదకొండవది అయిన ఘన నిత్య ! ఈమె నాలుగు చేతులతో, మూడు నేత్రాలతో కనిపిస్తుంది. నగ్నంగా సంచరించడం ఈమెకు ఆనందం. భయంకరమైన దంతాలు, నోటి చివరల నుంచి రక్తం దారులుగా కారుతూ ఉంటుంది. ఈమె చేతులలో ఖడ్గము, డాలు, త్రిశూలం , దండం ఉంటుంది. 

మంత్రం :-

|| ఓం క్లీం ఓం ఘనాలయే ఘనాలయే హ్రీం హం ఫట్ ||

12. బాలక :-

పన్నెండవ నిత్య అయిన బాలక నిత్య ! నగ్నంగా ఉండి చూడటానికి భయంకరంగా కనిపిస్తుంది. ఈమె నాలుగు హస్తాలతో మూడు నేత్రాలను కలిగి ఉంటుంది. ఈమె ఎప్పుడూ మధ్యపు మత్తులో ఉంటుంది. ఎడమ చేతులలో ఖడ్గము మరియు మానవ శిరస్సు ఉండగా కుడిచేతులలోని ఒక చేతిలో కపాలపాత్ర , ఇంకో చేతి వేలితో బెదిరిస్తూ కనిపిస్తుంది. ఈమె పుర్రెలతో కట్టబడిన కోటమీద కూర్చుని ఉంటుంది.

మంత్రం :- 

|| ఓం క్రీం హం హ్రీం బాలకకాళీ అతి అద్బుతే పరకర్మే అభీష్టసిద్దింమే దేహి హం ఫట్ స్వాహా || 

13. మాత్ర :-

పదమూడవది అయిన మాత్ర నిత్య మృతదేహం పై కూర్చుని ఉండి, శరీరంపై నీలిరంగు లేపనం పుయ్యబడి ఉంటుంది. ఈమెకు కపాల హారం ఉంటుంది. చేతులలో కపాల పాత్ర, కత్తెర, ఖడ్గం శిరస్సు కనిపిస్తాయి. 

మంత్రం :- 

|| ఓం క్రీం హ్రీం హం ఐం మహామాత్రే సిద్దింమే దేహి సత్వరం హాంఫట్ స్వాహా ||

14. ముద్ర :- 

పద్నాల్గవది అయిన ముద్ర నిత్య నగ్నంగా ఉండి నీలి కలువ శరీర ఛాయను కలిగి ఉంటుంది. ఈమె మూడు మెల్లకళ్ళను కలిగి ఉంటుంది. నాలుగు హస్తాలు, మెడలో శిరస్సులతో చేయబడిన హారం ఉంటుంది. ఈమె పెదవులపై రక్తం కనిపిస్తుంది. చేతులలో కపాల పాత్ర , బాకు, ఖడ్గం, డాలు ఉంటాయి.

మంత్రం :- 

|| ఓం క్రీం హం హం ప్రిం ఫ్రం ముద్రాంబా ముద్రాసిద్దింమే దేహిమే భో జగన్ముద్ర స్వరూపిణీ హం ఫట్ స్వాహా || 

15. మిత :-

పదిహేనవది అయిన మిత నిత్య ! అందమైన పిరిదులు మరియు కారునలుపు రంగులో ఉంటుంది. భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. విరబోసుకున్న జుట్టుతో ఎర్రటి దుస్తులు ధరించి కనిపిస్తుంది. కపాల మాలతో కనిపించే ఈ నిత్య ఒక మృతదేహం పై కూర్చుని ఉంటుంది. నాలుగు చేతులు, మూడు నేత్రాలను కలిగి ఉంటుంది. ఎడమ చేతులలో ఖడ్గము, శిరస్సు కనిపిస్తాయి. కుడిచేతిలో ఒక చేయి అభయ హస్తం, ఇంకోక చేయి వరద హస్తముగా కనిపిస్తుంది. ప్రళయ కాలంలో కనిపించే విలయాగ్నికి కోటిరెట్లు అధికమైన అగ్ని కాంతితో ఈమె దర్శనం ఇస్తుంది.

మంత్రం :-

|| ఓం క్రీం హం హ్రీం ఐం మితే పరమితే పరాక్రమాయ ఓం క్రీం హం హిం యం సోహం హం ఫట్ స్వాహా ||

నోట్ :- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది. ఇందులో ఇచ్చిన మంత్రాలను గురుముఖతః మాత్రమే సాధనా విశేషాలను తెలుసుకొని సాధన చేయాలి. 

ఈ పోస్ట్ ఎవరి ఉద్దేశ్యాలను, నమ్మకాలను, అభిప్రాయాలను కించపరిచే ఉద్దేశం లేదు. మేం అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం ! కాళీ మాత ఉపాసకులకు, భక్తులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ముఖ్యమైన విషయాన్ని పోస్ట్ చెయ్యబడింది. సాధకులకు ఉపయోగపడుతుంది. 

🌹🌹🌹🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS