Monday, May 29, 2023

సప్త మాత్రుకలు

సప్త మాత్రుకలు


భ్రహ్మీ, మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా
వరాహీ చైవ ఇంద్రాణి చాముండా సప్తమాతరః

1. బ్రహ్మణి - హంసలు పూంచిన విమానమెక్కి మాలా, కమండలువులతో బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మణిదేవి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

2. మహేశ్వరి - వ్రుషభముపై ఎక్కి ఉత్తమమగు త్రిశూలము ధరించి, పెద్ద సర్పములు గాజులుగా కలిగి చంద్ద్రరేఖ ఆభరణముగా దాల్చి మహేశ్వరి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

3. కౌమారి - చేత బల్లెము దాల్చి చక్కని నెమలి నెక్కి కుమార స్వామి యొక్క శక్తి రూపంతో అంబికాకౌమారి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

4. వైష్ణవి - విష్ణుశక్తి గరుడునిపై శంఖము, చక్రము, గద, ధనస్సు, ఖడ్గము ధరించి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

5. వారాహి - అసమానమైన యజ్ఞ వరాహరూపము దాల్చిన హరియొక్క శక్తి వారాహి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

6. ఇంద్రాణి - వేయికనులు కలిగిన ఇంద్రాణి ఇంద్రునివలె వజ్రాయుధమును చేతబూని శ్రేష్ఠమగు ఏనుగును ఎక్కి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

7. చండిక - అత్యంత భయంకరమైన ఉగ్రరూపంతో చండికా శక్తి దేవి శరీరము నుండి వెలువడి నక్కలవలె ఊళలు వేస్తూ దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.

అంధకాసురుని వధలో పరమశివునికి సహాయముగా నిల్చిన సప్తమాత్రుకల చరిత్ర క్రమక్రమంగా పురాణ ఇతిహాసములలో చెప్పబడింది.🕉️🚩🕉️

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS