Sunday, May 28, 2023

శివాలయానికి వెళ్ళేటప్పుడు నంది నుండి శివుని చూడాలంటారు. ఆ విధానం, చెప్పవల్సిన స్తోత్రం ఏమిటి?

  శివాలయానికి  వెళ్ళేటప్పుడు నంది నుండి శివుని చూడాలంటారు. ఆ విధానం, చెప్పవల్సిన స్తోత్రం ఏమిటి?


జ.  నందీశ్వరుని  కొమ్ముల మీద  ఎడమచేయి  ఉంచి, వెనుక  భాగంలో  కుడిచేతితో  స్పృశించడం  చేత అతడు  శిరసు వంచుతాడు. అప్పుడు కొమ్ములనుండి శివుని చూడాలి. పశుపతి అయిన  శివుడు, పశువులైన జీవులకు ప్రభువు. ఆ పశుత్వాన్ని దాటి శివుని చూడాలి.
మరియొక భావంలో - నంది ధర్మస్వరూపుడు. ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ధర్మం ద్వారానే దైవాన్ని దర్శించాలనే సంకేతం కూడా ఇందులో దాగి ఉంది.
 నందీశ్వర! నమస్తుభ్యం
 శాంతానంద ప్రదాయక!
 మహాదేవస్య సేవార్ధం
 అనుజ్ఞాం దాతుమార్హసిll-
అనే శ్లోకాన్ని పఠిస్తూ " హర హర - శివ శివ " అనే శివ నామాన్ని పలుకుతూ, నంది కొమ్ముల మధ్య నుండి  శివలింగాన్ని దర్శిస్తే - వేదపఠనం చేసిన ఫలం, సప్తకోటి మహా మంత్ర జపఫలం  లభిస్తాయని పాప పరిహారమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS