Tuesday, May 30, 2023

పూజ - జప నియమాలు

పూజ - జప నియమాలు 


పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.

నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.

ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.

గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు.    

పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.

పూజలో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది

తూర్పు-ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతిక్రింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించరాదు. తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు.

పూజలకు, జపానికి వినియోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి. ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.

జపం చేసేటప్పుడు మాల మధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.

నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపులా కొసలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.

వట్టి నేలపై కూర్చొని జపించరాదు. పూజించరాదు. భుజించరాదు.

’పూజ’ అంటే "భోగములను ప్రసాదించునది" అని అర్థం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతా శక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప, ధూపాలు, కుసుమాు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.

బహిష్ఠు స్త్రీలు మసలే చోట, వారి దృష్టిపడే చోట దేవతా పూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS