Monday, August 31, 2020

నరదృష్టి (నరదిష్టి) తొలగిపోవాలంటే.. వారానికోసారి ఇలా చేయండి..

 నరదృష్టి (నరదిష్టి) తొలగిపోవాలంటే.. వారానికోసారి ఇలా చేయండి..


నరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో

నరదృష్టి తొలగిపోవాలంటే .. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.


అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు. 

 

అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి. 


ఈతిబాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. sistla

అనంత పద్మనాభ వ్రతం

 అనంత పద్మనాభ వ్రతం



అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.


ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి


ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.


ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.


వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.


వ్రతవిధానము 


శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.


ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామాన్యముగా దర్భలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .


యమునా పూజ


ధ్యానం: 


శ్లో: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే,

ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే.

యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.


ఆవాహనం:

శ్లో: యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయిని,

ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.

యమునాదేవ్యై నమః ఆవాహయామి.


ఆసనం:  

శ్లో:నమస్కరోమి యమునే సర్వపాప ప్రణాశిని 

రత్నసింహాసనం దేవీ  స్వీకురుష్వ మయార్పితం.

యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి.


పాద్యం: 

శ్లో: సింహాసన సమారూడే దేవశక్తి సమన్వితే,

పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే.

యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి.


అర్ఘ్యం:

శ్లో: నందిపాదే నమస్తుభ్యం సర్వపాప నివారిణి,

అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్తమిదముత్తమం.

యమునాదేవ్యై నమఃఅర్ఘ్యం సమర్పయామి.


ఆచమనీయం:

శ్లో: హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే, 

గృహాణాచమనీయం దేవి శంకరార్ధ శరీరిణి .

యమునాదేవ్యై నమఃఆచమనీయం సమర్పయామి.


స్నానం:

శ్లో: దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితప్రియే

సర్వపాప ప్రశమని తున్గభద్రే నమోస్తుతే.

యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి.


వస్త్రయుగ్మం:

శ్లో: గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే,

సువ్రతం కురుమే దేవి తుంగభద్రే  నమోస్తుతే.

యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.


మధుపర్కం: 

శ్లో: కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే 

మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే.

యమునాదేవ్యై నమఃమధుపర్కం సమర్పయామి.


ఆభరనాణి :

శ్లో: నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరిణి 

సర్వలోకహితే తుభ్యం భీమరధ్యై నమోస్తుతే.

యమునాదేవ్యై నమః ఆభరనాణి సమర్పయామి.


గంధం:

శ్లో: కృష్ణ పాద సమద్భూతే గంగే త్రిపద గామిని,

జటాజూట సమద్భూతే సర్వకామఫలప్రదే. 

యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి.


అక్షతలు:  

శ్లో: గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని,

స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ అమలాన్ శుభాన్.

యమునాదేవ్యై నమఃఅక్షతాన్ సమర్పయామి.


పుష్పై పూజ:

శ్లో: మందారై పారిజాతైశ్చ  పాటలాశోక చంపకై 

పూజయామి తవప్రీత్యై వందే భక్త వత్సలే .

యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి.


అధాంగ పూజ:


ఓం చంచలాయై నమః  -  పాదౌ పూజయామి

ఓం సుజంఘాయ నమః -  జంఘే పూజయామి

ఓం చపలాయై నమః - జానునీ పూజయామి

ఓం పుణ్యాయై నమః - ఊరూం పూజయామి

ఓం కమలాయై నమః - కటిం పూజయామి

ఓం గోదావర్యై నమః  - స్థనౌ పూజయామి

ఓం భవనాశిన్యై నమః - కంటం  పూజయామి 

ఓం తుంగ భద్రాయై నమః - ముఖం పూజయామి

ఓం సుందర్యై నమః - లలాటం పూజయామి

ఓం దేవ్యై నమః - నేత్రే పూజయామి 

ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః - కర్ణౌ పూజయామి

ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి

ఓం భాగీరధ్యై నమః - శిరః పూజయామి 

ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. 


ధూపం:

శ్లో: దశాంగం గగ్గులోపేతం చందనాగరు సంయుతం 

యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతిగృహ్యాతాం.

యమునాదేవ్యై నమఃధూపం సమర్పయామి.


దీపం:

శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం 

గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే.

యమునాదేవ్యై నమఃదీపం దర్శయామి.


నైవేద్యం:

శ్లో: భక్ష్యైశ్చ  భోజ్యైశ్చ  రాసి షడ్బిస్సమన్వితం 

నైవేద్యం గృహ్యాతాం దేవీ యమునాయై నమోనమః

యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.


తాంబూలం: 

శ్లో: కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యైస్సమన్వితం

తాంబూలం గృహ్యాతాం దేవీ యమునాయై నమోస్తుతే.

యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి


నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారాన్ సమర్పయామి.


శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం  


ధ్యానం:

శ్లో: క్రుత్వాదర్భ మయం దేవం పరిధాన సమన్వితం 

ఫనైసప్తభిరావిష్టం పింగాలాక్షం చతుర్భుజం

దక్షినాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్య కారే

చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యా పద్య కారే

అవ్యయం సర్వలోకేశం పీతాంభరధరం  హరిం

అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి


ఆవాహనం:

శ్లో: ఆగచ్చానంత దేవేశ తేజోరాశే జగత్పతే

ఇమాంమయాక్రుతం పూజాం గృహాణ సురసత్తమ.

అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సర్పయామి.


ఆసనం:

శ్లో: అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః 

రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.

అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి.


తోరస్తాపనం:

శ్లో: తస్యాగ్రతో దృడం సూత్రం కుంకుమాక్తం  సుదోరకం

చతుర్దశి గ్రంధి సంయుక్తం వుపకల్ప్య ప్రజాజాయే 

అనంతపద్మనాభాయ నమః తోరస్తాపనం కరిష్యామి.


అర్ఘ్యం:

శ్లో: అనంతగుణ రత్నాయ విశ్వరూప ధరాయ చ 

అర్ఘ్యం దదామితెదేవ నాగాదిపతయే నమః 

అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సర్పయామి.


పాద్యం:

శ్లో: సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన

పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే

అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి.


ఆచమనీయం:

శ్లో: దామోదర నమోస్తుతే నరకార్ణవతారక

గృహాణాచమనీయం  దేవ మయాదత్తం హి కేశవా.

అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి.


మధుపర్కం:

శ్లో: అనంతానంత దేవేశ అనంత ఫలదాయక

దధి మద్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే

అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి.


పంచామృతం:

శ్లో: అనంతగుణ గంభీర విశ్వరూప ధరానమ

పంచామ్రుతైస్చ విదివ త్స్నాపయామి దయానిధే.

అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.


శుద్దోదక స్నానం:

శ్లో: గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

స్నానం ప్రకల్పయేతీర్ధం సర్వపాప ప్రముక్తయే

అనంతపద్మనాభాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.


వస్త్ర యుగ్మం:

శ్లో: శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే

పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే

అనంతపద్మనాభాయ నమఃవస్త్ర యుగమ సమర్పయామి.


యజ్ఞోపవీతం:

శ్లో: నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారాట్

బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ.

అనంతపద్మనాభాయ నమఃయజ్ఞోపవీతం సమర్పయామి.


గంధం:

శ్లో: శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాధీ భిరన్వితం

విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.

అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి.


అక్షతాన్:

శ్లో: శాలియాన్ తండులాన్ రంయాన్ మయాదత్తాన్ శుభావహాన్

అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీ కురుశ్వా ప్రభో 

అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి


పుష్పపూజ:

శ్లో: కరవీరై ర్జాతికుసుమై శ్చమ్పకై ర్వకులైశుభై 

శాతపత్రైశ్చ కల్హారై రర్చయే పురుషోత్తమ.

అనంతపద్మనాభాయ నమః పుష్పాణి పూజయామి.


అధాంగ పూజ: 

ఓం అనంతాయ నమః   -  పాదౌ పూజయామి

ఓం శేషయ నమః  -  గుల్భౌ పూజయామి 

ఓంకాలాత్మనే నమః -  జంఘే పూజయామి

ఓం విశ్వరూపాయ నమః - జానునీ పూజయామి

ఓం  జగన్నాదాయ నమః -  గుహ్యం పూజయామి 

ఓం పద్మనాభాయ నమః -  నాభిం పూజయామి

ఓం సర్వాత్మనే నమః  -  కుక్షిం పూజయామి

ఓం శ్రీ వత్సవక్షసే నమః - వక్షస్థలం పూజయామి

ఓం చక్రహస్తాయ నమః - హస్తాన్ పూజయామి

ఓం ఆజానుబాహవే నమః - బాహూన్ పూజయామి

ఓం శ్రీ కంటాయ నమః - కంటం పూజయామి

ఓం చంద్రముఖాయ నమః - ముఖం పూజయామి

ఓం వాచాస్పతయే నమః - వక్త్రం పూజయామి.

ఓం కేశవాయ నమః - నాసికాం పూజయామి

ఓం నారాయణాయ నమః - నేత్రే పూజయామి

ఓం గోవిందాయ నమః - శ్రోత్రే పూజయామి

ఓం అనంతపద్మనాభాయ నమః - శిరః పూజయామి

ఓం విష్ణవే నమః - సర్వాంగణ్యాని పూజయామి 


అనంతపద్మనాభ స్వామి అష్ట్తోతరము 


ఓం శ్రీకృష్ణాయ నమః

ఓం కమలానాథాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం వసుదేవాత్మజాయ నమః

ఓం పుణ్యాయ నమః

ఓం లీలామానుషవిగ్రహాయ నమః

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

ఓం యశోదావత్సలాయ నమః

ఓం హరయే నమః

ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః

ఓం దేవకీనందనాయ నమః

ఓం శ్రీశాయ నమః

ఓం నందగోపప్రియాత్మజాయ నమః

ఓం యమునావేగసంహారిణే నమః

ఓం బలభద్రప్రియానుజాయ నమః

ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః

ఓం నందవ్రజజనానందినే నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

ఓం నవనీతవిలిప్తాంగాయ నమః

ఓం నవనీతనటాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం నవనీతనవాహారాయ నమః

ఓం ముచుకుందప్రసాదకాయ నమః

ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురాకృతయే నమః

ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః

ఓం గోవిందాయ నమః

ఓం యోగినాంపతయే నమః

ఓం వత్సవాటచరాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం ధేనుకసురభంజనాయ నమః

ఓం తృణీకృతతృణావర్తాయ నమః

ఓం యమళార్జునభంజనాయ నమః

ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః

ఓం తమాలశ్యామలాకృతాయే నమః

ఓం గోపగోపీశ్వరాయ నమః

ఓం యోగినే నమః

ఓం కోటిసూర్యసమప్రభాయ నమః

ఓం ఇళాపతయే నమః

ఓం పరంజ్యొతిషే నమః

ఓం యాదవేంద్రాయ నమః

ఓం యాదూద్వహాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పీతవాససే నమః

ఓం పారిజాతాపహరకాయ నమః

ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః

ఓం గోపాలాయ నమః

ఓం సర్వపాలకాయ నమః

ఓం అజాయ నమః

ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం మధుఘ్నే నమః

ఓం మధురానాథాయ నమఃఓం ద్వారకానాయకాయ నమః

ఓం బలినే నమః

ఓం బృందావనాంతసంచారిణే నమః

ఓం తులసీదామభూషణాయ నమః

ఓం శ్యమంతమణిహర్త్రే నమః

ఓం నరనారాయణాత్మకాయ నమః

ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః

ఓం మాయినే నమః

ఓం పరమపూరుషాయ నమః

ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః

ఓం సంసారవైరిణే నమః

ఓం మురారినే నమః

ఓం నరకాంతకాయ నమః

ఓం అనాదిబ్రహ్మచారిణే నమః

ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః

ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః

ఓం దుర్యోధనకులాంతకృతే నమః

ఓం విదురాక్రూరవరదాయ నమః

ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః

ఓం సత్యవాచయే నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సత్యభామారతాయ నమః

ఓం జయినే నమః

ఓం సుభద్రాపూర్వజాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం జగన్నాథాయ నమః

ఓం వేణునాదవిశారదాయ నమః

ఓం వృషభాసురవిధ్వంసినే నమః

ఓం బాణాసురకరాంతకృతే నమః

ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః

ఓం బర్హిబర్హవతంసకాయ నమః

ఓం పార్థసారధియే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః

ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం యజ్ఞభోక్త్రే నమః

ఓం దానవేంద్రవినాశకాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః

ఓం పన్నాగాశనవాహనాయ నమః

ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః

ఓం పన్నాగాశనవాహనాయ నమః

ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః

ఓం పుణ్యశ్లోకాయ నమః

ఓం తీర్ధకృతే నమః

ఓం వేదవేద్యాయ నమః

ఓం దయానిధయే నమః

ఓం సర్వతీర్ధాత్మకాయ నమః

ఓం సర్వగ్రహరూపిణే నమః

ఓం పరాత్పరాయ నమః


తోరగ్రదిం పూజ:

ఓం కృష్ణాయ నమః - ప్రధమ గ్రంధిం పూజయామి 

ఓం విష్ణవే నమః - ద్వితీయ గ్రంధిం పూజయామి 

ఓం జిష్ణవే నమః - తృతీయ గ్రంధిం పూజయామి 

ఓం కాలాయ నమః - చతుర్ధ గ్రంధిం పూజయామి 

ఓం బ్రహ్మనే    నమః - పంచమ గ్రంధిం పూజయామి 

ఓం భాస్కరాయ నమః - షష్టమ గ్రంధిం పూజయామి 

ఓం శేషయ నమః - సప్తమ గ్రంధిం పూజయామి 

ఓం సోమాయ నమః - అష్టమ గ్రంధిం పూజయామి 

ఓం ఈశ్వరాయ నమః - నవమ గ్రంధిం పూజయామి 

ఓం విశ్వాత్మనే నమః - దశమ గ్రంధిం పూజయామి 

ఓం మహాకాలాయ నమః - ఏకాదశ గ్రంధిం పూజయామి 

ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః - ద్వాదశ గ్రంధిం పూజయామి 

ఓం అచ్యుతాయ  నమః - త్రయోదశ గ్రంధిం పూజయామి 

ఓం అనంతపద్మనాభాయ నమః - చతుర్దశ గ్రంధిం పూజయామి 


ధూపం:

శ్లో: వనస్పతి రసైర్దివ్యై ర్నానా గంధైశ్చ సంయుతం

ఆఘ్రేయ సర్వదేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం

ఓం అనంతపద్మనాభాయ నమః దూపమాఘ్రాపయామి.


దీపం:

శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజినామ్మయా 

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపాహం 

ఓం అనంతపద్మనాభాయ నమః దీపం దర్శయామి.


నైవేద్యం:

శ్లో: నైవేద్య గృహ్య దేవేశ భక్తిమే హ్యచాలాంకురు

ఈప్సితం మే వరం దేవహి పరత్రచ పరాం గతిం

అన్నం చతుర్విధం భక్ష్యై రసై షడ్భి సమన్వితం

మయానివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్ధన.

ఓం అనంతపద్మనాభాయ నమః నైవేద్యం సమర్పయామి.


తాంబూలం:

శ్లో:  ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం 

కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం.

ఓం అనంతపద్మనాభాయ నమః  తాంబూలం సమర్పయామి.


నీరాజనం:

శ్లో: సమ సర్వహితార్దాయ జగదాధార మూర్తయే

సృష్టి స్తిత్యంత్యరూపాయ అనంతాయ నమోనమః 

ఓం అనంతపద్మనాభాయ నమః నీరాజనం సమర్పయామి.


ప్రదక్షిణ నమస్కారాన్:

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ

తానితాని ప్రనస్యంతి ప్రదక్షిణ పదేపదే 

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ

త్రాహిమాం క్రుపయాదేవ శరణాగత వత్సల 

అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ 

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన 

నమస్తే దేవేదేవేశ నమస్తే ధరణీధర

నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ.

ఓం అనంతపద్మనాభాయ నమః  ప్రదిక్షణ నమస్కారాన్ సమర్పయామి.


తోరగ్రహణం:

శ్లో: దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవ్రుద్దయే 

అనంతాఖ్య మేడం సూత్రం దారయామ్యః ముత్తమం

ఓం అనంతపద్మనాభాయ నమః తోరగ్రహణం కరిష్యామి.


తోరనమస్కారం:

శ్లో: అనంత సంసార సముద్ర

మాగ్నం మమభ్యుద్దర వాసుదేవ

అనంతరూపిన్ వినియోజయస్వ

హ్యనంత సూత్రాయ నమోస్తుతే

ఓం అనంతపద్మనాభాయ నమః తోరనమస్కారాన్ సమర్పయామి.


తోరబంధనం:

సంసార గాహ్వారగుహాసు సుఖం విహర్తుం 

వాన్చంతి ఏ కురు కులోద్వః శుద్దసత్వా

సంపూజ్యచ త్రిభువనేశ మనంతరూపం 

బద్నంతి దక్షణ కారే వరదోరకం తే.

ఓం అనంతపద్మనాభాయ నమః  టోర బంధనం కరిష్యామి.


జీర్నతోరణం విసర్జనం:

శ్లో:  అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక 

సూత్రగ్రందిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః


ఉపాయనదానం :

శ్లో: అనంతః ప్రతిగ్రుహ్న్నతి అనంతోవై దదాతిచ 

అనంత స్తారకోభాభ్యా మనంతాయ నమోనమః 


అనంతపద్మనాభ వ్రత కథ


సూతపౌరాణికుడు  శౌనకాది మహర్షులను గాంచి యిట్లనియె!  ఓ మునిశ్రేష్టులారా! లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింప బడుచున్డిరి .  అట్టి దారిద్ర్యమును తోలగచేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు.  దానిని జెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్య వాసము చేయుచు అన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని  గాంచి  "ఓ మహాత్మా! నేను తమ్ములతో కలసి అనేక దినములుగా అరణ్య వాసము చేయుచూ ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను.  ఇట్టి కష్టసాగారము నందుండి కడతేరునట్టి వుపాయమును చెప్పవలేయునని ప్రాధించిన శ్రీకృష్ణుడు యిట్లనియె.


            "ఓ ధర్మరాజ! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రాతమను ఒక వ్రతము కలదు.  మరియు ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయవలెయును.  అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగును" అని వచించిన ధర్మరాజు యిట్లనియె.

           

               "ఓ రుక్మిణీ ప్రాణవల్లభా! ఆ అనంతుడను దైవంబు ఎవరు?  అతడి ఆదిశేషుడా! లేక తక్షుడా! లేక సృష్టికర్త యైన బ్రహ్మయా! లేక పరమాత్మ స్వరూపుడా" అని అడిగిన శ్రీ కృష్ణుడు యిట్లనియె.

 

               "ఓ పాండుపుత్ర! అనంతుడనువాడను నేనేతప్ప మరిఎవరో కాదు.సూర్య గమనముచే కలాకష్ట ముహూర్తములనియు, పగలు రాత్రనియు, యుగసంవత్సర ఋతు మాసకల్పమనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము.  నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించితిని.  నన్ను కృష్ణునిగాను,  విష్ణువు గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారనభూతునిగాను, అనంతపద్మనాభునిగాను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు.  ఈ నా హృదయమునందే పదునాలుగు ఇంద్రులును, అష్టావసువులును, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, సప్త ఋషులును, భూర్భు వస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని" అనిన ధర్మరాజు శ్రీ కృష్ణుని గాంచి " ఓ జగన్నాధ! నీవు వచించిన అనంత వ్రతమును యేతుల ఆచరిన్చావలేయును?  ఆ వ్రతము ఆచరించిన ఏమి ఫలము గలుగును?  ఏయే దానములు చేయవలెయును?  ఈ దైవమును పూజింపవలెను? పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము జెందిరి?  అని ధర్మరాజు అడుగగా!  శ్రీకృష్ణుడు యిట్లనియె.


             "ఓ ధర్మరాజ! చెపాడ వినుము.  పూర్వము వశిష్ట గోత్రోద్భవుడు , వేద శాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలదు. అతనకి భ్రుగుమహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు.  ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంత కాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగునవతియగు ఒక కన్యను గనెను.  ఆ బాలికకు శీలా అను నామకరణము చేసిరి.  


          ఇట్లు వుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాప జ్వరముచే మృతి చెందెను.  పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను ఒక కన్యను వివాహము చేసుకొనెను.  ఆ కర్కశ ఎంతో కటిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాకారిణి గాను, ఉండెను.  ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచూపెరుగుచు, గోడల యందును, గడపలయందును, చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థాలములయండు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టిచు దైవభక్తిగలదై యుండెను.  ఇట్లుండగా ఆ శీలకు వివాహ వయసు వచ్చినది.  అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్నిదినములు తపస్సుచేసి, పిదప పెండ్లి చేసుకోవలేయునని కోరికగలిగి దేశదేశములను తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను.  అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తె యగు శీలను ఇచ్చి వివాహము చేసెను.  ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్య యగు కర్కశ వద్దకు పోయి "ఓ ప్రియురాలా! మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేయునుగాడా! ఏమి ఇద్దాము అని అడుగగా,  ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికి వెళ్ళి తలుపులు గడియవేసుకొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను.  అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బట్టేమునకైన ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పెలపుపిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురుని పంపెను.  అంత కౌండిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండిఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు బోవుచూ మధ్యాహ్నవేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిదిగి తటాకంబునకేగెను.  నాటిదినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు యెర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తిశ్రద్దలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌండిన్యుని భార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, "ఓ వనితా మణులారా! మీరు ఏ దేవుని పూజించుచున్నారు?  ఈ వ్రతము పేరేమి?  నాకు సవిస్తారముగా తెలుపగలరు అని ప్రార్ధించగా, ఆ పతివ్రతలు యిట్లనిరి.  "ఓ పుణ్యవతి చెప్పెదము వినుము.  ఇది అనంత పద్మనాభ వ్రతము.  ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును.  


              భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను ఎనమిది దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండలమునకు చుట్టునూ పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆవేదికకు దక్షిణ పార్శ్వమున వుదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకున్దయినా అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి.

          

              శ్లో:  క్రుత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం,

                    సమన్వితం సప్తఫణై పింగాలాక్షం చతుర్భుజం.


               అను ఈ శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు, పిన్గాలాక్షుడగు, సప్తఫణి సాహితున్డగు, శంఖ చక్ర గదా ధరున్డుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున వుంచి పూజించి గోధుమపిండితో  ఇరువది ఎనమిది అరిసెలన్ జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అరిసెలను బ్రాహ్మణులకుఅరిసెలను‌ వాయనదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజిమ్పవలేయును.  మరియు పూజాద్రవ్యములన్నియు పదునాలుగేసి వుండవలేయును.  పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభ స్వామిని ధ్యానించుచు నుండవలేయును.  ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తముచేసి ప్రతి సంవత్సరము వుద్వాసనము చేసి మరల వ్రతము ఆచరిన్చుచుండవలెను.  అని ఆ వనితామణులు చెప్పిరి.  అంట ఆ శీలా తక్షణంబున స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిండిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్ట యై, భోజనాదులచే సంత్రుప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను.  


             అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యమువలన ఆ ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్య యుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోష భరితులై  సుఖముగానున్దిరి.  శీలా-గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములన్ గావించుచుండెను.


           అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుని యుండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సందితమునుండు తోరముచూచి "ఓ కాంతా! నీవు సందియందొక తోరమును గట్టుకొనియున్నావుకదా! అది ఎందులకు కట్టుకొను యున్నావు?  నన్ను వశ్యము చేసుకోనుతకా లేక మరియోకరిని వశ్వంబు

చేసుకోనుటకా అని అడిగెను.  అప్పుడు శీలా ఇట్లనియె.


            "ఓ ప్రాణ నాయకా!  అనంతపద్మనాభస్వామి ని ధరించియున్నాను.  ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకి ధనదాన్యాది సంపత్తులు గలిగి యున్నవని" తెలిపెను.  అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుడనగా యే దేవుడు అని దూషించుచచూ ఆ తోరమును త్రెంచి బాగా మండుచుండేది అగ్ని లో పడవేచెను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను.  


             పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన ఇట్టి అపరాధమువలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల  పాలగును.    గృహము అగ్నిపాలయ్యేను.  మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను.  ఎవరితో మట్లాడినను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను.  


             అంతటా కౌండిన్యుడు ఏమియునుదోచక  దారిద్ర్యముచే పీడింప బడుచూ  అడవులందు ప్రవేశించి క్షుద్భాదా పీడితుండై అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని యెట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒక చోట పుష్ప ఫల  భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియె: ఓ వ్రుక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచితివా?  యని అడుగగా ఆ వృక్షము నే నేరుగానని చెప్పెను.  


              అంత కౌండిన్యుడు మరికొంత దూరముపోయి పచ్చిగాడ్డిలో ఇటుఅటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా!  అనంతపద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నే నేరుగాను అని చెప్పెను.  


                పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు ఎత్తు పచ్చికలో నిలుచున్న ఒక వృషభమును చూచి ఓ వృషభరాజమా! అనంతపద్మనాభ స్వామి ని చూచితివా అని అడిగిన, అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అనిచేప్పెను.  


             పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగంబులతో గూడియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూడియును, హన్సకారండవ చక్రకాడులతో గూడియును, ఒక కొలనునుంది జలంబులు మరియొక కొలనుకి పోరాలుచున్డుతయును చూచి, ఓ కమలాకరంబులారా!  మీరు అనంత పద్మనాభ స్వామి ని చూచితిరా యని అడిగెను.  అందులకు ఆ పుష్కరినిలు మే మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను.  వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను.  అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాదానమిచ్చిరి.  


               అంతటా కౌండిన్యుడు ఎంతో విచారముతో  బాధతో మూర్చబోయి క్రిందపడెను.  అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ద బ్రాహ్మణ రూపదారుడై కౌండిన్యుని చెంతకు వచ్చి " ఓ విప్రోత్తమా! ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకపోయేను.  అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితున్డుగాను, శంఖ చక్ర ధరున్డుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నున్డై భగవంతుని ఈ విధంబుగా ప్రార్ధించెను.  


              నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాన్చన త్వన్నమ స్మరణా త్పాపమశేషం నఃప్రణశ్యతి, నమోనమస్తే గోవిందా నారాయణా జనార్దనా" యని ఇటుల అనేక విధములుగా స్తోత్రంచేసిణ అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై "ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని.  నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకున్డునటులను, అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము గలుగునట్లు వరము ఇచ్చితిని  అనెను.  

అప్పుడు కౌండిన్యుడు ఆనందముతో ఇట్లనెను.


                ఓ జగన్నాధా! నేను మార్ఘ మధ్యలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతము ఏమిటి ?  ఆ ఆవు ఎక్కడిది?  ఆ వృషంభు ఎక్కడినుండి వచ్చెను?  ఆ కొలను విశేషము ఏమిటి?  ఆ గాడిద ఏనుగు, బ్రాహ్మణులు ఎవరు?  అని ఆ భగవంతుడిని అడిగెను.  అపుడు ఆ పరమాత్ముడు.

           

                ఓ  బ్రాహ్మణ శ్రేష్టుడా!  పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను.  ఒకడు మహా భాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు.  పూర్వము ఒక రాజు ధనమదాన్దుడై

బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము జేసినందున ఆ రాజు వ్రుషభంబై అడవిలో తిరుగుచున్నాడు.  ఆ కొలంకులు రెండును ఒకటి ధర్మమూ, మరియొకటి అధర్మము.  ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ నుండినందున గాడిదయై పుట్టి తిరుగుచున్నాడు.  పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానె విక్రయించి వెనకేసుకోనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను.  అనంత పద్మనాభుదనైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని.  కావున నీవు ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరిన్చితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్దానము నొందేను.


              పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రాతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమందలము చేరెను.  


            ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కాన బడుచున్నాడు.  మరియు అగస్త్య మహాముని ఈ వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ది పొందెను.  సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి.  కావున ఈ వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు.

108 రూపాలలోని శ్రీ గణపతి..!!

108 రూపాలలోని 

        శ్రీ గణపతి..!!💐



"ఓం గం గణపతియేనమః"


1. ఏకాక్షర గణపతి.💐


 ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోకదావానలం గణ్విభుంవర  కుంజరాస్యమ్

అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం

ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య!


2. మహా గణపతి.💐

భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం

భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం

గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:

శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్ 


3. బాల గణపతి.💐

కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం

బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం


4. తరుణ గణపతి.💐

పాశాంకుశాపూస కపిత్ధ జంబూ

ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:

ధత్తే సదాయ స్తరుణారుణాంభ:

పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:


5. విఘ్నరాజ గణపతి.💐

విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే 

మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:


6. సిద్ది గణపతి.💐

ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్

అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్


7. బుద్ధి గణపతి.💐

త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే

బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |

నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే

నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ || 


8. లక్ష్మీ గణపతి.💐

బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్

పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:

శ్యామో రక్త సరోరుహేణ సహితో  దేవీ చ యస్యాంతికే

గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్


9. సంతాన లక్ష్మీ గణపతి.💐

శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |

భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||


10.  దుర్గా గణపతి.💐

తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |

దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||


11. సర్వశక్తి గణపతి.💐

ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం

పరస్పరాశ్లిష్టకటీ నివేశం

సంధ్యారుణం పాశసృణీం వహస్తం 

భయాపహం శక్తి గణేశ మీఢే


12. విరివిరి గణపతి.💐

సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |

అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||


13. క్షిప్ర గణపతి.💐

దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం

బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం


14. హేరంబ గణపతి.💐

అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:

పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ

విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:

కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా


15.  నిధి గణపతి.💐

విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |

తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ 


16.  వక్రతుండ గణపతి.💐

స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |

ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్


17. నవనీత గణపతి.💐

దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|

పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||  


18. ఉచ్ఛిష్గ్ట గణపతి.💐

లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం

దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక: 


19.  హరిద్రా గణపతి.💐

హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్

పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ

భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్


20. మోదక గణపతి.💐

నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |

మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||


21.  మేధా గణపతి.💐

సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం 

అఖిలదేవ ప్రదాయకం  మమ ఆత్మరక్ష వినాయకం


22. మోహన గణపతి.💐

రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక 

భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్ 


23. త్రైలోక్య మోహన గణపతి.💐

గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే

పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం

స్వశుండాగ్ర రాజం | మణి కుంభ

మంగాధి రూఢం స పత్న్యా ||


24. వీర గణపతి.💐

భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ

ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం

వీరం గణేశ మరుణం సతతం స్మరామి


25. ద్విజ గణపతి.💐

యం పుస్తకాక్ష గుణ దండకమండలు

శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం

స్తంబేర మానన చతుష్టయ శోభమానం

త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||


26. ఋణవిమోచన గణపతి.💐

సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే


27. సంకష్టహర గణపతి.💐

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే


28. గురు గణపతి.💐

ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |

సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||

అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |

వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||


29. స్వర్ణ గణపతి.💐

వందే వందారుమందార, మిందు భూషణ నందనం |

అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||


30. అర్క గణపతి.💐

మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|

విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||


31. కుక్షి గణపతి.💐

సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా

లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||


32. పుష్టి గణపతి.💐

ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |

విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||


33. వామన గణపతి.💐

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |

అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||


34. యోగ గణపతి.💐

యోగరూఢో యోగ పట్టాభిరామో

బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:

పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో

పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:


35. నృత్య గణపతి.💐

పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం

పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం


36. దూర్వా గణపతి.💐

దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |

గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||


37. అభీష్టవరద గణపతి.💐

నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |

కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||


38. లంబోదర గణపతి.💐

లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:

శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||    


39. విద్యా గణపతి.💐

భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |

నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||


40. సరస్వతీ గణపతి.💐

వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే

యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||


41. సంపత్ గణపతి.💐

పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ

ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:


42. సూర్య గణపతి.💐

హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం 

గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||


43. విజయ గణపతి.💐

శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత

పాశాంకుశై: కళమమంజరికా సనైధై:

పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:


44. పంచముఖ గణపతి.💐

గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|

అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||


45. నీలకంఠ గణపతి.💐

వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |

పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||


46. గాయత్రి గణపతి.💐

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |

భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||


47.  చింతామణి గణపతి.💐

కల్పద్రుమాధ: స్థితకామధేయం |

చింతామణిం దక్షిణపాణి శుండమ్ |

బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |

య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||


48. ఏకదంత గణపతి.💐

అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే


49. వికట గణపతి.💐

వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |

మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||


50. వరద గణపతి.💐

వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |

నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||


51. వశ్య గణపతి.💐

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |

శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||


52. కుల గణపతి.💐

శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |

రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||


53. కుబేర గణపతి.💐

రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |

సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |


54. రత్నగర్భ గణపతి.💐

హేరంబతే రత్నసువర్ణయుక్తే  సునూపుర మంజీరకే తథైవ|

సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||


55. కుమార గణపతి.💐

మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:

అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:


56. సర్వసిద్ధి గణపతి.💐

పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |

విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |

సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |

సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||


57. భక్త గణపతి.💐

నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం

శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్


58. విఘ్న గణపతి.💐

పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:

విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:


59. ఊర్ధ్వ గణపతి.💐

కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,

దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,

ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా

దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే


60. వర గణపతి.💐

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన

ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్


61. త్ర్యక్ష్యర గణపతి.💐

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం

సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్


62. క్షిప్రప్రసాద గణపతి.💐

యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్


63. సృష్టి గణపతి.💐

ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం

ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్

తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం

పుత్రం విలాస చతురం శివయో: శివాయ


64. ఉద్దండ గణపతి.💐

ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం

సిందూరపూర పరిశోభితగండయుగ్మం

ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం

అఖండలాది సురనాయక బృందవంద్యమ్


65. డుండి గణపతి.💐

అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్

ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:


66. ద్విముఖ గణపతి.💐

స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:

రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:


67. త్రిముఖ గణపతి.💐

శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:

పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా

పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే

స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:


68. సింహ గణపతి.💐

వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:

వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం

శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో

దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:


69. గజానన గణపతి.💐

సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|

ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||


70. మహోదర గణపతి.💐

మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:

మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||


71. భువన గణపతి.💐

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |

నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||


72. ధూమ్రవర్ణ గణపతి.💐

ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:

ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ


73. శ్వేతార్క గణపతి.💐

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే

శ్వేతార్కమూలనివాసాయ

వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ

సూర్యవరదాయ కుమారగురవే


74. ఆధార గణపతి.💐

నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర

వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం

హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్

పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార

ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||


75. భూతరోగ నివారణ గణపతి.💐

ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |

అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |


76. ప్రసన్న విఘ్నహర గణపతి.💐

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |

పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||


77. ద్వాదశభుజవీర గణపతి.💐

సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|

అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||


78. వశీకర గణపతి.💐

బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|

వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||

ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ

విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||


79. అఘౌర గణపతి.💐

గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం

బృహదుదరమశేషం భూతరాజం పురాణం

అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |

పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||


80.  విషహర గణపతి.💐

నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |

త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||


81. భర్గ గణపతి.💐

బాలార్కకోటి ద్యుతి మప్రమేయం

బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |

భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||


82. సర్వ సమ్మోహన గణపతి.💐

స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |

స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||


83. ఐశ్వర్య గణపతి.💐

సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |

అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ


84. మాయావల్లభ గణపతి.💐

సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |

కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |

వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |

సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||


85. సౌభాగ్య గణపతి.💐

తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |

సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||


86.  గౌరి గణపతి.💐

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |

లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |

నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |

గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||


87. ప్రళయంకర్త గణపతి.💐

అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |

హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||


88. స్కంద గణపతి.💐

కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|

ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||


89. మృత్యుంజయ గణపతి.💐

సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం

సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||


90. అశ్వ గణపతి.💐

రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |

చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||


91. ఓంకార గణపతి.💐

వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం

విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||


92.  బ్రహ్మవిద్యా గణపతి.💐

బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |

ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||


93. శివ అవతార గణపతి.💐

విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |

సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||


94. ఆపద గణపతి.💐

ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |

దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||


95.  జ్ఞాన గణపతి.💐

గుణాతీతమౌనం చిదానంద రూపం |

చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |

ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |

పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||


96. సౌమ్య గణపతి.💐

నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |

భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||


97. మహాసిద్ధి గణపతి.💐

గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |

పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||


98. గణపతి.💐

సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం

దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర

విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి

కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై

భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||


99. కార్యసిద్ధి గణపతి.💐

యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |

యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |

యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |

సదాతం గణేశం నమామో భజామ: ||


100. భద్ర గణపతి.💐

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:

సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||


101. సులభ గణపతి.💐

వందే గజేంద్రవదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం

కుంకుమపరాగశోణం - క్వులయినీ జారకోరకా పీడమ్ ||


102. నింబ గణపతి.💐

విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |

త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: || 


103. శుక్ల గణపతి.💐

అంతరాయ తిమిరోపశాంతయే

శాంతపావనమచింత్య వైభవం |

తంనరం వపుషికుంజరం ముఖే

మన్మహే కిమపి తుందిలంమహ: ||


104. విష్ణు గణపతి.💐

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే


105. ముక్తి గణపతి.💐

పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: 

ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||


106. సుముఖ గణపతి.💐

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |

ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||


107. సర్వ గణపతి.💐

చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం 

అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ: 


108. సిద్ధిబుద్ధి గణపతి.💐

సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:

శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:

వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో..

 

ఒకొక్క గణపతి..ఒకో కార్యానికి..ఫలితాలు ఇస్తాడు. మీకు నచ్చిన గణపతిని ఆరాధించి..

శుభ ఫలితాలు పొందండి.

    💐!! స్వస్తి..!!💐


🙏ఓం నమః శివాయ🙏


   💐సర్వే జనాః 

   సుఖినో భవంతు..💐

 

 💐శ్రీ మాత్రే నమః💐

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS