Thursday, August 27, 2020

నవగ్రహాలకి ఇష్టం లేని పనులు

💐*నవగ్రహాలకి ఇష్టం లేని పనులు * 💐


*అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట.*
*అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.*

*సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి.* *ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.*

*బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట.* *వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట.*

*శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట.* *తల్లితండ్రిని చులకన చేసిన కోపమట.*
*సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.*

*పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట.*
*సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.*

*శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట. గొడవలు లేని ఇల్లు ఇష్టము.*

*అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట.*
*వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.*

*జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకబడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట.*
*ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.*

*రాహువుకి వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట.*
*ఈయన భ్రమ మాయ కి కారణము.

                   💐💐💐💐💐

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS