Thursday, August 27, 2020

శివుడికి అత్యంత ప్రీతికరమైనరోజు సోమవారం..సోమ అంటే.స+ఉమ ఉమ తో కూడినవాడు అనే అర్థం .శివుడు శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!

*శివుడి కి,  అత్యంత ప్రీతికరమైనరోజు*

  *సోమవారం...!*
 *సోమ  అంటే........,*
         *స+ఉమ*
*ఉమ తో కూడినవాడు అనే అర్థం .......!  శివుడు👍 శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!*
*పార్వతీ దేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!*
*అందువలన "సోమవారం" రోజున  పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి......!*

           *ఈ రోజున అంతా ఆ స్వామికి, "పూజాభిషేకాలు" జరుపుతుంటారు......!*
*ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల    శివలింగాన్ని  ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే స్వామికి  పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు....!*
*ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి  కావలసినది అంకితభావమే.....!*
 *చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!*

          *ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ    లేమి  అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....! అంటే ఆ స్వామి అనుగ్రహం వలన  దారిద్ర్యం  అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....! ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని* *కీర్తించారు......! సోమవారం రోజున  పార్వతీ పరమేశ్వరులను  పూజించడం వలన  సమస్త పాపాలు పటాపంచలై పోవడమే కాకుండా,  సంపదలు ......సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!*

             *శివపూజలో  ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు  అభిషేక ప్రియుడు, హాలాహలాన్ని కంఠమందు ధరించాడు...!  ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం *అభిషేక జలం  తో  నేత్రాగ్ని చల్లబడుతుంది......!*
*అందుచేతనే  గంగను, చంద్రవంక  ను తలపై ధరించాడు శివుడు.......!!*

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS