Friday, August 28, 2020

యోగం :

 యోగం : 


   రెండు కానీ లేదా అంతకంటే ఎక్కువ గ్రహముల యొక్క  సంయోగం యోగం అందురు . 

యోగములకు కేవలం గ్రహములను 

 పరిగణనలోకి తీసుకోవాలి , రాశులు కాదు . రాశి జడాత్మ మరియు గ్రహం జీవాత్మ . 

జడాత్మ ( నాన్ లివింగ్ వస్తువులు ) . కేవలం యోగం కు మద్దతు ఇస్తాయి కానీ యోగము రూపోందించుట లో సహాయం చేయవు . యోగాలు రూపోందించుట లో గ్రహములు మాత్రమే సహకరిస్తాయి . 

   గ్రహములు మధ్య నాలుగు 4 రకాల సంబంధాలు ఉండును . 

  1. సంపూర్ణ సంబంధం : 

     గ్రహ పరివర్తన లో గ్రహములు సంపూర్ణ సంబంధం కలిగి వుండును . ఇది పుట్టుక తో ఫలవంతం అవుతుంది . 

2. యుతి సంబంధం : యుతి అనగా రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహములు ఒక రాశి లో కలిసి వున్నప్పుడు , గ్రహములు మధ్య యుతి సంబంధం ఏర్పడుతుంది . ఇది పరివర్తన గ్రహములు కన్నా ఈ సంబంధం కోంత బలహీనమైన ఫలితాలు కలుగుతాయి . కారణం గ్రహములు మధ్య అభిప్రాయ బేధాలు వుండ వచ్చు లేదా అన్యోన్యత వుండ వచ్చు . ఒక స్త్రీ మరియు పురుషుడు మధ్య యుతి వివాహ బంధం దారి తీస్తుంది . వారి ఇరువురి మధ్య అన్యోన్యత వుండ వచ్చు లేదా అన్యోన్యత లోపించి వచ్చు . యుతి  శాశ్వత సంబంధం లా వుండును . 

3. దృష్టి సంబంధం : గ్రహములు మధ్య దృష్టి సంబంధం వుంటే ఈ సంబంధం బలహీనమైనది . ఇది గ్రహం యొక్క విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది . 

 ఉదాహరణకు శ్రీరామ చంద్ర మూర్తి జాతకం లో లగ్నం లో గురు చంద్రులు మరియు సప్తమం లో కుజుడు . కుజుడు, చంద్ర గురులను సప్తమ దృష్టి చే వీక్షించుట. ఈ యోగం పుట్టుక తో రాలేదు . శ్రీరాముడు మరియు హనుమంతుడు కలిసి నప్పుడు ఈ యోగం వాస్తవ రూపం దాల్చింది . 

 కుజుడు -- హనుమ . 

 ఇక్కడ మనము గ్రహించ వలసి ఉంటుంది , పరివర్తన సంబంధం పుట్టుక తో ఫలితం ఉంటుంది దృష్టి సంబంధం భవిష్యత్తు లో ఫలం లభిస్తుంది . 

 4. అసంపూర్ణ పరివర్తనం : ఈ సంబంధం అత్యంత బలహీనమైది . 

 మనం ఫలిత నిర్ధారణ కు పై మూడు సంబంధాలు ప్రభావితం చూపుతాయి . ఉదాహరణకు గురువు మేష రాశి లో స్థితి అనుకుందాం . కుజుడు వృశ్చిక రాశిలో స్థితి పోంది నప్పుడు ఇది అసంపూర్ణ పరివర్తనం . కుజుడు ధనుస్సు రాశి కి అతి దగ్గర లో వుండుట వలన .

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS