Thursday, August 27, 2020

:పంచ పునీతాలు:

*:పంచ పునీతాలు:*


*మొదటిది..వాక్ శుద్ధి:*

వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు 
మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. 

*రెండవది..... దేహశుద్ధి:*

మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

*మూడవది.....భాండ శుద్ధి:*

శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.

*నాలుగవది.......కర్మశుద్ధి:*

అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.

*ఐదవది..........మనశ్శుద్ధి:*

మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు  వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.                            🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS