Thursday, August 27, 2020

శ్రీ దేవి దశమహావిద్యలు

శ్రీ దేవి దశమహావిద్యలు

మహామాత,మహాదేవి అయినటువంటి ఆ ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించివుంది... అయితే లోక రక్షణకు,భక్తుల కోరిక వలన,రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాలలో అవతరించింది ఇంకా ఎన్నో లీలలనూ ప్రదర్శించింది...వాటిల్లో  ప్రముఖమైనవి శ్రీ దేవి యొక్క "దశమహావిద్యలు"...

లోకనాయకుడైనటువంటి ఆ పరమేశ్వరునితో  వైరం పెట్టుకున్న దక్షుడు పరమేశ్వరుడు లేకుండా ఒక యజ్ఞాన్ని చేయనారంభించాడు. ఆ యఙ్ఞానికి మహాదేవుణ్ణి మరియు సతీదేవిని ఆహ్వానించలేదు.తండ్రి చేస్తున్న యాగం గురించి తెలుసుకున్న సతీదేవి యాగానికి వెళ్ళడానికి పరమేశ్వరుని అనుమతి అడిగింది. సతీదేవి యాగానికి వెళితే ఏం జరుగుతందో పరమేశ్వరుడికి తెలుసు.అందుకే వెళ్ళవద్దని ఆమెకు ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు శ్రీ కంఠుడు. అయినా సతీదేవి వినలేదు.వద్దన్నా వినకుండా వెళుతున్న సతీదేవి వెళ్ళకుండా ఆయన అడ్డుపడ్డాడు. దాంతో ఆమె ఆగ్రహంతో దశమహావిద్యలను సృజించింది ఆ విద్యలు శివుణ్ణి దశదిశల నుండి చుట్టుముట్టాయి. విధిలీలలకు పరమేశ్వరుడు సైతం అతీతుడు కాడు. ఇలా దేవి లీలల వల్ల దశమహావిద్యల సృజన జరిగింది.

తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది.
1)కాళీ                     2)తార
3)షోడశి                   4)భువనేశ్వరి
5)భైరవి                    6)ఛిన్నమస్త
7)ధూమవతి              8)భగళాముఖి
9)మాతంగి                10)కమలాత్మిక.

ఇవే దేవి యొక్క దశమహావిద్యలు...

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS